Horoscope Today 10 June 2024 : ఈరోజు జూన్ 10వ తేదీ. శ్రీక్రోధినామ సంవత్సరం, జేష్ట మాసం, ఉత్తరాయణం: గ్రీష్మ రుతువు, సోమవారం తిధి చవితి: సాయంత్రం 4 గంటల 51 నిమిషాల వరకు, నక్షత్రం: పుష్యం రాత్రి 10 గంటల 41 నిమిషాల వరకు. వ్యర్జం: ఉదయం 5 గంటల 50 నిమిషాల నుంచి 7 గంటల 31 నిమిషాల వరకు. దుర్ముహూర్తం: మధ్యాహ్న 1:23 నిమిషాల నుంచి ఒక గంట 15 నిమిషాల వరకు. తిరిగి మధ్యాహ్నం 2 గంటల 59 నిమిషాల నుంచి 3 గంటల 51 నిమిషాల వరకు. అమృతకాలం : ఈరోజు మధ్యాహ్నం 2 : 54 నుంచి సాయంత్రం 4: 36 వరకు ఉంటుంది. రాహుకాలం: ఉదయం 7:30 నుంచి 9: 00 వరకు. సూర్యోదయం: ఉదయం 5:30కు సూర్యాస్తమయం: సాయంత్రం 6:15 నిమిషాలకు. ఈరోజు విశేషం.. జేష్ట మాసం.. చవితి. సోమవారం శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా పుట్టదు అని అంటారు. ఈ సృష్టిలో జరిగే ఏ చర్యకైనా ఏ కార్యాన్నికైనా శివుని ఆజ్ఞ లేనిదే అది ముందుకు నడవదు. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎలాంటి ఫలితాలు పొందుతున్నారో తెలుసుకుందాం.
మేషరాశి :
ఈ రాశి వారికి ఈరోజు ఆకస్మిక ధన లాభం గోచరిస్తుంది. బంధుమిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. చాలాకాలంగా పట్టిపీడిస్తున్న కుటుంబ సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. తలపెట్టిన పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక స్థితి స్థిరంగా ఉంటుంది. ఉద్యోగ జీవితం సాఫీగానే సాగిపోతుంది. దగ్గర బంధువు ఒకరికి సహాయపడతారు. అనుకోకుండా బందువర్గంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. నిరుద్యోగులు శుభవార్తను వింటారు. ఆదాయపరంగా వ్యాపారులకు బాగానే ఉంటుంది. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది. ప్రయత్నాలు కలిసివస్తాయి. తల్లిదండ్రులు పెద్దల సహకారం లభిస్తుంది. వ్యవసాయదారులకు అనుకూలమైన సమయం. సహద్యోగులపై సహకారం ఉంటుంది.
పైఅధికారుల ఆదరణ పొందుతారు. పనులు సకాలంలో పూర్తవుతాయి. బంధుమిత్రులతో సంబంధాలు మెరుగవుతాయి. ఆరోగ్యంగా ఉంటారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. కోర్టు లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. పారిశ్రామికవేత్తలకు సిబ్బంది సహకారం లభిస్తుంది. న్యాయపరమైన సమస్యలను అధిగమిస్తారు. ఖర్చుల నియంత్రణ అవసరం విద్యార్థులకు కలిసి వస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు పలుస్తాయి. కొత్త ఉద్యోగంలో చేరే అవకాశాలు ఉంటాయి. ఉద్యోగంలో ఉత్తమ ఫలితం కనిపిస్తుంది. వ్యాపారం లాభం విశేషం. అదృష్టంకలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. స్వల్ప ఆటంకాలు ఉన్న విజయం లభిస్తుంది. ఆర్థిక ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడాలి. గొడవలకు దూరంగా ఉండాలి. అనుకున్న పనిపూర్తవుతుంది. ఇంట్లో శాంతిని నెలకొంటుంది. విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అనారోగ్య సమస్యలు అధికమవుతాయి. ఇష్టదేవతా స్మరణ మంచిది.
వృషభ రాశి :
ఈ రాశి వారు ఈరోజు నలుగురికి ఉపయోగపడే పనులు చేస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలను పొందుతారు. ప్రారంభించిన పనులను పట్టుదలతో పూర్తి చేస్తారు. విద్యార్థులకు అనుకూలమైన సమయం.మంచి సంస్థల్లో చేరుతారు. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. వ్యాపారులకు భాగస్వాములతో సంబంధాలు పెరుగుతాయి. ఉద్యోగులకు తోటి వారితో అభిప్రాయభేదాలు ఏర్పడవచ్చు. అయితే, పైఅధికారుల మద్దతు లభిస్తుంది. ఇంట్లోకి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. రావాల్సిన డబ్బు చేతికందుతుంది. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. ఉత్తమ కాలం నడుస్తోంది. పట్టుదలతో ప్రయత్నాలు చేస్తే అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అంత అనుకూల ఫలితాలు వస్తాయి. మంచి
ఆలోచనలతో పనిచేయండి. అదృష్టవంతులు అవుతారు. గృహ లాభాలు ఉన్నాయి. సంపద పెరుగుతుంది. సాహసోపేత నిర్ణయాలు శక్తినిస్తాయి. ఉద్యోగం బాగుంటుంది. వ్యాపారం నిరంతర కృషి మేలు చేస్తుంది. ఇతరులకు ఇబ్బందిని కలుగజేసే పనులను మానుకోవాల్సి ఉంటుంది. వృత్తిలో ఇబ్బందులను అధిగమిస్తారు. నూతనకార్యాలు ప్రారంభించకుండా ఉంటే మంచిది. ధైర్య సాహసాలతో నూతన కార్యాలు ప్రారంభిస్తారు. ఉద్యోగంలో అతను బాధ్యతలు అప్పగిస్తారు వృత్తి వ్యాపారాల్లో ఆదాయానికి లోటుండదు. ఖర్చుతో కూడుకున్న కొన్ని పనులు పూర్తి చేస్తారు. చాలాకాలంగా వేధిస్తున్న కుటుంబ సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. మిత్రుల సహాయంతో నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. హామీలు ఉండవద్దు. సూర్యరాదన శ్రేష్టం.
మిధున రాశి :
ఈరోజు ఈ రాశి వారికి క్రమంగా ఆదాయం పెరుగుతుంది. వేసే ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. ఆపదలు పొంచి ఉంటాయి. రహస్య శత్రువులు కాచుకుని కూర్చుంటారు. ఏమాత్రం పొరపాటు జరిగిన ప్రమాదకరంగా పరిగణిస్తుంది. వ్యాపారంలో నష్టం రాకుండా జాగ్రత్త పడాలి. నిందలేసే వారు ఉంటారు. ఆచితూచి సంభాషించండి. బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. చేసే పనులు ఇబ్బందులు ఉంటాయి. కొత్త పనులను ప్రారంభించడం మంచిది కాదు. ప్రయాణంలో జాగ్రత్త అవసరం. రాదు అనుకున్నట్టు చేతికి వస్తుంది. ఆదాయానికి ఆరోగ్యానికి డోకా లేదు. అనుకున్న పనులు మిత్రులు సహాయంతో పూర్తవుతాయి. వృత్తి వ్యాపారాల్లో సంతృప్తి ఉంటుంది.
గతంలో ప్రారంభించిన పనులు పూర్తి చేస్తారు. పాత బాకీలు కొంతవరకు వసూల్ అవుతాయి. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. ఉద్యోగంలో అందరి సహకారం లభిస్తుంది. బరువు బాధ్యతలు పెరిగిన పనిలో నైపుణ్యం ప్రదర్శిస్తారు. వ్యాపారులకు మంచి కాలం. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు చేస్తారు. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. శుభకార్య ప్రయత్నాన్ని కలుస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కొత్త దుస్తులు గృహపకరణాలు కొనుగోలు చేస్తారు. సంగీత కళాకారులకు సాహితీవేత్తలకు మంచి అవకాశాలు వస్తాయి. ఉద్యోగంలో మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. వ్యాపారంలో ఒత్తిడి తగ్గుతుంది. పెళ్లి సంబంధం కుదురుతుంది. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్తను వింటారు. నవగ్రహ శ్లోకాలు చదివితే అవిష్టశక్తి ఉంటుంది.
