Money Remedies : డబ్బులు ఇలా లెక్కపెడుతున్నారా? ఈ తప్పులు అసలు చేయొద్దు.. లక్ష్మీదేవి ఇంట్లో ఉండదు!

Money Remedies : డబ్బు లెక్కపెట్టేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో తెలుసా? పొరపాటున మన చేతి నుంచి ఏమైనా వస్తువులు జారిపోతే ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయో తెలుసా? ఆ ఇబ్బందుల నుంచి బయట పడాలంటే ఎలాంటి పరిహారాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం. చాలామంది దగ్గర లక్ష్మీదేవి నిలబడకపోవటానికి కారణం ఏంటంటే.. డబ్బు లెక్కపెట్టేటప్పుడు కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. ఆ తప్పులు చేయడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లో నిలబడదు. చెంచలమైన లక్ష్మీదేవి ఇంట్లోంచి వెళ్ళిపోతుంది. ఆ తప్పుల్లో ముఖ్యమైన తప్పేంటంటే.. డబ్బులు ఎక్కడపడితే అక్కడ ఉంచకూడదు. చాలామంది బాత్రూంలో స్నానం చేసి పైన డబ్బులు పెడుతూ ఉంటారు. దానివల్ల లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది. డబ్బు నిలబడదు. ఆడవాళ్ళు అయితే వంటగదిలో పోపులు డబ్బాలు డబ్బులు పెడుతూ ఉంటారు.

వంట గదిలో ఆగ్నేయంలో ఒక చిన్న మట్టి కొండ పెట్టి దాంటో రాళ్ల ఉప్పు పోసి అందులో డబ్బులు దాచి పెట్టుకోండి. అప్పుడు క్రమక్రమంగా డబ్బు పెరుగుతుంది. అంతేగాని పోపులో డబ్బాల మాత్రం డబ్బులు ఎట్టి పరిస్థితుల్లో ఆడవాళ్లు దాచి పెట్టకూడదు. అలాగే చాలామంది ఏం చేస్తారంటే.. డబ్బులు లెక్కపెట్టేటప్పుడు ఉమ్మితో తడిచేస్తూ ఉంటారు. నోట్లో అతుక్కుపోతే లెక్కపెట్టడానికి ఇబ్బంది అని ఉమ్మితో తడి చేసి డబ్బులు లెక్కబెడుతూ ఉంటారు. అలా చేస్తే లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుంది. ఆ ఇంట్లో స్థిర లక్ష్మి నిలబడదు. డబ్బులు ఎప్పుడైనా నోట్లు అతుక్కుపోయినప్పుడు ఏదైనా పొడి తీసుకొని ఆ పొడి రాసి అతుక్కున్న నోట్లని తీసి డబ్బులు లెక్క పెట్టాలి. లేదంటే.. మన వేలికి నీళ్లు రాసుకోవాలి. మన వేలికి నీళ్లు రాసి తడి చేసుకొని అప్పుడు నోట్లు లెక్క పెట్టాలి.

అంతేగాని ఉమ్మి తడి చేసి డబ్బులు లెక్క పెట్టకూడదు. లక్ష్మీదేవి ఇంట్లో అసలు నిలబడదు. అలాగే, చాలామంది డబ్బులు దానం ఇచ్చేటప్పుడు విసిరినట్లుగా ఇస్తూ ఉంటారు. దేవాలయాల దగ్గర డబ్బులు దానం ఇచ్చేటప్పుడు పైనుంచి ఇలా విసిరేస్తుంటారు. అలా ఎప్పుడూ చేయకూడదు. ఎవరికైనా ఎప్పుడైనా దానం ఇచ్చేటప్పుడైనా డబ్బులు ఇచ్చేటప్పుడైనా జాగ్రత్తగా వంగి డబ్బులు ఇవ్వటం అనేది నేర్చుకోవాలి. అప్పుడే లక్ష్మీదేవి నిలబడుతుంది. విసిరేసినట్లుగా డబ్బులు వేస్తే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది. అలాగే ఎప్పుడైనా డబ్బులు నోటు కింద పడితే దాన్ని వెంటనే కలకద్దుకొని ‘ఓం శ్రీం శ్రీయే నమః’ అంటూ లక్ష్మీదేవిని స్మరించుకొని దగ్గర పెట్టుకోవాలి. కళ్ళకు అద్దుకోకుండా నోటు కింద పడినప్పుడు దగ్గర పెట్టుకోకూడదు. అలాగే ఒక్కొక్కసారి చెయ్యి జారి కొన్ని వస్తువుల కింద పడిపోతూ ఉంటాయి.

