Garlic Lemon Juice : వెల్లుల్లి, నిమ్మరసం, తేనెతో ఇలా చేస్తే.. మీ జీవితంలో గుండె జబ్బులు దగ్గరకి రావు..!

0
42
Garlic Lemon Juice Reduce Cholesterol Health Tips in Telugu
Garlic Lemon Juice Reduce Cholesterol ( Photo Credit : Google )

Garlic Lemon Juice : ప్రస్తుత రోజుల్లో ఒత్తిడికి అనేది కామన్. ఒత్తిడి కారణంగా అనేక రోగాలు రావడంతోపాటు గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. అధిక ఒత్తిడి వల్ల నిద్రలేమితో పాటు ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మందిలో గుండెకు సంబంధించిన వ్యాధులు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అలాంటివారు వెల్లుల్లి నిమ్మరసంతో చేసిన మిశ్రమంతో గుండె నొప్పితో పాటు గుండెకు సంబంధించిన వ్యాధులు అన్నిటినీ తగ్గించుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు ఆరోగ్య విషయాలను వివరంగా తెలుసుకుందాం.

మనం చాలా వరకు వెల్లుల్లి, నిమ్మరసాలను వంటల్లో మసాలాలు కోసమో మంచి రుచి కోసమో వాడుతూ ఉంటాం. కానీ, ఈ రెండు కలిపితే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయో ఎవరికీ తెలియదు. రక్తనాళాల్లో ఎక్కువగా పేరుకుపోయిన కొలెస్ట్రాల్ తగ్గించేందుకు ఈ రెండు అద్భుతంగా పనిచేస్తాయని నిపుణులు అంటున్నారు. కొన్ని ఫార్మా కంపెనీల్లో మందుల తయారీలో వాడే పదార్థాలు కూడా వెల్లుల్లి, నిమ్మరసమేనట.

అధిక బరువు ఉన్నవారికి దివ్యౌషధం :
అయితే, వీటితోపాటు కొన్ని రసాయనాలను కలిపి మందుల్ని తయారుచేస్తారు. ఇలాంటి కెమికల్స్ పదార్థాలతో తయారైన మందులు మనం ఎందుకు వాడాలి. సహజసిద్ధంగా లభించే ఇలాంటి పదార్థాలతో మనమే ఔషధాల్ని తయారు చేసుకోవచ్చు. అలా వాడితే రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ వెంటనే కరిగిపోతుంది. దీంతో రక్త సరఫరా కూడా మెరుగుపడుతుంది. తద్వారా గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎప్పటికీ ఉండదని వైద్యునిపుణులు గట్టిగా చెబుతున్నారు.

ఒకవేళ గుండె జబ్బు ఉన్నవారిలో ఈ నిమ్మకాయ, వెల్లుల్లి రసాన్ని తాగితే గుండె జబ్బు తగ్గే అవకాశం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. గుండె నొప్పులు ఎక్కువగా అధిక బరువు ఉన్నవారికే వస్తూ ఉంటాయి. అలాంటి అధిక బరువుతో బాధపడేవారు గుండె జబ్బు నుంచి తప్పించుకునే ఈ వెల్లుల్లి నిమ్మకాయ రసంతో చేసిన రెమెడీని ఫాలో అవ్వాలి. ఎప్పటికీ గుండె నొప్పి మాత్రమే కాకుండా ఇతర ఎలాంటి గుండెజబ్బులు రావని కొన్ని పరిశోధనలో తేలింది. ఈ మిశ్రమం తయారీకీ మనకు కావాల్సిన పదార్థాలను ఇప్పుడు చూద్దాం..

Garlic Lemon Juice : వెల్లుల్లి, నిమ్మతో రసం తయారీ విధానం :

ముందుగా 30 వెల్లుల్లి రెబ్బలు, 6 నిమ్మకాయలు తీసుకోవాలి. నిమ్మకాయలను కోసి రసం తీయాలి. వెల్లుల్లి పొట్టు తీసి ముక్కలుగా చేయాలి. ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో నిమ్మరసం, వెల్లుల్లి రెబ్బలు వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలపాలి. ఆ తర్వాత ఒక గ్యాస్ స్టౌపై గిన్నె ఉంచి ఆ మిశ్రమాన్ని ఆ గిన్నెలో వేసి రెండు లీటర్ల నీటిని కలపాలి. ఆ తర్వాత 10 నిమిషాల పాటు ఆ నీటిని వేడి చేయాలి. ఆ తర్వాత వాడకట్టి గాజు సీసాలో ఉంచి ఫ్రిడ్జ్‌లో పెట్టాలి. ఇలా తయారు చేసిన మిశ్రమాన్ని ప్రతిరోజు పరగడుపున 5మిల్లీలీటర్లు తాగాలి.

క్రమం తప్పకుండా మూడు వారాలపాటు తీసుకోవాలి. వారం రోజులపాటు గ్యాప్ ఇవ్వాలి. ఆ తర్వాత మళ్లీ మూడు వారాలపాటు ఇదే మిశ్రమాన్ని తాగాలి. కచ్చితంగా 6 నెలల పాటు ఈ వెల్లుల్లి, నిమ్మరసాన్ని తాగుతుండలి. ఇలా చేయడం ద్వారా గుండె రక్తనాళాలను పంపించే నాళాల్లో పేరుకుపోయిన కొవ్వు కరిగిపోయి ఆ రక్తనాళాలు క్లీన్ అవుతాయి. అప్పుడు గుండెకు తగినంత రక్తం సరఫరా అవుతుంది. గుండె నొప్పితో పాటు ఎలాంటి గుండె సంబంధిత వ్యాధులు ఎప్పటికీ రావు. ఎంతో అద్భుతమైన ఈ వెల్లుల్లి నిమ్మరసం మిశ్రమాన్ని రోజువారీగా వాడుతూ ఉంటే గుండె నొప్పితో పాటు గుండె సంబంధిత వ్యాధులను దరిచేరకుండా కాపాడుకోవచ్చు.

ఈ లక్షణాలు కనిపిస్తే రోగనిరోధక శక్తి తగ్గినట్టే :
మీరు త్వరగా అలసిపోయి తీవ్రంగా నిరసించబోతున్నారంటే మీలో వ్యాధినిరోధక శక్తి సమర్థవంతంగా పనిచేయడం లేదని గుర్తించాలి. అలా పదేపదే జరుగుతోందంటే మాత్రం అసలు నిర్లక్ష్యం చేయకూడదు. ఒకవేళ ఈ లక్షణాలు మీలో కనిపించి ఉంటే.. మీ వ్యాధినిరోధక వ్యవస్థ సామర్ధ్యాన్ని కోల్పోతుందని సంకేతంగా గమనించాలి. ఆరోగ్యంగా ఉండాలంటే బలమైన రోగనిరోధక శక్తి చాలా అవసరం. అది బలహీనమయ్యే కొద్దీ రకరకాల అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి.

Garlic Lemon Juice Reduce Cholesterol Health Tips in Telugu
Garlic Lemon Juice Reduce Cholesterol ( Photo Credit : Google )

తాజా పరిశోధనల ప్రకారం.. అందరి ఇంట్లో సాధారణంగా ఉండే వెల్లుల్లి, తేనె కలిపి రెండింటిని తీసుకోవడం వల్ల మీ వ్యాధినిరోధకశక్తి మెరుగుపడుతుంది. ఇంతకీ ఈ వెల్లుల్లి, తేనెను ఎలా తీసుకోవాలంటే.. రెండు వెల్లుల్లి రెబ్బల్ని మెత్తగా పేస్ట్ చేయాలి. ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల తేనె కలపాలి. దీన్ని ప్రతి రోజు ఉదయాన్నే ఖాళీ కడుపుతో క్రమం తప్పకుండా ఏడు రోజుల పాటు తీసుకోవాలి. దాంతో కొద్దిరోజుల్లోనే అనేక అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు అంటున్నారు నిపుణలు.

వెల్లుల్లి, తేనెతో ప్రతిరోజూ ఇలా చేస్తే.. :

వెల్లుల్లి తేనె మిశ్రమాన్ని ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. ఎలాంటి వ్యాధులు దరిచేరకుండా అరికడుతుంది. వెల్లుల్లి మిశ్రమాన్ని రోజూ తీసుకోవడం వల్ల ధమనుల్లో ఏర్పడే ఫ్యాట్ తొలగించి గుండెకు రక్తప్రసరణను వేగంగా జరగడానికి సాయపడుతుంది. రక్తం గడ్డకట్టడంతో పాటు ఇన్ఫెక్షన్ రాకుండా నివారిస్తుంది. ఇందులో యాంటీ ఇన్ఫిమేటరీ గుణాలు ఉండటం వల్ల వాపును తగ్గిస్తుంది. ఎంత పవర్‌ఫుల్ అని చెప్పవచ్చు జీర్ణ వ్యవస్థకు సంబంధించిన ఎలాంటి వ్యాధినైనా నయం చేసే శక్తి ఈ వెల్లుల్లి, తేనె మిశ్రమానికి ఉంది. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ నేచురల్ గుణాలు ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది.

వెల్లుల్లి మిశ్రమాన్ని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల జలుబు, సైనసైటిస్ వంటి ఇతర అలర్జీ సమస్యలను కూడా నివారించుకోవచ్చు. వెల్లుల్లి తేనె ప్రతిరోజూ తీసుకోవడం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్లను కూడా నివారించవచ్చు. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉండటం వల్ల శరీరంలో ఏర్పడే ఎలాంటి బ్యాక్టీరియా నైనా నాశనం చేస్తుంది.

వెల్లుల్లి రెబ్బలను పేస్టుతో తేనె కలిపిన మిశ్రమాన్ని ప్రతిరోజూ క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా శరీరంలోని విష పదార్థాలను బయటకు నెట్టివేస్తుంది. అంతేకాదు.. శరీరంలో పేరుకుపోయిన వ్యర్థ, మలినాలను ఇతరేతర వ్యాధికారి క్రిములను నాశనం చేసి బయటకు పంపేయడంలో ఈ మిశ్రమం అద్భుతంగా పనిచేస్తుంది. దాంతో మనం ఎంతో ఆరోగ్యంగా ఉండేందుకు సాయపడుతుంది.

Read Also : Vitamin D deficiency : శరీరంలో విటమిన్ డి లోపిస్తే ఏమౌతుంది? లక్షణాలను ఎలా గుర్తించాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి!