Horoscope Today 11 June 2024 : జూన్ 11, పంచాంగం.. ఈరోజు రాశి ఫలాలు.. 12 రాశుల వారు ఏయే పనుల్లో విజయం సాధిస్తారంటే?

Horoscope Today 11 June 2024 : ఈరోజు.. జూన్ 11వ తేదీ 2024. జేష్ట మాసం, ఉత్తరాయణం, గ్రీష్మ రుతువు, మంగళవారం, తిథి: పంచమి సాయంత్రం 4 గంటల 58 నిమిషాల వరకు, నక్షత్రం: ఆశ్లేష రాత్రి 12:24 నిమిషాల వరకు, వ్యర్జం: మధ్యాహ్నం 12.24 నిమిషాల నుంచి 2. 06 నిమిషాల వరకు, దుర్ముహూర్తం: ఉదయం 8:03 నిమిషాల నుంచి 8 గంటల 56 నిమిషాల వరకు తిరిగి రాత్రి 10:00 51 నిమిషాల నుంచి రాత్రి 11:35 వరకు. అమృతకాలం: రాత్రి 9:05 నిమిషాల నుంచి 11 గంటల 39 నిమిషాల వరకు. రాహుకాలం: సాయంత్రం 3 గంటల నుంచి 4 గంటల 30 నిమిషాల వరకు, సూర్యోదయం ఉదయం 5:30 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6:17 నిమిషాలకు. ఈరోజు జ్యేష్ట శుక్ల పంచమి.. 12 రాశుల వారు ఈ రోజు ఎలాంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం

మేషరాశి :
ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక స్థితి స్థిరంగా ఉంటుంది. ఆర్థిక సమస్యలను చాకచక్యంగా అధిగమిస్తారు. ఖర్చుల నియంత్రణ అవసరం. విద్యార్థుల పైచదువుల కోసం ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త ఉద్యోగంలో చేరే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగంలో అనుకూల కాలం నడుస్తుంది. గృహ యోగం అనుకూలిస్తుంది. ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యంగా ఉంటారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. కోర్టు లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల సహాయంతో మీ ఆర్థిక సమస్యలు తీరుతాయి. మీ మనోబలం పెరుగుతుంది దాంపత్య సంబంధాలలో మధురానుభూతి ఉంటుంది. కొత్త పనులు ప్రారంభించేందుకు మంచి సమయం. ఉద్యోగులు, విద్యార్థులకు ఈ రోజంతా అనుకూల ఫలితాలు ఉంటాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే స్మరిస్తే మంచిది.

వృషభ రాశి :
ఈ రాశి వారు ఈరోజు మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఈ నిర్ణయాలే భవిష్యత్తులో కలిసివస్తాయి. వ్యాపార లాభం కనిపిస్తుంది. మిత్రుల ద్వారా మేలు జరుగుతుంది. ఆదాయం పెరుగుతుంది. ఖర్చుల్ని అదుపు చేస్తారు. విద్యార్థులకు ప్రయోజనం ఉంటుంది. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేయగలుగుతారు. మీ సంపద పెరుగుతుంది. మీరు ఉద్యోగంలో విజయం సాధిస్తారు. అప్పులు తీసుకోవద్దు. కొత్త వాహనాలు, భూమి కొనుగోలు ప్రయత్నాలు చేస్తే అన్ని విధాలుగా కలిసి వస్తుంది.

ఉద్యోగ ప్రయత్నాలు కలుస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలను పొందుతారు. ప్రారంభించిన పనులను పట్టుదలతో పూర్తి చేస్తారు. విద్యార్థులకు అనుకూలమైన సమయం. పైఅధికారుల మద్దతు లభిస్తుంది. ఇంట్లోకి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. రావాల్సిన డబ్బు చేతికందుతుంది. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. ముఖ్య కార్యాల్లో విజయం లభిస్తుంది. అపార్ధాలకు అవకాశముంది. ఉద్యోగంలో మంచి జరుగుతుంది. స్థిరత్వం ఏర్పడుతుంది ఇంటా బయట ఒత్తిడి కలిగించే పరిస్థితులు ఉంటాయి. ఇష్ట దైవస్మరణ మేలు చేస్తుంది.

