Devotional Stories : పాపాత్ములైన మనుషులు సంతోషంగా ఎందుకు ఉంటారు? పార్వతి దేవి పరమేశ్వరుని అడుగుతుంది..! పార్వతి పరమేశ్వరుడు ఏకాంతంగా కైలాసంలో కూర్చొని ఉన్నారు . అప్పుడు పార్వతీదేవికి ఒక్క సందేహం వస్తుంది. పార్వతి దేవి పరమేశ్వరుడు అడుగుతుంది. స్వామి ఈ మూడు లోకాలను పాలిస్తూ ఉంటారు కదా.. ఈ కాలంలో ఇప్పుడు కూడా చెడ్డ పనులు చేసేవారు ఆపదలో ఉన్నవారికి ఎవ్వరికి సహాయం చేయనివారు.. వాళ్లే ఎందుకు సుఖ సంతోషంగా ఉంటున్నారు. వాళ్లు ధనవంతులు అవుతున్నారు ఎందుకు స్వామి అని అడుగుతుంది పార్వతి దేవి.. అప్పుడు పరమేశ్వరుడు నీకు సమాధానం చెప్తాను అని చెప్పి పార్వతి దేవిని పరమేశుడు భూలోకానికి తీసుకొని వస్తాడు. నడుస్తూ నడుస్తూ ఈ యాత్రలోనే నీ ప్రశ్నకు సమాధానం చెప్తాను అంటాడు. పార్వతి, పరమేశ్వరులు ఈ ఇద్దరు బ్రాహ్మణ రూపంలోకి మారిపోతారు.. దారిలో ఒక పోయిన వృక్షం కనిపిస్తుంది. ఇప్పుడు పార్వతీ పరమేశ్వరులు అడవి మార్గంగా వెళుతూ ఉంటారు.

ఆ అడవిలో ఒక వృక్షం ఉంది. ఆ వృక్షం భూమి లోపటికి ఉంటుంది. పైన కొంచెం ఎర్రలతోనే తో ఉంటుంది. మిగతాదంతా పడిపోయి ఉంటుంది. సాయంత్రం సమయం అది పరమేశ్వరుడికి పడిపోయిన వృక్షం కనిపించలేదు పరమేశ్వరుడు చూసుకోకుండా ఆవృక్షాన్ని పాదంతో తన్నడం వల్ల నేలపై కింద పడిపోతాడు. పాదానికి గట్టిగా దెబ్బ తగులుతుంది. రక్తం వస్తుంది. అప్పుడు అది చూసిన పార్వతీదేవి కంగారు పడుతుంది. చీర ముక్కను చించి రక్తం వచ్చే దగ్గర కడుతుంది. అప్పుడు పరమేశ్వరుడు ఆ వృక్షాన్ని ఏమీ అనుకుంటా నువ్వు విశాలంగా ఈ అడివిలో పెద్ద చెట్టుగా ఎదగాలని ఆ చెట్టుతో అంటాడు. పార్వతీ దేవికి ఏమీ అర్థం కాలేదు.. ఈ చెట్టు వల్లనే కదా కింద పడ్డాడు.. ఈ వృక్షానికి ఎందుకు సాయం చేస్తున్నాడు ఈ చెట్టు పెద్దగా అవమని చెప్తున్నారు..
సమయం వచ్చాక చెబుతానంటూ కైలాసానికి..
