Chinta Chiguru Health Benefits : చింతచిగురు.. పల్లెటూర్లలో ఈ పేరు తెలియని వాళ్ళు ఉండరు. చింతచిగురుతో కర్రీ చేసిన లొట్టలు వేసుకొని తింటారు. అంత రుచిగా ఉంటుంది. చింతచిగురు గురించి తెలియని వాళ్ళు ఎందరో ఉన్నారు. అసలు చింతచిగురు గురించి తెలిస్తే ఎవ్వరూ వదిలిపెట్టరు. చింతచిగురు రుచికి పుల్లగా ఉంటుంది. చింతపండు బదులుగా పులుపు కోసం చింత చిగురును ఉపయోగిస్తూ ఉంటారు. చింతచిగురును ఆహారంగా తీసుకుంటే మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. చింత చిగురు ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్య తగ్గుతుంది.
కామెర్ల వ్యాధిని నయం చేసే గుణం కూడా చింతచిగురుకు ఉంది. చింతచిగురు రసంలో పటిక బెల్లాన్ని కలుపుకొని తాగటం వల్ల కామెర్ల వ్యాధి తగ్గుతుంది. శరీరంలో వాతం ఎక్కువ అవ్వడం వల్ల వచ్చే సమస్యలు తగ్గుతాయి. అంతేకాకుండా మూల వ్యాధుల నుంచి ఉపశమనం కూడా కలుగుతుంది. చింతచిగురు ఉడికించి ఈ నీటిని చర్మంపై రాయడం వల్ల కీళ్ల నొప్పులు తగ్గుతాయి. చింతచిగురే కాకుండా చింత పువ్వులు కూడా ఆహారంగా తీసుకుంటారు. దీనితో కూడా పప్పు పచ్చడి వంటివి తయారు చేస్తారు. ఫిలిఫైన్స్‌లో చింతాకులతో చేసిన టీని మలేరియా జ్వరానికి వైద్యంగా ఉపయోగిస్తారు.
చింతచిగురు తీసుకోవడం వల్ల నియంత్రిస్తుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుందని తాజాగా ఆరోగ్య నిపుణులు జరిపిన పరిశోధన ద్వారా రుజువైంది. చింతచిగురులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. సాధ్యసిద్ధమైన లైఫ్ పనిచేస్తుంది. సుఖ విరోచనం అవుతుంది. మలబద్ధకం ఉండదు. ఫినాల్స్ యాంటీఆక్సిడెంట్లు కూడా ఎక్కువగా ఉండటంతో చెడు కొవ్వును తగ్గిస్తుంది. చింతచిగురులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉంటాయి.
చింతచిగురు ఉడికించిన నీటిని నోట్లో పోసుకొని పుక్కిలించిన వాళ్ళకు గొంతు నొప్పి, గొంతు మంట, గొంతు వాపు వంటి సమస్యలు తగ్గుతాయి. కడుపులో నులిపురుగులు ఉన్న వారికి చింతచిగురు వేసి చేసిన వంటలను తినిపించడం వల్ల చక్కని ఫలితం ఉంది. జీర్ణాశయ సంబంధిత సమస్యలను కూడా నివారిస్తుంది. ఎక్కువగా తీసుకునే వారిలో ఎముకలు దృఢంగా ఉంటాయి. గుండె జబ్బులను తగ్గించడంతో పాటు శరీరంలో ఎర్ర రక్తకణాల ఉత్పత్తికి అవసరమైన పోషకాహాలను అందించడం వంటి లక్షణాలు కూడా చింత చిగురులో ఉన్నాయి.
Chinta Chiguru Health Benefits : చింతచిగురుతో సర్వ రోగాలు దూరం :
రక్తాన్ని శుద్ధి చేసే చింతచిగురు తినడం ద్వారా రోగాలన్నీ నయమవుతాయి. వేసవికాలంలో పలురకాల కాయలు, పండ్లు ఇతర ఆహార పదార్థాలను పట్టుకొస్తుంది. ఈ పండ్లను తినడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. అనేక రకాల హెల్త్ బెనిఫిట్స్ పొందవచ్చు. చింతచిగురు రక్తాన్ని శుద్ధి చేయడమే కాకుండా రోగాలన్నీ నయం చేస్తుంది. చింత చిగురుతో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం. వేసవికాలంలో విరివిగా లభించే చింతచిగురుతో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. చింతచిగురులో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీంతో సహజసిద్ధమైన లాక్సిటివ్‌గా పని చేస్తుంది.

ఫినాల్స్ యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండడంతో చెడు కొలెస్ట్రాల్ తగ్గించి మంచి కొలెస్ట్రాలను పెంచుతుంది బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గడం ద్వారా బెల్లీ ఫ్యాట్ ఉండదు. ఉడికించిన చింతచిగురు నీటిని పుక్కిలిస్తే.. గొంతు నొప్పి మంట వాపు తగ్గుతాయి. అంతేకాదు.. కడుపులో నులిపురుగుల సమస్యతో బాధపడుతున్న చిన్నారులకే కాకుండా పెద్దవాళ్లకు కూడా చింతచిగురు సరైన పరిష్కార మార్గంగా చెప్పొచ్చు ప్రతిరోజు చింతచిగురు రసం అరకప్పు ఉదయం వేడి నీళ్లలో కలిపి తాగటం వల్ల పచ్చకామెర్ల వ్యాధి నాలుగు రోజుల్లో నివారణ అవుతుంది.
చింతచిగురుతో చర్మవ్యాధులు నయం అవుతాయి :
దురదలు, దద్దుర్లు, గజ్జి వంటి చర్మవ్యాధులు తగ్గిపోతాయి. వాపులు తగ్గుతాయి. చింతచిగురును శరీరంలోని వాతం, పైత్యాన్ని పూర్తిగా హరిస్తుంది. ప్రతిరోజు చింతచిగురు రసం, అరకప్పు ఉదయం వేడి నీళ్లలో కలిపి తాగటం వల్ల పచ్చ కామెర్ల వ్యాధి 4 రోజుల్లో నివారణ అవుతుంది. చింతచిగురును ఆముదంతో ఉడికించిన గడ్డలపై కురుపులపై వేసి కడితే త్వరగా తగ్గిపోతాయి. చింతచిగురు రసం తీసి శరీరం నిండా పట్టించి కొంత సమయం ఉంచితే దురదలు, దద్దుర్లు, గజ్జి వంటి చర్మ వ్యాధులు తగ్గిపోతాయి. చింతచిగురు పాత బెల్లం కలిపి నూరి కట్టు కడితే బెణుకులు, వాత నొప్పులు వాపులు తగ్గుతాయి.
చింతచిగురు కషాయాన్ని తాగితే జ్వర తీవ్రత నశిస్తుంది. చింతచిగురు, కొబ్బరినీరు కలిపి మొత్తంగా రుబ్బి ముఖానికి రాసి పావుగంట సేపు ఉంచుకుంటే.. మొటిమలు మచ్చలు, పొక్కులు దద్దుర్లు కనుచూపుమేరలో కనిపించవు. ఆరోగ్య పరిరక్షణలో చింతచిగురు ఎంతో మేలు చేస్తుంది. గుండె జబ్బులు దరిచేరవు. శరీరంలో ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి అవుతుంది. అవసరమైన పోషకాలను అందించడమే కాక రక్తాన్ని శుద్ధి చేస్తుంది. చింతచిగురు రుచుకే కాదు. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పోషక విలువలు ఎక్కువగా ఉండే ఆకుకూరల్లో చింతచిగురు ఒకటి. చింతచిగురులో యాంటీసెప్ట్ గుణాలు అధికంగా ఉంటాయి. అన్ని వయసుల వారు చింతచిగురును తీసుకోవచ్చు. లేత చింతచిగురును ఆకుకూరలు మాదిరిగా ఉపయోగిస్తారు. కొన్ని ప్రాంతాల్లో పచ్చడి కూడా చేస్తారు.
