Manamey Movie Review : ‘మనమే’ మూవీ రివ్యూ.. ఫ్యామిలీ మ్యాన్ శర్వానంద్‌ ఖాతాలో హిట్ పడిందా? ఆడియెన్స్ టాక్ ఎలా ఉందంటే?

0
42
Manamey Movie Review _ Sharwanands manamey Review and Rating Telugu on Twitter Audience Talk
Manamey Movie Review _ Sharwanands manamey Review and Rating ( Photo Credit : Google )

Manamey Movie Review : యంగ్ హీరో శర్వానంద్, హీరోయిన్ కృతి శెట్టి నటించిన మనమే మూవీ జూన్ 7న థియేటర్లలో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. లవ్ అండ్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కించిన ఈ మూవీకి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించారు. టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్స్ హౌస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌తో టీజీ విశ్వ ప్రసాద్ మనమే మూవీని నిర్మించారు. ఇప్పటికే, ఓవర్‌సిస్ ప్రీమియర్స్ టాక్ వచ్చేసింది.

ప్రీమియర్ షోలతో అమెరికా నుంచి ఆడియన్స్ ట్విట్టర్ వేదికగా మనమే మూవీపై తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీకి ట్రైలర్ కొంచెం హైప్ ఇవ్వడంతో కొంతవరకు పాజిటివ్ బజ్ వచ్చింది. శర్వానంద్ హిట్ కొట్టబోతున్నాడనే అంచనాలు కూడా నెలకొన్నాయి. ఇంతకీ శర్వా మనమే మూవీతో హిట్ అందుకున్నాడా? ట్విట్టర్ ఆడియన్స్ నుంచి ఏ స్థాయిలో రెస్పాన్స్ వస్తుందో ఇప్పుడు చూద్దాం..

డైరెక్టర్ : శ్రీరామ్ ఆదిత్య
నటీనటులు : శర్వానంద్, కృతి శెట్టి, రాహుల్ ర‌వీంద్ర‌న్
సినిమాటోగ్రఫీ : విష్ణు శర్మ, జ్ఞానశేఖర్ వీఎస్
మ్యూజిక్ : హేషమ్ అబ్దుల్ వహాబ్
నిర్మాత : టీజీ విశ్వ ప్రసాద్
ప్రొడక్షన్ : పీపుల్ మీడియా ఫ్యాక్టరీ

ఫస్టాఫ్ సూపర్.. సెకండాఫ్ ఒక్కటే :
హీరో శర్వానంద్ నటించిన కొత్త మూవీ మనమే స్టోరీ ముందుగా లండన్ బ్యాక్ డ్రాప్‌తో స్టార్ట్ అవుతుంది. శర్వానంద్ తనదైన కామెడీ టైమింగ్‌తో బాగానే ఆకట్టుకున్నాడు. ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలా స్టోరీ ఉంది. కానీ, మూవీ సన్నివేశాల్లో ఆడియెన్స్ ఎంగేజ్ చేసే విషయాలు చాలా తక్కువనే చెప్పాలి. శర్వానంద్ కామెడీ సీన్స్ బాగానే ఉన్నాయని అనిపించిందని అంటున్నారు. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది.

ఎమోషనల్ కంటెంట్ పరిధి మేరకు ఉన్నట్టుగా అనిపించింది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగానే ఉన్నాయి. శర్వానంద్ తనయుడితో సన్నివేశాలు బాగా వచ్చాయి. ఫస్ట్ హాఫ్ మాదిరిగా సెకండ్ హాఫ్ ఎమోషనల్ సన్నివేశాలు పెద్దగా పండలేదనే టాక్ వినిపిస్తోంది. ఎమోషనల్ కనెక్టవిటీని బిల్డ్ చేయడంలో డైరెక్టర్ ఫెయిల్ అయినట్టుగా అనిపిస్తోంది. శర్వానంద్ తనదైన పర్ఫార్మెన్‌‌తో ఆడియోన్స్ నవ్వించడంలో సక్సెస్ అయ్యాడు. కానీ, కొన్ని బోరింగ్ సీన్స్ మనమే మూవీకి మైనస్ అని చెప్పవచ్చు.

శర్వానంద్‌కే ఆ క్రెడిట్ :
ఓవ‌ర్‌సీస్ ప్రీమియ‌ర్స్ నుంచి కూడా మ‌న‌మే మూవీ మిక్స్‌డ్ టాక్ అందుకుంది. చాలామంది నెటిజన్ల నుంచి మనమే మూవీపై నెగెటివ్ కామెంట్స్ కూడా వస్తున్నాయి. కొంతమంది అయితే మూవీ బోరింగ్‌గా ఉందని అంటున్నారు. మరికొందరు కామెడీ, ల‌వ్‌స్టోరీ, ఎమోష‌న్ అనుకున్నంతగా లేవని చెబుతున్నారు.