నీ మాయ ఏమిటి స్వామి నాకు అర్థం కాలేదు అని అంటుంది. అప్పుడు పరమేశ్వరుడు సమయం వచ్చినప్పుడు నీకు చెబుతాను పార్వతి దేవి ఇప్పుడు ఏమి మాట్లాడకుండా కైలాసానికి వెళ్ళిపోదాం అని అంటాడు. పార్వతీ పరమేశ్వరులు కైలాస పర్వతానికి వెళ్లిపోతారు.. కానీ పార్వతి దేవి భూలోకంలో జరిగిన గుర్తు వచ్చి ఆ వృక్షాన్ని ఎందుకు పెద్ద వృక్షం కావాలని అన్నారు అని పరమేశ్వరుని అడుగుతుంది.. ఈ ప్రపంచంలో మనుషులు పాపాత్ములైన మనుషులు.. అహంకారమైన మనుషులు.. దుష్ట స్వభావం మనుషులు… వీళ్లంతా ఎందుకు సుఖ సంతోషాలతో జీవిస్తున్నారు.. పార్వతీదేవితో పరమేశ్వరుని అంటున్నాడు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి కొంత సమయం పడుతుంది. కొంత సమయం వేచి ఉండాలి అని పార్వతి దేవితో అంటాడు.
విరిగిన చెట్టు అన్ని చెట్ల కన్నా పెద్ద చెట్టు కావాలని పరమేశ్వరుడు ఆశీర్వదించాడు కదా… ఆ వృక్షం కొద్దిరోజుల్ని పెద్ద చెట్టు అయింది. అడవిలోని చెట్లని చిన్నగా అయిపోయి అది పెద్దగా అయింది. మనుషులు ఎలా ఉన్నారంటే తమ దుష్ట స్వభావం ఉన్న వదులుకోలేకపోతున్నారు.. చెడు అలవాట్లను వదులుకోలేకపోతున్నారు.. తమ నీచత్వానికి చనిపోయే వరకు నీచత్వాన్ని వదులుకోరు.. చెరుకు లో ఉన్న గుణం ఏమిటి! తియ్యదనం.. చెరుకు ఎప్పుడు తనలో ఉన్న తీయదన్నా వదలదు.. అలాగే మామిడి యొక్క లక్షణం పులుపు… అది కూడా ఎప్పుడు వదలదు… అలాగే మనుషులు కూడా తమ అలవాట్లను వదలలేరు.. ఈ విధంగా నీచ మనుషులు అత్యాచారం చేసేవాళ్లు వారి స్వభావం వారి కర్మలను వదలలేరు.. అలాగే ఆ వృక్షం అంత విశాలమైనది. కానీ దాని స్వభావం అప్పుడు కూడా వదులుకోలేదు.. ఏదైనా పక్షులు గూడు కట్టుకుంటే కట్టని ఇచ్చేది కాదు.. పరమేశ్వరుడు మూడు లోకాలకు దేవుడు. అన్ని చూస్తూనే ఉన్నాడు.

వసంత రుతువు వచ్చింది. కొత్త కొత్త చిగుర్లు వేసుకుంటూ చాలా పచ్చదనంతో నిండి ఉంది. అలాగే అహంకారం కూడా ఆకాశంలో పెరుగు పోతూ ఉంది. ఆ పూర్తి అడవిలో ఇంత కన్నా అందమైన వృక్షం ఇంకొకటి ఏదీ లేదు.. ఎందుకంటే పరమేశ్వరుడు ఆవృక్షానికి వరాన్ని ఇచ్చాడు! అందుకే ఆ చెట్టుకి అహంకారం ఆకాశమంత ఎత్తులో ఉంది. ఒకరోజు చాలా గట్టి తుఫాను వచ్చింది. అడవిలో ఉన్న మిగిలిన వృక్షాలన్నీ విరిగిపోవడం ప్రారంభమైనాయి.. అదే అడవిలో పరమేశ్వరుడు వరమిచ్చిన వృక్షం కూడా ఉంది. అడివిలో అతిపెద్ద మైన వృక్షం అదే ఆ తుఫాను దాడికి తనను తాను రక్షించుకోలేకపోయింది.. వేళ్ళతో సహా కింద పడిపోయింది ఆ వృక్షం తుఫాను ఆగిపోయింది.
