Jr NTR Virat Kohli : Virat Kohli Comments on Jr NTR : జూనియర్ ఎన్టీఆర్.. ఒకప్పటి సీనియర్ ఎన్టీఆర్ తర్వాత అంతే క్రేజ్ సంపాదించుకున్నారు. ఆయన ఎప్పుడూ వివాదాలకు దూరంగా ఉంటారు. ఎవరిపైనా కూడా ఎలాంటి కామెంట్స్ చేయరు. తన పని ఏదో తాను చేసుకుంటారు. అయినప్పటికీ జూనియర్ ఎన్టీఆర్‌పై కొన్నిసార్లు ఫేక్ న్యూస్ చక్కర్లు కొడుతుంటాయి. అంతేకాదు.. ఆయనపై విచిక్షణ లేకుండా ట్రోలింగ్ చేసిన సందర్భాలు లేకపోలేదు. అయినప్పటికీ నిండు కుండ తొణకదు అనేలా ఇవన్నీ ఏమి ఆయన పట్టించుకోరు.
జూనియర్ ఎన్టీఆర్ మంచితనం గురించి ఎంత చెప్పినా తక్కువే అని చెప్పాలి. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఆయన మంచితనం గురించి పదేపదే చెబుతూనే ఉంటుంటారు. లేటెస్టుగా టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ గతంలో జూనియర్ ఎన్టీఆర్‌పై చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. విరాట్ కోహ్లీ, ఎన్టీఆర్‌కు సంబంధించిన పాత వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ చేస్తున్నారు.
వాస్తవానికి జూనియర్ ఎన్టీఆర్, విరాట్ కోహ్లీ ఇద్దరూ మంచి బెస్ట్ ఫ్రెండ్స్ అనేది పెద్దగా ఎవరికి తెలియకపోవచ్చు. అందులోనూ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు మాత్రం తప్పక తెలిసి ఉంటుంది. ఎన్టీఆర్, కోహ్లీ ఫ్రెండ్‌షిప్‌కు సంబంధించి ఎవరికి తెలియని ఒక విషయం వెలుగులోకి వచ్చింది. విరాట్ ఒకనొక ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. తనకు టాలీవుడ్ ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్ అంటూ ఎవరైనా ఉన్నారంటే అతడు జూనియర్ ఎన్టీఆర్ మాత్రమేనని అన్నాడు.
Jr NTR Virat Kohli : నా బెస్ట్ హీరో తారక్ మాత్రమే : కోహ్లీ
అందరి హీరోల కన్నా తనకు ఎన్టీఆర్ బెస్ట్ హీరో అంటూ చెప్పుకొచ్చాడు విరాట్. ఎందుకంటే.. ఎన్టీఆర్ నటన చాలా అద్భుతంగా ఉంటుందని అన్నాడు. ఒక సందర్భంలో తామిద్దరూ కలిసి ఒక యాడ్ కోసం కూడా పనిచేశామని గుర్తుచేసుకున్నాడు కోహ్లీ. ఆ యాడ్ కారణంగా ఎన్టీఆర్ అసలు క్యారెక్టర్ ఏంటో నాకు తెలిసిందన్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే.. జూనియర్ ఎన్టీఆర్ చాలా గొప్ప మనస్సు. ఆయనంత మంచివారు మరొకరు ఉండరు. ఎంతో సాఫ్ట్ నేచర్ ఆయనది. చాలా హంబుల్ పర్సన్ కూడా. ఎన్టీఆర్ వంటి ఒక మంచి వ్యక్తి నాకు మంచి స్నేహితులు అయ్యాడు. ఈ విషయంలో నాకు చాలా సంతోషంగా ఉందని కోహ్లీ తెలిపాడు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ మూవీ గురించి కూడా కోహ్లీ మాట్లాడాడు.

అందులో ప్రత్యేకించి తన బెస్ట్ ఫ్రెండ్ అయిన తారక్ నటన గురించి ప్రస్తావించాడు. ఎన్టీఆర్ నటన చాలా అద్భుతంగా ఉందంటూ పొగడ్తలతో మంచేత్తాడు. ఎన్నిసార్లు ఆయన పర్ఫార్మెన్స్ చూసిన సరిపోదని అన్నాడు. ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పినా అది తక్కువే.. అతడే నా బెస్ట్ యాక్టర్.. అందులో ఎలాంటి సందేహం అక్కర్లేదు అంటూ తనదైన శైలిలో ఎన్టీఆర్‌ను కోహ్లీ కొనియాడాడు. ఎన్టీఆర్ గురించి కోహ్లీ చెప్పిన మాటలకు తారక్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీలవుతున్నారు.
ఇక, సినిమాల విషయానికి వస్తే.. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం.. దేవర అనే మూవీలో నటిస్తున్నాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ మూవీ అతి త్వరలోనే థియేటర్లలో రిలీజ్ కానుంది. రాబోయే దేవర మూవీతో తారక్ మరో శిఖరాన్ని అధిరోహించబోతున్నాడని నందమూరి అభిమానులు అంటున్నారు. మరో సినిమా ’వార్ 2‘ లో కూడా తారక్ నెగటివ్ షేడ్ రోల్ చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలపై తారక్ ఫ్యాన్స్ భారీగా ఆశలు పెట్టుకున్నారు. సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయా? అని తెగ ఎదురుచూస్తున్నారు.
Read Also : Varun Tej Surgery : వరుణ్ తేజ్‌కు సర్జరీనా..? పెళ్లైన ఏడాదిలోపే ఆపరేషనా? ఇందులో నిజమెంత?