Categories: DevotionalLatest News

2024 Vaishakha Purnima : వైశాఖ పౌర్ణమి రోజున మహిళలు ఈ రంగు గాజులు వేసుకుంటే.. భర్తకు అఖండ ఐశ్వర్యం కలిసివస్తుంది!

2024 Vaishakha Purnima Remedies : మే 23న వైశాఖ పౌర్ణమి.. ఈ పవిత్రమైన రోజున ఆడవాళ్లు రాత్రివరకైనా సరే తప్పకుండా ఈ రంగు గాజులు వేసుకుంటే భర్తకు అపారంగా కలిసివస్తుంది. అంతేకాదు.. స్త్రీలు ఎలాంటి రంగు గాజులు వేసుకుంటే అఖండ ఐశ్వర్యం కలుగుతుంది. వైశాఖ పౌర్ణమి రోజు ఏం చేయాలి? ఎలాంటి గాజులు ధరించాలో ఇప్పుడు తెలుసుకుందాం. చంద్రుడు, విశాఖ నక్షత్రానికి దగ్గరగా సంచరించే మాసాన్ని వైశాఖ మాసంగా పిలుస్తారు. ఈ మాసాల్లో వైశాఖం రెండో మాసం కావడం.. అందులోనూ ఉత్తరాయణంలో ఉండడంతో ఇది అత్యంత పవిత్రమైనదిగా పురాణాలు చెబుతున్నాయి.

మన సనాతన ధర్మంలో ఏ వ్యక్తి అయినా ఎప్పుడు పడితే అప్పుడు సముద్ర స్నానం ఆచరించకూడదు. వైశాఖ పౌర్ణమి రోజున కచ్చితంగా ఆచరించాల్సిన నియమాల్లో సముద్ర స్నానం ఒకటి. ఈరోజు కరక్కాయను తీసుకెళ్లి సముద్రంలో వేసి సముద్ర స్నానం ఆచరించడం వల్ల నరఘోష నర దిష్టి తొలగిపోతుందని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. జ్ఞాన పౌర్ణమి, బుద్ధ పౌర్ణమి, శ్రీకూర్మ జయంతి అన్నమాచార్యుల జయంతి ఇన్ని విశేషాలు ఉన్న ఈ వైశాఖ పౌర్ణమి అత్యంత పవిత్రమైందిగా చెబుతారు. వైశాఖ పౌర్ణమి రోజు సిద్ధార్థుడు జన్మించాడు. అదే వైశాఖ పౌర్ణమి రోజు ఆయనకు జ్ఞానం కలిగి బుద్ధుడిగా అవతరించడం వల్ల దీనికి బుద్ధ పౌర్ణమి అనే పేరు వచ్చిందని చెబుతారు. అంతేకాదు.. ఆధ్యాత్మిక సాధకులకు జ్ఞాన ప్రాప్తి పొందే వారికి సాధువులకు అత్యంత పవిత్రమైన పౌర్ణమిగా పంచాంగ కర్తలు చెబుతున్నారు. వైశాఖ పౌర్ణమి రోజు కూర్మావతారం ఎత్తిన శ్రీ మహా విష్ణువు ఈ భూమండలాన్ని రక్షించినటువంటి రోజుగా కూర్మ పురాణం తెలియజేస్తుంది.

ఈ వ్రతం చేస్తే మహిళలకు సంపద, సౌభాగ్యం :
అన్నమాచార్యులు వైశాఖ పౌర్ణమి రోజు జన్మించడం ఆయన చేసిన ఆధ్యాత్మిక కీర్తనలు ఈ పౌర్ణమి ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. వైశాఖ పౌర్ణమి రోజు మహావిష్ణువు ఆరాధించి పూజించడంతోపాటు సంపత్ గౌరీ వ్రతాన్ని ఆచరించడం విశేషమైన ఫలితాలను ఇస్తుంది. ఈ వ్రతాన్ని స్త్రీలు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు. సంపదలు కలగాలని కోరికతో ప్రతి మహిళ పసుపుతో గౌరీదేవిని పూజించి ఆ పసుపు గౌరీదేవిని ముత్తైదుకు వాయనం ఇవ్వడం ఈ వ్రతం విశేషం. అలాగే, విష్ణు సహస్రనామ పారాయణం చేయడంతో పాటు గౌరీదేవిని పూజించడం, సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం అన్నమాచార్యుల వారిని బుద్ధుడిని కూర్మావతారంలో ఉన్న మహావిష్ణువును పూజించడం ద్వారా అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు. వైశాఖ పౌర్ణమి రోజు చేసే దానధర్మాలకు అనేక శుభ ఫలితాలు ఉన్నాయని పురాణాల్లో ఉంది. ఈరోజు ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయడం ద్వారా పేదవారికి వస్త్ర దానం, గొడుగు, చెప్పులు నీటి కుండా వంటివి దానం చేయడం వల్ల మంచి పుణ్యఫలం దక్కుతుంది.

