Dhanteras 2024 : అక్టోబర్ 29న ధనత్రయోదశి.. ఈరోజున బలిదీపం ఎలా వెలిగించాలి? ఎందుకు వెలిగించాలో తెలుసా? కలిగే ఫలితాలేంటి?

Dhanteras 2024 : అక్టోబర్ 29వ తేదీ.. ఈ ధన త్రయోదశి రోజున బలి దీపాన్ని ఏ విధంగా వెలిగించాలో తెలుసా? ధన త్రయోదశి రోజు పాటించాల్సిన ముఖ్యమైన నియమాలు ఏంటో తెలుసా? ఇప్పుడు తెలుసుకుందాం. 2024 సంవత్సరం అక్టోబర్ 29వ తేదీన ధన త్రయోదశి వచ్చింది. ఆరోజున ఇంటి గుమ్మం ముందు సాయంకాలం పూట బలి దీపమనే ప్రత్యేకమైన దీపాన్ని వెలిగించాలి. ఆ దీపం వెలిగిస్తే.. అనేక శుభఫలితాలు కలుగుతాయి. ఈ ఏడాదిలో మొత్తం ఇంట్లోని వాళ్ళు ఎవ్వరికీ అపమృత్యు దోషాలు ఉండవు.

వాహనాల మీద వెళ్లేటప్పుడు ప్రమాదాలు జరగటం, దెబ్బలు తగలడం వంటివి జరగవు. అలాగే సంవత్సరం మొత్తం ఇంట్లో ఉన్న వాళ్ళకి అనారోగ్య సమస్యలు ఉండవు. సంవత్సరం మొత్తం ఆరోగ్య ప్రాప్తిని పొందవచ్చు. ఆరోగ్యం బాగుండటానికి అక్టోబర్ 29వ తేదీ ధనత్రయోదశి రోజు సాయంకాలం పూట ఇంటి గుమ్మం ముందు బలి దీపాన్ని వెలిగించాలి. ఈ బలి దీపాన్ని ఎలా వెలిగించాలి? ముందుగా గోధుమ పిండి కొద్దిగా తీసుకోవాలి. ఆ గోధుమ పిండిలో బెల్లం తురుము కొంచెం కలపాలి. ఆవు పాలు కొద్దిగా పోయాలి. పచ్చి ఆవు పాలు, బెల్లం తురుము, గోధుమ పిండిలో కలిపి ఆ గోధుమ పిండితో ఒక పిండి దీపాన్ని తయారు చేసుకోవాలి. ఆ పిండి దీపాన్ని మీ ఇంటి గుమ్మం ముందు ఉంచాలి.

Dhanteras 2024 : బలిదీపానికి ఎన్ని ఒత్తులు వేయాలంటే? :

మీ ఇంటి సింహద్వారం మీ ఇంటి గుమ్మం ముందు ఆ పిండి దీపం ఉంచాలి. ఆ పిండి దీపంలో నువ్వుల నూనె పోయాలి. నువ్వుల నూనె పోసిన తర్వాత దక్షిణ దిక్కు వైపు వత్తులు వేసి ఆ దీపాన్ని వెలిగించాలి. ఎన్ని ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలంటే.. ఎన్ని వత్తులు అయినా వేయవచ్చు. 2 ఒత్తులు గాని 3 వత్తులు గాని వేయవచ్చు. ఎన్ని వత్తులు అయినా వేసి ఆ దీపాన్ని దక్షిణ దిక్కువైపు వెలిగేలాగా వెలిగించాలి. ఆ వత్తులన్నీ కలిపి ఒకే ఒత్తి లాగా చేయాలి. ఆ వత్తి దక్షిణ దిక్కువైపు వెలిగేలాగా ఇంటి గుమ్మం ముందు వెలిగించాలి. ఇలా గోధుమ పిండితో వెలిగించే దీపాన్ని బలి దీపంగా పిలుస్తారు.

Dhanteras 2024
Dhanteras 2024

అయితే, ఈ బలి దీపం దగ్గర కొన్ని విధులు పాటించాలి. ఆ విధులు ఏంటంటే.. ఆ బలిదీపం దగ్గర ఆకులో ఒక రాగి నాణాన్ని ఒక గవ్వని ఉంచాలి. అయితే, రాగి నాణెం అందుబాటులో లేని వాళ్లు ఒక రూపాయి నాణాన్ని ఆకుల మీద ఉంచవచ్చు ఒక రూపాయి నాణెం, ఒక గవ్వ, ఆ దీపం దగ్గర ఒక ఆకులో ఉంచాలి లేదా ఆ దీపంలోనే రూపాయి నాణెం, గవ్వవేసి దీపాన్ని వెలిగించుకోవచ్చు. ఆ తర్వాత ఆ బలి దీపం దగ్గర నైవేద్యం పెట్టాలి. కొద్దిగా బియ్యం, బెల్లం నైవేద్యంగా సమర్పించాలి. ఆ నైవేద్యాన్ని మళ్లీ ఇంకొక ఆకులో ఉంచాలి. ఏదైనా ఒక తమలపాకు దగ్గర ఉంచాలి.

ఇంటి గుమ్మం ముందు బలిదీపం వెలిగించాలి :
అలా నైవేద్యం పెట్టాలి. ఈ బలి దీపం కొండెక్కిన తర్వాత ఏం చేయాలి. ఆ బలి దీపం కొండెక్కిన తర్వాత మరుసటిరోజు స్నానం చేసి గోధుమపిండితో చేసిన ఆ పిండితో దీపం పెట్టిన ఆ రాగి నాణెం లేదా రూపాయి నాణెం గవ్వ నైవేద్యంగా బియ్యం, బెల్లం కూడా ఎవరు తొక్కనిచోట చెట్టు మొదట్లో వెయ్యాలి లేదా పారే నీళ్లలో విడిచిపెట్టాలి. ఇలా అక్టోబర్ 29 ధనత్రయోదశి సాయంకాలం పూట ఇంటి గుమ్మం ముందు బలి దీపం వెలిగించండి. సంవత్సరం మొత్తం దోషాలు లేకుండా అనారోగ్య సమస్యలు లేకుండా సకల శుభాలను సిద్ధింప చేసుకోండి. అలాగే, ధన త్రయోదశి రోజు ఇంట్లో బంగారు ఆభరణాలు, వెండి ఆభరణాలు పాలతో శుద్ధి చేసుకోండి. ఆవుపాలతో కడగండి. ఆ తర్వాత మళ్లీ నీళ్ళతో కడగండి. వాటిని పూజా మందిరంలో ఉంచి ధనలక్ష్మి దేవిని పూజించండి.

పూజ పూర్తయిపోయిన తర్వాత మళ్లీ వాటిని ధనం దాచుకునే బీరువాలో దాచి పెట్టుకోండి. ఇలా చేస్తే శ్రీమహాలక్ష్మి దేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే ధన త్రయోదశి రోజు ఇంకో విధివిధానం పాటిస్తే కూడా అద్భుత ఫలితాలు కలుగుతాయి. ఆ విధివిధానమేంటంటే ఇంట్లో సభ్యులందరూ కూడా కనీసం నాలుగు దీపాలు వెలిగించి దీపాలు దానం ఇవ్వండి. యజమాని, యజమానురాలు పిల్లలందరూ కూడా ఒక్కొక్కళ్ళు నాలుగు మట్టి ప్రమిదల్లో దీపాలు వెలిగించి ఒక్కొక్కరు నాలుగు చొప్పున వెలిగించిన దీపాలు దక్షిణతో పాటు బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వండి. ఇలా దానం ఇవ్వటం ద్వారా కూడా సంవత్సరం మొత్తం యమధర్మరాజు అనుగ్రహం కలుగుతుంది. అనారోగ్య సమస్యలు ఉండవు. ధన త్రయోదశి రోజు ప్రతి ఒక్కరు కూడా ధనలక్ష్మి దేవి పూజ చేస్తూ ఈ విధి విధానాలు పాటిస్తే సంవత్సర మొత్తం సకల శుభాలను పొందవచ్చు.

Read Also : Diwali 2024 : దీపావళి రోజున లక్ష్మీ దేవి అనుగ్రహం పొందాలంటే మీ ఇంట్లో ఈ 3 వస్తువులను పారేయండి!