మనమే మూవీని ఒక ఫ్యామిలీ సినిమాగా తెరకెక్కించడంలో డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య కొంతవరకు పర్వాలేదనిపించాడని అంటున్నారు. శ‌ర్వానంద్ మనమే మూవీ మొత్తాన్ని తన భుజాలపైనే నడిపాడు. ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే.. శర్వాకే ఆ క్రెడిట్ దక్కుతుందని ఆయన ఫ్యాన్స్ అంటున్నారు.

Manamey Movie Review _ Sharwanands manamey Review and Rating Telugu on Twitter Audience Talk
Manamey Movie Review ( Photo Credit : Google )

మూవీలో ఇదే పెద్ద మైనస్ :
ఈ మూవీ మొత్తంలో ఎక్కువగా తల్లి, తండ్రి, పాప మధ్యనే ఈ స్టోరీ మొత్తం ఉంటుందని, మూడు పాత్రలతో మూవీని ముందుకు నడిపించారని ఆడియోన్స్ అభిప్రాయపడుతున్నారు. సెకండాఫ్‌ విషయానికి వస్తే.. ఎమోషనల్ సీన్స్ అంతగా ఆడియోన్స్ కనెక్ట్ చేయడంలో డైరెక్టర్ సక్సెస్ కాలేదేనే అభిప్రాయం నెటిజన్లలో వ్యక్తమవుతోంది. ఒక ఫ్యామిలీ మూవీలో ఉండాల్సిన గుండెల్ని పిండేసేలా సెంటిమెంట్‌, ఫ్యామిలీ డ్రామా అనేవి సెకండాఫ్‌లో పూర్తి స్థాయిలో లేవని అంటున్నారు.

హీరో శ‌ర్వానంద్‌ సెంటిమెంట్ సీన్లలో బాగా పండించాడు. పాపతో కొన్ని సన్నివేశాలు అద్భుతంగా వచ్చాయని అంటున్నారు. కామెడీ సన్నివేశాల్లో కడపుబ్బ నవ్వించేలా ఉన్నాయని చెబుతున్నారు. అయితే, ఈ సినిమాలో హీరో శర్వానంద్‌కు తగ్గ విల‌న్ రోల్ లేకపోవడం మూవీకి పెద్ద మైన‌స్‌ అని అంటున్నారు.

Manamey Movie Review: మనమే ట్విట్టర్ రివ్యూ.. శర్వానంద్ హిట్టా కొట్టాడా?

రాహుల్ ర‌వీంద్ర‌న్ విలన్ పాత్ర అంతగా ఆడియోన్స్ కనెక్ట్ కాలేదని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మూవీ మేకింగ్ విషయంలో పర్వాలేదనిపించింది. మంచి మంచి లొకేష‌న్స్ చూపించారు. మ‌న‌మే మూవీ స్టోరీ ఒక్కటే కాస్తా ఆడియోన్స్ కనెక్ట్ కాలేకపోయిందని అంటున్నారు. మ‌న‌మే స్టోరీ గ‌తంలో వచ్చిన అనేక మూవీలకు భిన్నంగా శ‌ర్వానంద్ ఎంతో డిఫరెంట్ లుక్‌తో కనిపించాడు. తనదైన నటనతో ఆకట్టుకున్నాడని, ఇక హీరోయిన్ కృతిశెట్టితో శర్వా కెమిస్ట్రీ బాగానే ఉందని నెటిజ‌న్లు కామెంట్స్ పెడుతున్నారు.

మూవీకి ఇదే ప్లస్ పాయింట్ :
ఏదిఏమైనా హీరో శ‌ర్వానంద్ మనమే మూవీని అన్నీ తానై ముందుకు నడుపుతూ తన పాత్రకు వంద శాతం జస్టిస్ చేశాడని అంటున్నారు. హీరోయిన్ కృతిశెట్టి రోల్‌కు స్కోప్ పెద్దగా లేనట్టుగా కనిపించిందని అంటున్నారు. ఈ మూవీలో సీర‌త్ క‌పూర్ రోల్ మాత్రం ఏదో ఉండాలి అన్నట్టుగా ఉందని కామెంట్లు పెడుతున్నారు. హేష‌మ్ అబ్దుల్ వ‌హాబ్ స్వరపరిచిన సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మూవీకి కొద్దిగా ప్ల‌స్ పాయింట్ అయిందని అంటున్నారు.

మనమే మూవీ ఆశించిన విధంగా లేదంటూ ట్విట్టర్ వేదికగా నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. మనమే మూవీని చూసేందుకు థియేటర్లకు వెళ్లి ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయొచ్చు. కానీ, ఈ ఫ్యామిలీ డ్రామా మూవీ ఎంతవరకు ఆడియన్స్‌కు కనెక్ట్ అవుతుందో చూడాలి.

Read Also : Pushpa 2 Couple Song : ఆరు భాషల్లో మిలియన్ల వ్యూస్‌తో పుష్ప 2 కపుల్ సాంగ్ రికార్డు.. అగ్రస్థానంలో పుష్ప పుష్ప టైటిల్ సాంగ్!