Balakrishna Vasundhara : రామోజీరావుకి హీరో బాలకృష్ణ సతీమణి ఏమౌతుంది? ఈనాడులో ‘వసుంధర పేజీ’ అందుకే పెట్టారా?

0
38
Balakrishna Vasundhara _ Nandamuri Balayya Wife Vasundhara Devi Relation with Ramoji Rao Family
Balakrishna Vasundhara _ Nandamuri Balayya Wife Vasundhara Devi ( Image Source : Google )

Balakrishna Vasundhara Marriage : నందమూరి బాలకృష్ణ ఫ్యామిలీని ప్రపంచానికి దూరంగా ఉంచేవారు. కానీ, ఆయన పిల్లల పెద్దయ్యాక అందరూ మీడియాకు తెలిసిపోయారు. ఇక చంద్రబాబు నాయుడు కోడలుగా నారా బ్రాహ్మణి వచ్చిన తర్వాత నందమూరి నారా ఫ్యామిలీ మొత్తం ఒక్కటైంది. ఇక తేజశ్రీ, మోక్షజ్ఞలు కూడా సామాన్య సినిమా ప్రేక్షకులకు బాలయ్య ఫ్యాన్స్‌కి సుపరిచితమే. అయితే, చాలామందికి తెలియని విషయం ఏమిటంటే.. నందమూరి బాలయ్య సతీమణి వసుంధరా దేవి, బాలయ్య పెళ్లి.. వసుంధరా దేవితో బాలయ్య పెళ్లి చాలా యాదృచ్ఛికంగా జరిగింది.

రామోజీరావు ప్రాణస్నేహితుడి కూతురే వసుంధర :
అప్పట్లో నందమూరి తారక రామారావు నటన నుంచి విరామం తీసుకుని రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 1982లో ఆయన రాజకీయ పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత ఎంతో బిజీగా ఉండేవారు. అయితే, అప్పటికే ఈనాడు అధినేతగా రామోజీరావు చాలా పేరుగాంచిన వ్యక్తి. రాజకీయం నుంచి ప్రజల సమస్యల వరకు ఎప్పుడూ జర్నలిస్టులతో చర్చిస్తూ ఉండేవారు రామారావు. సలహాలు కూడా తీసుకుంటూ ఉండేవారు. అలానే ఓ రోజున రామోజీరావు ఇంటికి వెళ్లారు తారాక రామారావు. పార్టీతో పాటు ప్రజలు ప్రచారంపై ఆయనతో చర్చిస్తున్న క్రమంలో ఓ అమ్మాయి టీ తీసుకుని వచ్చింది.

ఆ అమ్మాయి తెచ్చిన టీ తీసుకున్న రామారావు.. ఆ అమ్మాయి ఎవరు అని రామోజీరావును అడిగారంట. అప్పుడే నా ప్రాణ స్నేహితుడు సూర్యారావు కూతురు అని చెప్పారట రామోజీరావు. ఆ టీ తెచ్చింది ఎవరో కాదు ఆమెనే వసుంధరా దేవి. వాస్తవానికి వసుంధర అంటే.. రామోజీరావు ఆయన సతీమణికి ఎంతో ఇష్టమట. మొదటి నుంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్‌గా ఉండేవారట. అయితే, కొన్నాళ్లు ఉంచుకుంటామంటే సూర్యారావు సరే అన్నారట.

అప్పటికే ఆయన ఎస్ఆర్ఎంటీ అధినేతగా చాలా పాపులర్ శ్రీరామదాసు మోటార్ ట్రాన్స్‌ఫోర్ట్ అధినేతగా వందల వాహనాలు, స్పేర్ పార్ట్స్ బిజినెస్‌తో పాటు ధియేటర్ల బిజినెస్‌తో కూడా చాలా బిజీగా ఉండేవారు. ఆ సమయంలోనే బాలయ్య వివాహం గురించి కూడా చర్చ వచ్చిందట. బాలయ్యకు మన వసుంధరను ఇచ్చి చేస్తే బాగుంటుందని రామోజీరావు చెప్పారట.

తిరుమలలో బాలయ్య, వసుంధర పెళ్లి :
అంతే.. సూర్యారావు ఓకే అనేసారంట. వెంటనే రామారావు గారు కూడా సరేనన్నారు. ఇంకేముంది సరిగ్గా వారం తిరగకముందే మంచి రోజు చూసి అదే ఇంట్లో పెళ్లిచూపులు కూడా జరిగిపోయాయి. ఎన్టీఆర్ ఇంటికి నందమూరి కోడలుగా వెళ్లడం తమకు ఇష్టమేనని వసుంధర తండ్రి చెప్పారు. అయితే, దగ్గర బంధువుల మధ్య బాలయ్య, వసుంధరల పెళ్లిచూపులు గ్రాండ్‌గా జరిగాయి.

దాదాపు లక్షల్లో కట్నం.. అంతేకాదు.. ఒక కారు కూడా ఆరోజు బాలయ్యకు గిఫ్టుగా ఇచ్చారని అప్పట్లో టాక్ నడిచేది. డిసెంబర్ 8, 1982న మధ్యాహ్నం 12 గంటల 41 నిమిషాలకు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి, కర్ణాటక కళ్యాణ మండపంలో బాలకృష్ణ వసుంధరల వివాహం జరిగింది.

Balakrishna Vasundhara Marriage : బాలయ్య పెళ్లి పెద్దగా రామోజీరావు :

కానీ, అందరికీ తెలియని విషయం ఏమిటంటే.. ఆ పెళ్లికి మాత్రం ఎన్టీఆర్ హాజరు కాలేకపోయారు. అప్పటికే ఆయన ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. హరికృష్ణ, ఎన్టీఆర్ లేకుండానే బాలకృష్ణ వివాహం జరిగిపోయింది. ఆ పెళ్లికి పెద్దగా రామోజీరావు వ్యవహరించారు. వసుంధరా దేవి తల్లిదండ్రులు దేవరపల్లి సూర్యారావు ప్రమీలరాణి దంపతులు కన్యాదానం చేశారు. ఎన్టీఆర్ దంపతులకు బాలయ్య 5వ కొడుకు. బాలయ్య పెళ్లికి కేవలం ఎన్టీఆర్ సతీమణి బసవతారకమ్మ ఇతర కుటుంబ సభ్యులు మాత్రమే ఉన్నారు. పెళ్లి ముగిసిన తర్వాత సాయంత్రమే అంత హైదరాబాద్ పయనమయ్యారు. అలా ఆగమేఘాల మీద బాలయ్య వసుంధరల పెళ్ళి జరిగింది.

బాలయ్య దంపతులకు ముగ్గురు సంతానం :
అయితే, అప్పటికి బాలయ్య సోలో హీరోగా సినిమాలు కూడా చేయలేదు. కేవలం తండ్రితో కలిసి మాత్రమే నటించారు బాలయ్య. అన్నదమ్ముల అనుబంధం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన బాలయ్య మంచి పేరు తెచ్చుకున్నారు. వాస్తవానికి ఆ పాత్రను చంద్రమోహన్‌తో చేయించాలి. తీరా సెట్ మీదకు వచ్చిన తర్వాత ఆయనకు బదులుగా ఇంట్లో ఉన్న బాలయ్యను పిలిపించి మరి ఆ రోజు చేయించారట ఎన్టీఆర్. ఆ మూవీ తర్వాత కూడా వేములవాడ భీమకవి, దానవీరశూరకర్ణ చేశారు బాలయ్య. అక్బర్ సలీం అనార్కలితో బాలయ్యకు ఇంకాస్త పేరు వచ్చింది.

Balakrishna Vasundhara _ Nandamuri Balayya Wife Vasundhara Devi Relation with Ramoji Rao Family
Balakrishna Vasundhara Devi Marriage ( Image Source : Google )

కాకపోతే అప్పటికి కూడా బాలయ్యను ఎన్టీఆర్ కొడుకు అనేవారు. పెళ్లి అయిన తర్వాత సాహసమే జీవితంతో సోలో హీరోగా బాలకృష్ణ నటిస్తూ ఉండగానే 1985లో ముద్దుల కృష్ణయ్యతో స్టార్ హీరోగా నిలబడ్డారు. 1988లో బ్రాహ్మణి, 1991లో తేజశ్రీ, 1994లో మోక్షజ్ఞ బాలయ్య వసుంధర దంపతులకు జన్మించారు. వసుంధర పెద్ద వ్యాపారవేత్త కూతురు అయినప్పటికీ మొదటి నుంచి కూడా ఇంటిని దాటి ఎప్పుడు బయటకు వచ్చేవరకు కాదు. సినిమా వేడుకలకు కూడా దూరంగా ఉండేవారు.

మహిళల కోసం ఈనాడులో వసుంధర పేరుతో పేజీ :

మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈనాడుగా మారిన తర్వాత మొదట్లో సినిమా పేపర్ పరిచయం చేశాడు రామోజీరావు. ఈనాడు సినిమాకు మంచి పాపులారిటీ వచ్చి సేల్స్ కూడా పెరిగాయి. ఆ తర్వాత మహిళల కోసం ఓ పేజీని ఏర్పాటు చేయాలనుకున్నారు. మహిళలను కూడా పేపర్ చదివేలా చేయాలని ఓ పేజీని కేటాయించారు రామోజీరావు. అయితే, దానికి ఏ పేరు పెట్టాలా అనేదానిపై చర్చ జరిగినప్పుడు తనకు కూతురు లాంటి ఎంతో ఇష్టమైన వసుంధర పేరు గుర్తొచ్చిందట. వెంటనే అదే పేరును కన్ఫామ్ చేశారు.

వసుంధర అంటే.. పుడమి, ధరణి అని అర్థం. ఈ వసుంధర పేజీ నేటికీ కూడా పాపులర్ మరి. ఆ వసుంధర ఎవరో కాదు.. స్వయానా బాలకృష్ణ గారి సతీమణి. బాలయ్య వసుంధరల పెళ్లి కార్డు కూడా నెట్టింట్లో వైరల్ అవుతుంది. వసుంధరా దేవి దేవరపల్లి సూర్యారావు శ్రీమతి దేవరపల్లి ప్రమీలరాణి రెండవ కూతురు. ఇక బాలకృష్ణ ఎన్టీఆర్ దంపతులకు ఐదవ సంతానం. బాలయ్య పెళ్లి తర్వాత ఎన్టీఆర్ దగ్గరకు వెళ్లి ఆశీస్సులు తీసుకున్నారు.

Read Also : Ramoji Rao Real Life Story : రామోజీరావు రియల్ లైఫ్ స్టోరీ.. సాధారణ రైతు కుటుంబం నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ.. ప్రస్థానం మొదలైందిలా..!