Categories: Latest NewsTechnology

Airtel Prepaid Pack : ఎయిర్‌టెల్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఈ ప్రీపెయిడ్ ప్యాక్‌పై అన్‌లిమిటెడ్ డేటా.. కేవలం ధర రూ. 9 మాత్రమే!

Airtel Prepaid Pack : మీరు ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ యూజరా? అయితే, మీకోసం అద్భుతమైన ఆఫర్ అందుబాటులో ఉంది. ఎయిర్‌టెల్ కేవలం రూ. 9కి అన్‌లిమిటెడ్ డేటాను అందించే ప్రీపెయిడ్ ప్యాక్‌ను రిలీజ్ చేసింది. మీరు చదివింది నిజమే. కేవలం రూ. 9కే అపరిమిత డేటాను పొందవచ్చు.

రూ. 9కు అన్‌లిమిటెడ్ డేటా :
మీకు అన్‌లిమిటెడ్ డేటాను అందిస్తుంది. ఎక్కువ ఖర్చు లేకుండా తక్కువ డేటాను పొందవచ్చు. ఈ ప్యాక్ వ్యాలిడిటీ కేవలం ఒక గంట మాత్రమే. మీరు పూర్తి 60 నిమిషాల పాటు అన్‌లిమిటెడ్ డేటాను పొందవచ్చు.

10జీబీ తర్వాత డేటా స్పీడ్ ఎంతంటే? :
డేటా స్పీడ్ గంటకు 10జీబీ వరకు వస్తుంది. గంటలోపు 10జీబీ మార్క్‌ని దాటిన తర్వాత స్పీడ్ గణనీయంగా 64Kbpsకి పడిపోతుంది. ఈ తగ్గిన వేగంతో ఇప్పటికీ మెసేజింగ్, సాధారణ బ్రౌజింగ్ వంటి ప్రాథమిక ఇంటర్నెట్ సర్వీసులను ఉపయోగించగలరు. కానీ, వీడియోలు లేదా పెద్ద ఫైల్‌లను డౌన్‌లోడ్ చేయలేరు.

Airtel Prepaid Pack : ఈ ప్యాక్‌ను ఎప్పుడు ఉపయోగించాలి? :

ఈ ప్యాక్ ఎలాంటి పరిస్థితుల్లోనైనా వినియోగించుకోవచ్చు. వై-ఫై లేని ప్రదేశంలో కూడా సులభంగా వినియోగించుకోవచ్చు. క్షణాల్లోనే లార్జ్ ఫైల్‌ను డౌన్‌లోడ్ చేయాలి లేదా హై క్వాలిటీ గల వీడియోను వీక్షించవచ్చు.మీ డేటా కనెక్షన్‌ని స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో షేర్ చేసుకోవచ్చు. గంట అంతరాయం లేని ఇంటర్నెట్ బ్రౌజింగ్‌ను పొందవచ్చు. ఈ పరిస్థితులలో రూ.9 ప్యాక్ లైఫ్‌సేవర్‌గా ఉంటుంది.

Airtel prepaid pack offers  ( Image Source : Google )

ఎలా యాక్టివేట్ చేయాలి? :
ఈ ప్యాక్‌ని యాక్టివేట్ చేయడం చాలా సులభం. మీరు ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్ ద్వారా లేదా ఎయిర్‌టెల్ వెబ్‌సైట్‌ని విజిట్ చేయడం ద్వారా యాక్టివేట్ చేయవచ్చు. రూ. 9 ప్యాక్‌ని ఎంచుకుని పేమెంట్ చేయండి.మీరు ప్యాక్‌ను యాక్టివ్ చేసిన వెంటనే డేటా ప్రారంభం అవుతుంది. ఆ గంటను సద్వినియోగం చేసుకోవడానికి రెడీగా ఉన్నారని నిర్ధారించుకోండి.

డేటా ప్యాక్ విలువైనదా? :
కేవలం రూ. 9కే ఈ ప్యాక్ హై-స్పీడ్ డేటాను పొందవచ్చు. దీర్ఘకాలిక ఉపయోగానికి సరికాదు. గంట వ్యవధిలో నిర్దిష్ట డేటా సరిపోతుంది. డేటా వినియోగాన్ని గరిష్టంగా ఉపయోగించవచ్చు. మీకు డేటా కావాలని భావిస్తే.. ఎయిర్‌టెల్ రూ. 9 ప్రీపెయిడ్ ప్యాక్ బెస్ట్ ఆప్షన్ చెప్పవచ్చు. గంట అన్‌లిమిటెడ్ ఇంటర్నెట్‌ని పొందవచ్చు.

Read Also : Kalki 2898 AD Trailer : ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండుగే.. కల్కీ 2898 ఏడీ మూవీ ట్రైలర్ చూశారా..? ఫైనల్ వార్ అదిరింది..!

Share
Published by
OTN

This website uses cookies.