Varahi Navratri 2024 : వారాహిదేవి పూజ రాత్రి వేళలోనే ఎందుకు చేస్తారో తెలుసా? అమ్మవారిని ఇలా ఆరాధిస్తే అన్ని విజయాలే..!

0
34
Varahi Navratri 2024 Varahi Ammavari Puja Vidhanam in Telugu
Varahi Navratri 2024 ( Image Source : Google )

Varahi Navratri 2024 : వారాహి అమ్మవారిని వేకువజామున రాత్రివేళలో ఎక్కువగా పూజిస్తూ ఉంటారు. అతి ముఖ్యంగా రాత్రి వేళలోనే పూజలు చేస్తూ ఉంటారు. మన సనాతన ధర్మంలో విష్ణువుని ప్రాత: కాలంలో శివున్ని సాయంకాలంలో పూజించడం మంచిదని పురాణాలలో తెలిపారు. అదే విధంగా కొన్ని దేవతా ఆరాధనలు కొన్ని కొన్ని సమయాల్లో చేయడం వల్ల విశేషమైన ఫలితాలు ఉంటాయి.

అదే విధంగా వారాహిమాతను రాత్రి వేళలో పూజించడం వల్ల కొన్ని అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు. పురాణాల ప్రకారం.. శక్తికి 7 ప్రతిరూపాలే సప్తమాతృకలు. బ్రాహ్మణి, కౌమారి వైష్ణవి, మహేశ్వరి, ఇంద్రాణి, చాముండి, వారాహి పేర్లు ఉన్నాయి. కొన్ని నమ్మకాల్లో ఎనిమిదో మాత్రకలుగా నారసింపిని, మరికొన్ని సాంప్రదాయాలలో తొమ్మిదో మాతృకలుగా వినాయకుని మాత్రమే ఆరాధించి పూజలు చేయడం జరుగుతుంది. దుష్ట శిక్షణ – శిష్ట రక్షణ కాచేందుకు ఈ సప్త మాతృకలు సిద్ధంగా ఉన్నారు.

వారాహి దేవిని ఆరాధిస్తే.. సకల జయాలు :

వారాహిమాత తాంత్రికలకు ఇష్టమైన దేవత. అందుకే వారాహిమాతను రాత్రి వేళలో పూజిస్తారు. వారాహిమాత ముఖ్యదేవతదిగా ప్రతిష్టించిన ఆలయాలలో దర్శనం సైతం రాత్రి వేళలో లేదా తెల్లవారుజామున మాత్రమే ఉంటుంది. దేశంలో పలు ప్రాంతాలలో వారాహిమాత ఆలయాలు ఉన్నప్పటికీ చౌరాసి, ఒడిస్సా, వారణాసి మహిళాపురంలో ఉన్న ఆలయాలకు ప్రాధాన్యత ఎక్కువ. వారాహి దేవిని పూజించడం వలన శత్రు భయం ఉండదు. లలితాదేవికి సైన్యాధిపతిగా వారాహి దేవిని వర్ణిస్తారు. అందుకే, వారాహి అమ్మవారి ప్రస్తావన లలితా సహస్రనామంలో కూడా మనకు కనిపిస్తుంది.

లలితా దేవి తరుపున పోరాడేందుకు మాత్రమే కాకుండా భక్తులకు అండగా ఉండేందుకు కూడా ఒక గొప్ప యోధురాలుగా నిలుస్తుంది. వారాహి అమ్మవారు, వారాహి దేవిని ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్య అడ్డంకులన్నీ తొలగిపోతాయని శత్రుభయం ఉండదని జ్ఞానం సిద్ధిస్తుందని కుండలేని శక్తి జాగృతం అవుతుందని తరతరాలుగా ప్రగాఢ విశ్వాసం. వారాహి దేవి పేరు ఉన్న మూలమంత్రాలను అష్టోత్తరాలను పటిస్తే సకల జయాలు సిద్ధిస్తాయి. వారాహిదేవి అనుగ్రహం వల్ల అనారోగ్యం తొలగుతుంది.

Read Also : Gomatha Puja Benefits : గోమాతకి ఏ వారం ఎలాంటి ఆహారాన్ని పెడితే లక్ష్మీ కటాక్షం కలుగుతుందో తెలుసా?

