CM Chandrababu Salary : ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన, బీజేపీతో జతకట్టి కూటమిగా ఎన్నికల్లో పోటీ చేసింది. ఈ ఎన్నికల్లో భారీ మేజార్టీతో 164 సీట్లను గెలుచుకుని వైసీపీని గద్దె దింపి టీడీపీ అధికారంలోకి వచ్చింది. కొద్దిరోజుల క్రితమే టీడీపీ కొత్త ప్రభుత్వం కొలువుదీరింది.
ఏపీ కొత్త సీఎంగా చంద్రబాబు అధికార పీఠాన్ని అధిరోహించగా, జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎంగా, ఇతర నేతలు మంత్రులుగా బాధ్యతలు చేపట్టారు. అయితే, ఇప్పుడు ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అసలు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎంత వేతనం ఉంటుంది. నెలకు వారికి వచ్చే జీతం అనేది చర్చ నడుస్తోంది. ఏపీ సీఎంగా చంద్రబాబు నెల జీతం ఎంత ఉంటుంది అనేది తెలుసుకోవాలనే ఆసక్తి పెరిగింది.
CM Chandrababu Salary : నాల్గోసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు అధికారంలోకి..
గతంలోనే మూడు సార్లు సీఎంగా కొనసాగిన చంద్రబాబు.. నాల్గోసారి కూడా ఆయన సీఎం పదవిని దక్కించుకున్నారు. ఏపీకి రెండు సార్లు సీఎంగా చేసిన ఆయన రాష్ట్ర విభజన అనంతరం నవ్యాంధ్రకు మొదటి ముఖ్యమంత్రిగా తన బాధ్యతలు నిర్వర్తించారు. 2024 ఎన్నికల్లో భారీ విజయంతో నవ్యాంధ్రకు రెండోసారి కూడా ముఖ్యమంత్రి అయ్యారు. ఈ క్రమంలోనే సీఎంగా చంద్రబాబు జీతం నెలకు ఎంత ఉంటుంది అనేది చర్చ నడుస్తోంది.

దేశంలో ప్రధానమంత్రి నుంచి సీజేఐ, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, కేంద్ర మంత్రుల వరకు అందరికి నెలకు ఒక్కో రకమైన జీతం ఉంటుంది. అలాగే, రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా అందరిలానే నెలకు వేతనం అందుకుంటారు. అందులోనూ ప్రతి రాష్ట్రానికి ముఖ్యమంత్రుల నెలవారీ వేతనం ఒక్కోలా ఉంటుంది. ఒక రాష్ట్రంలో ఒక సీఎం జీతం తక్కువగా ఉంటే.. మరో రాష్ట్రంలో సీఎం జీతం అంతకన్నా ఎక్కువగా ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే.. రాష్ట్ర సీఎంగా చంద్రబాబు జీతం నెలకు రూ. 3.35 లక్షలు అంట.. అంటే.. ఇందులో సీఎం పదవితో పాటు ఒక ఎమ్మెల్యేగా కూడా జీతం కలిపి అందుకుంటారు. అంతేకాదు.. రాష్ట్ర సీఎంలకు కాన్వాయి, బస, సెక్యూరిటీ ఉంటుంది. ఒక రాష్ట్ర సీఎంగా దేశంలో ఎక్కడికైనా అలాగే, విదేశాల్లో ఎక్కడికైనా వెళ్లేందుకు సదుపాయం కలిగి ఉంటారు. ప్రభుత్వ ఆధ్వరంలో నడిచే హెలికాఫ్టర్లు కూడా వినియోగించుకోవచ్చు.
Read Also : Money Remedies : డబ్బులు ఇలా లెక్కపెడుతున్నారా? ఈ తప్పులు అసలు చేయొద్దు.. లక్ష్మీదేవి ఇంట్లో ఉండదు!