2024 Vaishakha Purnima : మే 23న వైశాఖ పౌర్ణమి.. ఈ తప్పులు అసలు చేయొద్దు.. మీ ఇంట్లో ఈ కూర వండితే దురదృష్టం పడుతుంది!

0
33
Vaishakh Purnima 2024 : Significance of Vaishakha Pournami and Buddha Purnima
Vaishakh Purnima 2024 : Significance of Vaishakha Pournami and Buddha Purnima (Photo Credit : Google )

2024 Vaishakha Purnima : వైశాఖ పౌర్ణమి రోజున పొరపాటున కూడా ఇంట్లో ఈ కూర వండితే ఎంతటి సంపన్నుడికైనా అష్ట దారిద్రాలు, దురదృష్టం పట్టుకుంటుంది. చేతిలో పైసా కూడా మిగలదు. అప్పులు కూడా పుట్టవని పురాణా పండితులు చెబుతున్నారు. అందుకే పౌర్ణమి రోజున స్త్రీలు పొరపాటున కూడా ఈ కూర వండకూడదట.. ఒకవేళ వండితే దురదృష్టం కలుగుతుందని నమ్ముతారు. ఈ పవిత్రమైన రోజున కొన్ని పనులు చేయడం ద్వారా అపర కుబేరులు అవుతారు. వైశాక పూర్ణిమ రోజున మహా వైశాఖి బుద్ధ పౌర్ణమి అని కూడా పిలుస్తారు. ఈరోజు ఆధ్యాత్మిక సాధనలు చేయడం ద్వారా అధిక ఫలితాలను పొందవచ్చునని చెబుతుంటారు.

దశావతారమైన కల్కి సంబల గ్రామం నుంచి అవతరిస్తాడని భాగవత పురాణంలో ఉంది. భారతదేశంలో బౌద్ధ మతాన్ని స్వీకరించిన ప్రజలు తెల్లని దుస్తులను ధరించి మాంసాహారం తినరు. ఈరోజున కేవలం కీర్ రెసిపీ మాత్రమే తింటారు. ఈరోజున బుద్ధుడికి ఒక మహిళ ఒక గిన్నెలో పాలు మాత్రమే సమర్పించిందని చెబుతుంటారు. ఈరోజున బౌద్ధులు చుట్టుపక్కల వర్గాల నుంచి పగోడాల వరకు రంగురంగుల పల్లకిలలో ఊరేగింపులు నిర్వహిస్తారు. అలాగే బోధి చెట్టు మొదట్లో నీరు పోసి నైవేద్యం సమర్పిస్తారు. అక్కడే ధ్యానం చేస్తారు. బుద్ధ పూర్ణిమ సందర్భంగా బీహార్‌లోని బోధగయాలు ఉన్న ప్రపంచ వారసత్వ ప్రదేశమైన మహాబోధి ఆలయాన్ని చాలామంది భక్తులు సందర్శిస్తారు. ఇక్కడే బుద్ధుడు జ్ఞానోదయం పొందాడని చెబుతుంటారు.

ఈరోజు ఇలాంటి తప్పులు అసలు చేయొద్దు :
పౌర్ణమి నాటి చంద్రుడు నిండు సామర్థ్యంతో ఉంటాడు. మన మనసు మీద చంద్రుడి ప్రభావం గణనీయంగా ఉంటుందని జ్యోతిష్యులు చెబుతుంటారు అందుకే పౌర్ణమి నాడు పాలు ధ్యానం చేస్తే మంచిదని చెబుతూ ఉంటారు. పౌర్ణమి శుభ సందర్భంగా ఈ తప్పులు అస్సలు చేయొద్దు. పౌర్ణమి చాలా పవిత్రమైన రోజు కాబట్టి ఈరోజు ఎవరితోనూ వాదించకండి. దురుసుగా ప్రవర్తించడం దూషించే మాటలు మాట్లాడటం వంటి తప్పులు చేయవద్దు. ఈ రోజున నాన్ వెజ్, ఆల్కహాల్ తీసుకోవడం వల్ల జీవితంలో కష్టాలు వస్తాయి. ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించండి ఒక నిస్సహాయాన్ని లేదా పేదవాడిని అవమానించడం వల్ల మీరు చేసే దానాలు పుణ్యాలు, పుణ్యాల ఫలం వృధా అయిపోతాయి. ఈ పవిత్రమైన రోజు గోర్లు జుట్టు కత్తిరించడం చేయొద్దు. అలా చేస్తే అది జీవితంలో ఇబ్బందులను కలిగిస్తుంది.

