Chicken Shahi Korma : రెస్టారెంట్ స్టైల్‌లో చికెన్ కుర్మా ఎప్పుడైనా చేశారా? లేదంటే టేస్ట్ చేశారా? ఒకసారి తిన్నారంటే మళ్లీ మళ్లీ తినాలనిపించేలా ఉంటుంది. మీరు రెస్టారెంట్ కి వెళ్లకుండానే అదే టేస్ట్ వచ్చేలా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఈ రెసిపీని ఇలా చేస్తే అద్భుతంగా వస్తుంది. మీ చేతులతో మీరే రెస్టారెంట్ స్టైల్‌లో చికెన్ కుర్మాని (Chicken Shahi Korma) ఇంట్లో చేసుకోవచ్చు. తయారీ విధానాన్ని చూసి మీరు ట్రై చేయండి. ఈ చికెన్ కుర్మా చేసుకోవడానికి ఫస్ట్ ఏం చేయాలంటే.. ఒక బౌల్ తీసుకొని 6 లేదా 7 బాదం పప్పులు 6 లేదా జీడిపప్పులు, ఒక టీ స్పూన్ గసగసాలు వేసుకొని వేడి నీళ్లు పోసి ఒక అరగంట నానబెట్టండి. ఇలా నానబెట్టడం వల్ల బాదంపప్పులకి పైన పొట్టు వచ్చేస్తుంది. అలాగే పప్పులన్నీ బాగా నానబెడితే గ్రైండ్ చేసేందుకు ఈజీగా ఉంటుంది.
ఒక అర కిలో చికెన్ (Chicken Shahi Korma) తీసుకొని ఒక టీ స్పూన్ ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ కారం వేసి కలిపి పెట్టుకోండి. ఒక అరగంట పక్కన పెట్టుకోండి. మీడియం సైజు మూడు ఉల్లిపాయల్ని సన్నగా పొడవుగా కట్ చేసుకోండి. ఈ ఉల్లిపాయ ముక్కల్ని వేడి వేడి నూనెలో వేసి బాగా వేగనివ్వండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఈ కలర్ వచ్చేంతవరకు వేయించుకొని ఏదైనా ప్లేట్‌లో వేసుకొని కొద్దిగా ఆరనివ్వండి. ఈ ఉల్లిపాయ ముక్కలు ఆరిన తర్వాత కాస్త క్రిస్పీగా అవుతాయి. అలా క్రిస్పీగా మారిన తర్వాత చేతితో ఇలా నలిపి పక్కన పెట్టుకోండి. ఈ బాదం పప్పులు, జీడిపప్పులు కూడా బాగా నానుతాయి. బాదంపప్పులకి పొట్టును తీసేయండి. ఆ తర్వాత నీళ్లతో సహా మిక్సీ జార్‌లో వేసుకొని కలిపి మెత్తటి పేస్ట్ మాదిరిగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి.
Chicken Shahi Korma : చికెన్ కుర్మా తయారీ విధానం :
ఇప్పుడేం చేస్తారంటే.. నల్ల యాలకుల ఒకటి తీసుకోండి. పచ్చ యాలకులను రెండు తీసుకోండి. జాజికాయ కొద్దిగా ఒక చిన్న ముక్క తీసుకోండి. వన్ నుంచి చెక్క తీసుకోండి. జాపత్రి కొద్దిగా తీసుకొని పక్కన పెట్టుకోండి. మీరు మిక్సీ జార్‌లో అయినా వేసుకోవచ్చు. ఇలా దంచుకోవడం కష్టంగా అనిపిస్తే.. చికెన్ కుర్మా చేసుకోడానికి అన్ని రెడీ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు చికెన్ కుర్మాని చాలా సింపుల్‌గా చేయొచ్చు. ఫస్ట్ పాన్‌లోకి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ 2 టేబుల్ స్పూన్ నెయ్యి అయినా వేసుకోవచ్చు. రెస్టారెంట్‌లో నెయ్యి కూడా వేస్తారు. ఆయిల్ కొద్దిగా కాగిన తర్వాత ఒక 5 లేదా 6 యాలకుల్ని కచ్చాపచ్చాగా దంచి వేయండి. ఇలా యాలకులు దంచి వేయడం వల్ల ఆ ఫ్లేవర్ డిఫరెంట్‌గా ఉంటుంది. కుర్మాకి దీంట్లోనే 5 లేదా 6 లవంగాలు దీంట్లోనే 2 బిర్యానీ ఆకులను కూడా ఇలా తుంచి వేసి వేయండి. ఈ మసాలా దినుసులు అన్ని కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు చికెన్ వేసుకోవాలి.
