Vegetables Price Hike : తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరలకు రెక్కలు వస్తున్నాయి అమాంతం కూరగాయల ధరలు కొండెక్కి కూర్చోవడంతో సామాన్యులకు కొనలేక ఇబ్బందులు పడుతున్నారు. అరకొర సంపాదనతో బతుకు బండి లాగుతున్న సామాన్యులకు కూరగాయలు కొనలేని పరిస్థితి ఏర్పడుతుంది. హైదరాబాద్ నగరంతో పాటు ఏపీ, తెలంగాణ వంటి తెలుగు రాష్ట్రాల్లో టమాటా, ఉల్లి ధరలు మళ్ళీ ఆకాశాన్ని అంటాయి.
ముఖ్యంగా వంటకు ప్రధానమైన టమాటా, ఉల్లి ధరలు ధరలు కొండెక్కి కూర్చొన్నాయి. కూరగాయల ధరలు ఒక్కసారిగా పెరగటంతో గృహనీలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గతకొద్దిరోజులుగా మార్కెట్లో ఉల్లిపాయ ధరలు ఒక్కసారిగా ఆకాశాన్నింటాయి. అధిక వినియోగించే టమాటా ధర కూడా ఉన్నట్టుండి భారీ ధర పలుకుతోంది. కొన్నిచోట్ల టమాటా కిలో ధర ఏకంగా రూ. 90లకు చేరుకుంది.
నాణ్యమైన మొదటి రకం టమాట కిలో రూ. 80 నుంచి రూ. 90 రూపాయలు పలుకుతోంది. ఇక రెండో రకం నాణ్యత గల టమాటా కిలో ధర రూ.60 నుంచి రూ. 70 రూపాయలు పలుకుతోంది. ఇక హోల్‌సేల్ మార్కెట్లో రూ. 120 రూపాయలకు మూడు కిలోల టమాటాను విక్రయిస్తున్నారు. అంతేకాదు.. కేజీ ఉల్లిపాయ రూ. 50 రూపాయలకు పైనే పలుకుతోంది. కొన్ని ప్రాంతాల్లో రూ. 60 రూపాయలకు విక్రయిస్తున్నారు.

టమాటా, ఉల్లిపాయ ధరలు పెరగటంతో సామాన్యులు కూరగాయలు కొనాలంటేనే భయపడిపోతున్నారు. సాధారణంగా వేసవిలో కూరగాయల ధరలు పెరుగుతుంటాయి. వర్షాకాలం మొదలవుగానే మళ్లీ కూరగాయల ధరలు తగ్గుతాయి. ఇది ప్రతి ఏటా సహజమే కానీ, ఈసారి దీనికి భిన్నమైన పరిస్థితి నెలకొంది. వేసవిలో వీటి కూరగాయల ధరలు నియంత్రణలోనే ఉన్నాయి. వర్షాకాలం మొదలయ్యాక పక్షం రోజుల వ్యవధిలోనే కూరగాయల ధరలు అవాంతం పెరిగాయి.
Vegetables Price Hike : ఏ కూరగాయల ధరలు ఎంత పెరిగాయంటే?
సామాన్యులు ఎక్కువగా కొనే మార్కెట్లలో రైతు బజార్లు ఒకటి. ఆయా రైతు బజార్లలోని కూరగాయల మార్కెట్లో ధరలతో పోలిస్తే.. బహిరంగ మార్కెట్లోని కూరగాయలు 60 శాతానికి పైగా పెరిగాయని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మే నెలలో కిలో ఉల్లి ధర రూ. 20 రూపాయలు పలికింది. ఇప్పుడు అది రూ. 50 రూపాయలకు చేరింది. టమాటా జూన్ నెల ఆరంభంలో రూ. 25 రూపాయలు ఉండగా, ప్రస్తుతం రూ. 60 రూపాయలకు చేరింది. వంకాయ రూ. 40 రూపాయలు, పచ్చిమిర్చి కిలో రూ. 80 రూపాయలకు చేరింది.
బీన్స్, క్యారెట్, బీట్రూట్, క్యాప్సికం, సొరకాయ, కాకరకాయ తదితర కూరగాలయతో పాటు పుదీనా, కొత్తిమీర, ఇతర ఆకుకూర ధరలు సైతం రెట్టింపు అయ్యాయి. ఉల్లిగడ్డలు గతంలో హైదరాబాద్ నగరానికి రోజు 8వేల క్వింటాళ్ల వరకు వచ్చేవి. దాంతో ఆరు నెలలుగా కిలో రూ. 20 చొప్పున స్థిర ధరలోనే లభ్యమయ్యాయి. ప్రస్తుతం 5 నుంచి 6వేల క్వింటాళ్లే వస్తున్నాయని, అందుకే కూరగాయల ధరలు భారీగా పెరుగుతున్నాయని మార్కెటింగ్ అధికారులు చెబుతున్నారు.