Money Remedies : డబ్బులు లెక్కపెట్టేటప్పుడు అందరూ చేస్తున్న తప్పులేంటో తెలుసా?

ఒక్కొక్కసారి ఇంట్లో ఉప్పు డబ్బా కింద పడిపోతుంది. ఉప్పు లక్ష్మీప్రదం. నవగ్రహాల్లో శుక్రుడు, చంద్రుడికి సంబంధించింది. ఉప్పు కింద పడిపోతే బలం తగ్గి భార్యాభర్తల మధ్య గొడవలు ఎక్కువ వస్తాయి. అలాంటప్పుడు ఏం చేయాలంటే.. శుక్రవారం పూట లక్ష్మీదేవిని గులాబీ పూలతో పూజిస్తూ లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవాలి. అప్పుడు శుక్రుడు బలం పెరుగుతుంది. లక్ష్మీ అష్టోత్తరం చదవడం వీలు కాకపోయినా శుక్రవారం లక్ష్మీదేవి దగ్గర అత్తమూలికా తైలంతో దీపాన్ని వెలిగించండి.

తామరవత్తులు వేసి దీపాన్ని వెలిగించండి. ఆ దోషం తొలగి పోతుంది. భగవంతుడు అనుగ్రహం తగ్గిపోయిందని అర్థం. అలాంటప్పుడు ఏం చేయాలంటే పూజ ఇంకా ఎక్కువ సేపు చేసుకోవాలి. ఒకసారి దేవాలయానికి వెళ్లి దేవాలయ ప్రాంగణాలు ఏదైనా స్తోత్రం చదువుకొని రావాలి. నూనె డబ్బా చేయిజారి కింద పడిపోతే అది ఆందోళనకు సంకేతం. అప్పులు పెరుగుతాయి. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఒక నూనె బాటిల్ మీ చేత్తో ఎవరికైనా దానం ఇచ్చేసేయాలి.

Money Remedies in Telugu And money attraction mantra tips
Money Remedies in Telugu ( Image Source : Google )

అప్పుడు ఆ దోషం పోతుంది. కుంకుమ కింద పడిపోతే భర్తకు అపమృత్యు దోషాలు వస్తాయి. ఆ దోషం పోవాలంటే ఒకసారి దుర్గాదేవి ఆలయంలో కుంకుమార్చన చేయించుకుని ఆ బొట్టు భర్త భార్య ఇద్దరు రోజు ధరించాలి. అలాగే ఒక్కొక్కసారి దేవుడికి పెట్టే దీపారాధనలు కుందులు చేజారి కింద పడిపోతూ ఉంటాయి. దీపారాధన కుందులు చేయి జారి కింద పడిపోతే.. ఆర్థిక ఆరోగ్య సమస్యలు కలగడానికి సూచనగా భావించాలి.

అలా జరగకుండా దీపారాధన కుందులకి అమావాస్య రోజు పూజ చేయాలి. అమావాస్య రోజు దీపారాధన కుందుల్ని చక్కగా పసుపు కుంకుమలతో అలంకరించి బొట్లు పెట్టి దీపారాధన కుందులకి పుష్పాలా అలంకరించి ఆ కుందులకే పుష్పాలతో పూజ చేస్తూ ‘ఓం దీపలక్ష్మి నమో నమః‘ ఇరవై ఒకసారి చదువుకోవాలి. దీపారాధన కుందులు కిందపడిన దోషం మొత్తం పోతుంది. ఈ తప్పుడు జరిగితే ఈ విధివిధానాలు తప్పక పాటించండి. డబ్బులు లెక్కపెట్టేటప్పుడు జాగ్రత్తలు పాటించి లక్ష్మి కటాక్షాన్ని పొందొచ్చు.

Read Also : Dharma Sandehalu Head Bath : ఆడవాళ్ళు వారంలో ఏ రోజు తలస్నానం చేయకూడదు? ఏ రోజు చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయంటే?