Categories: Devotional

Horoscope Today 4th June 2024 : ఈరోజు జూన్ 4 రాశి ఫలితాలు.. నేటి పంచాంగం.. 12 రాశుల్లో ఎవరికి నేడు కలిసివస్తుందంటే?

Horoscope Today 4th June 2024 : ఈరోజు జూన్ 4వ తేదీ.. శ్రీ క్రోధినామ సంవత్సరం, వైశాఖ మాసం, ఉత్తరాయణం వసంత రుతువు, మంగళవారం. తిధి: త్రయోదశి, రాత్రి: తొమ్మిది గంటలకు, నక్షత్రం: భరణి.. రాత్రి 10 నిమిషాల వరకు, వ్యర్జం: ఉదయం 8:30 నుంచి 10 గంటల 2 నిమిషాల వరకు, ఉదయం 8 గంటల 3 నిమిషాల నుంచి 8 గంటల 56 నిమిషాల వరకు. తిరిగి రాత్రి 10 గంటల 51 నిమిషాల నుంచి 11:35 వరకు.

అమృతకాలం: సాయంత్రం 6:04 నిమిషాల నుంచి 7 గంటల 34 నిమిషాల వరకు, రాహుకాలం: మధ్యాహ్న 3 గంటల నుంచి సాయంత్రం 4 గంటల 30 నిమిషాల వరకు. సూర్యోదయం: ఉదయం 5:30 నిమిషాలకు, సూర్యాస్తమయం: సాయంత్రం 6:15 నిమిషాలకు. ఈరోజు విశేషం త్రయోదశి. మంగళవారం ఎంతో విశేషమైన ఈరోజు. హనుమంతుని పూజించినా ప్రార్థించిన విశేషమైన పుణ్యఫలం లభిస్తుంది. ఈ మంగళవారం రోజున స్వామి హనుమను పూజించాలి. ఇక 12 రాశుల వారు ఈ రోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం.

మేషరాశి :
ఈ రాశివారికి ఈరోజు ఆర్థిక సమస్యలు తీరుతాయి. మనోబలం పెరుగుతుంది. అందర్నీ కలుపుకొని పోవడం వల్ల ఇబ్బందులు తగ్గుతాయి. క్రమేపి ఆదాయం పెరుగుతుంది. వస్తువులు భూములు కొనే అవకాశం ఉంది. పాత బాకీలు కొన్ని వసూలు అవుతాయి. వ్యాపార ఒప్పందాలు కలిసి వస్తాయి. ఉద్యోగానికి సంబంధించిన శుభవార్త వింటారు. సంతృప్తిగా పనులు పూర్తి చేస్తారు. పైఅధికారుల ఆదరణ లభిస్తుంది. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలపై మనసు నిలుపుతారు. భూముల వ్యవహారం కలిసి వస్తుంది.

స్నేహితులు ఆత్మీయులతో సంబంధాలు పొందుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు చేస్తారు. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. చేసే పనులు ఇబ్బందులు ఉండవు. కొత్త పనులను ప్రారంభించడం మంచిది. గృహంలో కొన్ని మార్పులు జరుగుతాయి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఆరోగ్యానికి డోకాలేదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆస్తుల కొనుగోలుకు ప్రయత్నాలు చేస్తారు. ఆదాయం పెరుగుతుంది. స్త్రీలతో అనవసరపు పరిచయాలకు దూరంగా ఉండండి. సంతానం, శుభవార్తలు వింటారు. ప్రేమ వ్యవహారాలు ముందుకు వెళ్తాయి. గణపతి ధ్యానం చేయాలి. మొత్తం మీద ఈరోజు ఈరాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి.

వృషభ రాశి :
ఈ రాశి వారికి ఈరోజు ముఖ్య కార్యాల్లో విజయం లభిస్తుంది. ఆటంకాలు తొలగిపోతాయి. దేనికి తొందరవద్దు. ధర్మ మార్గంలో ముందుకు సాగండి. వ్యాపారంలో అప్రమత్తత అవసరం. కుటుంబ పరంగా మంచి జరుగుతుంది. సమిష్టి నిర్ణయాలు కలిసి వస్తాయి. ఊహించని కార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. సమయానికి డబ్బు చేతికి అందుతుంది. చేపట్టిన పండ్లను పూర్తిచేస్తారు. ఉత్సాహంతో ఉంటారు. ఆరోగ్యంపై మనసు పెడతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై మనసు నిలుపుతారు. శుభకార్యాలు మూలంగా ఖర్చులు ఉంటాయి. సంగీత సాహిత్య సినిమా రంగాల వారికి అనుకూలం. కొత్త అవకాశాలతో ఆదాయం పెరుగుతుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.

వాహనాలు భూముల వ్యవహారంలో జాగ్రత్త అవసరం. చేతి పనివారికి ఒత్తిడి శ్రమ పెరుగుతాయి. ఉద్యోగస్తులకుపై అధికారుల ఆదరణ లభిస్తుంది. ప్రయాణాల మూలంగా ఖర్చులు పెరగవచ్చు. విహార యాత్రలపై మనసు నిలుపుతారు. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. వృత్తి, ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి ఉంటుంది. ఆత్మీయులను కలుస్తారు. స్త్రీల మూలకంగా ధన లాభం ఉంటుంది. మంచి పనులు చేపడతారు. గొప్ప వారితో స్నేహసంబంధాలు ఏర్పడుతాయి. కీలక విషయాల్లో పురోగతి ఉంటుంది. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. ఆంజనేయ ఆరాధన శుభ ఫలితం ఇస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి.

మిధున రాశి :
ఈ రాశివారు ఈరోజు ప్రారంభించిన పనులు పూర్తవుతాయి. దేవత గురుభక్తి పెరుగుతుంది. ఆదాయంలో హెచ్చుతగ్గులు ఉన్న ప్రతి అడుగు నిదానంగా వేయండి. ధర్మమార్గంలో ఆలోచించండి. ముఖ్య వ్యక్తుల సలహాలను పాటించండి. ముఖ్యమైన పెద్ద కార్యక్రమాలను కొంతకాలం వాయిదా వేయండి. ఆరోగ్యం పై శ్రద్ధ పెంచాలి. ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సి వస్తుంది. ప్రయాణాలు జాగ్రత్త అవసరం. అనవసరంగా డబ్బు ఖర్చు అవ్వడంతో ఆందోళన చెందుతారు. ఖర్చులను రాబడిన జాగ్రత్తగా అంచనా వేసుకోవాలి. ఉద్యోగస్తులకు ఆఫీసులో పని భారం పెరుగుతుంది. తోటివారితో స్నేహంగా ఉంటూ పనులు చేసుకోవడం మంచిది. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ఉన్నత విద్యా ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాల్లో నలుగురు సహకారంతో ముందుకు వెళ్తారు. రావాల్సిన డబ్బు సమయానికి అందుతుంది.

Horoscope Today 4th June 2024 ( Photo Credit : Google )

ఈరోజు ముఖ్యంగా ఓపిక నియంత్రణ అవసరం. కొత్త పనులు ప్రారంభించకుండా చేతిలో ఉన్న పనులను పూర్తి చేయడంపై మనసు నిలపడం మంచిది. కోర్టు ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. అపరిచిత వ్యక్తుల వలన సంక్లిష్ట స్థితి ఎదురవుతుంది. ఘర్షణ వాతావరణం ఉంటుంది. విదేశీయాన ప్రయత్నాలకు మార్గం సుగమవుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించక తప్పదు. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. వ్యాపారులు లాభాలు బాటలు పడతారు. శ్రమ మీద కొంతవరకు పనులు పూర్తవుతాయి. కృషికి తగ్గ ఫలితాలు ఉంటాయి. కీలక వ్యవహారాల్లో కుటుంబ సహకారం అందుతుంది. బంధుప్రీతి ఉంటుంది. ఇష్టదైవ ప్రార్థన శుభప్రదం. మొత్తంమీద ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి.

