Rave Party Hema Arrest : బెంగుళూరు రేవ్ పార్టీ కేసులో ఊహించని ట్విస్ట్.. సినీనటి హేమ అరెస్ట్!

Rave Party Hema Arrest : బెంగళూరులో సంచలనం సృష్టించిన రేవ్ పార్టీ కేసులో ఊహించని ట్విస్ట్ నెలకొంది. తెలుగు రాష్ట్రాల్లో కొన్నిరోజులుగా ఉత్కంఠ రేపుతున్న ఈ రేవు పార్టీ కేసులో టాలీవుడ్ సినీయర్ నటి హేమ అరెస్ట్ అయినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి విచారణకు హాజరుకావాల్సిందిగా పోలీసులు పలుమార్లు హేమకు నోటీసులు జారీ చేశారు. అయినప్పటికీ హేమ విచారణకు పోలీసుల ఎదుట హాజరు కాకపోవడంతో మరోసారి కూడా ఆమెకు నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలోనే పోలీసులు నటి హేమను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.

సోమవారం ఉదయం హేమ విచారణకు హాజరు కాగా.. రేవ్ పార్టీ నిర్వహక సిబ్బందిలో హేమ కీలకంగా వ్యవహరించినట్టు విచారణలో తేలింది. ఈ కేసులో ఇప్పటివరకూ మొత్తం ఐదుగురితో హేమ రేవ్ పార్టీని ప్లాన్ చేసినట్టు విచారణలో పోలీసులు తేల్చేశారు. ఈ నేపథ్యంలోనే నటి హేమను అరెస్ట్ చేసినట్టు చెబుతున్నారు బెంగుళూరు పోలీసులు. రేవ్ పార్టీ నిర్వహణతో పాటు డ్రగ్స్ పాజిటివ్ తేలడంతో హేమను అదుపులోకి తీసుకున్నారు. ఇదివరకే ఈ రేవ్ పార్టీ కేసులో విచారణకు హాజరుకావాలని రెండుసార్లు హేమకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. కానీ, ఆమె ఏదో ఒక కారణం చూపుతూ విచారణకు వెళ్లకుండా తప్పించుకున్నారు.

Rave Party Hema Arrest : బెంగళూరు మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చే అవకాశం :

ఎన్నిసార్లు చెప్పిచూసినా ఆమె వినకపోవడంతో చివరికి పోలీసులు సోమవారం హైదరాబాద్‌కు వచ్చి నటి హేమకు నోటీసులు పంపారు. పోలీసుల చర్యతో తప్పని పరిస్థితుల్లో నటి హేమ బురఖాలో విచారణకు హాజరైంది. విచారణ సమయంలో పోలీసుల అడిగిన ప్రశ్నలకు ఆమె సరైన సమాధానం చెప్పలేదని తెలిసింది. రేవ్ పార్టీ ప్లానింగ్, హేమ కీ రోల్ ఉందని విచారణలో పోలీసులు గుర్తించారు. ఆస్పత్రిలో హేమాకు వైద్య పరీక్షలు చేసిన అనంతరం ఆమెను స్టేట్ హోంకు తరలించనున్నారు. బుధవారం ( జూన్ 5) బెంగళూరు మెజిస్ట్రేట్ ముందు నటి హేమను పోలీసులు హాజరుపరిచే అవకాశం ఉంది.

Telugu Actress Hema Arrest in Bengaluru Rave Party Case
Telugu Actress Hema Arrest ( Photo Credit : Google )

హేమ సహా పలువురికి పరీక్షలు.. 86మందికి పాజిటివ్ :

గత మే నెలలో బెంగళూరులో రేవ్ పార్టీ జరిగింది. ఈ రేవ పార్టీలో టాలీవుడ్ సినీ పరిశ్రమకు సంబంధించి అనేక మంది నటీనటులు, సీరియల్ నటులు దాదాపు 100 మందికి పైగా సెలబ్రిటీలు పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన నటీనటులు కూడా ఉన్నారు. అంతేకాదు.. రేవ్ పార్టీలో డ్రగ్స్ కూడా భారీగా పట్టుబడటంతో పోలీసులు మరింత లోతుగా విచారణ చేపట్టారు. రేవ్ పార్టీలో పాల్గొన్న నటినటీల బ్లడ్ శాంపిల్స్ కూడా సేకరించి పరీక్షలు చేయించగా 86 మందికి డ్రగ్స్ తీసుకున్నట్టుగా పాజిటివ్ వచ్చిందని బెంగళూరు పోలీసులు వెల్లడించారు.

ఈ రేవ్ పార్టీలో తాను అసలు పాల్గొనలేదని, తాను ఇంట్లోనే ఉన్నానంటూ నమ్మించే ప్రయత్నం చేశారు నటి హేమ. తాను ఇంట్లో ఉన్నట్టుగా నిరూపించేలా కొన్ని వీడియోలను కూడా ఆమె షేర్ చేశారు. రేవ్ పార్టీలో హేమ పాల్గొన్నట్టుగా ఆమె ఫోటోను పోలీసులు బయటకు విడుదల చేశారు. హేమ ధరించిన డ్రెస్, ఆమె వీడియోలో కనిపించిన డ్రెస్ ఒకేలా ఉండటంతో ఆమె పార్టీలో పాల్గొన్నట్టుగా తేల్చేశారు పోలీసులు. మొదటినుంచి తాను రేవ్ పార్టీలో పాల్గొనలేదని చెబుతున్నా హేమ బ్లడ్ శాంపిల్స్ టెస్టు చేయగా ఆమెది కూడా పాజిటివ్ అని తేలడంతో పోలీసులు అదుపులో తీసుకున్నారు.

Read Also : Bigg Boss Season 8 Telugu : బిగ్‌బాస్ 8 తెలుగు కంటెస్టెంట్స్ వీళ్లేనట..? హౌస్‌లోకి వెళ్లేవారి లిస్టులో ఎవరెరు ఉన్నారంటే?