Gold Rates Today May 23, 2024 : బంగారం కొనేందుకు చూస్తున్నారా? దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసా? అంతర్జాతీయ మార్కెట్, దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఈరోజు ( మే 23, 2024)న ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. గతకొన్ని రోజులుగా వడ్డీ రేట్ల తగ్గింపు సంకేతాల నేపథ్యంలో డాలర్ బలహీనపడటం కారణంగా బంగారం ధరలు ఒక్కసారిగా రికార్డు స్థాయికి చేరుకున్నాయి. గత నెల ఏప్రిల్‌లో కూడా బంగారం ఆల్ టైమ్ రికార్డు స్థాయిని చేరుకున్నాయి.
బంగారం ధరలు పెరిగిన సమయంలోనే వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. ఒకానొక సందర్భంలో వెండి ధర మాత్రం లక్ష దాటింది. మార్కెట్ విశ్లేషుకులు సైతం బంగారం ధర మరింత కొండెక్కుతుందని అంచనా వేశారు. కానీ, బంగారం ధరల ర్యాలీకి ఒక్కసారిగా ఫుల్ స్టాప్ పడింది. మే 22 (బుధవారం) కూడా బంగారం ధరల్లో ఎలాంటి మార్పు లేదు. కానీ, అంతర్జాతీయ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పెరిగాయి.
దేశీయ బులియన్ మార్కెట్లో మాత్రం బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఔన్సుకు 2,420 డాలర్ల నుంచి భారీగా తగ్గింది. దాదాపు ఇప్పుడు 50 డాలర్ల వద్ద కొనసాగుతోంది. 2,370 డాలర్ల స్థాయిలో కొనసాగుతోంది. అదే సమయంలో వెండి ధరలు కూడా 30.52 డాలర్లకు చేరుకుంది. డాలర్ విలువతో పోలిస్తే.. రూపాయి మారకం విలువ 83.278 వద్ద ట్రేడ్ అవుతోంది. దేశీయంగా బంగారం రేట్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
Gold Rates Today May 23, 2024 : తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలివే :
తెలంగాణలోని హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల (22క్యారెట్లు) ధర రూ.67,300 వద్ద కొనసాగుతోంది. నిన్న అదే బంగారం ధర రూ.68,300 వద్ద ఉండగా.. వెయ్యి వరకు తగ్గింది. ప్రస్తుతానికి బంగారం ధర స్థిరంగా కొనసాగుతోంది. గత రెండు రోజుల క్రితం బంగారం ధర రూ.68,900 ఆల్ టైమ్ గరిష్ట స్థాయిని చేరుకుంది.
24 క్యారెట్ల బంగారం ధర విషయానికి వస్తే.. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర రూ.73,420గా ఉంది. నిన్నటితో ధర రూ.74,510 ఉండగా.. రూ. 1,090కు దిగజారింది. అదేవిధంగా హైదరాబాద్ మార్కెట్లో ఈరోజు కిలో వెండి ధర రూ.97వేలుగా ఉంది. నిన్నటి వెండి ధర రూ.1,00,300 నుంచి దాదాపుగా రూ.3,300 వరకు దిగజారింది.
విజయవాడలో బంగారం, వెండి ధరలివే :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడలో ఈరోజు 10గ్రాముల (22 క్యారెట్లు) బంగారం ధర రూ. 67,300గా ఉంది. నిన్న బంగారం ధర రూ.63,800 నుంచి రూ. వెయ్యి తగ్గింది. అలాగే, 24 క్యారెట్లు 10గ్రాముల బంగారం ధర ఈరోజు రూ.73,420 ఉండగా, నిన్నటి ధర రూ.74,510 నుంచి రూ.1,090కు తగ్గింది. అదేవిధంగా, విజయవాడలో ఈరోజు కిలో వెండి ధర రూ.97వేలుగా ఉంది. నిన్న వెండి ధర రూ.1,00,300 నుంచి రూ.3,300కు తగ్గింది.
