Kalki 2898 AD Trailer : ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండుగే.. కల్కీ 2898 ఏడీ మూవీ ట్రైలర్ చూశారా..? ఫైనల్ వార్ అదిరింది..!

Kalki 2898 AD Trailer Release : పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ మూవీ ట్రైలర్ వచ్చేసింది. ఈ నెల 21 రాత్రి 8.45 గంటలకు కల్కీ ట్రైలర్ రిలీజైంది. ఫస్ట్ ట్రైలర్ కన్నా ఈ ట్రైలర్ అత్యంత అద్భుతంగా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. ఉంది. ఫైనల్ వార్.. మూవీ రిలీజ్‌కు 6 రోజుల ముందు ఈ ట్రైలర్ రిలీజ్ చేశారు మూవీ మేకర్స్.

ఈ ట్రైలర్‌లో డార్లింగ్ ప్రభాస్, అమితాబ్ మధ్య ఫైట్ సీన్ ఆద్యంతం కట్టిపడేసేలా ఉన్నాయి. బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకునె కడుపులో భగవంతుడు ఉన్నాడని అమితాబ్ బచ్చన్ అంటాడు. ఆ బిడ్డను ఎలాగైనా చంపేందుకు ప్రత్యర్థులు ప్రయత్నిస్తుంటారు. ఆ ప్రయత్నాలను అడ్డుకోవడంలో అశ్వత్థామగా అమితాబ్ అడ్డుగా నిలుస్తాడు.

అతడి అడ్డును తొలగించడానికి భైరవగా ప్రభాస్ సూపర్ ఫైట్ చేస్తాడు. వీరిద్దరి ఫైట్, కళ్లు చెదిరేలా విజువల్స్ కనిపించాయి. ఈ కల్కీ ట్రైలర్ అవతార్ మాదిరిగా భారీ రోబోతో ఫైట్ చేయడం ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటుంది. కల్కి 2898 ఏడీ మూవీలో దీపిక కడుపులో ఉన్న బిడ్డ ఇంతకీ ఎవరు? బిడ్డ బయటకు రాకుండా ప్రయత్నించేది ఎవరు? భైరవ వారికి సాయం చేయడానికి గల కారణమేంటి? ఇదంతా కల్కీ యుద్ధంలో అద్భుతంగా విజువల్స్ ఉన్నాయి. ఫైనల్‌గా ఈ కల్కీ మూవీలో ఎవరిది గెలుపు? ఇలా అనేక ప్రశ్నలకు సమాధానం మూవీతో లభించనుంది.

Kalki 2898 AD Trailer : రెండు గంటలు ఆలస్యంగా కల్కీ మూవీ ట్రైలర్ రిలీజ్

ప్రపంచవ్యాప్తంగా ఈ జూన్ 27వ తేదీన కల్కీ 2898 ఏడీ మూవీ థియేటర్లలో ముందుకు రాబోతోంది. కల్కి 2898 ఏడీ మూవీ 3 గంటల 56 సెకన్ల నిడివితో రానుంది. ఒక్క మాటలో చెప్పాలంటే అతి పెద్ద మూవీ కూడా. ఇటీవలే సెన్సార్ పనులు పూర్తి అయ్యాయి. యూ/ఎ సర్టిఫికెట్ కూడా వచ్చింది.

మూడు ప్రపంచాలతో జరిగే ఈ పోరాట దృశ్యాలు 3 గంటల పాటు ప్రేక్షకులను ఆలరించనున్నాయి. కల్కీ మూవీ రన్ టైమ్ ఎక్కువగా ఉండటం సినిమాకే మైనస్ అవుతుందా? అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. కాంప్లెక్స్, కాశీ, శంబాలా అనే 3 వేర్వేరు ప్రపంచాలను సృష్టించిన కథే ఈ కల్కి 2898 ఏడీ మూవీగా దర్శకుడు నాగ్ అశ్విన్ చూపించబోతున్నారు.

వాస్తవానికి, కల్కి 2898 ఏడీ మూవీ ట్రైలర్ షెడ్యూల్ ప్రకారం.. ఈరోజు సాయంత్రం 6 గంటలకే విడుదల కావాల్సి ఉంది. కానీ, మూవీ మేకర్స్ 2 గంటలు ఆలస్యంగా రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా”సారీ డార్లింగ్స్.. ఫైనల్ వార్ కదా.. కాస్త వెయిట్ చేయక తప్పదు.. ప్లీజ్.. 8 గంటలకు షార్ప్ టైమ్” అంటూ ఎక్స్ వేదికగా అభిమానులకు తెలియజేసింది చిత్ర యూనిట్.

ఆ సమయానికి కూడా కల్కీ మూవీ ట్రైలర్ రిలీజ్ కాలేదు. అరగంట తర్వాత కూడా దేనిపై ఎలాంటి సమాచారం లేదు. చివరికి రాత్రి 8.45 గంటలకు కల్కీ మూవీ రిలీజ్ ట్రైలర్ రిలీజ్ అయింది. ప్రభాస్ ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు.

Read Also : Sooseki Song Lyrics : ‘సూసేకి అగ్గిరవ్వ మాదిరే’ పాట లిరిక్స్.. సూపర్ సాంగ్ రాశారుగా చంద్రబోస్..!