మిధున రాశి :
ఈ రాశి వారు ఈరోజు లక్ష్యం వైపు అడుగులు వేయండి. అభివృద్ధి ఉంటుంది. వ్యాపార పరంగా అనుకూలఫలితం ఉంటుంది. ఉత్తమ భవిష్యత్తు దిశగా ప్రణాళికలు వేసుకునే కాలమిది. బంధుమిత్రుల సహకారాన్ని తీసుకోండి. ఒక పనిలో విజయం ఉంటుంది. ఉద్యోగంలో తగినంత గౌరవం గుర్తింపు లభిస్తాయి. అప్పు తీసుకున్న మొత్తాన్ని తిరిగి చెల్లిస్తారు. పాత బాకీలు కొంతవరకు వస్తువులు అవుతాయి. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. ఉద్యోగంలో అందరు సహకారం లభిస్తుంది. వ్యాపారులకు మంచి కాలం. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు చేస్తారు. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు కలుస్తాయి. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. అదృష్ట కాలం కొనసాగుతుంది. మీ పిల్లల విజయాలతో సంతోషంగా ఉంటారు. ప్రేమికులు మనసులో మాటను తెలియజేయవచ్చు. అనుకున్న పనులన్నీ పూర్తి చేస్తారు. గణపతి ధ్యానం చేస్తే మేలు జరుగుతుంది

కర్కాటక రాశి :
ఈ రాశి వారికి ఈరోజు అన్నివిధాలా కలిసి వస్తుంది. అదృష్ట యోగం ఉంటుంది. ఉద్యోగంలో ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. వ్యాపార పరంగా లాభాలు ఆశించిన స్థాయిలో పెరుగుతాయి. స్నేహితుల సహాయంతో వ్యక్తిగత సమస్యను పరిష్కరించుకుంటారు. ఎప్పటి నుంచో చేతికి రావాల్సిన మొత్తం అందుతుంది. వ్యాపారంలో మీ పనితీరు అద్భుతంగా ఉంటుంది. రిస్క్ తీసుకోవద్దు. ప్రయాణంలో అపరిచితులతో ఎక్కువగా మాట్లాడకండి.

మీ సాంకేతిక నైపుణ్యాలు పెరుగుతాయి. అందర్నీ నమ్మవద్దు. కుటుంబ కలహాలు దూరమవుతాయి. వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. కొత్త పెట్టుబడులు కొంతకాలం వాయిదా వేయడం మంచిది. ఉద్యోగులకు పని భారం పెరుగుతుంది. పనుల్లో జాప్యం జరగవచ్చు. రావాల్సిన డబ్బు చేతికి అందరంలో ఆటంకాలు ఎదురవుతాయి. వివాదాలకు దూరంగా ఉండండి. ఆస్తి విలువ పెరుగుతుంది ఉద్యోగంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. తెలియని విషయాల్లో తలదూర్చవద్దు. శుభవార్తను వింటారు ఆరోగ్యం జాగ్రత్త. సూర్య స్తుతి మంచిది.

సింహరాశి :
ఈ రాశి వారికి ఈ రోజు రోజంతా సుఖసంతోషాలతో గడిచిపోతుంది. ఆటంకాలు ఎదురైన ఆర్థిక పరిస్థితి అనుకూలించకపోయిన కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగంలో మీ బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహిస్తారు. పట్టు వదలకుండా ప్రయత్నిస్తే వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. ఆదాయం నిలకడగా కొనసాగుతుంది. వ్యాపార లాభం ఉంది. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. ఉత్తమ భవిష్యత్తుకు పునాది వేస్తారు. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. పెద్దల అండదండలు ఉంటాయి.

