Horoscope Today 13 June 2024 : జూన్ 13, 2024.. ఈరోజు రాశి ఫలితాలు.. 12 రాశుల వారిలో ఎవరికి ఎలాంటి ఫలితాలు కలుగుతాయంటే?

Horoscope Today 13 June 2024 : జూన్ 13వ తేదీ.. శ్రీక్రోధి నామ సంవత్సరం. జేష్ట మాసం, ఉత్తరాయణం గ్రీష్మరుతువు. గురువారం.. ఈరోజు ఏయే రాశులవారికి ఏయే ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా 12 రాశుల వారికి ఏయే పనుల్లో కలిసివస్తాయి. ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం.

మేషరాశి :
ఈరోజు ఈ రాశివారు నూతన ఒప్పందాల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. అందరిని గుడ్డిగా నమ్మకూడదు. రావాల్సిన డబ్బు చేతికందుతుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాల్లో బంధువుల సహకారం లభిస్తుంది. ఉద్యోగులు అధికారులతో స్నేహంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. కొత్త పనులను ప్రారంభించకుండా చేతిలో ఉన్న వాటిని పూర్తి చేస్తారు. వ్యాపారం సంతృప్తికరంగా సాగుతుంది. ఈరోజు వాహనాల వల్ల పనులు నెరవేరుతాయి. అనుకొని ఖర్చులు ముందుకు రావచ్చు. పనులు అనుకూలత ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉండండి. కుటుంబ పెద్దల సలహాలను పాటిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతారు. శత్రువులపై విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులతో వివేదించవద్దు. ప్రయాణాలు, ఆటంకాలు ఉంటాయి. ఓర్పు వల్ల కోల్పోయినవి తిరిగి లభిస్తాయి. నూతన కార్యాలను ప్రారంభిస్తారు

వృషభ రాశి :
ఈరోజు ఈ రాశి వారికి ఆదాయం పెరుగుతుంది. ఖర్చులు పెరుగుతాయి. వైవాహిక జీవితంలో ఆనందాన్ని పొందుతారు. కొత్త ఉపాధి అవకాశాలు లభిస్తాయి. భార్య మీ మనసుకు తగిన విధంగా నడుచుకుంటుంది. వివాహది శుభకార్యాల కారణంగా ఖర్చులు పెరుగుతాయి. రావాల్సిన డబ్బు పాక్షికంగా చేతికి అందుతుంది. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. విద్యార్థులకు శ్రమ తగ్గుతుంది. ఖర్చు విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోండి. పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు కలిసివస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆంజనేయ ధ్యానం శుభప్రదం.

మిధున రాశి :
ఈ రాశి వారికి ఈరోజు కార్యా సాఫల్యం గోచరిస్తుంది. కుటుంబ ఆస్తుల మూలంగా ఆదాయం పెరుగుతుంది. రావాల్సిన డబ్బు చేతికందుతుంది. కొత్త పనులు ప్రారంభించే ప్రయత్నం చేస్తారు. ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలను పాల్గొంటారు. వాహనం మూలంగా ఖర్చులు ఉండవచ్చు. భూముల వ్యవహారంలో జాగ్రత్త వహిస్తారు. అన్నదమ్ములు బంధువర్గంతో చిన్నపాటి మనస్పర్ధలు ఏర్పడవచ్చు. కొత్త పరిచయాలతో జాగ్రత్త అవసరం. శుభకార్య ప్రయత్నాలు కలుస్తాయి. ఇరుగుపొరుగుతో కలహాలు రావచ్చు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. ఉద్యోగులు అధికారులు ఆదరణ పొందుతారు. మొహమాటం వల్ల కొత్త సమస్యలు వస్తాయి వృత్తిపరంగా మంచి సమయం. ఉద్యోగంలో మంచి స్థానం పొందే అవకాశాలు ఉన్నాయి. కొత్త ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవారికి ఉద్యోగం లభిస్తుంది. కొత్త రంగాల్లో ఉపాధిని పొందవచ్చు. లక్ష్మీ స్తుతి ఉత్తమం.

కర్కాటక రాశి
ఈ రాశి వారు ఈరోజు శుభవార్తలు వింటారు. విద్యార్థులకు శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. ఆర్థిక ఒప్పందాలు, వ్యాపార లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. ఉద్యోగులకు పైఅధికారుల ఆదరణ లభిస్తుంది. పని భారం పెరిగిన సమయానికి పూర్తిచేస్తారు. ఆత్మీయ రాకతో ఖర్చులు పెరగవచ్చు. ఆస్తుల విషయంలో తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. ప్రయాణాల వల్ల కార్య సాఫల్యం ఉంటుంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ఇంటా బయట సంతృప్తిగా ఉంటారు. తీర్థయాత్రలకు వెళ్లే ఆలోచన చేస్తారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు కలుస్తాయి. శుభకార్య ప్రయత్నాలు కలుస్తాయి. దైవిక ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అదృష్టం ఉంటుంది. బంధువుల సహకారం లభిస్తుంది. మీరు నమ్మిన సిద్ధాంతం కాపాడుతుంది. ధైర్యంగా ముందడుగు వేయండి. సుఖ సంతోషాలు ఉంటాయి. శివారాధన మంచిది.

