TDP Woman Fan Back Chandrababu Naidu CM ( Image Source : Google )
Telangana Woman : టీడీపీ అధినేత చంద్రబాబు విషయంలో ఐదేళ్లు గ్రామానికి దూరంగా ఉండి తన పంతం నెగ్గిన తర్వాత ఊరికి వచ్చిన మహిళకు ఘన స్వాగతం లభించింది. ఈ ఘటన ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం కేశవాపురం గ్రామంలో చోటుచేసుకుంది. ఆంధప్రదేశ్‌లో నారా చంద్రబాబు నాయుడు సీఎం అయ్యాకే తాను పుట్టింటికి వస్తానని ఐదేళ్ల క్రితమే పంతం పట్టింది విజయలక్ష్మి.
ఇప్పుడు తన పంతం నెగ్గడంతో ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం కేశవాపురంలోని తన పుట్టింటికి వచ్చింది. కేశవాపురం గ్రామానికి చెందిన కట్టా గోపయ్య, సౌభాగ్యమ దంపతులకు నాలుగో కుమార్తె విజయలక్ష్మి. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాటి చెందిన పెద్దనాటి నరసింహరావుతో ఆమెకు వివాహమైంది. అయితే విజయలక్ష్మి తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయారు.
కేశవపురంలో తల్లిదండ్రుల నివాసంలోనే ఉంటున్న ఆమె తోబుట్టు వద్దకు విజయలక్ష్మి అప్పుడప్పుడూ వస్తుంటారు. ఈ క్రమంలో ఐదేళ్ల కిందట తన ఇద్దరు కుమారులతో కలిసి ఊరికి వచ్చిన ఆమెకు అక్క కొడుకు తాళ్లూరు ప్రసాద్‌కు మధ్య రాజకీయంగా విభేదాలు తలెత్తాయి.
చంద్రబాబు సీఎం అవుతారని ఆమె అంటే.. జగన్ అధికారంలోకి వస్తారని ప్రసాద్ అంటూ ఇద్దరు గట్టిగానే వాదించుకున్నారు. ఆనాడు జగన్ సీఎం కావడంతో టీడీపీ అధికారంలోకి వస్తేనే మళ్లీ తాను ఊర్లోకి వస్తానని ఆమె పంతం పట్టింది. ఇన్నాళ్లు పుట్టింటిలో ఎలాంటి కార్యక్రమాలు జరిగినా కూడా విజయలక్ష్మి హాజరు కాలేదు.
తాజాగా చంద్రబాబు సీఎంగా బాధ్యతలు స్వీకరించడంతో ఆమె గ్రామానికి వచ్చింది. బంధువులు, కుటుంబ సభ్యులు స్థానిక టీడీపీ అభిమానులు ఆమెకు ఘనస్వాగతం పలికారు. గ్రామ బస్టాండ్ కూడాలిలోని ఎన్టీఆర్ విగ్రహానికి కూడా ఆమె నివాళులర్పించారు.
Read Also : CM Chandrababu Salary : ఆంధ్రప్రదేశ్ సీఎంగా చంద్రబాబు నాయుడు నెల జీతం ఇదేనట!
This website uses cookies.