కర్కాటక రాశి :
ఈ రాశివారికి ఈ రోజు ధర్మబద్ధంగా ముందుకు వెళ్తే విశేషమైన ధనయోగం అదృష్ట యోగం గోచరిస్తుంది. కీర్తి పెరుగుతుంది. పది మందికి ఉపయోగపడే పనులు చేయండి. ధర్మం సదా రక్షిస్తుంది. ఈ అపారబలం అద్భుతంగా ఉంటుంది. నూతన కార్యాల్లో పురోగతిని సాధిస్తాడు. కాలం సహకరిస్తుంది. బంధుమిత్రుల అండ లభిస్తుంది. భవిష్యత్తు సయోదాయకంగా గోచరిస్తుంది. వృత్తిరీత్యా ఇబ్బందులను అధిగమిస్తారు. మానసిక ఆందోళనతో కాలం గడుపుతారు. స్త్రీలు చేసే వ్యవహారాలు సమస్య ఎదురవుతాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. రహస్య శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇంట్లో పెద్దవారు సహకారం లభిస్తుంది. వ్యాపారులు అనుకూలంగా ఉంటాయి. అయితే, కొత్త పెట్టుబడులు కొంతకాలం వాయిదా వేయడం మంచిది.
ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. పనుల్లో జాప్యం జరగవచ్చు. అనవసరమైన ఆలోచనల కారణంగా కాలయాపన చేస్తారు. ఏకాగ్రత అవసరం. వాహనాల విషయంలో ఖర్చులు ముందుకు వస్తాయి. ఆరోగ్యంపై మనసు పడతారు. రావలసిన డబ్బు చేతికందనంలో ఆటంకాలు ఎదురవుతాయి. ఆదాయంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. కుటుంబ సభ్యులతో సంతృప్తిగా ఉంటారు. వివాదాలకు దూరంగా ఉండండి. విద్యార్థులు పట్టుదలతో చదివి మంచి స్థాయిలో నిలుస్తారు. పారిశ్రామికవేత్తలు న్యాయపరమైన సమస్యలను అధిగమిస్తారు. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు కలుస్తాయి. వ్యాపార పరంగా లాభాలు ఉంటాయి. కొత్త పనులు చేపడతారు. ఆరోగ్యం చాలా వరకు కుదుటపడుతుంది. పెళ్లి సంబంధం కుదురుతుంది. ఖర్చులు తగ్గించుకోవాలి ఏ విషయంలోనూ మీరు ఉత్సాహం పనికిరాదు. లక్ష్మీ ఆరాధన మంచిది.
సింహరాశి :
ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. పోరుగువారితో వాదాలకు పేజీలకు దిగవద్దు. ఇంతకాలం తీరని కోరికలు నెరవేరుతాయి. వ్యాపారంలో కాలానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలి. ఆర్థిక ఇబ్బందులు రాకుండా జాగ్రత్తపడాలి. పనుల్ని మధ్యలో ఆపవద్దు. కొన్ని సత్కార్యాలను సాధించే అవకాశం ఉంది. బంధువుల వల్ల మేలు జరుగుతుంది ఆకస్మిక నెల లాభం ఉంటుంది. రాజకీయ రంగంలో వారికి క్రీడాకారులకు అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. బంధుమిత్రులు కలుస్తారు. శుభవార్తలు వింటారు. అభివృద్ధి ఉంటుంది. వ్యక్తిగత సమస్య ఒకటి మిత్రుల సహాయంతో పరిష్కారం అవుతుంది. పట్టుదలతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు.