Horoscope Today 13 June 2024 : Daily Panchangam And Rasi Phalalu Telugu
Horoscope Today 13 June 2024 ( Image Source : Google )

సింహరాశి :
ఈ రాశి వారికి ఈరోజు ఆస్తులు, భూముల విషయంలో ఉన్న వివాదాలన్నీ పరిష్కారం అవుతాయి. పెండింగ్లో ఉన్న కోర్టు కేసుల్లో కదలిక వస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు. పారిశ్రామికవేత్తలకు రాబడి పెరుగుతుంది. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. విద్యార్థులు చదువులు రాణిస్తారు. శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆపదలు తొలగుతాయి. ముఖ్యమైన వ్యక్తుల వల్ల కలిసి వస్తుంది. గృహంలో శుభాలు జరుగుతాయి. బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు. మోసం చేసేవారు ఉంటారు. ఉద్యోగంలో ప్రమోషన్ అవకాశాలు ఉన్నాయి. కార్యాలయంలో ఎవరితోనూ అనవసరంగా జోక్యం చేసుకోకండి. మీ పనిని సకాలంలో పూర్తి చేస్తే మీపై ఎలాంటి అపవాదులు ఉండవు.

కన్య రాశి :
ఈ రాశి వారికి ఈరోజు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త ఉద్యోగంలో చేరతారు. ఆఫీసులో తోటివారితో స్నేహంగా ఉంటూ పనులు నెరవేర్చుకుంటారు. ఉత్సాహంగా ఉంటారు. తీర్థయాత్రలు విహారయాత్రలు చేస్తారు. ఇంటికి కావలసిన కొత్త వస్తువులు దుస్తులు కొంటారు. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారులకు భాగస్వామ్యతో సత్సంబంధాలు ఉంటాయి. కోర్టు కేసుల్లో విజయం లభిస్తుంది. ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి.

Horoscope Today 13 June 2024 : ఏ రాశుల వారికి ఏది మంచిదంటే?

రావలసిన డబ్బు చేతికందడంలో జాప్యం జరగవచ్చు. అవరోధాలను అధిగమించి పనులు పూర్తి చేస్తారు. మాట పట్టింపులకు పోవద్దు. ఏకాగ్రత అవసరం. ఆర్థిక లాభం ఉంటుంది. శుభం జరుగుతుంది. కెరియర్ పరంగా బాగానే ఉంటుంది. ఈ కాలంలో కొన్ని సవాళ్లు కూడా ఎదురవుతాయి. ఉద్యోగస్తులకు పూర్తిస్థాయిలో పదోన్నతులు కల్పిస్తారు. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారు శుభవార్తలు అందుతాయి.

తులా రాశి :
ఈరోజు ఈ రాశి వారికి రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. పైచదువులు కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక లావాదేవీలలో జాగ్రత్త వహిస్తారు. అనవసరమైన ప్రయాణాలను వాయిదా వేసుకుంటారు. కొత్త పనులు కాకుండా చేతిలో ఉన్న పనులను పూర్తి చేయడం మంచిది. వాహనాల వల్ల పనులు నెరవేరుతాయి. నూతన పెట్టుబడులు వాయిదా వేసుకుంటారు. అదృష్ట యోగం ఉంది. అనుకున్న ఫలితం వస్తుంది. శ్రమ అవసరం. వ్యాపార లాభం ఉంటుంది. సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. శ్రమతో ఉద్యోగంలో విజయ అవకాశాలు ఉంటాయి. ఆఫీసులో మీకు ప్రమోషన్ రావొచ్చు. కొందరు వ్యక్తులు మీకు వ్యతిరేకంగా కుట్రపన్నవచ్చు. జాగ్రత్తగా ఉండండి. విష్ణు స్తుతి శుభప్రదం.

వృశ్చిక రాశి :
ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. నలుగురిలో మంచి పేరును సంపాదిస్తారు. భూముల కొనుగోలు విషయంలో జాగ్రత్త వహిస్తారు. ఇంటికి కావాల్సిన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఉద్యోగులకు పైఅధికారుల ఆదరణ లభిస్తుంది. ధన లాభం సూచితం. అదృష్ట ఫలాలు అందుతాయి. వ్యాపారంలో విపరీతమైన లాభం ఉంటుంది. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. ఆఫీసులో మంచి పని తీరు కారణంగా ప్రశంసలు పొందుతారు. శుభవార్తను వింటారు.