ఓం శ్రీ పంచమ్యై నమః, వారాహి దేవి.. ఓం శ్రీ దండనాథాయై నమః,
ఓం శ్రీ సంకేతాయై నమః, ఓం శ్రీ సమయస్వరీ నమః,
ఓం శ్రీ సమయ సంకేతాయై నమః, ఓం శ్రీ వరాహ్యై నమః,
ఓం శ్రీ పోతున్యై నమః, ఓం శ్రీ శివాయ నమః,
ఓం శ్రీ వార్తాయై నమః, ఓం శ్రీ మహాసేనాయే నమః,
ఓం శ్రీ ఆజ్ఞా చక్రిస్వరీ నమః, ఓం శ్రీ అరిజ్ఞై నమః..

ఆషాడ నవరాత్రులు.. గుప్త నవరాత్రులు :
ఈ సందర్భంగా 9 రోజులు నవరాత్రి గుప్త నవరాత్రిగా పిలుస్తారు. అమ్మవారి వాహనం, వారాహి దేవి వాహనం దున్నపోతు. ఉగ్రంగా కనిపించిన ఈ అమ్మవారు తల్లి చల్లని తల్లి అంటే కరుణారస మూర్తి. అన్యాయంగా దౌర్జన్యంగా అక్రమాలకు గురికాకుండా కుటుంబాన్ని రక్షించేదే ఈ దేవత. ఎవరూ వచ్చి ఆక్రమించుకోకుండా సైన్యాధ్యక్షురాలుగా ఉంటుంది. ఎన్నో తరాల నుంచి అమ్మవారు ఉపాసన దేవత ఆరాధించబడుతుంది.

Varahi Navratri 2024 Varahi Ammavari Puja Vidhanam in Telugu
Varahi Navratri 2024 ( Image Source : Google )

ఈ వారాహి దేవి అమ్మవారు శ్రీలలితా త్రిపుర సుందరి సైన్యాధ్యక్షురాలు. ఈమెకు రాత్రి దేవత అని పేరు కూడా ఉంది. పేరు వినగానే చాలామంది భక్తి కన్న ముందు భయం అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఎందుకంటే చాలామందిలో అపోహర్ ఆమె క్షుద్ర దేవత అని చూడ్డానికి చాలా భయంకరంగా ఉంటుంది. ఆమె చూడ్డానికి భయంకరంగా ఉన్నా ఆమె చాలా కరుణామయం. ఆమెను చూసే విధానంలో మన మార్పు అనేది ఉంటుందన్నమాట.

Varahi Navratri 2024 : వారాహి అమ్మవారి పూజ ఏ సమయంలో చేయాలంటే? :

మన మనసులోనే ఆమె రూపాన్ని నింపుకొని ఆమెకు అమ్మ నువ్వే నాకు దిక్కు. నువ్వు తప్ప నాకు ఎవరు ఆదుకో ఆదుకోరు ఎవరూ లేరు అని చెప్పి మనస్ఫూర్తిగా ఎప్పుడైతే అమ్మని మనస్ఫూర్తిగా వేడుకుంటామో మన కష్టాలు తీర్చమని కోరుకుంటామో అమృతమూర్తి ఆ కష్టాలు అనేవి తప్పకుండా తీరుస్తుంది. అయితే, అమ్మవారిని పూజించడంలో ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే.. పూజ ఏ విధంగా చేయాలి. నైవేద్యం ఏ విధంగా సమర్పించాలి.

అలాగే ఏ సమయంలో మనం పూజ చేయాలి అనేది తప్పకుండా తెలుసుకోవాలి. అయితే, మనం ముఖ్యంగా ఏ సమయంలో పూజించాలంటే.. అమ్మవారికి ఉన్న పేరేంటి.. రాత్రి దేవత.. మనం ఎప్పుడూ కూడా ఈ పూజను సాయంత్రం 6 నుంచి 8 గంటల లోపల ఈ పూజ అనేది చేసుకోవాలి. ఆలస్యమైన పర్వాలేదు కానీ, సాయంత్రం 6 గంటల తర్వాత ఈ పూజను మొదలు పెట్టాలన్నమాట. ఈ పూజ ఎప్పుడు మొదలు పెట్టాలి అంటే శుక్లపక్షంలో వచ్చే పంచమి నాడు మొదలుపెట్టాలి.

Read Also : Devotional Stories : పాపాత్ములే సంతోషంగా ఎందుకు ఉంటారు? పార్వతి దేవి అడిగిన ప్రశ్నకు పరమేశ్వరుడు చెప్పిన రహాస్యం తెలిస్తే షాకవుతారు..!