విశాఖలో బంగారం, వెండి ధరలివే :
ఏపీ నగరమైన విశాఖపట్నంలో కూడా ఈరోజు 22 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ. 67,300 వద్ద ఉంది. నిన్న రూ.68,300 నుంచి రూ. వెయ్యి వరకు తగ్గింది. అలాగే, 24 క్యారెట్లు (10 గ్రాములు) బంగారం ధర రూ. 73,240 వద్ద కొనసాగుతోంది. నిన్నటి బంగారం ధర రూ.74,510 నుంచి రూ. వెయ్యి వరకు తగ్గింది.
Gold Rates Today : ఢిల్లీ, ముంబై నగరాల్లో నేటి బంగారం, వెండి ధరలివే :
దేశ రాజధాని నగరమైన న్యూఢిల్లీలో ఈరోజు బంగారం స్థిరంగానే కొనసాగుతున్నాయి. 22 క్యారెట్లు 10గ్రాముల బంగారం ధర రూ.67,450గా ఉంది. నిన్న బంగారం ధర రూ.68,450 నుంచి రూ.వెయ్యి తగ్గింది. అలాగే, 24 క్యారెట్లు తులం బంగారం ధర రూ.73,570గా ఉంది. నిన్న బంగారం ధర రూ.74,660 నుంచి రూ.1,090కు తగ్గింది. ఢిల్లీలో ఈరోజు కిలో వెండి ధర రూ.92,500గా ఉంది. నిన్న వెండి ధర రూ.95,800 నుంచి రూ. 3,300కు తగ్గింది.
చెన్నై నగరంలో ఈరోజు 10 గ్రాముల (22క్యారెట్లు) బంగారం ధర రూ. 67,500గా ఉంది. నిన్నటి బంగారం ధర రూ.74,840 నుంచి రూ.1,100కు తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,640గా కొనసాగుతోంది. నిన్న బంగారం ధర రూ.78,840 నుంచి రూ.1,200కు తగ్గింది. అదేవిధంగా, చెన్నైలో కిలో వెండి ధర రూ.97వేలుగా ఉంది. నిన్న వెండి ధర రూ. 1,00,300 నుంచి రూ.3,300కు తగ్గింది.

ముంబైలో ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 22 క్యారెట్లు 10గ్రాముల బంగారం ధర రూ.67,300గా కొనసాగుతుంది. నిన్నటి బంగారం ధర రూ. 68,300 నుంచి రూ.వెయ్యి వరకు తగ్గింది. 24 క్యారెట్లు 10గ్రాముల బంగారం ధర రూ.73,420గా ఉంది. నిన్నటి బంగారం ధర రూ.74,510 నుంచి రూ.1,090కు తగ్గింది. ముంబైలో కిలో వెండి ధర రూ. 92,500గా ఉంది. నిన్నటి వెండి ధర రూ.95,800 నుంచి రూ.3,300కు తగ్గింది.
పూణేలో ఈరోజు బంగారం ధర 22 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ. 6829, 24 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ. 7450గా ఉంది. కోల్‌కతాలో ఈరోజు బంగారం ధర 22 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ. 6829, 24 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ. 7450 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో ఈరోజు బంగారం ధర 22 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ. 6829, 24 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ. 7450కు అందుబాటులో ఉంది. గురుగ్రామ్‌లో ఈరోజు బంగారం ధర 22 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ. 6844, 24 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ. 7465గా ఉంది.
లక్నోలో ఈరోజు బంగారం ధర 22 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ. 6844, 24 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ.7465గా ఉంది. అహ్మదాబాద్‌లో ఈరోజు బంగారం 22 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ. 6834, 24 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ. 7455గా ఉంది. జైపూర్‌లో ఈరోజు బంగారం 22 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ. 6844గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ. 7465గా ఉంది.
థానేలో ఈరోజు బంగారం 22 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ. 6829, 24 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ. 7450గా ఉంది. నాగ్‌పూర్‌లో ఈరోజు బంగారం ధర 22 క్యారెట్లు గ్రాముకు రూ. 6829, 24 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ. 7450 నుంచి అందుబాటులో ఉంది. సూరత్‌లో ఈరోజు బంగారం ధర 22 క్యారెట్లు బంగారం గ్రాముకు రూ. 6834, 24 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ. 7455గా ఉంది.