ధనుస్సు రాశి :
ఈ రాశి వారికి ఈ రోజు కలిసి వస్తుంది. నలుగురిలో మంచి పేర్లు పొందుతారు. పిల్లలు చదువులో రాణిస్తారు. వృత్తి వ్యాపారాలు సజావుగా కొనసాగుతాయి. పనుల్లో పట్టుదల ఏకాగ్రత కనబరుస్తారు. ఇంట్లో శుభకార్యాలు చేస్తారు. విదేశీ ప్రయాణాలు దూర ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. రాజకీయ ప్రభుత్వ పనులు కలసి వస్తాయి. ఉద్యోగులకు ఆఫీసులో అన్ని విధాలుగా అనుకూల వాతావరణం ఉంటుంది. అధికారుల ఆదరణ సహోద్యుగుల సహకారం లభిస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్ సూచనలు ఉంటాయి. ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంటుంది. వాహనం మూలంగా పనులు నెరవేరుతాయి. కొందరు తప్పుదోవ పట్టించే ప్రమాదం ఉంది స్వతంత్రంగా తీసుకుని నిర్ణయం శక్తిని ఇస్తుంది. నచ్చిన ఉద్యోగం లభిస్తుంది. కార్యసిద్ధికి నవగ్రహ ధ్యాన శ్లోకాలు పాటించండి.

మకర రాశి :
ఈ రాశి వారికి ఈరోజు ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. నిలిచిపోయిన పనుల్లో కదలిక వస్తుంది. స్థిరాచరాసుల మూలంగా ఆదాయం పెరుగుతుంది. సమాజంలో గుర్తింపు పొందుతారు. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. విద్యార్థులకు విదేశాల్లో పైచదువుకు అవకాశం రావచ్చు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. వివాహది శుభకార్యాలు మేలు చేస్తాయి. అదృష్టవంతులు అవుతారు. పనిలో శ్రమ పెరుగుతుంది. దైవ బలం రక్షిస్తుంది. ఉద్యోగ ఫలాలు బాగుంటాయి. కెరియర్ పరంగా కొంచెం కష్టంగా ఉంటుంది. మంచి ఫలితాలు ఉంటాయి. చేసే పనులు ఆటంకాలు తగ్గుతాయి. కార్యాలయంలో సమస్యలు తగ్గుతాయి. వ్యాపారంలో సమస్యలు తగ్గుతాయి. మీ వ్యాపారంలో మంచి అభివృద్ధి ఉంటుంది. ఇష్ట దైవ స్మరణ సదా శక్తినిస్తుంది.

కుంభరాశి :
ఈ రాశి వారికి ఈరోజు శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలలో ఊరట లభిస్తుంది. ఉత్సాహంతో పనులు చేస్తారు ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. స్వయం వృత్తిలో ఉన్న వారికి పని భారం పెరుగుతుంది. రాబడి సంతృప్తి ఇస్తుంది. ప్రారంభించిన పనులు పూర్తవుతాయి. యోగదాయకమైన కాలం నడుస్తుంది. అవరోధాలు తలుగుతాయి. అవమానాలను తట్టుకొని నిలబడతారు. వ్యాపార లాభం ఉంటుంది. కెరియర్ పరంగా చాలా మంచి సమయం. మీకు మంచి జాబ్ ఆఫర్ వస్తుంది. ప్రైవేట్ రంగంలో పనిచేసే వ్యక్తులు వేరే నగరాల్లో జాబ్ ఆఫర్ పొందవచ్చు. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారి కోరికలు కూడా నెరవేరుతాయి. గణపతి ధ్యానం శ్రేష్ఠం.

మీనరాశి :
ఈ రాశి వారు ఈ రోజు సమయానికి పనులు పూర్తిచేస్తారు. ఆదాయం స్థిరంగా ఉంటుంది. అనవసరమైన ఖర్చులు ఉండవచ్చు. ఆర్థిక నిర్ణయాల్లో జాగ్రత్త అవసరం. విద్యార్థులకు కలిసి వస్తుంది. వాహన మూలంగా ఖర్చులు ఉంటాయి. కళాకారులకు అనుకూలమైన సమయం. అదృష్ట కాలం కొనసాగుతుంది. ఏది అనుకుంటారు అదే జరుగుతుంది. ఆచితూచి ఖర్చు చేయండి. ఉత్తమ భవిష్యత్తు కోసం చేసే ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తాయి. కెరియర్ పరంగా చాలా మంచిది. కార్యాలయంలో విజయం ఉంటుంది. ఆఫీస్‌లో ప్రశంసలు అందుతాయి. గౌరవం పెరుగుతుంది. గొప్ప జాబ్ ఆఫర్ పొందవచ్చు ముఖ్యంగా ప్రభుత్వంగానికి సంబంధించిన వ్యక్తులకు ఈ సమయం చాలా బాగుంటుంది. వారికి ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది.

Read Also : Horoscope Today 11 June 2024 : జూన్ 11, పంచాంగం.. ఈరోజు రాశి ఫలాలు.. 12 రాశుల వారు ఏయే పనుల్లో విజయం సాధిస్తారంటే?