ఈరోజు బంధువులను కలుస్తారు. కుటుంబ సభ్యులు మీకు సహకరిస్తారు నూతన వాహనం, భూముల కొనుగోలుపై ఆసక్తి కనపరుస్తారు. విద్యార్థులకు అనుకూలం. మంచి స్థాయిలో నిలుస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు కలిసివస్తాయి. అధికారుల ఆదరణ పొందుతారు. పదోన్నతితో బదిలీ అయ్యే అవకాశం ఉంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆత్మీయులతో పనులు నెరవేరుతాయి. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేందుకు అనుకూలమైన సమయం. వ్యాపారం ఆర్థికంగా లాభపడతారు. మీ పోటీదారులను అధిగమిస్తారు. లక్ష్మీ ధ్యానం సదా రక్షిస్తుంది.

కన్య రాశి :
ఈ రాశి వారు ఈరోజు ఉత్సాహంతో పనులు చేస్తారు. విహార యాత్రలు తీర్థయాత్రలు చేస్తారు. కోర్టు పనులు ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. ఆస్తి వ్యవహారాలు తోబుట్టులతో మాట పట్టింపులు కలుగుతాయి. పారిశ్రామికవేత్తలకు సిబ్బంది సహకారం లభిస్తుంది. ఉద్యోగంలో మెరుగైన ఫలితాలు సాధిస్తారు. ఐశ్వర్య శక్తీ కలుగుతుంది. వ్యాపార అభివృద్ధి ఉంటుంది. మిత్రుల వల్ల మేలు చేకూరుతుంది. మీ వల్ల కొందరికి సహాయం అందుతుంది. నమ్మకంతో ముందడుగు వేస్తారు.

Horoscope Today 11 June 2024 : ఈరోజు ఏయే రాశుల వారికి ఏయే పనులు అనుకూలం..

స్నేహితులతో కలిసి కొత్త పనులు ప్రారంభించే ప్రయత్నం చేస్తారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు కలిసివస్తాయి. ఏ విధంగా చూసినా మంచి కాలం నడుస్తోంది. పదిమందికి మేలు జరిగే పనులు చేస్తారు. ఉద్యోగంలో ఉన్నత పదవి పొందడానికి అవకాశం ఉంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపారంలో లాభాలు కనిపిస్తున్నాయి. చక్కగా పనులు పూర్తి చేస్తారు. ఆస్తి వివాదాల విషయంలో ఆందోళన చెందుతారు. విద్యార్థులు చదువు విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఈ రోజు ఎవరి నుంచి ఆశించవద్దు. ఆరోగ్యానికి సంబంధించి సమస్యలు ఉంటాయి. శివారాధన ఉత్తమం.

తులా రాశి :
ఈ రాశి వారికి ఈరోజు ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. కొత్త అవకాశాలు వస్తాయి. ఆలోచించి అడుగు వేయాలి. కొన్ని సంఘటనలు ఇబ్బంది పెడతాయి. జాగ్రత్తగా పరిష్కరించాలి. వ్యాపారంలో శ్రద్ధ పెంచండి. ముఖ్య కార్యాలను వాయిదా వేయండి. వివాదాలకు దూరంగా ఉండాలి. ఆరోగ్యం పై శ్రద్ధ పెంచాలి. వివాహది శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విద్యార్థులకు అనుకూలం. వ్యాపార భాగస్వాములతో సంబంధాలు పొందుతాయి. కొన్ని అనవసరమైన ఖర్చులు మూలంగా ముఖ్యమైన పనుల్లో జాప్యం జరగవచ్చు. అనవసర వాహనాల వల్ల ఖర్చులు పెరగవచ్చు.

అయితే ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగులకు పని ఒత్తిడి తగ్గుతుంది. పట్టుదల అవసరం. ఉద్యోగంలో విధులను నిర్వహించడంలో శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. కొత్త ఆదాయం వనరులు అభివృద్ధి చెందుతాయి. వ్యాపారం బాగా సాగుతుంది అదృష్టం మీకు కలిసి వస్తుంది. సమయానికి డబ్బు చేతికి అందుతుంది. గృహ వస్త్రాలను కొనుగోలు చేస్తారు. మీరు అన్ని పనుల్లో విజయం సాధిస్తారు. నవగ్రహ స్తోత్ర పఠించడం శుభప్రదం.

