Jaggery Remedy : బెల్లంతో ఏయే పరిహారాలు చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసా? బెల్లంతో కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు చేయడం ద్వారా మీకున్న అన్ని సమస్యలను ఎలా తొలగించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. పరిహార శాస్త్రంలో బెల్లం ముక్కకు విశేషమైన ప్రాధాన్యత ఉంది. బెల్లం ముక్క ఉపయోగించి అనేక పరిహారాలు పాటించడం ద్వారా మీ జీవితంలో అనేక సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు.
ఎవరైనా సరే.. ఉద్యోగంలో తొందరగా ప్రమోషన్ రావాలన్నా కోరుకున్న చోటికి బదిలీతో పాటు ప్రమోషన్ రావాలన్నా ఒక అద్భుతమైన పరిహారం చేయాలి. ప్రతిరోజు రాగి చెంబులో నీళ్లు తీసుకుని ఆ నీళ్లల్లో 21 ఎండు మిరపకాయ విత్తనాలు వేసి ఒక బెల్లం ముక్క వేసి తూర్పు వైపు తిరిగి సూర్యుడుకి ఆర్జ్యం ఇస్తూ ఆ నీళ్లు మొక్కలో పోయాలి. ఇలా బెల్లం ముక్క, ఎండు మిరపకాయ విత్తనాలు కలిపి నీళ్ళతో రోజు సూర్యుడికి ఆర్జమిస్తే.. కోరుకున్న చోటికి ప్రమోషన్‌తో పాటు ట్రాన్స్‌ఫర్ కూడా లభిస్తుంది.
తొందరగా ఇల్లు కొనుక్కోవాలన్నా తొందరగా స్థలంగా కొనుక్కోవాలన్నా తొందరగా పొలం కొనుక్కోవాలన్నా వాటికి ఆటంకాలు వస్తూ ఉంటే.. మీ స్థలం లేదా ఇంటి స్థలము తొందరగా కొనుక్కోవటానికి ఒక పవర్ ఫుల్ పరిహారం చేయాల్సి ఉంటుంది. మీకు కావాల్సిన రేట్‌కి మీకున్న ప్లాట్ అమ్మాలన్నా సైట్ అమ్మాలన్నా ల్యాండ్ లేదా హౌస్ గాని ఏదైనా మీకు కావాల్సిన రేటుకు అమ్మాలి అన్నా కూడా బెల్లానికి సంబంధించి ఈ పరిహారం చేయడం ద్వారా అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు.
ఇంతకీ, ఆ పరిహారం ఏంటంటే.. మంగళవారం రోజు.. మీ ఇంటి ముందు కొద్దిగా మట్టిని తవ్వండి. ఆ మట్టి లోపల ఒక 1/2 కేజీ బెల్లం లేదా కేజీ బెల్లం పాతిపెట్టి మట్టి కప్పేయండి. అలా చేస్తే.. తొందరలోనే మీరు సైట్ కొనుక్కోవాలని కోరిక నెరవేరుతుంది. ల్యాండ్, పొలం కొనుక్కోవాలని కోరిక నెరవేరుతుంది. అలాగే, మీకు తొందరగా స్థలానికి మంచి రేటు వచ్చి ల్యాండ్ గాని ఫ్లాట్ గాని అమ్ముడు పోవాలన్నా కూడా మంగళవారం రోజు ఈ ప్రత్యేకమైన విధివిధానం పాటించాలి. అది కూడా మంగళవారం ఉదయం 6 నుంచి 7 మధ్యలో మీ ఇంటి ముందు మట్టి కొద్దిగా తవ్వి ఒక హాఫ్ కేజీ లేదా ఒక కేజీ బెల్లం అక్కడ ఉంచాలి. ఆ బెల్లం పాతిపెట్టి మట్టి కప్పివేయండి. అప్పుడు తొందరగా ల్యాండ్ ఇష్యూ ప్రాపర్టీస్‌లో మీకు సక్సెస్ వస్తుంది.
Jaggery Remedy : బెల్లంతో ఆదివారం ఇలా చేశారంటే అన్ని పనుల్లో విజయం..
అంతేకాదు.. రియల్ ఎస్టేట్‌లో బాగా సక్సెస్ రావాలంటే.. రియల్ ఎస్టేట్ డీల్స్ బాగా జరగాలంటే.. రియల్ ఎస్టేట్లో విపరీతంగా డబ్బులు సంపాదించాలంటే.. మంగళవారం పూట నానబెట్టిన కందులతో పాటు బెల్లం ముక్క ఆవుకి ఆహారంగా తినిపించాలి. అలా తినిపిస్తే.. రియల్ ఎస్టేట్‌లో బ్రహ్మాండమైన సక్సెస్ వస్తుంది. అలాగే, పొలిటికల్‌గా ఎదగాలంటే రాజకీయంగా బాగా అభివృద్ధి సాధించాలన్నా.. గవర్నమెంట్ జాబు రావాలన్నా.. గవర్నమెంట్‌లో ఏదో ఒక విధంగా జాబ్ తొందరగా తెచ్చుకోవాలంటే కూడా ఈ పరిహారం అద్భుతంగా పనిచేస్తుంది.

అలాగే మీకు తరతరాలుగా ఆస్తులుంటే.. తరతరాలుగా రావలసిన ఆస్తులతో పాటు మీకు ఇంకా రావట్లేదు.. మీకు రావలసిన భూమి గానీ ఇల్లు గానీ ఉంది. అది తొందరగా రావట్లేదని భావిస్తే.. తొందరగా రావటానికి ఆదివారం పూట ఆవుకి బెల్లం ముక్క తినిపించాలి. ఆదివారం ఆవుకి బెల్లం ముక్క పెడుతూ ఉంటే.. మీకు తరతరాలుగా రావాల్సిన ప్రాపర్టీస్ తొందరగా వస్తాయి. గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా చక్కగా విజయవంతం చేసుకోవచ్చు.
అలాగే అసలు ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళేటప్పుడు అధికారులు కలుసుకొని మాట్లాడాల్సినప్పుడు లేదా ఒక జాబ్ కోసం అప్లికేషన్ పంపించాల్సినప్పుడు లేదా కోర్టు పరంగా ఒక వ్యక్తితో మాట్లాడాల్సినప్పుడు బెల్లం ముక్క నోట్లో వేసుకుని నవ్వుతూ వెళ్ళండి. అప్పుడు మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. ఇలా పరిహార శాస్త్రంలో బెల్లానికి విశేషమైన ప్రాధాన్యత ఉంది. బెల్లం ముక్క సంబంధించిన పరిహారాలు పాటించి అద్భుతమైన శుభ ఫలితాలను పొందండి.
Read Also : Money Remedies : డబ్బులు ఇలా లెక్కపెడుతున్నారా? ఈ తప్పులు అసలు చేయొద్దు.. లక్ష్మీదేవి ఇంట్లో ఉండదు!
