Jio Diwali Dhamaka Offer : రిలయన్స్ జియో యూజర్లకు పండుగే.. ఈ దీపావళికి రిలయన్స్ జియో (JioBharat 4G) ఫీచర్ ఫోన్ల ధరలను 30 శాతం భారీగా తగ్గించింది. ఈ పరిమిత కాల ఆఫర్‌లో రూ. 999 విలువైన జియో భారత్ మొబైల్ ఫోన్ ఇప్పుడు మార్కెట్లో రూ.699 ప్రత్యేక ధరకు అందుబాటులో ఉంది. జియోభారత్ ఫోన్‌ను రూ.123తో రీఛార్జ్ చేసుకోవచ్చు. ఈ నెలవారీ టారిఫ్ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ ఫ్రీ వాయిస్ కాల్స్, 14జీబీ డేటా కూడా అందుబాటులో ఉంటుంది.
జియో నెలవారీ రీఛార్జ్ ప్లాన్ రూ. 123 ఇతర ఆపరేటర్ల కన్నా 40 శాతం తక్కువకే పొందవచ్చు. ఇతర నెట్‌వర్క్‌లు ఫీచర్ ఫోన్ల నెలవారీ రీఛార్జ్ ధర రూ. 199 వరకు చెల్లించాలి. జియో కన్నా రూ. 76 రూపాయలు ఎక్కువ. అంటే.. ప్రతి రీఛార్జ్‌పై వినియోగదారుడు నెలకు రూ.76 ఆదా చేస్తే.. కేవలం 9 నెలల్లోనే మొత్తం ఫోన్ ధర రికవరీ అవుతుంది.
2G నుంచి 4Gకి మారేందుకు అవకాశం :
ఇది ఫీచర్ ఫోన్ మాత్రమే కాదు.. 2G నుంచి 4Gకి మారడానికి ఇదే అవకాశం. JioBharat 4G ఫోన్‌లలో 455 కన్నా ఎక్కువ లైవ్ టీవీ ఛానెల్‌లు, సినిమా ప్రీమియర్‌లు, కొత్త సినిమాలు, వీడియో షోలు, లైవ్ స్పోర్ట్స్ ప్రోగ్రామ్‌లు, జియోసినిమా (JioCinema) వంటివి పొందవచ్చు.

డిజిటల్ పేమెంట్లు, క్యూఆర్ కోడ్ స్కాన్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. JioPay, JioChat వంటి ప్రీలోడెడ్ యాప్‌లు కూడా ఈ ఫోన్‌లో అందుబాటులో ఉంటాయి. మీ సమీపంలోని దుకాణాలతో పాటు ఫోన్‌ను JioMart లేదా Amazon నుంచి కూడా కొనుగోలు చేయవచ్చు.
జియో బెస్ట్ ఆఫర్ :
రిలయన్స్ జియో ఇటీవల బెస్ట్ ఆఫర్‌లను ప్రకటించింది. అక్టోబర్ 26 నుంచి నవంబర్ 5, 2024 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్ కింద ఎంపిక చేసిన ప్లాన్‌లపై రీఛార్జ్ చేస్తే.. EaseMyTrip, Ajio, Swiggy నుంచి వోచర్‌లు, ఆఫర్‌లను పొందుతారు. మీరు Jio.com లేదా MyJio యాప్ ద్వారా ఈ బెనిఫిట్స్ పొందవచ్చు.
ఈ ఆఫర్‌ను పొందేందుకు మీరు రూ. 899, రూ. 3,599 ప్లాన్లతో పాటు Jio True 5G ప్లాన్‌లతో రీఛార్జ్ చేసుకోవచ్చు. ఇందులో మీరు EaseMyTrip నుంచి రూ. 3వేల వోచర్, Ajio ద్వారా రూ. 200 కూపన్, Swiggy నుంచి రూ. 150 వోచర్ పొందుతారు. తద్వారా మొత్తం రూ. 3,350 బెనిఫిట్స్ అందిస్తుంది.