Viral Video : వామ్మో.. పాములా? ఈ మాట వింటనే హడలిపోతుంటారు. పాములను దూరంగా చూస్తే భయంతో వణికిపోతాం. అదే పాము దగ్గరగా వస్తే ఏమైనా ఉందా? దూరంగా పారిపోతాం. కానీ, ఈ సౌత్ కొరియన్ అమ్మాయి మాత్రం కొంచెం కూడా భయం లేకుండా పాములను చేత్తో పట్టేసుకుంది.
అంతటితో ఆగలేదు. అదేదో నూడిల్స్ అన్నట్టుగా నోటిలో పెట్టుకుని కరకర నమిలి తినేస్తోంది. ఒళ్లు గగొరుపొడిచే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దక్షిణ కొరియాకు చెందిన ఈ యువతి ఏం చక్కగా ప్లేటులో పాములను పెట్టుకుని తెగ తినేస్తోంది.
ఆ పాములను కనీసం కుక్ కూడా చేయలేదు. అలానే పచ్చి పాములను నోటితో నమిలి తినేస్తోంది. ఈ వీడియో చూసిన వారంతా వామ్మో పాములను తింటుందిగా అంటూ భయపడిపోతున్నారు. కేవలం పాములను మాత్రమే కాదు.. అక్కడి కూరగాయలను పచ్చిగానే తినేస్తోంది. ఈ వైరల్ వీడియోను ఆమె తన ఇన్‌స్టాలో షేర్ చేయడంతో వైరల్ అవుతుంది. ఆ పామును తినడం చూసి నెటిజన్లు ఇదేం పని.. అంటూ తిట్టిపోస్తున్నారు.
పాములను యువతి తింటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మిలియన్ల కొద్ది వ్యూస్ వచ్చాయి. వేలాది కొద్ది లైకులు వస్తున్నాయి. ఇలాంటి తినడం వల్లే అనేక వైరస్‌లు వస్తున్నాయి అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనా ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. ఈ భయానక వీడియో మీరు కూడా ఓసారి లుక్కేయండి.
Read Also : Telangana Woman : చంద్రబాబు సీఎం అయ్యాకే పుట్టింటికి.. పంతం నెగ్గించుకున్న తెలంగాణ ఆడపడుచు!