Categories: DevotionalLatest News

Horoscope Today 9 June 2024 : ఈరోజు రాశి ఫలాలు.. నేటి పంచాంగం.. 12 రాశుల వారికి ఏ పని కలిసివస్తుందంటే?

Horoscope Today 9 June 2024 : ఈరోజు జూన్ 9వ తేదీ. శ్రీ క్రోధినామ సంవత్సరం జేష్ట మాసం, ఉత్తరాయణం, గ్రీష్మ రుతువు. ఆదివారం తిధి: తదియ, సాయంత్రం: 4 గంటల 22 నిమిషాల వరకు, నక్షత్రం: పునర్వసు రాత్రి 9 గంటల 26 నిమిషాల వరకు. వ్యర్జం: ఉదయం 9 గంటల 2 నిమిషాల నుంచి 10 గంటల 43 నిమిషాల వరకు. దుర్ముహూర్తం: సాయంత్రం 4 గంటల 42 నిమిషాల నుంచి 5: 36 వరకు. అమృతకాలం: సాయంత్రం 5 గంటల 52 నిమిషాల నుంచి 7:32 నిమిషాల వరకు.

రాహుకాలం : ఈరోజు సాయంత్రం 4: 30 నిమిషాల నుంచి 6:00 గంటల వరకు. సూర్యోదయం ఉదయం 5:30కు ప్రారంభం. సూర్యాస్తమయం : సాయంత్రం 6:17 నిమిషాలకు. ఈరోజు విశేషం ఆదివారం. సూర్యభగవానుని ఆరాధనకు ప్రత్యేకమైన రోజు. ఈ ఆదివారం సూర్యదేవుడికి ఆరాధించడం శుభప్రదం. ఆదివారం సూర్యున్ని పూజించడం వల్ల ఆరోగ్యం పెరుగుతుంది. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎలాంటి ఫలితాలు పొందవచ్చునో వివరంగా తెలుసుకుందాం.

మేషరాశి :
ఈరోజు ఈ రాశి వారికి ఆర్థికపరంగా చాలా బాగుంటుంది. ఈ రోజంతా యాక్టివ్‌గా ఉంటారు. చిన్నచిన్న ఖర్చుల విషయంలో ఒత్తిడికి లోనవ్వద్దు. వ్యాపారులు కొత్త ఒప్పందాలు చేసుకునేందుకు ఇదే మంచి సమయం. అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి. స్థిరాచరాసుల మూలంగా ఆదాయం పెరుగుతుంది. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. ప్రయాణాలు కలిసివస్తాయి. కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. కొత్త పనులను ప్రారంభిస్తారు. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. తీర్థయాత్రలు నదీ స్నానాలు చేస్తారు. దేవత గురుభక్తి పెరుగుతుంది. వ్యాపారం సంతృప్తిగా కొనసాగుతుంది. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. తిరుగులేని శక్తిగా ఎదుగుతారు.

ఆర్థికంగా మిశ్రమ ఫలితం ఉంటుంది. మంచి భవిష్యత్తును నిర్మిస్తారు. బయటవాళ్ళు ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉన్నాయి. కీర్తివృద్ధి చెందుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇష్టదేవతను దర్శించండి. ఉద్యోగస్తులకు ఆఫీసులో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. తోటిఉద్యోగులు అధికారుల సహకారం లభిస్తుంది. బందు వర్గంతో సంబంధాలు పెరుగుతాయి.వాహనం మూలంగా కలసివస్తుంది. శుభయోగాలు ఉన్నాయి. సంతృప్తినిచ్చే విధంగా జీవితం ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో బాగుంటుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఇతరులనుంచి సహాయ సహకారాలు అందుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. శివారాధన శ్రేష్టంగా ఉంటుంది.

వృషభ రాశి :
ఈ రాశి వారికి ఈరోజు చిన్న చిన్న ఆటంకాలు కలిగిన చివరికి విజయం సిద్ధిస్తుంది. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అనుకున్నది దక్కుతుంది. ధన లాభం విశేషంగా ఉంది. గంభీరంగా వ్యవహరించాలి. ధర్మ మార్గంలో పైకివస్తారు. అదృష్ట యోగం ప్రోత్సహిస్తుంది. పట్టుదల అవసరం. ప్రేమికుల మధ్య మనస్పర్ధలు తొలగిపోతాయి. మీరు సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగులకు పనిఒత్తిడి తగ్గుతుంది. వ్యాపారులకు లాభాలు వస్తాయి. కుటుంబ సభ్యులతో సంకేతం ఉంటుంది. అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఇతరుల నుంచి సహాయ సహకారాలు అందుకుంటారు.

రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఖర్చులు పెరుగుతాయి. దేవత గురుభక్తి పెరుగుతుంది. అనవసరమైన ఖర్చులతో ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. ప్రయాణాలను వాయిదా వేసుకుంటారు. పనిభారం తగ్గుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ నిలుపుతారు. ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. అయితే, చిన్నచిన్న వివాదాలు మూలంగా శాంతిని దూరం చేసుకుంటారు. కోర్టు వ్యవహారాలలో అనుకూల ఫలితాలు ఉంటాయి. న్యాయపరమైన సమస్యలను అధిగమిస్తారు. సహద్యోగులతో కలిసికట్టుగా పనిచేస్తారు. ఖర్చుల నియంత్రణ వివాదాలకు దూరంగా ఉండటం అవసరం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

మిధున రాశి :
ఈరోజు ఈ రాశి వారికి అద్భుతంగా ఉంటుంది. ఆర్థిక లాభం ఉంటుంది. ఇంట్లోకి నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. తీర్థయాత్రలపై మనసు నిలుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతారు. సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆదాయం స్థిరంగా ఉంటుంది. సహద్యోగులతో సంబంధాలు బాగుంటాయి. ప్రతి వ్యాపారాల్లో అనుకూలంగా ఉంటుంది. మీ కుటుంబ సభ్యులతో మంచి ప్రవర్తనను కలిగి ఉండండి. ముఖ్యమైన పనుల్లో అప్రమత్తగా వ్యవహరించాలి. మౌనం వివాదాల నుంచి బయటపడేస్తుంది. ఆర్థిక సమస్యలను అధిగమిస్తారు. ఒక శుభం జరుగుతుంది. గతంలో చేసిన మేలు ఒకటి ఇప్పుడు మిమ్మల్ని కాపాడుతుంది. స్థిరాచరాసుల విషయంలో ఉన్న తగాదాలు పాక్షికంగా పరిష్కారం అవుతాయి.

భూముల కొనుగోలుపై మనసు నిలుపుతారు. రావాల్సిన డబ్బు చేతికి అందడంతో కొన్ని పనులు పూర్తవుతాయి. కార్యకలాపాలుగా సాగుతాయి. అనవసరమైన ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. సమాజంలో మంచి పేర్లు సంపాదిస్తారు. విద్యార్థులకు అనుకూలమైన రోజు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగండి. కాలం అనుకూలంగా నడుస్తుంది. వ్యాపారంలో కొన్ని సాంకేతిక సమస్యలు ఎదురవుతాయి. జాగ్రత్తగా ఖర్చుపెట్టండి. బంధుమిత్రుల వ్యవహారాలలో ఎక్కువ పట్టించుకోకపోవడమే మంచిది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఒక సంఘటన మీలో ధైర్యాన్ని నింపుతుంది. శక్తి కోసం నవగ్రహ శ్లోకాలు పాటించండి.

కర్కాటక రాశి :
ఈరోజు రాశి వారికి తగిన ప్రతిఫలం ఉంటుంది. శ్రద్ధతో పనులు చేస్తారు. మొదలుపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఉత్సాహంతో ఉంటారు. పనిలో బాధ్యతలు పెరిగిన సంతోషంగా స్వీకరిస్తారు. సమర్థవంతంగా పూర్తిచేస్తారు. అలసట లేకుండా నిరంతరం శ్రమతో పనుల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగులకు గుర్తింపు లభిస్తుంది. కార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులకు అనుకూలం. ఆరోగ్యం బాగుంటుంది. వృత్తి, ఉద్యోగ వ్యాపారాలు మరింత కష్టపడాలి. అదృష్ట ఫలాలు అందుతాయి.

కొత్తగా వ్యాపారం ప్రారంభించే వారు లాభం పొందుతారు. మీ కోరికలు నెరవేరుతాయి. షేర్ మార్కెట్ నుంచి ఆశించిన ధనలాభం ఉంటుంది. ఈరోజు పనులన్నీ తొందరగా పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు. ప్రేమికులు వారి సంబంధం పట్ల మక్కువతో ఉంటారు. మీరు కొత్త ఉద్యోగ ఆఫర్లను పొందుతారు. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ తొందరపాటు పనికిరాదు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. పెద్దల సలహాలు, సూచనలు పొందుతారు. శివారాధన మంచిది.

సింహరాశి :
ఈ రాశి వారు ఈరోజు ఆదాయం పెంచుకునే ప్రయత్నాలు చేస్తారు. ఉద్యోగస్తులకు ఆఫీసులో పనిభారం తగ్గుతుంది. ఖర్చులు పెరుగుతాయి. పట్టుదలతో పనులను పూర్తి చేయడం మంచిది. ప్రారంభించిన పనులు పూర్తవుతాయి. విద్యార్థులకు అనుకూలం. రాబడి ఖర్చులు ఉంటాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. పనుల్లో బరువు బాధ్యతలు శ్రమ పెరుగుతాయి. రావాల్సిన డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది. ముఖ్యమైన విషయాల్లో ఆచితూచి అడుగులు వేయడం మంచిది. ఏదైనా నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచించే తీసుకోవడం మంచిది. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు.

Today Horoscope 9th June 2024 ( Photo Credit : Google )

వ్యాపారంలో లాభసాటుగా కొనసాగుతుంది, అయితే వ్యాపార భాగస్వామితో సఖ్యత పెంచుకోవడం అవసరం. వివాదాలకు దూరంగా ఉండండి. బందువర్గం మూలంగా ఖర్చులు పెరగవచ్చు. ధనయోగం ఉంది. ప్రయత్నం బలంగా ఉండాలి. సౌభాగ్యం సిద్ధిస్తుంది. ఓర్పు గొప్ప వారిని చేస్తుంది. వస్తూ, వస్త్ర ప్రాప్తి ఉంటుంది. సకాలంలో పనులు పూర్తి చేయాలి. విజ్ఞానం ఉంటాయి. ధైర్యం రక్షిస్తుంది దగ్గర వారి నుంచి మంచి వార్తలు వింటారు. ఆనందంగా కాలం గడుస్తుంది. ఖర్చులు పెరుగుతాయి. మీ ప్రణాళికలను బహిర్గతం చేయవద్దు. కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. యువతా తమ కెరియర్‌పై చాలా సీరియస్‌గా ఉంటారు. ఉన్నత వ్యక్తుల నుంచి మార్గదర్శకత్వం పొందుతారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించండి.

కన్య రాశి :
ఈ రాశి వారికి ఈరోజు చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. అదృష్ట యోగం ఉంది. ఉత్తమ కాలం నడుస్తోంది. అనుకున్నవన్నీ జరుగుతాయి. కాలాన్ని ఎంత గొప్పగా వినియోగించుకుంటే అంత మంచి ఫలితాలు వస్తాయి. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. మిత్రుల సహకారం లభిస్తుంది. కొత్త ఆలోచనలు చేయండి. ఉత్సాహంతో పనులు చేస్తారు. కొత్త దుస్తులు వస్తువులు కొనుగోలు చేస్తారు. బంధు వర్గం స్నేహితులతో మనస్పర్ధలు తొలగుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. కార్య సాఫల్యం ఉంటుంది. కొత్త వ్యాపారం ప్రారంభిస్తారు. కోర్టు వ్యవహారాల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి.

Horoscope Today 9 June 2024 : 12 రాశుల వారికి ఆదివారం ఎలా శుభఫలితాలు ఉంటాయంటే?

న్యాయపరమైన సమస్యలను అధిగమిస్తారు. ఉద్యోగస్తులకు పనుల్లో బాధ్యత పెరిగిన ఉత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. ఆరోగ్యంగా ఉంటారు. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. సంగీత సాహిత్య కళాకారుల ఆదాయం పెరుగుతుంది. వ్యవసాయదారులకు పారిశ్రామికవేత్తలకు అనుకూలం. ఇరుగుపొరుగువారి సహకారం లభిస్తుంది. ప్రయాణాల వల్ల కార్య సాఫల్యత ఉంటుంది. మీకు గౌరవం పెరుగుతుంది. విద్యార్థులకు నిపుణుల సహాయం అందుతుంది. గతంలో తీసుకున్న నిర్ణయాలు ఈరోజు మీకు మేలు చేస్తాయి. చిన్న తరహా వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. అపరిచితుల పట్ల జాగ్రత్త వహించండి. మీ రంగాల్లో మంచి విజయాలు ఉంటాయి. ఊహించిన దానికన్నా అధికంగా ధనలాభం కలుగుతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. దూర ప్రయాణాలు చేస్తారు. గురుగ్రహ శ్లోకం చదవాలి.

తులారాశి :
ఈ రాశి వారికి ఈ రోజు ధనధాన్యాలు కలిసివస్తాయి. పట్టుదలతో విజయాన్ని అందుకుంటారు. అన్ని ఇష్టాలు సిద్ధిస్తాయి. రాజయోగం ఉంది. స్వస్థానం ప్రాప్తిస్తుంది. ఆర్థిక స్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఆర్థికంగా ఉత్తమ కాలం. ఒక విషయంలో సానుకూల ఫలితం ఉంటుంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. నలుగురి సహకారం లభిస్తుంది. కొత్త పనులు ప్రారంభించడంపై మనసు నిలుపుతారు. ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతారు. ఇంట్లో అనుకూల వాతావరణ ఉంటుంది. తీర్థయాత్రలు విహారయాత్రల ప్రణాళికను పాలుస్తాయి.

కళాకారుల ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారుజ వ్యాపారులకు అనుకూలం. ఈరోజు సాధారణంగా ఉంటుంది. తొందరగా అలసిపోతారు. విదేశాల్లో వ్యాపారం చేసే వ్యక్తులు కొన్ని సమస్యలు తగ్గించుకుంటారు. అనారోగ్య సమస్యలను అధిగమిస్తారు. అధికారులతో మాట పట్టింపులు ఉంటాయి. మీ జీవిత భాగస్వామి కోసం సమయాన్ని కేటాయించాలని నిర్ధారించుకోండి. మీ వ్యాపారం బాగా సాగుతుంది. శ్రమ పెరగకుండా చూసుకోవాలి ఆర్థిక విషయాలు జాగ్రత్తగా ఉండాలి ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. గిట్టని వారికి దూరంగా ఉండటం మంచిది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు సూర్యనారాయణ మూర్తిని దర్శించండి.

వృశ్చిక రాశి :
ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక స్థితి సంతృప్తిగా ఉంటుంది. గత కాలంలో పెట్టిన పెట్టుబడికి ఇప్పుడు మంచి టైం మొదలైంది. వాహనాలు, భూముల కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. కోర్టు కేసుల్లో విజయం చేకూరుతుంది. ప్రయత్నం పూర్వక విజయం లభిస్తుంది. ఇబ్బందులను అధిగమించడం మంచిది. మోసం చేసేవారు ఉంటారు జాగ్రత్తగా ఉండండి. పనుల్లో ఏకాగ్రత లోపించనీయకండి. ఒక మంచి జరుగుతుంది. ముఖ్య వ్యక్తుల సూచనలు అవసరం. నవగ్రహ స్తుతి ఆనందాన్ని ఇస్తుంది. రావాల్సిన డబ్బు చేతికందుతుంది. ఉద్యోగస్తులు సంతోషంతో పనులు పూర్తి చేస్తారు. కొత్త ఉద్యోగ అవకాశాలు తలుపు తడుతాయి. రోజు వారి కార్యకలాపాలు సజావుగా కొనసాగుతాయి.

బంధువర్గంతో సఖ్యత పెరుగుతుంది. వ్యవసాయదారులకు పారిశ్రామికవేత్తలకు మంచి సమయం. కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి. తీర్థయాత్రలు విహారయాత్రలపై మనసు నిలుపుతారు. ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతారు. వ్యాపారులు లాభాలు పొందుతారు. కార్యాలయంలో సహద్యోగులను ఆకట్టుకుంటారు. మీ సూచనలను అందరూ అనుసరిస్తారు. మంచి వ్యక్తులను కలుస్తారు. స్నేహితులతో సంతోష సమయం గడుపుతారు. ఈరోజు మీ ప్రయాణం వాయిదా వేయండి. ముఖ్యమైన వ్యవహారాలలో జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని పరిస్థితులు మిమ్మల్ని బాధిస్తాయి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని పడితే వారిని అతిగా నమ్మకపోవడమే మంచిది.

ధనస్సు రాశి :
ఈ రాశి వారి ఈరోజు నలుగురికి సాయపడతారు. చిత్తశుద్ధితో పనిచేయడం వలన లక్ష్యం నెరవేరుతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. బాగా శ్రమపడితే విజయం లభిస్తుంది. ఉద్యోగ వ్యాపారాల్లో బాగుంటుంది. అనుకున్నది సాధిస్తారు. బుద్ధి చురుగ్గా పనిచేస్తుంది. గృహలాభం ఉంటుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. మీ బాధ్యతలు మీరు నెరవేరుస్తారు. విదేశాల్లో మంచి ఆఫర్లు పొందుతారు. ఇంట్లో శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులకు అనుకూలం. కష్టానికి తగిన ఫలితాలు సాధిస్తారు. ప్రయాణాలు కలిసి వస్తాయి. పనిచేసే చోట సహద్యోగుల సహకారం లభిస్తుంది. అధికారులతో స్నేహంగా మెలుగుతారు. పదోన్నతులు లాభించవచ్చు.

అన్నదమ్ములు బందువర్గం చొరవతో పనులు నెరవేరుతాయి. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. ఆరోగ్యంగా ఉంటారు. కేసుల్లో అనుకూల ఫలితాలు వస్తాయి. వ్యాపారస్తులకు భాగస్వామ్యలతో అవగాహన పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతారు. వ్యాపారులు కొత్త ప్రణాళికలు వేసుకునేందుకు మంచి రోజు. రియల్ ఎస్టేట్‌తో సంబంధం ఉన్న వ్యక్తులు భారీ లాభాలను పొందుతారు. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. విద్యార్థులకు చదువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కీలక విషయాలలో నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆర్థిక లావాదేవీలు కలుగుతాయి. సమాజంలో మంచి గౌరవం లభిస్తుంది. కార్యసిద్ధికి ఇష్ట దైవాన్ని స్మరించండి.

మకర రాశి :
ఈ రాశి వారికి ఈరోజు కార్యసిద్ధి కలుగుతుంది. సమయస్ఫూర్తితో పనులను పూర్తి చేస్తారు. ఏదో ఊహిస్తారు అదే జరుగుతుంది. ధనలాభం ఉంటుంది. అన్ని విధాలా కలిసివస్తుంది. గౌరవం లభిస్తుంది. కొందరికి సాయం చేయడం ద్వారా పుణ్యం పెరుగుతుంది. ఇప్పుడు చేసే పనులు బంగారు భవిష్యత్తును ఇస్తాయి. సాహసోపేతమైన నిర్ణయాలు విజయాన్ని ఇస్తాయి. శుభవార్తలు వింటారు. మీరు మతపరమైన కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. వ్యాపారంలో మంచి లాభాలు పొందే అవకాశాలు ఉంటాయి. మీ మనసులో ఉన్నది ఉన్నట్టు మాట్లాడటం వల్ల మీపై వ్యతిరేకత పెరగవచ్చు. వృత్తి, వ్యాపారాల్లో ఆదాయం స్థిరంగా ఉంటుంది. శుభవార్తను వింటారు. ఖర్చులు విషయంలో నియంత్రణ పాటించాలి. ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి.

బంధుమిత్రుల రాకతో ఖర్చులు పెరగవచ్చు. ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. సహోద్యుగలపై అధికారులతో సఖ్యతతో వెలగడం అవసరం. లేదంటే.. ఇబ్బందులకు గురవుతారు. తీర్థయాత్ర ఆలయ ఆలోచనలు, ప్రయత్నాలు ఫలిస్తాయి. కార్యప్రయత్నాలు ముందుకు సాగుతాయి. వ్యవసాయదారులకు మంచి వాతావరణం. ఇరుగుపొరుగుతో తగాదాలు పరిష్కారం అవుతాయి. శుభకాలం నడుస్తుంది. ఉద్యోగులు పనిని బాధ్యతాయుతంగా చేయండి. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి. మంచి ఆలోచనతో ముందుకు వెళ్తారు. అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. శాంతి కోసం లక్ష్మీ అష్టోత్తరం చదవాలి.

కుంభరాశి :
ఈ రాశి వారికి ఈరోజు ఎప్పటినుంచో వెంటాడుతున్న కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. కార్యాలయంలో సహోద్యుగుల నుంచి సహకారం అందుతుంది. ఇతరుల నుంచి ప్రశంసలు పొందుతారు. ఉద్యోగంలో మంచి లాభాలు లభిస్తాయి. అధికంగా శ్రమించాల్సి ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది. అన్నదమ్ముల సహకారం లభిస్తుంది. ఉత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. కొన్ని పనులు వృధా ఖర్చులు ఉంటాయి. రావాల్సిన డబ్బు పాక్షికంగా చేతికి అందుతుంది. వ్యవసాయదారులకు పారిశ్రామికవేత్తలకు మంచి సమయం. అనుకున్న పనులు సమయానికి పూర్తవుతాయి. సహద్యోగుల సహకారం లభిస్తుంది. బాధ్యతలు పెరిగిన సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. బంధుమిత్రులతో కార్యా సాఫల్యత ఉంటుంది.

సంగీత సాహిత్య కళాకారులకు అనుకూలం. కొత్త అవకాశాలు లభిస్తాయి. ఇంట్లోకి కావలసిన వస్తువులు కొనుగోలు చేయడంలో ఆలస్యం చేస్తారు. విద్యార్థులకు అనుకూలం. ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. శుభకాలం నడుస్తోంది. కార్యం సిద్ధిస్తాయి. ధన లాభం ఉంటుంది. అన్ని విధాలా కలిసి వస్తుంది. గౌరవం లభిస్తుంది. కొందరికి సహాయం చేయడం వల్ల పుణ్యం పెరుగుతుంది. ఇప్పుడు చేసే పనులు బంగారు భవిష్యత్తునిస్తాయి. శుభవార్తలు వింటారు. కొందరికి మీపై కోపం రావచ్చు. మీ మాట తీరు మార్చుకుంటే చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. పాత రుణం విషయాలు ఇబ్బందులు ఎదుర్కొంటారు. మీ ప్రత్యర్థులను బలహీనులుగా భావించే పొరపాటున చేయొద్దు. శాంతి కోసం లక్ష్మీ అష్టోత్తరం చదవాలి.

మీనరాశి :
ఈరోజు మీనరాశి వారికి అభిష్టాలు సిద్ధిస్తాయి. చిన్నచిన్న విజ్ఞాలు ఎదురైనా అంతిమంగా విజయం సిద్ధిస్తుంది. లక్ష్యం చెరువులోనే ఉంటుంది. ధైర్యంగా ప్రయత్నం కొనసాగించండి. దైవ శక్తి కాపాడుతుంది. ఉద్యోగంలో గుర్తింపు లభిస్తుంది. కుటుంబ సభ్యులకు శుభకాలం. కళాకారులకు మంచి సమయం. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. సాంకేతిక విధులు మీకు ఆసక్తి కలిగిస్తాయి. మీ శత్రువులపై విజయం సాధిస్తారు. రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తులకు ఈరోజు గొప్పగా ఉంటుంది. కొన్న భూముల వల్ల ఆస్తి విలువ అమాంతం పెరుగుతుంది. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారాలు సంతృప్తిగా కొనసాగుతాయి.

వ్యాపారస్తులు కొత్త పనులు ప్రారంభిస్తారు. విద్యార్థులకు అనుకూలం. రావాల్సిన డబ్బు చేతకి అందుతుంది. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలను పాల్గొంటారు. మంచి వారితో స్నేహ సంబంధాలు పొందుతారు. ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఉద్యోగస్తులుపై అధికారులు మన్ననలను పొందుతారు. పదోన్నతి పొందవచ్చు. బంధుమిత్రులతో పనులు నెరవేరుతాయి. ఉద్యోగులు, వ్యాపారాలు విద్యార్థులకు శుభసమయం. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. పెద్దలతో పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక లాభాలు కలుగుతాయి. అనుకొని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. విష్ణు సహస్రనామం పఠిస్తే మంచి ఫలితాన్ని ఇస్తుంది.

Read Also : Horoscope Today 8 June 2024 : జూన్ 8, పంచాంగం.. ఈరోజు రాశిఫలాలు.. 12 రాశుల వారికి ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయంటే?

Share
Published by
OTN

This website uses cookies.