కర్కాటక రాశి :
ఈ రాశి వారికి ఈరోజు గతంతో పోలిస్తే.. అనుకూలంగా ఉంటుంది. మాట మంచితనంతో అందరినీ ఆకట్టుకుంటారు. నలుగురిలో గౌరవ మర్యాదలను పొందుతారు. కొత్త ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. చాలా రోజుల నుంచి నిలిచిపోయిన పనుల్లో కదలికతో సంతృప్తి చెందుతారు. కొత్త పనుల ప్రారంభంపై మనసు నిలుపుతారు. ప్రయాణాలు కలిసి వస్తాయి. పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. స్నేహితులు ఆత్మీయుల సలహాలతో పనులు చాలా వరకు నెరవేరుతాయి. ఉద్యోగస్తులకు ఆఫీసులో పైఅధికారులతో సంబంధాలు పెరుగుతాయి. పారిశ్రామికవేత్తలకు అందరి సహకారం లభిస్తుంది.

కొన్ని అనవసరమైన ఖర్చుల వల్ల ముఖ్యమైన పనులు కొంత ఆలస్యం జరగవచ్చు. సంబంధించిన సమస్యలు పరిష్కరించబడతాయి. నూతన గృహకార్యాలపై శ్రద్ధ వహిస్తారు. బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాల్లో పాల్గొంటారు. దైవ దర్శనం చేసుకుంటారు. ఉద్యోగంలో బాధ్యతలు మీద పడతాయి. వ్యాపారంలో కలిసి వస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. మానసిక ఒత్తిడి తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. అనుకున్న పనులు నెరవేరుతాయి. పెళ్లి ప్రయత్నాలు బలవంతమవుతాయి. శనిప్రభావం కారణంగా కొన్ని పనులు ఆలస్యం కావచ్చు. అధైర్య పడకూడదు. ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధికి సంబంధించిన వింటారు. ఓ వార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమంలో పాల్గొంటారు. కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఉత్సాహపరుస్తాయి. శివారాధన ఆనందాన్ని ఇస్తుంది.

సింహరాశి :
ఈరోజు ఈ రాశివారికి కార్య సాఫల్యం ఉంటుంది. అనుకొని విధంగా కలిసి వస్తుంది. అన్నదమ్ములు బంధువర్గం, స్నేహితులతో సంబంధాలు బలపడతాయి. ఉద్యోగ ప్రయత్నాలు పాక్షికంగా ఫలిస్తాయి. కొత్త ఉద్యోగంలో చేరుతారు. సంతోషంతో పనులు పూర్తిచేస్తారు. డబ్బు విషయంలో సంతృప్తిగా ఉంటారు. ఆదాయం స్థిరంగా ఉంటుంది. ప్రణాళికతో ముందుకు వెళ్తే సమస్యలు అధిగమించవచ్చు. వాహనం మూలంగా పనులు నెరవేరుతాయి. వ్యవసాయదారులకు కలిసి వస్తుంది. రాజకీయ ప్రభుత్వ పనులు నెరవేరుతాయి. కొత్త వ్యాపారం ప్రారంభించే ఆలోచన చేస్తారు. కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. దేవత గురుభక్తి పెరుగుతుంది. నూతన వ్యక్తులను నమ్మి మోసపోకూడదు.

సంఘంలో అప్రతిష్ట రాకుండా జాగ్రత్త పడటం మంచిది. ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఎదురవడంతో ఇబ్బంది పడతారు. దైవ దర్శనానికి ప్రయత్నిస్తారు. ఉద్యోగంలో ప్రమోషన్ లభించే అవకాశం ఉందిజ ప్రతి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధికి సంబంధించిన వింటారు. ఓ వార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. ఆదాయం కూడా కొద్దిగా పెరుగుతుంది. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మధ్యమధ్య అనారోగ్య బాధలు తప్పవు. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమంలో పాల్గొంటారు. దుర్గాదేవిని ఆరాధిస్తే శుభం చేకూరుతుంది. సింహరాశి వారికి మొత్తం మీద ఈరోజు శుభఫలితాలు గోచరిస్తున్నాయి.