నూతన వాహనం భూముల కొనుగోలుపై ఆసక్తి కనపరుస్తారు. ఆర్థిక లావాదేవీలో ఏమరపాటు తగదు. కోర్టు కేసుల్లో ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. శుభవార్తలు వింటారు. విద్యార్థులకు అనుకూలం. మంచి స్థాయిలో నిలుస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు కలుస్తాయి. సహద్యోగులకు సహకారం లభిస్తుంది. అధికారుల ఆదరణ పొందుతారు. పదోన్నతితో బదిలీ అయ్యే అవకాశం ఉంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ప్రయాణాలు కలిసి వస్తాయి. బంధువర్గంతో సంబంధాలు వృద్ధి చెందుతాయి. ఆత్మీయులతో పనులు నెరవేరుతాయి. ఉద్యోగం శుభప్రదం. ఉద్యోగంలో చక్కని ఫలితాలు అనుభవానికి వస్తాయి. వృద్ధి వ్యాపారాల్లో ఉన్నవారు అభివృద్ధిని సాధిస్తారు. సంతానానికి సంబంధించి శుభవార్తలు వింటారు. ఇష్ట దేవతా ధ్యానం శక్తినిస్తుంది.
కన్యారాశి :
ఈ రాశి వారికి ఈరోజు అన్ని ఇష్టాలు సిద్ధిస్తాయి. కీర్తి పెరుగుతుంది. ఒక ఫలితం సంతృప్తిని ఇస్తుంది. వ్యాపారం అనుకులం. వివాదాలు తలెత్తకుండా సౌమ్యంగా మాట్లాడాలి. కుటుంబపరంగా కొన్ని విషయాల్లో స్పష్టత వస్తుంది. రాజకీయ వ్యవహారాల్లో దిగ్విజయాన్ని పొందుతారు. ప్రయత్న కార్యాలన్నీ సంపూర్ణంగా ఫలిస్తాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. స్నేహితులతో కలిసి కొత్త పనులు ప్రారంభించే ప్రయత్నం చేస్తారు. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. విహార యాత్రలు తీర్థయాత్రలు చేస్తారు. ఆరోగ్యంపై మనసు నిలుపుతారు. రాజకీయ పనులు నెరవేరుతాయి. కోర్టు పనులు ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. ఆత్మీయులతో సంబంధాలు పెంపొందుతాయి.
Horoscope Today 10 June 2024 : ఏయే రాశుల వారికి ఈరోజు ఎలాంటి పనులు నెరవేరవచ్చు?
ఆస్తి, వ్యవహారాలు తోబుట్టువులతో మాట పట్టింపులు తలెత్తవచ్చు. పారిశ్రామికవేత్తలకు సిబ్బంది సహకారం లభిస్తుంది. కాలం సహకరిస్తుంది. ఉద్యోగంలో బాగుంటుంది. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఇతరులకు ఉపకరించే పనులు చేపడతారు. గౌరవ మర్యాదలు లభిస్తాయి. శుభవార్తలు వింటారు. పలుకుబడి కలవారితో పరిచయాలు ఏర్పడతాయి. బంధువులకు మీ సలహాలు నచ్చుతాయి. ఉద్యోగంలో సహద్యోగులు బాగా సహకరిస్తారు. కొన్ని ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. అందరికీ మేలు జరిగే పనులు చేస్తారు. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. వ్యాపారంలో లాభాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఆంజనేయస్వామిని స్మరించండి. కార్యసిద్ధి కలుగుతుంది.
తులా రాశి :
ఈరోజు రాశి వారికి ఆర్థికంగా బాగానే ఉంటుంది. రాదు అనుకున్న డబ్బు చేతికి అందుతుంది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. వ్యాపార భాగస్వామితో సంబంధాలు పెంపొందుతాయి. కొన్ని అనవసరమైన ఖర్చుల మూలంగా ముఖ్యమైన పనుల్లో జాప్యం జరగవచ్చు. తీర్థయాత్రలు చేస్తారు. కొత్త వ్యక్తులతో జాగ్రత్త అవసరం. వాహనాలు వల్ల ఖర్చులు పెరగవచ్చు. భూముల వ్యవహారంలో ఆయన వారితో మనస్పర్ధలు రావచ్చు. కోర్టు కేసుల మూలంగా ఖర్చులు పెరగవచ్చు. అయితే, ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయి. విద్యార్థులకు అనుకూలం. ఉద్యోగులకు పని ఒత్తిడి పెరుగుతుంది. పట్టుదల అవసరం. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది.