2024 Vaishakha Purnima : ఈ వస్తువులను దానంగా ఇస్తే..

ఈ పవిత్రమైన రోజున సముద్ర స్నానం చేస్తే.. విశేషమైన ఫలితం లభిస్తుందని చెప్తారు. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునేందుకు చేసే సాంప్రదాయం కూడా ఉంది. ఈరోజు కొన్ని వస్తువులు దానం చేయడం వల్ల అనేక పనుల్లో విజయం సాధిస్తారు. ఆర్థిక సంక్షోభం నుంచి ఉపశమనం పొందుతారని నమ్ముతారు. వైశాఖ పౌర్ణమి రోజు తీసుకునే కొన్ని పనులు మీ జీవితంలోని ఇబ్బందులను తొలగించి సంతోషాన్ని శాంతిని కలిగిస్తాయి. ఆర్థిక సమస్యలు అధికమించేందుకు వైశాఖ పౌర్ణమి రోజు లక్ష్మీదేవికి 11 పసుపు కౌర్యలు సమర్పించాలి. వీటిని ఎరటి వస్త్రంలో తొట్టి భద్రంగా ఉంచుకోవాలి. ఆర్థిక సమస్యలను దూరం చేస్తుంది. ఇలా చేస్తే కుటుంబంపై లక్ష్మీదేవి ఆశీర్వాదం ఉంటుంది. ఆర్థిక లాభాల కోసం లక్ష్మీదేవి అనుగ్రహం పొందటం కోసం వైశాఖ పౌర్ణమి రోజున చీపురును దానం చేయాలి.

కొన్ని విశ్వాసాల ప్రకారం.. చీపురు విరాళంగా ఇవ్వడం వల్ల ఆర్థిక లాభం పొందే బలమైన అవకాశాలు ఏర్పడతాయి. లక్ష్మీదేవి అమ్మవారి ఆశీస్సులు లభిస్తాయి. వైశాఖ పౌర్ణమి రోజు గంగా పవిత్ర నదులలో స్నానం చేయడం వల్ల జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. పవిత్ర నదిలో స్నానం చేయటం దానం చేయటం వల్ల జీవితంలోని కష్టాల నుంచి ఉపశమనం లభిస్తుంది. సంతోషం, శాంతి లభిస్తాయి. ఈ మాసంలో తాగునీరు అందించటం వల్ల పితృ దోషం నుంచి ఉపశమనం లభిస్తుందని నమ్ముతారు. కష్టపడి పని చేసినా విజయం లభించకపోతే ఈరోజు నల్ల నువ్వులు దానం చేయటం శుభప్రదంగా పరిగణిస్తారు. ఇలా చేయటం వల్ల వ్యక్తి కోరుకున్న ఫలితాలను పొందుతాడు. ఈరోజు ఇలా చేస్తే ఎప్పుడూ సమస్యలు ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు. వైశాక పౌర్ణమి రోజు చంద్రుని పూజించటం వల్ల చంద్ర దోషం నుంచి బయటపడతారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. పనిలో ఆటంకాలు తొలగిపోతాయి.

ఈ చెట్లను తాకితే కోటి జన్మల పాపం పోతుంది :
ఈరోజు పూజ అనంతరం దానం చేయటం అత్యుత్తమం. పితృ దోషంతో బాధపడేవారు వైశాఖ పౌర్ణమి రోజు రావి చెట్టుకు నల్ల నువ్వులు కలిపిన నీటితో అభిషేకం చేయాలి. దాంతో పితృ దోషం పోతుంది. శని దోషంతో ఇబ్బందులు పడేవారు.. ఈరోజు రావి చెట్టుకు పూజ చేయడం ద్వారా చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. రావి చెట్టు వద్ద పాలు నీటితో అభిషేకం చేస్తే.. ప్రతి పనిలో విజయం చేకూరుతుంది. సంపద ప్రాప్తిస్తోంది ఎవరైతే ఈ వైశాఖ పౌర్ణమి రోజు సూర్యోదయాన్ని కన్నా ముందే నిద్రలేచి స్నానం చేస్తారో వారికి అదృష్టం వరిస్తుంది. ఉదయాన్నే స్నానం చేసి ఎక్కువ నీటితో రావి చెట్టు మొదలను తడిపి ప్రదక్షిణాలు చేస్తే.. మీ పూర్వీకులు అంతా తరిస్తారు.

Vaishakh Purnima 2024 : Significance of Vaishakha Pournami and Buddha Purnima
Vaishakh Purnima 2024 : Significance of Vaishakha Pournami and Buddha Purnima (Photo Credit : Google )

అత్యంత పవిత్రమైన వైశాఖ పౌర్ణమి రోజున ఉసిరి చెట్టును కానీ లేదా వేపచెట్టును తాకితే చాలు.. మీ జన్మజన్మల పాపాలు పోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది. వైశాఖ పౌర్ణమి శ్రీ మహా విష్ణువుకు మహాలక్ష్మికి, మహా శివుడికి అత్యంత ఇష్టమైన రోజు. అందుకే ఈరోజు త్రిమూర్తుల ఆశీర్వాదం కలగాలంటే వేప చెట్టును లేదా ఉసిరి చెట్టును తాకితే చాలు. ఈరోజు ఉసిరి చెట్టును తాకితే.. మీ ఒంట్లో ఉన్న దోషాలు మొత్తం ఆ చెట్టు లాక్కొని మీకు పాజిటివ్ ఎనర్జీని అందిస్తుంది. తెలిసి తెలియక చేసిన మహా పాపాలైనా పోతాయి. ఈరోజు వేప చెట్టును తాకితే మీకు అదృష్టం పడుతుంది.

