Benefits of Coriander Leaves And Seeds in Telugu
Benefits of Coriander : కొత్తిమీర చిన్న గింజల్లో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కొత్తిమీర కిచెన్‌లోనే కాకుండా ఆయుర్వేదంలో కూడా ఒక ప్రత్యేక స్థానం ఉంది. దీని గింజలు, ఆకులలో దాగి ఉన్న ఔషధ గుణాలు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో అద్భుతమైన ప్రభావాన్ని చూపుతాయి. బరువు తగ్గడం, జీర్ణక్రియను మెరుగుపరచడం లేదా గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడం వంటివి కావచ్చు. కొత్తిమీర రోజువారీ వినియోగం అనేక విధాలుగా ప్రయోజనకరంగా ఉంటుంది. కొత్తిమీర మీ ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరుస్తుంది. రోజువారీ జీవితంలో చేర్చడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కొత్తిమీర గింజల నీటిని తాగడం వల్ల జీర్ణవ్యవస్థ బలపడుతుంది. శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వును తగ్గించడంలో కూడా సాయపడుతుంది. కొత్తిమీర గింజలను రాత్రిపూట నీటిలో నానబెట్టిన నీటిని ఉదయం ఖాళీ కడుపుతో తాగడం వల్ల బరువు తగ్గవచ్చు. కొత్తిమీరలో రక్త నాళాలను విస్తరించడంలో సాయపడే మూలకాలు ఉన్నాయి. తద్వారా రక్తపోటు తగ్గుతుంది. రెగ్యులర్ వినియోగం గుండె ఆరోగ్యంగా ఉంచుతుంది. గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. పొటాషియం పుష్కలంగా ఉండటం, సోడియం తక్కువగా ఉండటం వల్ల గుండెను దృఢంగా ఉంచడంలో సాయపడుతుంది. కొత్తిమీరలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి.
ఆర్థరైటిస్, ఇతర ఇన్‌ఫ్లమేటరీ సమస్యలలో ఉపశమనం కలిగిస్తుంది. కీళ్ల నొప్పులను తగ్గించడంలో సాయపడుతుంది. శరీరంలో వాపు, నొప్పిని తగ్గిస్తుంది. కొత్తిమీరలో పొటాషియం, మెగ్నీషియం, క్యాల్షియం, మాంగనీస్, ఐరన్ పుష్కలంగా ఉన్నాయి. ఎముకలు, కండరాల బలానికి అవసరమైనవి. ఇది కాకుండా, శరీరంలో అవసరమైన ఖనిజాల లోపాన్ని తీర్చడంలో సహాయపడుతుంది. తద్వారా మెరుగైన శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కొత్తిమీరను ఆయుర్వేదంలో జ్వరం, రక్తపోటు, కొలెస్ట్రాల్ వంటి సమస్యలకు చికిత్స చేసేందుకు ఉపయోగిస్తారు. కొత్తిమీర గింజలు, ఆకులతో చేసిన డికాషన్ తీసుకోవడం వల్ల జ్వరం నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇందులో ఉండే మూలకాలు రక్తపోటును సమతుల్యంగా ఉంచుతాయి. కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తాయి. శరీరం మొత్తం పనితీరును మెరుగుపరుస్తుంది.
Read Also : Diwali 2024 : దీపావళి రోజున లక్ష్మీ దేవి అనుగ్రహం పొందాలంటే మీ ఇంట్లో ఈ 3 వస్తువులను పారేయండి!
This website uses cookies.