Dharma Sandehalu Head Bath Telugu : ఆడవాళ్లు తలస్నానం ఏ రోజు ఏ సమయంలో చేస్తే అదృష్టం వరిస్తుంది. ఏ రోజు ఆడవాళ్లు తలస్నానం చేయకూడదు. వాస్తవానికి ఆడవాళ్లు పొరపాటున కూడా కొన్ని రోజుల్లో అసలు తలస్నానం చేయకూడదనే విషయం తెలుసా? తలస్నానం అసలు ఎందుకు ఆయా రోజుల్లో చేయకూడదో వివరంగా తెలుసుకుందాం. మన సాంప్రదాయాల్లో తలస్నానం చేయడం అనేది ఒక ప్రత్యేకమైనదిగా చెబుతారు.
అందులోనూ వారంలో ఏ రోజు తలంటు స్నానం చేస్తే ఎలాంటి ఫలితం కలుగుతుంది అనేది శాస్త్రపరంగా అనేక ఆరోగ్యపరమైన విషయాలను సూచించింది. వాస్తవానికి తల స్నానం అనేది అందరికీ రోజు చేసే వీలుండదు. అలాంటి వారు వారానికి రెండు లేదా మూడు రోజులు తలస్నానం చేస్తుంటారు. అలాంటి వారి కోసం ప్రత్యేకించి వారంలోని కొన్ని దినాలలో తలస్నానం చేస్తే ఆరోగ్యకరమైన శరీరం కలిగి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది.
ఏ సమయాల్లో తలస్నానం చేయాలంటే? :
మరికొన్ని రోజుల్లో తలస్నానం చేస్తే అనారోగ్య కరమైన పరిస్థితితోపాటు ఇతర విషయాలలో ప్రతికూలంగా ఉంటుంది. కాబట్టి అన్ని విధాలుగా తలంటు స్నానం ఏ రోజు చేస్తే మంచిది అనేది ఈ విషయం గురించి శాస్త్ర రీత్యా పరిశీలించినట్లయితే.. స్నానాలు ఉదయం సమయంలోనే చేయాలి. సూర్యోదయానికి పూర్వం చేస్తే చాలా మంచిది. పొద్దు పోయాక చేస్తే లేదా తినిచేస్తే అనారోగ్యం కలుగుతుంది. వృద్ధులు, రోగుల్లో వారికి ఆరోగ్యం సహకరించదు కనుక ఇలాంటి వారు ఎండ కొద్దిగా వచ్చిన తర్వాత తలస్నానం చేయడంలో ఎలాంటి తప్పులేదు.
ఆరోగ్యం సరిగా లేనివారు కాకుండా ఇతరులు శాస్త్రానికి విరుద్ధంగా పోతే మాత్రం రాబోయే రోజుల్లో ఆరోగ్యపరంగా అనేక ఇబ్బందులు, చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా స్త్రీలు తలస్నానం చేసే సమయంలో జుట్టు పూర్తిగా విరబోసి స్నానం చేయకూడదు. జుట్టు చివర్లు ముడి వేసుకొని స్నానం చేయాలి. ఇలా చేస్తే శుభకరం. మంగళకరం వారపు రోజులలో శుభ, అశుభ ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం..
ఆదివారం రోజున తలస్నానం, తలంటు స్నానం చేసినచో ఈరోజు అనుకూలంగా ఫలితం రాదు. ఫలితం శరీర కాంతి తగ్గుతుంది. మానసిక అనారోగ్యం ఏర్పడుతుంది. దుఃఖప్రదం సంతానానికి కీడు, కొన్ని సందర్భాలలో తప్పనిసరిగా తలస్నానం చేయవలసి వస్తే.. దోష పరిహారం కోసం కొబ్బరి నూనెలో ఏదేని కొన్ని పూలను కలిపి స్నానం దోష పరిహారం జరుగుతుంది. సోమవారం తలస్నానం పనికిరాదు. ఫలితం కలవరము, కాంతిహీనం, భయం కలుగుతాయి. దోష పరిహారం కోసం కొబ్బరి నూనెలో మందార పూలను వేసి తల అంటుకొని స్నానం చేస్తే దోష పరిహారం అవుతుంది.
Dharma Sandehalu Head Bath : వారంలో ఏ రోజు తలస్నానం చేస్తే అదృష్టం కలిసివస్తుందంటే?
మంగళవారం.. తల స్నానం అసలే పనికిరాదు.. అలా చేస్తే ఫలితం విరోధం. ఆపాయం, ఆయుక్షణం, భర్తకు కీడు కలుగుతాయి. దోష పరిహారం కోసం నూనెలో చిటికెడు పుట్టమన్ను, ఆవు తొక్కిన మట్టిని కలిపి తలస్నానం చేస్తే దోష పరిహారం అవుతుంది.బుధవారం తల స్నానం చేస్తే ఫలితం శుభం. ఫలితం లాభం కీర్తి సంపద కలుగుతాయి. జ్ఞానం కలుగుతుంది. బుద్ధి వికసిస్తుంది. గురువారం రోజు తలస్నానం చేస్తే ఫలితం.. అశాంతి, విద్యలోపం, ధనవ్యయం, కీడు, శత్రువులు అధికమవుతారు.

దోష పరిహారం కోసం నూనెలో గరిక గాని పుష్పాలను గాని కలిపి తలంటుకుని స్నానం ఆచరిస్తే దోష పరిహారం అవుతుంది. శుక్రవారం తలస్నానం చేసిన ఫలితం అశాంతి, వస్తున్నాసనం, రోగప్రదం దోష పరిహారం కోసం విభూదిని కానీ గోమాయం కానీ కలిపి తలంటుకొని స్నానం చేస్తే దోష పరిహారం అవుతుంది. శనివారం తలస్నానం చేస్తే ఫలితం ఆయుర్వృద్ది, వస్తు సేకరణ, లాభం, కుటుంబ సౌఖ్యం కలుగుతాయి. శుభకరమైనది చెబుతారు. ఈరోజు తప్పక అందరూ తలస్నానం చేస్తే మంచి ఆరోగ్యం కలుగుతుంది.
పురాణాలు, శాస్త్రాల ప్రకారం.. తలంటు స్నానం చేసే ఆడవాళ్లు బుధవారం, శనివారం రోజుల్లో చేస్తే చాలా శుభప్రదమని చెబుతారు. అదృష్టం కలిసివస్తుందని అంటారు. అదేవిధంగా, ముఖ్యమైన పండుగ పర్వదినాల్లో పుణ్యక్షేత్రాలలో పుట్టినరోజు రోజున తలస్నానం చేయడానికి శాస్త్రప్రకారంగా ఎలాంటి నియమాలు లేవు. అది ఏ వారమైనా నిస్సందేహంగా తలస్నానం చేయవచ్చునని శాస్త్రం చెబుతోంది. ముఖ్యంగా మనం గమనించవలసిన విషయమేంటంటే.. ప్రతిరోజు తలస్నానం చేసే అలవాటు ఉన్నవారికి ఈ నిబంధనలు వర్తించవని గమనించాలి. వారానికి రెండు సార్లు చేసే వాళ్లకే ఈ నియమ నిబంధనలు వర్తిస్తాయి.