మారినేట్ పెట్టిన చికెన్ మొత్తాన్ని వేసుకొని హై ఫ్లేమ్‌లో పెట్టి 10 నిమిషాలు వేయించండి. చికెన్ బాగా వేగేలా నీళ్లంతా ఇంకిపోయేంతవరకు వేయించండి. చికెన్‌లో నీళ్లు ఇంకిపోయి ఆయిల్ సపరేట్ అవుతుంది. వేగిన తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. వెల్లుల్లి పేస్ట్ అయితే కుర్మాకు టెస్ట్ బాగుంటుంది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్న తర్వాత ఫ్లేమ్ మీడియంలో పెట్టి అల్లం, వెల్లుల్లి పేస్ట్ బాగా వేగనివ్వండి. పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించండి. ఇప్పుడు అల్లం, వెల్లుల్లి పేస్ట్ కూడా వేగింది.
ఆ తర్వాత 3 టీ స్పూన్లు రెగ్యులర్ మనం ఇంట్లో వాడే కారం వేసుకోండి. ఒక టీ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లి కారం వేయండి. మంచి కలర్‌తో పాటు ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. రెండు టీ స్పూన్లు ధనియాల పొడి కూడా వేయండి. హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి, పావు టీ స్పూన్ పసుపు కూడా వేసి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఇప్పుడు అన్ని వేసి కలుపుకుని లో ఫ్లేమ్‌లో పెట్టండి. మాడకుండా ఉంటాయి. ఇప్పుడు ఈ పొడులన్నీ కలిసిన తర్వాత బాగా చిలికిన పెరుగు హాఫ్ కప్పు దాకా వేసుకొని కలుపుకోండి.

ఈ పెరుగు వేసిన తర్వాత ఫ్లేమ్ లోలోనే ఉంచి కలపండి. ఫ్లేమ్ హైలో పెట్టారనుకోండి. పెరుగు విరిగిపోయినట్లు అయిపోతుంది. అందుకని లో-ఫ్లేమ్‌లో పెట్టి బాగా కలుపుతూ ఒక నిమిషం వేగనివ్వండి. ఇప్పుడు పెరుగు కూడా బాగా ఉడికి ఆయిల్ సపరేట్ అవుతుంది. ముందుగా వేయించి పొడి చేసి పెట్టుకున్నా ఆనియన్స్ ఉన్నాయి కదా వాటిల్ని కూడా వేసి బాగా కలుపుకోండి. మొత్తం కలుపుకున్న తర్వాత కాజు బాదం పేస్ట్ కూడా వేయండి. కాజు బాదం పేస్ట్ కూడా వేసి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి. కాజు, బాదం పేస్ట్ కూడా బాగా కలిసిపోయిన తర్వాత ఒక గ్లాస్ నీళ్లు పోయండి. గ్లాస్ నీళ్లు పోసుకుని సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి. కారం కూడా సరిపోయిందా లేదా చూసుకొని వేసుకోండి. కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకొద్దిగా కారం ఎక్కువ వేసుకొని కలుపుకోండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మీడియం ప్లేమ్ పెట్టి మూత పెట్టేసి ఉంచండి.
కుర్మా సగం వరకు ఉడికిన తర్వాత ఇప్పుడు దీంట్లో ముందుగా దంచిన మసాలా పొడిని వేయండి. ఇలా అన్ని వేసుకున్న తర్వాత బాగా కలిపేసి మళ్ళీ లో ఫ్లేమ్‌లో పెట్టి రెండు నిమిషాలు ఉడికించండి. ఇప్పుడు ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే.. ఆయిల్ సపరేట్ అయ్యి చిక్కటి గ్రేవీ లాగా అవుతుంది. ఆయిల్ సపరేట్ అయిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఎక్కువ చిక్కటి గ్రేవీలాగా వచ్చేటట్టు ఉడికిస్తే.. ఆరిన తర్వాత కాస్త గట్టిగా అయిపోతుంది. అందుకని గ్రేవీ కొద్దిగా పల్చగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేయండి. చాలా యమ్మీగా ఉంటుంది. రెస్టారెంట్ టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి.