Daily Health Tips : సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని ఎవరికి ఉండదు. ప్రస్తుత ఆధునిక జీవితంలో అనేక అలవాట్లు కారణంగా ఆరోగ్యం దెబ్బతింటుంది. వయస్సుతో సంబంధం లేకుండా యువ్వనంలోనే అనేక అనారోగ్య సమస్యల బారినపడుతున్నారు. దీనికి ప్రధాన కారణం.. జీవనశైలి సరిగా లేకపోవడమే. జీవనశైలిలో మార్పులు చేయడం ద్వారా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో పాటు ప్రాణాంతక వ్యాధులను కూడా దూరం పెట్టొచ్చు. జీవితాంతం ఆరోగ్యంగా ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా జీవించాలంటే ముందుగా కొన్ని ఆరోగ్య సూత్రాలను తప్పక తెలుసుకోవాలి. ఆరోగ్య సూత్రాలను మీ జీవన విధానంలో భాగంగా చేసుకోవాలి. అప్పుడు మీకు ఎలాంటి ఆరోగ్యపరంగా సమస్యలు దరిచేరవు.
ఆరోగ్య సూత్రాల్లో ముందుగా ఉదయం 4 గంటల 30 నిమిషాలకు నిద్రలేవాలి. రోజు రెండుసార్లు బ్రష్ చేసుకోవాలి. ఉదయం లేచిన వెంటనే గ్లాసుడు గోరవెచ్చని నీరు కూర్చొని నెమ్మదిగా తాగాలి. ఆ తర్వాత కొద్దిసేపు ఎండలో నిలబడటం చాలా మంచిది. ఇక ఉదయం టిఫిన్ 8:30 లోపు మాతమ్రే తినాలి. ఉదయం టిఫిన్‌తో పండ్ల రసం కూడా తాగాలి. తప్పకుండా ఏదో ఒక పనిచేయాలి. మధ్యాహ్నం లోగా మంచినీరు రెండు లేదా మూడు గ్లాసులు తాగాలి. కూల్ డ్రింక్స్ అసలు తాగకూడదు. గంట తర్వాత మరోసారి ఆహారం తినాలి. ఇక మంచి నీళ్లు భోజనానికి 48 నిమిషాల ముందు తాగాలి. భోజనం కింద కూర్చొని మాత్రమే తినాలి. వండిన ఆహారం వేడిగా 40 నిమిషాల లోపు తినాలి.
Daily Health Tips : సూర్యాస్తమయం లోపే రాత్రి భోజనం తినేయాలి :
మధ్యాహ్నం 12 నుంచి 1:15 నిమిషాలలోపు ఆహారాన్ని తీసుకోవాలి. ఆహారం బాగా నమిలి మింగాలి. మధ్యాహ్నం కూరల్లో వాముపొడి వాడాలి. మధ్యాహ్న భోజనం నిండుగా తినాలి. మధ్యాహ్నం భోజనం తరువాత మజ్జిగ తాగాలి. మధ్యన భోజనం తరువాత విశ్రాంతి తీసుకోవాలి. భోజనం తర్వాత ఐస్ క్రీమ్స్ ఎప్పుడు తినకూడదు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో టీ తాగటం చాలా మంచిది. ఇక నాలుగు గంటల సమయంలో ఏదైనా కీరా ముక్కలు లేదా ఆకుకూర సలాడ్లను తీసుకోవాలి. రాత్రి భోజనం సూర్యాస్తమయం లోపు చేయాలి.

రాత్రిపూట చాలా తక్కువగా తినాలి. రాత్రి భోజనం తర్వాత ఒక కిలోమీటర్ వరకు నడవాలి. రాత్రి భోజనం తర్వాత గంటకు పాలు త్రాగాలి. రాత్రిపూట లస్సి, మజ్జిగ తాగకూడదు. రాత్రి పుల్లటి పండ్లు తినకూడదు. రాత్రి 9 నుంచి 10 గంటల లోపు పడుకోవాలి. అలానే రాత్రిపూట సలాడ్ తీసుకోకూడదు. పంచదార, మైదాతో చేసిన పదార్థాలను అసలు ముట్టకూడదు. విదేశీ ఆహారం ఎప్పుడు కొనరాదు. ప్రతిరోజు నాలుకను తప్పకుండా శుభ్రపరచాలి.
ఇక కొబ్బరి నీళ్లను ఎక్కువగా తీసుకుంటే చాలా మంచిది. పాలల్లో పసుపు వేసి మరిగించి తాగితే క్యాన్సర్ రాదు. ఆయుర్వేద వైద్యం ఆరోగ్యానికి మంచిది. అక్టోబర్ నుంచి అంటే చలికాలంలో వెండి బంగారు పాత్రలోని నీరు త్రాగాలి. జూన్ నుంచి సెప్టెంబర్ అంటే వర్షాకాలంలో రాగి పాత్రలో నీరు త్రాగాలి. మార్చి నుంచి ఎండాకాలంలో మట్టి పాత్రలో నీరు ఎప్పుడు తాగుతుండాలి.
మట్టి కుండలో ఉండే చల్లటి నీళ్లను తీసుకోవటం మంచిది. కూల్ డ్రింక్స్ అలవాటు ఆరోగ్యానికి మంచిదికాదు. ఎండాకాలంలో తలపై ఏదైనా మెత్తటి కాటన్ గుడ్డను కట్టుకొని తిరగటం మంచిది. సాయంత్రం సమయంలో కాళ్ళపై కొబ్బరి నూనె రాసుకుంటే చాలా మంచిది. ఇక ముఖం పాడవకుండా రాత్రి సమయంలో కళ్ళపై కీరా ముక్కలను పెట్టుకుంటే మంచిది. ఎండాకాలంలో చికెన్ తినకుండా ఉండాలి. మీరు ఎక్కువగా నూనెలో వేయించిన ఆహార పదార్థాలకు దూరంగా ఉంటే చాలా మంచిది. శరీరంలో వేడి తగ్గటానికి సబ్జాగింజలను నీళ్లలో కలిపి తీసుకోవటం ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ ఆరోగ్య సూత్రాలను పాటించడం ద్వారా ఆరోగ్యవంతమైన జీవితాన్ని ఎంజాయ్ చేయొచ్చు.
Read Also : Chinta Chiguru Health Benefits : చింత చిగురుతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా? మీ ఆహారంలో తప్పక చేర్చుకోండి!