కన్యారాశి :
ఈ రాశి వారికి ఈరోజు అనుకున్న విధంగా పనులు పూర్తవుతాయి. అయితే, పనులపై శ్రద్ధ నిలపడం అవసరం. ఉద్యోగ ప్రయత్నాలు తాత్కాలికంగా ఫలిస్తాయి. విద్యార్థులు చదువు విషయమై శ్రమించవలసిన రావచ్చు. వ్యవహారాల్లో ఖర్చులు ఉన్న ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఉత్సాహంతో పనులు చేస్తారు. ఉన్నప్పటికీ చిన్నపాటి వివాదాలు తలెత్తవచ్చు. చేతిలో ఉన్న పనులను పూర్తి చేయడంపై మనసు నిలుపుతారు. కొత్త పనులు ప్రారంభాన్ని వాయిదా వేసుకుంటారు. భూములు వాహనాల కొనుగోలు ప్రయత్నాలు వాయిదా పడతాయి. కళాకారులకు ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. కాలం వ్యతిరేకంగా ఉంటుంది. సంక్లిష్ట స్థితి ఎదురవుతుంది. ఘర్షణ వాతావరణం ఉంటుంది.

Horoscope Today 4th June 2024 : 12 రాశుల వారికి ఏయే విషయాల్లో శుభప్రదమంటే?

ప్రతి అడుగు నిదానంగా వేయండి. ధర్మ మార్గంలో ఆలోచించండి. ముఖ్య వ్యక్తుల సలహాలను పాటించండి. ముఖ్యమైన పెద్ద కార్యక్రమాలను కొంతకాలం వాయిదా వేయండి. ఆరోగ్యంపై శ్రద్ధ పెంచాలి. మంచి వార్తను వింటారు. స్థిరాస్తులకు సంబంధించిన విషయాలను సమయస్ఫూర్తి అవసరం నిరుత్సాహంగా కాలం గడుస్తుంది. అపకీర్తి వచ్చే అవకాశం ఉంటుంది. ఇతరులకు అపకారం కలిగించే పనులకు దూరంగా ఉండటం మంచిది. పరిశుభ్రతకు ప్రాధాన్యమిస్తే అనారోగ్య సమస్యలు ఉండవు. ఉద్యోగ పరంగా అనుకూలమైన సమయం. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. పెళ్లి ప్రయత్నాలు కలుస్తాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. స్నేహితులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. వ్యాపారులు పురోగతిని సాధిస్తారు. సామాజిక సేవలు ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంటుంది. ఇష్టదైవ ప్రార్థన శుభప్రదం. మొత్తం మీద ఈ రాశివారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి.

తులా రాశి :
ఈరోజు రాశి వారికి ఇష్ట కార్యశక్తి గోచరిస్తుంది. ధర్మ మార్గంలోపైకి వస్తారు. ప్రయత్నం మేరకు స్వల్ప లాభం ఉంటుంది. అనుకూలమైన రోజు కొత్త అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరగవచ్చు. సంతృప్తిగా ఉంటారు. గృహపకరణాలు కొనుగోలు చేస్తారు. సాంస్కృతిక ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. రోజువారి పనులు సజావుగా సాగిపోతాయి. ఆత్మీయులు బంధువులతో సత్సంబంధాలు ఉంటాయి. వ్యవసాయదారులకు వాతావరణం అనుకూలిస్తుంది. పెద్దల సలహాలను పాటిస్తారు. దేవత గురుభక్తి పెరుగుతుంది. పిల్లల చదువు, వివాహాది శుభకార్య ప్రయత్నాలు కలుస్తాయి. నలుగురిలో మంచి పేర్లు సంపాదిస్తారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. ఉద్యోగస్తులకు అధికారుల ఆదరణ లభిస్తుంది. ప్రయాణాలు కలిసి వస్తాయి.

వ్యాపారంలో మేలు జరుగుతుంది. సుఖ సంతోషాలు ఉంటాయి. ధనలాభం ఉంది. పనుల్లో ఒత్తిడిని తగ్గించుకోవాలి. వ్యాపార రంగంలో లాభాలు ఉంటాయి. రెండు ప్రయత్నాలు చేయవలసి వస్తుంది. నూతన కార్యాలకు శ్రీకారం చూస్తారు. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు కలుస్తాయి. పెళ్లి ప్రయత్నాలకు ఇది అనుకూలమైన సమయం. సామాజిక కార్యకలాపాలు చురుగ్గా పాల్గొంటారు. ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు. పాత స్నేహితులు తూర్పు, బంధువులు ఇంటికి వచ్చే అవకాశం ఉంది. వ్యాపారుడి శ్రమ మీద పురోగతిని సాధిస్తారు. బంధువులతో మేలు జరుగుతుంది. ఆధ్యాత్మిక విషయాల్లో చురుకుగా పాల్గొంటారు. లలిత సహస్రనామాలు పారాయణం చేయాలి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి.

వృశ్చిక రాశి :
ఈరోజు వృశ్చిక రాశి వారికి ఆశీర్వాద ఆర్థిక వ్యవహారాల్లో మరింత ప్రగతి కనిపిస్తుంది. ఎన్నాళ్లుగాను ఎదురుచూస్తున్న పని ఇప్పుడు పూర్తి అవుతుంది. ఉద్యోగంలో స్థిరమైన ఫలితాలు ఉంటాయి. అనుకున్న స్థాయికి చేరుతారు. కుటుంబంలో శాంతి లభిస్తుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. రుణాలు తీరుతాయి. ఇష్ట కార్యాల్లో విశేషమైన ప్రకృతి సాధించే కాలమిది. చూసిన లాభమే ఆచరిస్తుంది. మనసులోని కోరిక తీరుతుంది. ఉద్యోగంలో అధికారుల నుంచి ఆదరణ లభిస్తుంది. అధికార లాభం ఉంది. ఆర్థిక స్తోమత చాలా వరకు మెరుగుపడుతుంది. బంధువులతో సంబంధం మెరుగుపడతాయి. భూవివాదాలు పరిష్కారం అవుతాయి. నిరుద్యోగుల యత్నాలలో పురోగతి ఉంటుంది. పరిచయాలు పెరుగుతాయి. ఇంటి నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. గత జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి.

వ్యాపారాలలో మరింతగా లాభాలు అందుతాయి. ఉద్యోగాల్లో అదనపు బాధ్యతల నుంచి విముక్తి లభిస్తుంది. ఊహించని ఆహ్వానాలు అందుతాయి. కుటుంబ సమస్యలు తీరుతాయి. ఆప్తుల నుంచి పిలుపు రావచ్చు. పనులు చకచకా సాగుతాయి. వ్యాపారాలు ఉద్యోగాలలో అనుకూలంగా ఉంటుంది. ఒక వ్యక్తిగత సమస్య నుంచి బయటపడతారు. స్పెక్యులేషన్‌కు దూరంగా ఉండండి. ఆదాయం పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తారు. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. అద్భుతమైన అవకాశాన్ని పొందుతారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. నూతన వస్తుఆభరణాలు సేకరిస్తారు. నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది. ఇంటి నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. ముఖ్యమైన శుభవార్తలు వింటారు. ఆత్మీయుల సహాయ, సహకారాలు సంపూర్ణంగా లభిస్తాయి. అనుకోకుండా డబ్బు చేతికి అందుతుంది. మహావిష్ణువుని స్మరించండి. మంచి జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి.

ధనస్సు రాశి :
ఈ రాశి వారికి ఈరోజు శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. కుటుంబ సభ్యులకు మేలు జరుగుతుంది. మిత్రుని ద్వారా లాభపడతారు. గత వైభవం లభిస్తుంది. కుటుంబమంతా సంతోషంగా ఉంటారు. గతంలో వాయిదా వేసిన పనులన్నీ పూర్తి చేసుకుంటారు. సంపూర్ణ ఆరోగ్యం ఏర్పడుతుంది. స్థిరనివాసం ఉంటుంది. వ్యవసాయం మూలకంగా లాభాలను పొందుతారు. ప్రయత్న కార్యాలన్నీ ఫలిస్తాయి. సూక్ష్మ విషయాలను గ్రహిస్తారు. ఆర్థికంగా కలిసి వస్తుంది. విద్యార్థులు పైచదువులు కోసం ఎక్కువగా ఆలోచిస్తారు. అనుకూలమైన రోజు ఆదాయం స్థిరంగా ఉంటుంది. క్రమేపి పెరుగుతుంది. ఆరోగ్యంగా ఉంటారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. అనవసరమైన ఖర్చులు నియంత్రించడం అవసరం. బంధుమిత్రులతో పనులు నెరవేరుతాయి.