ఈ రంగు గాజులను ధరిస్తే అఖండ ఐశ్యర్యమే :

అలాగే ఎంతో పవిత్రమైన గయ కొలనులో స్నానమాచరించిన ఎన్నోజన్మల పుణ్యం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. వైశాఖ పౌర్ణమి రోజున ఇంట్లో తులసి కోటను శుభ్రం చేసుకొని పూజించడం వల్ల అద్భుతమైన పుణ్యం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. అలాగే, వైశాఖ పౌర్ణమి నాడు స్త్రీలు ఎరుపు, ఆకుపచ్చ రంగుల గాజులను ధరిస్తే ఆ ఇంట్లో అఖండ ఐశ్వర్యం కలుగుతుందని చెబుతున్నారు. మహిళలు ఈ గాజులు ధరించడం వల్ల ఆ ఇంట్లో సకల శుభాలు జరుగుతాయని, భర్త సంపద పెరుగుతుందని అంటున్నారు. అయితే, మహిళలు పొరపాటున కూడా పగిలిన గాజులను ధరించకూడదు. ఆకుపచ్చ, ఎరుపు, పసుపు రంగు గాజులను ధరిస్తే లక్ష్మీ అనుగ్రహం కలిగి జీవితంలో కోటీశ్వరులు అవుతారు.

2024 Vaishakh Purnima Remedies ( Photo Credit : Google )

స్నానం చేసే నీటిలో ఇది కలిపితే కోటిరెట్ల పుణ్యమే :
వైశాఖ పౌర్ణమి రోజున ఆడవాళ్లు స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి కలుపుకొని స్నానం చేస్తే.. ఎటువంటి సమస్యలైనా తొలగిపోయి కోటిరెట్ల పుణ్యం దక్కుతుంది. వైశాఖ పౌర్ణమి రోజు ఏం చేయాలో ఎలాంటి నియమాలు పాటించాలో తెలుసుకుందాం. ఈరోజు జపం, ధ్యానం చేస్తే మంచిదని చెబుతూ ఉంటారు. వైశాఖ పౌర్ణమి మరింత ప్రత్యేకమైనది. ఏ పౌర్ణమికి లేని ప్రత్యేకతలు ఈ రోజున ఉన్నాయి. వైశాఖ పౌర్ణమిని బుద్ధ జయంతిగా చెబుతారు. ఈరోజు బుద్ధునికి మహా ప్రీతికరమైన రోజు కావడంతో ఆయన జననం బుద్ధుడిగా మారడం నిర్యాణం చెందడం మూడు కూడా ఈ పౌర్ణమి నాడే జరిగాయని చెబుతారు. అందుకే బౌద్ధులకు ఆయనను ఆరాధించే సకల జీవులకు ఈరోజు పరమ పవిత్రంగా భావిస్తారు. ఈ పౌర్ణమి విష్ణుభక్తులకు పరమ పవిత్రమైనది. విష్ణుమూర్తి రెండవ అవతారమైన కూర్మావతారం ఈరోజునే ఉద్భవించడం అందుకు కారణంగా పేర్కొంటారు.

విష్ణు, మహేశ్వరులకు ప్రత్యేకమైన రోజు :

అమృతం కోసం దేవదానములు క్షీర సాగరాన్ని మదించే సమయంలో కవ్వంలో ఉన్న మందర పర్వతం జారిపోకుండా ఉండేందుకు కుర్ముడు అండగా నిలబడ్డాడు. అతి విశిష్టమైన ఈ కూర్మావతారాన్ని పూజించేందుకు ఆలయాలు చాలా ఉన్నాయి. వైశాఖ పౌర్ణమి రోజునే విష్ణు భక్తులైన అల్వార్లలో నమ్మాల్ వారికి జన్మించాడని అంటారు. వైశాఖ పౌర్ణమి శైవులకు కూడా ప్రత్యేకమే. శివుని రూపమైన సర్వేశ్వరుడు అవతరించింది ఈ రోజునే. 8 పాదాలతో రెక్కలతో సింహపు దేహంతో ఉన్న అవతారమే ఇది. హిరణ్యకశిపుని చంపిన తర్వాత కూడా నరసింహస్వామి ఉగ్రత్వం తగ్గలేదట. దాంతో ఆ స్వామితో తలపడి ఆయనను బలహీనపరిచి శాంతింప చేసేందుకు సర్వేశ్వరుడు అవతరించాడు. దక్షిణాదినా పురాతనమైన ఆలయాలలో ఈ సేవ రూపం తప్పకుండా కనిపిస్తుంది.

శైవారాధకులకు కూడా ఈరోజు విశిష్టమే. సంప్రదాయపరంగా కూడా వైశాఖ పౌర్ణమి ఎంతో పూర్వమైనది. ఈ రోజును మహా వైశాఖిగా పిలుస్తారు. ఈరోజు సముద్ర స్నానం చేస్తే విశేషమైన ఫలితం వస్తుందని చెబుతారు అంటే.. ఏది ఏమైనా ఈరోజున మన ఇష్ట దైవాన్ని మనసారా కొలుచుకొని మన కోరికలను కష్టాలను చెప్పుకుంటే అనుగ్రహం కలుగుతుంది. ఈరోజు ఇంట్లోనే ఆడవారు స్నానం చేసే నీటిలో కాస్త కల్లుప్పు కొద్దిగా పసుపు, కుదిరితే కాస్త కర్పూరం వేసుకొని స్నానం చేస్తే.. కోటి జన్మల ఫలితం దక్కుతుంది. ఇంట్లోని సమస్యలని తొలగిపోయి కోటీశ్వరులు అవుతారు.

Read Also : 2024 Vaishakha Purnima : మే 23న వైశాఖ పౌర్ణమి.. ఈ తప్పులు అసలు చేయొద్దు.. మీ ఇంట్లో ఈ కూర వండితే దురదృష్టం పడుతుంది!

Share
Published by
OTN

This website uses cookies.