Lasoda Fruit Health Benefits : మీరు మీ ఊళ్లో ఇలాంటి చెట్లను ఎప్పుడైనా చూశారా? చూడటానికి పిచ్చిమొక్కలా కనిపించే ఈ మొక్క అద్భుతమైన ఔషధ గుణాలను కలిగి ఉంది. సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో మీ ఇంటి చుట్టూ లేదా తోటలో లసోడా (విరిగి) చెట్లను చూసి ఉండవచ్చు. కానీ, ఆ విరిగి చెట్లు లేదా నక్కెర కాయల చెట్టు ప్రయోజనాల గురించి మీకు తెలియకపోవచ్చు. ఈ చెట్టులోని పండ్లు, ఆకులు, బెరడు, గింజలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ విరిగి పండ్లు మొత్తం ఆరోగ్యానికి మేలు చేస్తాయి. బంక కాయల చెట్ల పండ్ల గురించి మీకు పూర్తిగా తెలియదు. విరిగి చెట్లతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. అయితే, ఇక్కడ లసోడా గురించి పూర్తి సమాచారాన్ని అందిస్తున్నాం.
ఈ విరిగి చెట్లను ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో పిలుస్తుంటారు. కొందరు విరిగి చెట్లు అంటే.. మరికొందరు నక్కెర, బంక నక్కెర చెట్టు, బంక పండ్లు, బంక కాయల మొక్క అనే పేర్లతో ఎక్కువగా పిలుస్తారు. ఈ లసోడా బొటానికల్ పేరు కోర్డియా మైక్సా. లసోడా చెట్టు కూడా మర్రి లాగా చాలా పెద్దదిగా ఉంటుంది. ఈ చెట్టు పండ్లు చాలా మృదువైనవి. దక్షిణ, గుజరాత్, రాజస్థాన్ ప్రజలు ఈ పండ్లను తమ ఆహారంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. లసోడా ఆకుల రుచి తమలపాకు లాంటి రుచిని కలిగి ఉంటుంది. ఈ చెట్టులో మొత్తం మూడు జాతులు ఉన్నాయి. కానీ, లామెడ, లసోడా చెట్లు మాత్రమే బాగా ప్రసిద్ధి చెందాయి. అయితే, ఈ విరిగి చెట్ల పండులో ఔషధ ప్రయోజనాలేంటి? ఎలా ఉపయోగించాలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
లసోడా (విరిగి) ఔషధ గుణాలు ఇవే :
లసోడా (విరిగి చెట్లు)లో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. కొంతమంది ఈ చెట్లను గోండి లేదా నిసోరా అని కూడా పిలుస్తారు. లసోడా చెట్లలో ప్రోటీన్, క్రూడ్ ఫైబర్, కార్బోహైడ్రేట్, కొవ్వు, ఫైబర్, ఐరన్, ఫాస్పరస్, కాల్షియం వంటి పోషకాలు లభిస్తాయి. అంతేకాదు.. విరిగి చెట్లలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా ఉన్నాయి.
కాలేయ ఆరోగ్యానికి నక్కెర పండ్లు దివ్యాషధం :
లసోడా పండుగా పిలిచే నక్కెర పండ్లు అనేక కాలేయపరమైన సమస్యలను దివ్యాషధంగా పనిచేస్తంది. గత జనవరి 2007లో నైజీరియన్ జర్నల్ ఆఫ్ నేచురల్ ప్రొడక్ట్స్ అండ్ మెడిసిన్‌లో ఎలుకలపై ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం.. నూనెలు, గ్లైకోసైడ్‌లు, ఫ్లేవనాయిడ్‌లు, స్టెరాల్స్, సపోనిన్‌లు, టెర్పెనాయిడ్స్, ఆల్కలాయిడ్స్, ఫినోలిక్ ఆమ్లాలు, కౌమరిన్‌లు, టానిన్‌లు, రెసిన్‌లు, చిగుళ్లు. శ్లేష్మం కాలేయాన్ని నయం చేసే లక్షణాలను కలిగి ఉన్నాయని రుజువైంది.
Lasoda Fruit Health Benefits : విరిగి చెట్టు అధిక రక్తపోటును తగ్గిస్తుంది :
అధిక రక్తపోటు అనేది ప్రపంచవ్యాప్తంగా సర్వసాధారణమైన వ్యాధి. అయితే, మీరు గృహి చిట్కాల ద్వారా కూడా తొందరగా నయం చేయవచ్చు. 2016లో ప్రచురితమైన ఒక అధ్యయనంలో కార్డియా మైక్సా పండులో అధికరక్తపోటును తగ్గించే లక్షణాలు ఉన్నాయని తేలింది. ఈ అధ్యయనం 5 వారాల పాటు నిర్వహించారు. ఈ పండ్ల సారం రక్తపోటు స్థాయిలను అదుపులో ఉంచగలదని, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించగలదని కనుగొన్నారు.