వృశ్చిక రాశి :
ఈ రాశి వారికి ఈరోజు అదృష్ట ఫలాలు అందుతాయి. ప్రతిదీ లోతుగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. కుటుంబ సభ్యులతో కలిసి పనిచేయండి. ఉద్యోగంలో అభివృద్ధికి అవకాశం ఉంటుంది. కుటుంబ పరంగా కొన్ని బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. బంధువులతో మొహమాటం వల్ల డబ్బు నష్టపోయే సూచనలు ఉన్నాయి. ఇంటికి కావాల్సిన వస్తువులు కొంటారు. ఆదాయంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. ఖర్చుల నియంత్రణ అవసరం.

Horoscope Today 11 June 2024 : Daily Panchangam And Rasi Phalalu Telugu
Today Horoscope 11 June 2024 ( Photo Credit : Google )

రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ప్రారంభించిన పనుల్లో జాప్యం ఉండవచ్చు. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త అవసరం. ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. ఉద్యోగంలో ఆశించిన ఫలితాలు వస్తాయి. ధన లాభం ఉంటుంది. ఎదురుచూస్తున్న పని వెంటనే పూర్తవుతుంది. వ్యాపారంలో లాభం రావచ్చు.ఈరోజు చాలా బిజీగా ఉంటారు. గతంలో చేసిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోండి. అపరిచితుల పట్ల జాగ్రత్త వహించండి. ఇష్ట దైవాన్ని స్మరించండి.. శాంతి లభిస్తుంది.

ధనస్సు రాశి :
ఈరోజు రాశి వారికి స్థిరాచరాస్తుల మూలంగా ఆదాయం పెరుగుతుంది. బంధు వర్గం మూలంగా కొన్ని పనులు నెరవేరుతాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. వాహనం మూలంగా పనులు కలసి వస్తాయి. న్యాయపరమైన సమస్యలను అధిగమిస్తారు. శుభవార్తలు వింటారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. దూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. సమయానికి తగ్గ నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపార బలం పెరుగుతుంది. బ్రహ్మాండమైన ఫలితం ఒకటి లభిస్తుంది.

గృహ,వాహన యోగాలు అనుకూలిస్తాయి. ఉద్యోగంలో పురోగతిని సాధిస్తారు. పెళ్లి ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. తలచిన పనులు నెరవేరుతాయి. రియల్ ఎస్టేట్ వారికి బాగుంటుంది. వ్యాపారంలో అధిక లాభాలు వస్తాయి. రెండు రోజులుగా కొనసాగుతున్న దిక్కుతోచని పరిస్థితి తొలగిపోనుంది. పూర్వీకులు ఆస్తులు వాటా పొందుతారు. ఆన్‌లైన్ వ్యాపారాలు చేసే వారికి అనుకూలమైన రోజు. మీ వ్యక్తిత్వానికి ప్రజలు ఆకర్షితులవుతారు. ఆంజనేయస్వామిని స్మరించండి.. మేలు జరుగుతుంది.

మకర రాశి :
ఈ రాశి వారికి ఈ రోజు అదృష్ట యోగం. స్వయంకృషితో బ్రహ్మాండమైన ఫలితం పొందుతారు. ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది. వృత్తి వ్యాపారాల్లో ధన లాభం ఉంది. కుటుంబంలో ప్రశాంతత ఏర్పడుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. తప్పుడు వ్యవహారాలకు దూరంగా ఉండండి. తలపెట్టిన పనుల్లో బరువు, బాధ్యతలు పెరిగిన సంతోషంగా పూర్తి చేస్తారు. ప్రారంభించిన పనులు సమయానికి పూర్తవుతాయి. నిలిచిపోయిన పనుల్లో కదలిక వస్తుంది.