ఇలా చేస్తూ ఈ మంత్రాన్ని 11 సార్లు జపించాలి :
ఎంతోకాలంగా అనుభవిస్తున్న కష్టాలు మాత్రం ఈ రోజుతో పోతాయి. మీరు ఎంతోకాలంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నా పలితం కలగకపోతే ఈ వైశాఖ పౌర్ణమి రోజు ఉసిరిచెట్టు లేదా వేప చెట్టును తాకితే మీరు కోరుకున్న ఉద్యోగం వస్తుంది. ఈరోజు మీకు వేపచెట్టు లేదా ఉసిరి చెట్టు ఎక్కడ ఉంటే.. అక్కడకు వెళ్లి ముందు కొన్ని చెంబుడు నీళ్లను పోసి చెట్టుకు మూడు ప్రదిక్షణలు చేయాలి. చెట్టు మొదలల్లో ప్రమిదపెట్టి మూడు వత్తులు విడివిడిగా వేసి నువ్వుల నూనె పోసి దీపం వెలిగించండి. ఆ తరువాత చెట్టును 11 మార్లు తాకండి. అలా తాకేటప్పుడు ‘ఓం నమో నారాయణాయ’ అనే మంత్రాన్ని 11 సార్లు జపిస్తూ తాకండి. ఇలా చేశాక ఆ చెట్టు దగ్గర కొంచెం సేపు కూర్చొని రండి.

ఇలా ఈరోజు ఎవరైతే చేస్తారో వారికి తిరుగులేని రాజయోగం పడుతుంది. మీ కష్టాలు మొత్తం ఈరోజుతో పోతాయి. మీ ఇంట్లో కోట్ల వర్షం కురుస్తుంది. మహా వైశాఖ పౌర్ణమి రోజు మీరు గుమ్మానికి రావి ఆకులతో ఇప్పుడు చేసే విధంగా తోరణంలా కట్టుకుంటే మీకు సకల శుభాలు కలుగుతాయి. ఆ లక్ష్మీనారాయణల దివ్య ఆశీస్సులు మీకు కలుగుతాయి. ఆ ఇంటికి నర దిష్టి నర పీడ తగలవు. ఆ ఇంట్లో వారికి దోషాలన్నీ పోతాయి. ఈరోజు ఇంటికి వాస్తు దోషాలు ఉన్నా మీ ఇంట్లో అనారోగ్య సమస్యలు ఉన్నా పోవటానికి ఇది మంచి అవకాశం. ఈరోజు ఇలా చేస్తే మీ జీవితంలో ఉత్తమ ఫలితాలు కలుగుతాయి.

రావి ఆకులతో ఇలా చేస్తే అద్భుతమైన ఫలితాలు :

ఎవరైతే శక్తివంతమైన వైశాఖ పౌర్ణమి రోజు రావిచెట్టు ఆకుల తోరణాన్ని మీ ఇంటి గుమ్మాలకు కడతారో వారి ఇంట్లో వారికి అద్భుతమైన శక్తులు దేనినైనా సాధించే ధైర్యం, అదృష్టం కలుగుతాయి. అలాంటి ఇంట్లో సిరిసంపదలు కలుగుతాయి. వైశాఖ పౌర్ణమి రోజున రావి చెట్టుకు అద్భుత శక్తులు వస్తాయి. ఈ సమయంలో ఆ శక్తిని పొందాలంటే రావి ఆకులను తాకడం ఇంటికి తోరణంలా కట్టుకుంటే అనేక సమస్యల నుంచి బయటపడవచ్చు. అనాదికాలంలోనే మహర్షులు గుర్తించి వైశాఖ పౌర్ణమి లాంటి పుణ్య దినాల్లో రావి ఆకుల తోరణాన్ని ఇంటికి కట్టుకోమని సూచించారు.

అత్యంత శక్తివంతమైన మహా వైశాఖి రోజు ఎవరైనా సరే ఇంట్లో మాంసం కూరను వండిన తిన్న వారికి పరమ దరిద్రం కలుగుతుంది. మాంసం కూరతో పాటు ఈరోజు ములక్కాయ, బీరకాయ కూర, మసాలాతో చేసిన పదార్థాలు అసలు తినరాదని చెబుతారు. అలా తెలియక తిన్నారంటే మహా పాపం తగులుతుంది. ఈరోజు ఏ చిన్న మంచి పని చేసినా అది మేరు పర్వతం అంత పుణ్యాన్ని తీసుకొస్తుంది. ఈరోజు దైవం మీద ధ్యాస ఉంచి దైవ నామస్మరణ చేస్తే ఎంతో మంచిదని పండితులు చెబుతున్నారు.

Read Also : Sharing Same Soap : మీ ఇంట్లో వారంతా ఒకే సబ్బును వాడుతున్నారా? తస్మాత్ జాగ్రత్త.. ఈ పొరపాటు అసలు చేయొద్దు..!