ఆత్మీయుల సహకారం లభిస్తుంది. కుటుంబంలో అనుకూల వాతావరణము ఉంటుంది. పెద్దల సహకారాన్ని పొందుతారు. మంచి ఫలితాలను పొందుతారు. కుటుంబంతో సంతృప్తిగా ఉంటారు. కళాకారులకు సాహితీ వ్యక్తులకు కొత్త అవకాశాలు వస్తాయి. ఉద్యోగస్తులకు అధికారుల ఆదరణ లభిస్తుంది. శుభం జరుగుతుంది. వ్యాపార బలం పెరుగుతుంది. విశేష ధనలాభం కలుగుతుంది. క్రమంగా అభివృద్ధిని సాధిస్తారు. ఉద్యోగంలో అధికారుల నుంచి ఒత్తిడి ఉంటుంది. ఉద్యోగం గురించి ప్రయత్నిస్తున్న వారికి మంచి కబురు అందుతుంది. ఆకస్మిక ధనం లభించే సూచనలు ఉన్నాయి. దగ్గర బంధువులతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల్లో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. అనారోగ్యానికి గురయ్యే పరిస్థితి కనిపిస్తోంది. హామీలు ఇవ్వొద్దు. శివారాధన మేలు చేస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి.

మకర రాశి :
ఈ రాశి వారికి ఈరోజు దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో ఏమరపాటు తగదు. సమయానికి నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగ ప్రయత్నాలలో తాత్కాలిక ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులకు పరిభారము ఉండవచ్చు. సహో ఉద్యోగుల సహకారం లభిస్తుంది. రావాల్సిన డబ్బు చేతికి అందడానికి కొంత సమయం పడుతుంది. తద్వారా పనులు అనుకున్నంత త్వరగా పూర్తి చేయలేక పోతారు. కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి. సమయమనం పాటించండి. స్నేహితులు బంధువర్గం మూలంగా ఇబ్బందులు తలుగుతాయి. వ్యాపారం లాభచాటుగా కొనసాగుతుంది. ఉత్సాహంతో పనులు చేస్తారు. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ధన చింతన ఉండదు. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. అన్ని విధాలా సుఖాన్ని పొందుతారు.

వ్యాపారంలో అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్యంగా ఉంటూ శ్రద్ధతో పనులు పూర్తి చేయడంపై మనసు నిలుపుతారు. వాహనాలు భూముల మూలంగా వివాదాన్ని తొలగిపోతాయి. కాలం అనుకూలంగా ఉంటుంది. ప్రతి అడుగు నిదానంగా వేయండి. ధర్మమార్గంలో ఆలోచించండి. ముఖ్య వ్యక్తుల సలహాలను పాటించండి. ముఖ్యమైన పెద్ద కార్యక్రమాలను కొంతకాలం వాయిదా వేయండి. ఆరోగ్యం పై శ్రద్ధ పెంచాలి. మంచి వార్తను వింటారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. ప్రయాణాల వల్ల లాభం చేకూరుతుంది. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. ఇష్ట దైవ ప్రార్థన శుభప్రదం. మొత్తం మీద ఈరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి.

కుంభరాశి :
ఈ రాశి వారికి ఈరోజు మీ మంచితనం మిమ్మల్ని అందరిలో ప్రత్యేకంగా ఉండేలా చేస్తుంది. ధర్మ మార్గంలో పైకి వస్తారు. తోటి వారితో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. ఉద్యోగంలో సంతృప్తికర వాతావరణం ఉంటుంది. పనిభారం పెరిగిన సమర్థవంతంగా పూర్తి చేస్తారు. ఆరోగ్యంగా ఉంటారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. సహోద్యోగులతో మనస్పర్ధలు ఏర్పడవచ్చు. బంధుమిత్రులతో సత్సంబంధాలు ఉంటాయి. తలపెట్టిన పనులు నెరవేరుతాయి. వ్యాపారస్తులకు అనుకూలం. పెట్టుబడుమూలంగా ఆదాయం పెరుగుతుంది. అధికారుల ప్రశంసలు పొందుతారు. సంగీత సాహితీవేత్తలకు కళాకారులకు ఆదాయం పెరుగుతుంది. కొత్త అవకాశాలు చేతికందుతాయి. ఆదాయం స్థిరంగా ఉంటుంది. క్రమేపి పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు.

స్థిరాచరాసుల విషయంలో వివాదాలు పరిష్కారం అవుతాయి. కొత్త వస్తువులు కొంటారు. ఉద్యోగ ప్రయత్నాలు పలుస్తాయి. ఇష్ట కార్యసిద్ధి ఉంటుంది. వ్యాపారంలో మేలు జరుగుతుంది. సుఖ సంతోషాలు ఉంటాయి. ధనలాభం ఉంది. పనుల్లో ఒత్తిడిని తగ్గించుకోవాలి. విఘ్నాలను అధిగమిస్తారు. ఉద్యోగంలో ఒక లక్ష్యాన్ని సాధిస్తారు. కొంత శ్రమ పడ్డ అనుకున్న పనులు నెరవేరుతాయి. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం, ఆదాయం నిలకడగా ఉంటాయి. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. స్నేహితులు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. స్త్రీలు విశ్రాంతి తీసుకోవడం అవసరం. ఊహించని కార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. వృత్తి ఉద్యోగరంగాల్లో అభివృద్ధి ఉంటుంది. ఆత్మీయులను కలవడంలో సఫలం అవుతారు. వెంకటేశ్వర స్వామిని దర్శిస్తే శుభం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి.

మీనరాశి :
ఈ రాశి వారు ఈరోజు తలపెట్టిన పనులను అనుకున్న సమయంలో పూర్తి చేస్తారు. ఇంటి బరువు బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు సజావుగా కొనసాగుతాయి. నలుగురిలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. విద్యార్థులకు మంచి అవకాశం వస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు కలుస్తాయి. ధనలాభం ఉంటుంది. ఉద్యోగస్తులకు ఆఫీసులో సంతృప్తిగా ఉంటుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలలో స్నేహితులు బంధువర్గం సాయం లభిస్తుంది. వ్యాపారస్తులకు గత పెట్టుబడి మూలంగా లాభాలు అందుతాయి. కొత్త పెట్టుబడుల కోసం ప్రయత్నాలు చేస్తారు. పాత బాకీలు వసూలు అవుతాయి.

వృధా ఖర్చులతో ముఖ్యమైన పనులు ఆలస్యం జరగవచ్చు. ముఖ్య కార్యాల్లో విజయం లభిస్తుంది. ఉద్యోగంలో ఒత్తిడి శ్రమ తగ్గుతాయి. ధర్మ మార్గంలో ముందుకు సాగండి. కుటుంబ పరంగా మంచి జరుగుతుంది. సమిష్టి నిర్ణయాలు కలిసి వస్తాయి. ఒక ముఖ్యమైన సమాచారాన్ని అందుకుంటారు. ఆకస్మిక ధన లాభయోగం ఉంటుంది. ప్రయత్న కార్యాల్లో విజయం సాధిస్తారు. బంధుమిత్రులను కలుస్తారు. క్రీడాకారులు రాజకీయ రంగాల్లో వారు ఉత్సాహంగా ఉంటారు. ఆరోగ్యం పర్వాలేదు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. పురోగతి చెందుతారు. ముఖ్యంగా స్వయం ఉపాధి బాగుంటుంది. ఉద్యోగంలో మార్పులు జరగవచ్చు. విందులు వినోదాల్లో పాల్గొంటారు. భార్య పిల్లలతో కాలక్షేపం చేస్తారు. స్త్రీలు సంతోషంగా కాలక్షేపం చేస్తారు. లక్ష్మీనారాయణ ఆరాధన చేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది.

Read Also : Horoscope Today 3rd June 2024 : జూన్ 3న రాశిఫలితాలు.. 12 రాశుల్లో ఏయే రాశులవారికి ఏయే పనుల్లో అదృష్టం కలిసివస్తుందంటే?

This website uses cookies.