Renu Desai Strong Reply to Pawan Kalyan Fans ( Image Source : Google )
Renu Desai : టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అంటే ఆ క్రేజ్ మామూలుగా ఉండదు. పవన్ అంటే ఆయన అభిమానులకు అంత పిచ్చి. అదే అభిమానాన్ని సోషల్ మీడియా వేదికగా వ్యక్తపరుస్తుంటారు. కొన్నిసార్లు పవన్ అభిమానులు చేసే కామెంట్లతో ఆయన మాజీ భార్య రేణ్ దేశాయ్ ఇబ్బందిగా ఫీలవుతుంటారు. ఆ కామెంట్లను చూసినప్పుడల్లా రేణూ చాలా ఆవేదనకు గురవుతుంటారు.
తన జీవితం ఏదో తాను బతుకుతుంటే పాత విషయాలను పదేపదే గుర్తుచేస్తూ తనను వేధిస్తున్నారని వాపోతున్నారు రేణ్ దేశాయ్. ప్రతిసారి తన జీవితాన్ని పవన్ జీవితంలో ముడిపెట్టడం ఆమెకు నచ్చలేదు. ఈ విషయాన్ని సున్నితంగా ఎన్నోసార్లు చెప్పిచూశారు. ఆయన అభిమానుల తీరు మారలేదు. మా అన్నతో కలిసి ఉంటే బాగుండేది.. ఎందుకు పవన్ అన్నను వదిలిసి వెళ్లిపోయావ్ అంటూ ఇలా ఇబ్బందికరమైన కామెంట్లు చేస్తుంటారు.
సాధారణంగా రేణు దేశాయ్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గానే ఉంటారు. ఏదో ఒక విషయాన్ని తన అకౌంట్లో పోస్టు చేస్తుంటారు. తాను ఏ పని చేసినా లేదా పిల్లల గురించి ఏదైనా విషయాన్ని తన అభిమానులతో ఇన్‌స్టా వేదికగా ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తుంటారు. అయితే, లేటెస్టుగా రేణూ దేశాయ్.. ఇంట్లో జరిపిన హోమం గురించి ఒక విషయాన్ని ఫాలోవర్లతో షేర్ చేసుకున్నారు. అందులో తన చేతులతో ప్రసాదం చేశానంటూ ప్రత్యేక పూజలు చేసే సమయంలో స్వయంగా ప్రసాదం తయారు చేయడం తనకు చాలా ఇష్టమని రేణు చెప్పుకొచ్చారు.
తాను పెట్టిన పోస్టుతో సంబంధం లేకుండా పవన్ ఫ్యాన్స్ కొందరు మరో విషయాన్ని కామెంట్ చేశారు. పవన్‌కు సంబంధించి కామెంట్లను పెట్టారు. వదిన గారు.. మీరు ఇంకా కొన్ని సంవత్సరాలు ఓపిక పట్టాల్సింది.. అప్పుడు బాగుండేది.. పవన్ వంటి దేవున్ని పెళ్లి చేసుకుని ఆయన అతంరంగం తెలుసుకోకుండానే వెళ్లిపోయారంటూ కామెంట్ చేశారు. ఇప్పుడు ఆ దేవుడు విలువ మీకు తెలిసి వచ్చింది. డెస్టినీ అనేది ఒకటి ఉంటుంది. అదే అందరి జీవితాలను నిర్ణయిస్తుందని ఒక అభిమాని కామెంట్ చేశాడు. అంతేకాదు.. ఈరోజున పిల్లలు ఇద్దరు అన్నయ పవన్‌తోనే ఉన్నారు.. అది చాలు వదిన మాకు.. మేము మిమ్మల్ని మిస్ అవుతున్నాం అంటూ కామెంట్ చేసినట్టుగా ఉంది.
ఆ కామెంట్ చూసిన వెంటనే రేణూ గట్టిగానే రిప్లయ్ ఇచ్చారు. మీకు అసలు కొంచెం ఏమైనా బుద్ది ఉందా? ఉంటే ఇలాంటి మాటలు అనేవారు కాదు.. పవన్ గారు నన్ను వదిలేసి ఇంకో పెళ్లి చేసుకున్నారు. అంతేకానీ నేను అలా కాదన్నారు. దయచేసి ఇకపై ఇలాంటి కామెంట్స్ పెట్టి.. నన్ను ఇలా టార్చర్ పెట్టకండి ప్లీజ్ అంటూ దండం పెట్టేశారు రేణు దేశాయ్.
ఆ వెంటనే.. మీరు సూపర్ అమ్మ.. అన్నయ్య దగ్గర లేకున్నా బాగానే పూజలు చేస్తున్నారంటూ మరో అభిమాని కామెంట్ చేయడంతో రేణూ దేశాయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేంటీ.. అన్న దగ్గర లేకపోయినా? దీని అర్థం ఏంటి? నాకంటూ సొంత లైఫ్ ఏది ఉండదా?.. ఇలాంటి కామెంట్లతో నన్ను చాలా బాధపెడుతున్నారని రేణూ దేశాయ్ తన ఆవేదనను వెలిబుచ్చారు.
Read Also : Viral Video : నూడిల్స్ తిన్నట్టు.. పాములను కరకర కొరికి నమిలి తినేస్తోందిగా.. వీడియో చూస్తే అంతే..!
This website uses cookies.