కళాకారులకు కొత్త అవకాశాలు తలుపు తడతాయి. విశేషమైన కృషి అవసరం. ఉద్యోగంలో పట్టు సాధిస్తారు. శత్రువుల నుంచి సమస్య ఎదురవుతుంది. ముఖ్య కార్యాలు, ఆత్మీయుల సలహాలు తీసుకోవాలి. అధికారుల ప్రశంసలు ఉంటాయి. మొహమాటంతో తెలియని ఇబ్బందులు ఉంటాయి. సత్యనిష్ట ముందుకు నడిపిస్తుంది. ఆరోగ్యం గురించి జాగ్రత్త పడటం మంచిది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. విదేశీయాన ప్రయత్నాలకు మార్గం సుగుమం అవుతుంది. కుటుంబ కలహాలకు దూరంగా ఉంటే మేలు. సహనం అనే విధాల శ్రేయస్కరం. డబ్బును పొదుపుగా వాడతారు. ఉద్యోగంలో మీ సూచనలకు ఆలోచనలకు విలువ పెరుగుతుంది. ఇంటాబయట ఒత్తిడి ఉంటుంది. ప్రయాణాలు ఇబ్బంది పడతారు. వృత్తి, వ్యాపారాలు ఉన్నవారు లాభాలు ఆర్జిస్తారు. దూర ప్రాంతాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తను వింటారు. నవగ్రహ శ్లోకాలు చదవండి. మేలు జరుగుతుంది.
వృశ్చిక రాశి :
ఈ రాశి వారు ఈరోజు అనుకున్నదొకటి అయింది ఒకటి అన్నట్టుగా ఉంటారు. మిమ్మల్ని చూసి అసూయపడే వారు ఉంటారు. మీ స్తోమత గురించి ఇతరులకు సహాయం చేస్తారు. ఇంటికి కావలసిన వస్తువులు కొంటారు. ఆదాయంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. ఖర్చుల నియంత్రణ అవసరం. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ప్రారంభించిన పనులు జాప్యం ఉండవచ్చు. పట్టుదల అవసరం. వివాదాలకు దూరంగా ఉంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు. వ్యాపారులు, భాగస్వాములతో అవగాహన పెంపొందించుకుంటారు. స్నేహితులు బంధువర్గం మూలంగా ఖర్చులు పెరగవచ్చు. కొత్త పరిచయాలతో కొన్ని పనులు కలిసి వస్తాయి వ్యవసాయదారులకు అనుకూలమైన సమయం. పారిశ్రామికవేత్తలకు సిబ్బంది సహకారం లభిస్తుంది.

ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త అవసరం. అనవసరపు ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. దేవత గురుభక్తి పెరుగుతుంది. ఏకాగ్రత అవసరం. పనిలో నైపుణ్యం పెరుగుతుంది. దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉన్నాయి. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. సమిష్టి కృషితో ఉత్తమ ఫలితం సాధించవచ్చు. ఉద్యోగంలో ఓర్పు అవసరం. దేనికి తొందర వద్దు. ఉపద్రవాలు తొలగుతాయి. ఇంట్లో వారి సహకారంతో అదృష్టవంతులు అవుతారు. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. ఆకస్మిక లాభం ఉంటుంది. ప్రయాణాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. కుటుంబ సమస్యలు ఇబ్బంది పెడతాయి. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది. వ్యాపారులు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సూర్యోస్తత్తరం చదివితే మేలు.
ధనుస్సు రాశి :
ఈరోజు రాశి వారు శుభవార్తలు వింటారు. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. గతంలో స్థిరాచరాసుల మూలంగా ఆదాయం పెరుగుతుంది. బంధువర్గం మూలంగా కొన్ని పనులు నెరవేరుతాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. వాహనం మూలంగా పనులు కలిసి వస్తాయి. న్యాయపరమైన సమస్యలను అధిగమిస్తారు. ఉద్యోగులకు అధికారులచే స్థలంలో తోటివారి సహకారం లభిస్తుంది. ఉత్సాహంతో పనులు చేస్తారు. పైఅధికారులతో స్నేహంగా మెలగడానికి ప్రయత్నిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆదాయం స్థిరంగా ఉంటూ క్రమంగా పెరుగుతుంది. కళాకారులకు నూతన అవకాశాలు లభిస్తాయి. దూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. సమయానికి తగ్గ నిర్ణయాలు తీసుకుంటారు.