ఈ మార్గంలోనే ప్రశ్నకు జవాబు ఉందన్న శివుడు :
ఒకరోజు ఆ వృక్షంలో ఉన్న మార్గంలో పార్వతీ పరమేశ్వరులు భూలోకానికి సంచారం చేయడానికి వస్తున్నారు. ఇప్పుడు పార్వతి దేవి పరమేశ్వరుని అడిగిన ప్రశ్నలకు జవాబు తెలుసుకోవాలని అనుకుంటుంది. పార్వతి దేవి పరమేశ్వరుని అడుగుతుంది ప్రభువు నాకేమీ అర్థం కావట్లేదు నేను అడిగిన ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం చెప్తారు భూలోకంలోనే ఉన్నాం కదా.. మనం వెళ్లే మార్గ లో నువ్వు అడిగిన ప్రశ్నలకు జవాబు దొరుకుతుంది అని పరమేశ్వరుడు అంటారు. ఇంతకుముందు ఏ మార్గం లో అయితే ప్రయాణించారు అదే మార్గంలో వెళ్తుండగా పెద్ద వృక్షం విరిగి పడిపోయి ఉంటుంది. ఆవృక్షం దగ్గరికి పార్వతీ పరమేశ్వరులు వస్తారు. కింద పడిపోయిన వృక్షాన్ని చూసి పార్వతి దేవి మీ లీలలు ఎంత విచిత్రమైనది.. ఈ వృక్షం ఎంతో అందమైన, సుందరమైన వృక్షము ఎంత పెద్ద వృక్షము అడివిలో ఒక్క వృక్షం కూడా కనిపించట్లేదు. అదే ఈ వృక్షం నిలబడి ఉన్నట్లయితే ఎంత అందంగా ఉండేది కానీ వీళ్ళతో సహా కింద పడిపోయి ఉంది చూడండి. దానికి కారణం ఏమిటి అని పార్వతి దేవి, పరమేశ్వరుని అడుగుతుంది.
పరమేశ్వరుడు, దేవి విరిగిపోయిన ఈ వృక్షము కొన్ని సంవత్సరాల క్రితం మనం ఈ మార్గం వెళుతూ ఉండగా ఈ వృక్షం నా కాలుకు తగిలి దెబ్బ తగిలింది రక్తం కూడా వచ్చింది. ఆవృక్షమే ఇది కానీ నేను ఆ సమయంలో ఈ వృక్షానికి ఏ వరం ఇచ్చాను. నీకు గుర్తు ఉందో లేదో ఈ వృక్షాన్ని చాలా పెద్దగా ఎదగమని వరం ఇచ్చాను. అప్పుడు ఈ వృక్షాన్ని తీసి పారేయాలి అంటే నేను చాలా కష్టపడాల్సి వచ్చేది. ఎందుకంటే అప్పుడు ఆ విరిగిపోయిన వృక్షం చాలా అహంకారం కలిగి ఉంది. పాపి ఈ వృక్షము నాశనం చేయడం నా అవస్థతం.. అందువలన ఈ వృక్షానికి పెద్దగా అవ్వమని వరం ఇచ్చాను. దేవి చూడు ఈ వృక్షం ఎంత విశాలంగా అయ్యింది. ఈ విరిగిపోయిన వృక్షం అడవిలోనే పెద్ద వృక్షంగా మారింది. కానీ అహంకారం అన్నిటికంటే పెద్ద వృక్షం అని అహంకారం పోలేదు.. దానిపై పక్షులు వస్తే దానిమీద గూడు కట్టుకొని లేదు.. యాత్రికులు కూడా నీడని ఇచ్చేది కాదు.. నీడ ఇవ్వకుండా ఆకులను ముడుచుకునేది అందువల్లనే ఈ వృక్షము అహంకారి పెద్ద పాపి తన జీవితంలో ఎప్పుడు ఏ మంచి పని చేయలేదు ఎవ్వరకు సహాయం చేయలేదు ఉపయోగపడలేదు. అందువల్లనే ఈ వృక్షాన్ని సర్వనాశనం చెయ్యడం నా ఆవశ్యకత..

