YS Jagan Mohan Reddy faces Bitter Experience Before Entrance of AP Assembly ( Image Source : Google )
YS Jagan Mohan Reddy : ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత మొదటిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు మాజీ సీఎం జగన్. ఈ సందర్భంగా అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతున్న సమయంలో ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. జగన్ పులివెందుల ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న సమయంలో అసెంబ్లీ గేటు వద్ద ఆయన కాన్వాయ్‌ను వెంబడిస్తూ కొందరు ఆకతాయిలు గట్టిగా కేకలు వేశారు.
జగన్ మామయ్య.. జగన్ మామయ్య అంటూ కేకలతో ఫొటోలు, వీడియోలు తీశారు. ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్ అసెంబ్లీ వెనుక గేటు బయటి నుంచి లోపలి వెళ్లిపోయారు. అనంతరం ఆయన పులివెందుల ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీ గేటు వద్ద టీడీపీ శ్రేణులు గుమిగుడారు. జగన్‌ని చూడగానే బైబై జగన్ అంటూ నినాదాలు చేశారు. జగన్ కాన్వాయ్ ముందు ఇలా కేకలు వేయడం సరికాదని, మాజీ సీఎం వెళ్తున్న సమయంలో ఆయన్ను గౌరవించాలని వైసీపీ శ్రేణులు కోరుతున్నాయి. జగన్ బైబై అంటూ కొందరు నినాదాలు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వెనుక బెంచ్‌లో జగన్ :
ఏపీ అసెంబ్లీలో ప్రమాణస్వీకార సభలో తాను కూర్చోకుండా ఎమ్మెల్యే జగన్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. తన పేరు పిలిచిన తర్వాత సభలోకి వచ్చిన ఆయన నేరుగా పోడియం వద్దకు వెళ్లి ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం సభలో తాను కాసేపు కూడా కూర్చోకుండా వెళ్లిపోయారు. అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ ఛాంబర్‌లోకి వెళ్లిన తర్వాత వైసీపీ ఎమ్మెల్యేలతో జగన్ భేటీ అయ్యారు. అనంతరం నేరుగా తాడేపల్లి నివాసానికి ఆయన వెళ్లిపోయారు. అసెంబ్లీ లోపలకు వెళ్లి ప్రమాణం చేసేందుకు కొద్దిసమయం ఉండటంతో దాదాపు 5 నిమిషాల వరకు ఆయన చివరి బెంచ్‌లోనే కూర్చున్నట్టుగా కనిపించారు.
మరోవైపు.. మాజీ సీఎం జగన్‌పై ధూళిపాళ్ల నరేంద్ర ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓటమి తర్వాత జగన్ ఎలా ఉన్నాడో చూడాలని మా వాళ్లు ఎదురుచూసారన్నారు. జగన్ తన రాజ్యం లాక్కున్నట్టుగా ఫీల్ అయ్యారని విమర్శించారు. ప్రమాణ స్వీకర సమయంలో జగన్ మాటలు తడబడ్డాయని అన్నారు. తన పేరు కూడా తప్పుగా చదివారని చెప్పారు. ప్రమాణం తర్వాత సీటులో కూర్చోకుండా ఇంతవరకు ఏ ఎమ్మెల్యే వెళ్లిపోలేదని ధూళిపళ్ల విమర్శించారు.
సీఎం జగన్ కారును అసెంబ్లీ ప్రాంగణంలోకి అనుమతించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ప్రతిపక్షనేత హోదా దక్కపోవడంతో జగన్ గేటు బయటే కారు దిగి అసెంబ్లీలోకి రావాల్సిన పరిస్థితి రావడంతో సీఎం చంద్రబాబు ఈ దిశగా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు.. ప్రతిపక్ష హోదా విషయంలో సభ్యులు చాలా హుందాగా వ్యవహరించాల్సి ఉంటుందని టీడీపీ ఎమ్మెల్యేలకు చంద్రబాబు సూచించారు. చిన్న విషయాలను రాజకీయం చేయొద్దని, రాగద్వేషాలకు తావు ఇవ్వొద్దని టీడీపీ నేతలు, కార్యకర్తలకు చంద్రబాబు సూచనలు చేశారు.
Read Also : YS Jagan : ఏపీ అసెంబ్లీలో వైఎస్ జగన్‌కు గౌరవం.. ఆ విషయంలో సీఎం చంద్రబాబు అనుమతి!
This website uses cookies.