వ్యాపారం అద్భుతంగా ఉంటుంది. నూతన కార్యక్రమాలను ప్రారంభించే కాలం. చిన్నప్రయత్నంతోనే అధిక లాభం పొందుతారు. సంఘర్షణాత్మకమైన ఆలోచనలను నమ్మకంగా ముందుకు వెళ్తే ఆశయం నెరవేరుతుంది. అధికారులతో గౌరవిస్తారు. పట్టుదలతో కొన్ని కార్యాలు పూర్తి చేసుకుంటారు. అనారోగ్య బాధలు తొలగిపోతాయి. ప్రయాణాలు జాగ్రత్తగా చేయడం మంచిది. నూతన వ్యక్తులు పరిచయం అవుతారు. నిరుద్యోగులకు మంచి ఆఫర్ వస్తుంది. ఉద్యోగంలో అధికారులను నేర్పిస్తారు. అధికార లాభానికి కూడా అవకాశం ఉంది. ఆర్థిక స్తోమత పెరుగుతుంది. సమాజానికి మేలు జరిగే పనులు చేపడతారు. ఒక కుటుంబ సమస్య నుంచి తెలివిగా బయటపడతారు. ఆదాయం పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తారు. సొంత నిర్ణయాలకు మంచి కాలం.
మకర రాశి :
ఈ రాశి వారికి ఈరోజు కొత్తగా చేపట్టిన పనులు సమయానికి పూర్తవుతాయి. నిలిచిపోయిన పనుల్లో కదలిక వస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై మనసు నిలుపుతారు. రావలసిన డబ్బు ఆలస్యంగా అందుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ నిలుపుతారు. ఉత్సాహంగా ఉంటూ సంతోషంతో పనులు చేస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కొత్త ఉద్యోగంలో చేరుతారు. తలపెట్టిన పనుల్లో బరువు బాధ్యతలు పెరిగిన సంతోషంగా పూర్తి చేస్తారు. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు వస్తాయి. ఉద్యోగులకు పదోన్నతి, స్థానచలన సూచన. సంఘంలో గౌరవ మర్యాదలు పెంపొందుతాయి. పారిశ్రామికవేత్తలకు అనుకూలమైన సమయం. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ఆత్మవిశ్వాసంతో లక్ష్యాన్ని చేరుకుంటారు.
అనుకున్న పని సకాలంలో పూర్తవుతుంది. ఉద్యోగంలో ఉత్తమ ఫలితం ఉంటుంది. కాలాన్ని సద్వినియోగం చేసుకుంటే బ్రహ్మాండమైన విజయం సాధిస్తారు. వ్యాపారం మద్యస్థంగా ఉంటుంది. ఇంట్లో వారికి మేలు జరుగుతుంది. ప్రయత్నకార్యాలన్నీ వెంటనే ఫలిస్తాయి. ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది. సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. నూతన వస్తూ ఆభరణాలను పొందుతారు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. రుణ బాధలు తొలగిపోతాయి. దైవ దర్శనాలతో ముందుకు వెళ్తారు. ఉద్యోగంలో కొద్దిగా ఒత్తిడి పెరుగుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఇతరత్రా సంపాదన కోసం సన్నిహితులతో చర్చిస్తారు. వ్యాపారం అనుకూలంగా ఉంటుంది. కొత్త పరిచయాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఆరోగ్యం పర్వాలేదు. మిత్రులవల్ల మేలు జరుగుతుంది.నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. లక్ష్మీ ఆరాధన మంచిది.