శుభకార్య ప్రయత్నాన్ని పలుస్తాయి. రావాల్సిన డబ్బు ఆలస్యంగా అందుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ నిలుపుతారు. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కొత్త ఉద్యోగంలో చేరుతారు. కోర్టు కేసులు అనుకూల ఫలితాలు వస్తాయి. ఉద్యోగులకు పదోన్నతి, స్థానచలన సూచన. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగం అనుకూలంగా ఉంటుంది. ప్రమాదకర పనులు చేయవద్దు. కుటుంబ జీవితం చాలా ఆనందదాయకంగా ఉంటుంది. పని విషయంలో అజాగ్రత్తగా ఉండకండి. ఇష్టదైవాన్ని ధ్యానించండి.. ప్రశాంతత లభిస్తుంది.

కుంభరాశి :
ఈరోజు రాశి వారికి కొత్త అవకాశాలు లభిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. స్థిరమైన ఆలోచనలతో ముందుకు వెళ్తారు. కావాల్సిన వస్తువులను కొంటారు. అన్ని విషయాలను చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. ఆఫీసులో అనుకూల వాతావరణ ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉంటూ పనులు పూర్తిచేస్తారు. విద్యార్థులకు అనుకూలం. కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు పొందుతారు. ఆదాయం దృష్టిలో ఉంచుకుని ఖర్చు చేయండి. రావాల్సిన డబ్బు ఆలస్యంగా చేతికందుతుంది.

ఆర్థిక లావాదేవీల్లో తొందరపాటు తగదు. ఉద్యోగంలో శ్రమ పెరిగిన తగిన ప్రతిఫలం లభిస్తుంది. మనసులో ఉన్న ఒక ముఖ్యమైన కోరిక నెరవేరుతుంది. వ్యాపార లాభం కనిపిస్తుంది. వివాదాలకు దూరంగా ఉండండి. ఎప్పటినుంచో నిలిచిపోయిన పనులు పూర్తి చేయడంతో సంతోషంగా ఉంటారు. మీరు వ్యాపారంలో పెద్ద పెట్టుబడులు పెట్టవచ్చు. ఆర్థిక సంబంధమైన విషయాలకు ఈరోజు మంచిది. ఉద్యోగంలో ప్రమోషన్ ఉండవచ్చు. లేదంటే బదిలీలు జరగవచ్చు. ఆదిత్య స్తుతి మేలు చేస్తుంది.

మీనరాశి :
ఈరోజు ఈ రాశి వారు ఒక సమస్య పరిష్కారం అవుతుంది. కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగాలి. మీ ఖర్చులను నియంత్రించుకోండి. శుభకార్యాల వల్ల ఖర్చులు పెరగవచ్చు. రావాల్సిన డబ్బు అందకపోవడంతో చేపట్టిన పనులు ఆలస్యం అవుతాయి. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతారు. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఆరోగ్యంపై శ్రద్ధ నిలుపుతారు. ఇంట్లో వాతావరణం సంతృప్తికరంగా ఉంటుంది. అన్నదమ్ములు బందు వర్గంతో చిన్నపాటి మనస్పర్ధలు ఉండవచ్చు.

చర్చల ద్వారా వివాదాలను పరిష్కరించుకుంటారు. ఉద్యోగ ప్రయత్నాలు కొంతవరకు ఫలిస్తాయి. విహారయాత్ర ప్రయత్నాలు చేస్తారు. పారిశ్రామికవేత్తలకు అనుకూలమైన సమయం. వ్యాపార ఒప్పందాలు కలిసివస్తాయి. వ్యవసాయదారులకు అనుకూలం. న్యాయపరమైన సమస్యలను అధిగమిస్తారు. శుభయోగాలు ఉన్నాయి కోరుకున్న ఫలితాలు వెంటనే సిద్ధిస్తాయి. వ్యాపారంలో లాభం ఉంటుంది. పట్టు విడుపులతో వ్యవహరించాలి. ఉన్నతమైన జీవితం ఏర్పడుతుంది. లక్ష్మీ స్తుతి మన:శాంతినిస్తోంది.

Read Also : Horoscope Today 10 June 2024 : ఈరోజు రాశి ఫలాలు.. పంచాంగం.. 12 రాశుల వారికి ఏయే పనులు కలిసివస్తాయంటే?