ఈ చెట్టు మాదిరిగానే దుష్ట మానవులు కూడా అంతమై పోతారు :
ఈ వృక్షము చాలా విశాలమైపోయినది దాని పతనాన్ని జరిగింది. దానంతట అదే విరిగిపోయింది దీనిని తీయడానికి నాకు ఎటువంటి కష్టం చేయవలసిన అవసరం రాలేదు. పార్వతి దుష్ట వ్యక్తులు ఎవరైతే ఉంటారో కొంత కాలమే ధనవంతులుగా ఉంటారు.. సుఖమైన జీవితాన్ని జీవిస్తారు.. నేను ఒక సమయంలో వాళ్లకు తెలియజేస్తాను.. ధర్మ మార్గంలో రావడానికి ప్రవర్తన మార్పు రావడానికి వాళ్లు ఆ సమయంలో మారకపోతే ఏ విధంగా అయితే ఈ వృక్షము వేర్లు సహా నాశనమైపోయిందో.. అదేవిధంగా పాపాత్ములు కూడా వేర్లులతో సహా నాశనం అయిపోతారు. ఈ వృక్షానికి అవకాశం ఇచ్చిన తనలో ఎటువంటి మార్పు రాలేదు. అదేవిధంగా మనుషులు కూడా తమలో మార్పు తెచ్చుకోకపోతే నాశనమైపోతారు.. పార్వతి దేవికి పరమేశ్వరుడు ఇచ్చిన జ్ఞానము, సందేహం అర్థమైంది..
పార్వతి దేవి నాద.. ఈముల్లోకానికి నాథుడు అప్పుడు మీరు ఇచ్చిన వరం నాకు అర్థం కాలేదు. మీ లీల నాకు అర్థం కాలేదు.. మీరిచ్చిన వరంలో ఇంత అర్థం నాకు తెలియలేదు. అలాగే పాపాత్ములు కూడా తమ చేతుల్లోనే వినాశనం ఉంది. రావణుడు పేరు ప్రతి ఒక్కళ్ళు వినే ఉంటారు.. రామాయణంలో రావణుడు ముల్లోకాలను గెలిచాడు. కానీ తన మృతుని తానే తెచ్చుకున్నాడు.. రావణుడు మరణించిన తర్వాత ఏడవడాని కి మండోదరి తప్ప ఎవ్వరూ లేరు ఈ ప్రపంచంలో మనుషులంతా అహంకారంతో నిండిపోయి ఉన్నారు. అహంకారంతో ఎదుట మనిషిని కూడా వాడి మనసు నొప్పిస్తూ ఉన్నారు. అత్యాచారాలు, పాపాలు చేస్తూ ఉన్నారు. పాపాలు చేస్తూ భయపడడం లేదు… వీళ్లు కొంతకాలమే సుఖంగా ఉంటారు. పరమేశ్వరుడు పార్వతీ దేవికి స్వయంగా చెప్తూ ఉన్నారు. అటువంటివారు కొంతకాలమే సుఖంగా ఉంటారు. పూర్తి జీవితం సుఖంగా ఉండలేరు. వారు అంతం తప్పదు.. ఈ వృక్షం లాగే వేళ్ళతో సహా సర్వనాశనం అయ్యింది. ఆవృక్షము మళ్లీ ఎదగలేనంత నాశనం అయిపోయి.. అలాగే మనుషులు కూడా తన అహంకారాన్ని విడవకపోతే తప్పకుండా వాళ్లు వాళ్ల నాశనాన్ని వాళ్లే తెచ్చుకుంటారు..
Read Also : Ganesh Jayanti 2023 : వినాయకుడు ఎలా జన్మించాడు.. విఘ్ననాయకుడు అనే పేరు ఎలా వచ్చిందంటే?