కుంభరాశి :
ఈరోజు రాశి వారికి అనుకూలమైన రోజు. కొత్త అవకాశాలు లభిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. స్థిరమైన ఆలోచనలతో ముందుకు వెళ్తారు. కావాల్సిన వస్తువులను కొంటారు. అన్ని విషయాలను చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. ఆఫీసులో అనుకూల వాతావరణ ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉంటూ పనులు పూర్తి చేస్తారు. రాజకీయ ప్రభుత్వ పనులు అనుకూల ఫలితాలు ఉంటాయి. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు పొందుతారు. ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకుని ఖర్చులు చేయండి. రావాల్సిన డబ్బు చేతికందుతుంది. ఆర్థిక లావాదేవీలు తొందరపాటు తగదు. అనవసరమైన ఆలోచనలను పక్కనపెట్టి పనులు పూర్తి చేయడంపై మనసు నిలుపుకోండి.
వ్యాపార యోగం అద్భుతం. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. విశేష ధన లాభం ఉంటుంది ఉద్యోగంలో ఆటంకాలు తగ్గుతాయి. సమయస్ఫూర్తితో వ్యవహరిస్తే గత వైభవం సిద్ధిస్తుంది. చంచల స్వభావం పనికిరాదు. ఆవేశపరిచే వారు ఉంటారు. ఏకాగ్రత చాలా అవసరం. చేపట్టిన బాధ్యతలను పొందుతారు. ఆరోగ్యంపై శ్రద్ధ పెంచాలి. బంధుమిత్ర విరోధం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. విద్యార్థులకు అనుకూలం. మానసికందోళన అధికమవుతుంది. అనారోగ్య బాధలను అధిగమిస్తారు. అనవసరపు నిందలతో అపకీర్తి వస్తుంది. స్థిరమైన నిర్ణయాన్ని తీసుకోలేరు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. పిల్లలు పురోగతిని సాధిస్తారు. కుటుంబానికి సంబంధించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థికంగా అభివృద్ధికి అవకాశం ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. నూతన కార్యాలకు ప్రణాళికలు వేస్తారు. సూర్యస్తుతి మేలు చేస్తుంది.
మీనరాశి :
ఈరోజు ఈ రాశి వారు ముఖ్య కార్యాలపై శ్రద్ధ పెంచాలి. ఆర్థిక అంశాలు అనుకూలిస్తాయి. ధర్మాన్ని అనుసరించండి. కష్టాలు తొలగిపోతాయి. ఉద్యోగంలో ఇబ్బంది తగ్గుతుంది. తోటివారి సలహాలు పనిచేస్తాయి. వ్యాపారంలో శ్రమ తగ్గుతుంది. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. ప్రయాణాలు వల్ల లాభం చేపడుతుంది. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ధనచింతన ఉండదు. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. అన్ని విధాల సుఖాన్ని పొందుతారు. ఖర్చులు పెరగవచ్చు. రావలసిన డబ్బు అందడంతో చేపట్టిన పనులు పూర్తవుతాయి. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతారు. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఆరోగ్యంపై శ్రద్ధ నిలుపుతారు. ఇంట్లో వాతావరణం సంతృప్తికరంగా ఉంటుంది.
అన్నదమ్ములు బంధువర్గంతో చిన్నపాటి మనస్పర్ధలు ఉండవచ్చు. చర్చల ద్వారా వివాదాలను పరిష్కరించుకుంటారు. ఉద్యోగ ప్రయత్నాలు కొంతవరకు సాధిస్తాయి.వ్యాపార ఒప్పందాలు కలిసివస్తాయి. వ్యవసాయదారులకు అనుకూలం. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబ సమస్య సామరస్యంగా పరిష్కారం అవుతుంది. మిత్రులు మీకు చేదోడు వాతోడుగా ఉంటారు. పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వెంకటేశ్వర స్వామిని స్మరించండి. ప్రశాంతత లభిస్తుంది.
Read Also : Horoscope Today 9 June 2024 : ఈరోజు రాశి ఫలాలు.. నేటి పంచాంగం.. 12 రాశుల వారికి ఏ పని కలిసివస్తుందంటే?