చర్మ వ్యాధులను నయం చేయగలదు :
వర్షాకాలంలో చర్మంపై కురుపులు రావడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా ఆడుకునే సమయంలో క్రిములు సోకే పిల్లల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. అలాంటి పరిస్థితిల్లో మీరు విరిగి చెట్టుకు సంబంధించిన ఆకులను తీసుకొచ్చి మెత్తగా నూరాలి. ఆ తర్వాత వ్యాధి సోకిన చర్మంపై రాయడం ద్వారా తొందరగా ఉపశమనం పొందవచ్చు. దురద, అలెర్జీ సమస్యలతో బాధపడుతున్న వారికి కూడా ఈ నక్కెర చెట్లు అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇందుకోసం విరిగి గింజలను మెత్తగా రుబ్బుకుని దురద ఉన్న చోట రాస్తే మంచి ఉపశమనం కలుగుతుంది.
గొంతు నొప్పిని నివారిస్తుంది :
మీకు గొంతునొప్పి ఉందా? గొంతునొప్పిని నయం చేసేందుకు విరిగి చెట్లు బెరడును నీటిలో వేసి బాగా మరిగించాలి. అనంతరం ఆ మిశ్రమాన్ని వడపోసి తాగేయాలి. ఇంకా ఇందులో రుచి కోసం నల్ల మిరియాలు, తేనెను కూడా కలుపుకోవచ్చు. వెంటనే మీ గొంతు నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. అంతేకాదు.. ఈ చెట్టు బెరడు కషాయం మహిళలకు పీరియడ్స్ నొప్పి నుంచి తొందరగా ఉపశమనం పొందవచ్చు.
నోటి ఆరోగ్యానికి అద్భుత ఔషధం :
ఏదైనా కొన్ని పదార్థాలు తిన్న తర్వాత చాలా మందికి చిగుళ్లు, పంటి నొప్పి ఇబ్బందిపెడతాయి. మొత్తం నోటి అనారోగ్యానికి కారణమవుతాయి. ఈ పండ్లను తినడం వల్ల నోటిపూత కూడా నయమవుతుంది. నోటి ఆరోగ్యంలో ఉపశమనం పొందడానికి విరిగి చెట్లు బెరడు పొడిని తీసుకుని, రెండు కప్పుల నీటిలో కలిపి ఆపై మరిగించాలి. అనంతరం ఈ పానీయాన్ని తీసుకోవాలి. ఇలా కొన్నిరోజులు చేయడం ద్వారా పంటి నొప్పి, అల్సర్లు, చిగుళ్ల వాపులు అన్నీ మాయమవుతాయి.

కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్ నుంచి భారీ ఉపశమనం :
ముఖ్యంగా ఆర్థరైటిస్ సమస్యతో ఇబ్బందిపడేవారికి ఈ నక్కెర పండ్లు అద్భుతంగా ఉపయోగపడతాయి. కీళ్ల నొప్పుల సమస్యలను నివారించడానికి ఈ పండ్లను ప్రతినిత్యం తీసుకుంటుండాలి. ఈ నక్కెర మొక్క ఆకులు అనాల్జేసిక్ లక్షణాలతో ఉంటాయి. కీళ్ల నొప్పుల నుంచి తొందరగా రిలీఫ్ అందిస్తాయి. నక్కెర పండ్లు, ఆకుల మిశ్రమాన్ని తలనొప్పి సమస్య నుంచి వెంటనే ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఒకవేళ ఈ నక్కెర పండ్లను తీసుకుంటే జీర్ణం అయ్యేందుకు చాలా సమయం పడుతుందని చెబుతారు. అందుకే ఈ పండ్లను ఎంత తక్కువ మోతాదులో తింటే అంత మంచిదని అంటున్నారు. రోజుకు కనీసం 10 విరిగి పండ్లు లేదా నక్కెర పండ్లను తింటే ఎలాంటి సమస్యలు ఉండవు.
జుట్టు సమస్యలకు విరిగి పండ్లు చక్కని పరిష్కారం :
వయస్సుతో సంబంధం లేకుండా మీ జుట్టు వెంటనే తెల్లగా మారితే.. ఈ బంక పండ్ల చెట్టు అద్భుతమైన ఔషధంగా ఉపయోగపడుతుంది. ఈ నక్కెర పండ్ల నుంచి తీసిన రసాన్ని మీ జుట్టుపై రాసుకోవడం ద్వారా తెల్లబడిన జుట్టు మళ్లీ నల్లగా మారడం జరుగుతుంది. అయితే, ఈ నక్కెర పండ్ల రసాన్ని నూనెతో కలిపి వాడుకోవచ్చు.
Note : ఈ ఆరోగ్య సమాచారం కేవలం హోం రెమెడీస్ మాదిరిగా అవగాహన కోసం మాత్రమేనని గమనించాలి. ఈ మూలిక ఔషధం లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉంటే ముందుగా మీ వైద్యుడిని సంప్రదించి సరైన చికిత్స తీసుకోవడం ఉత్తమం.
Read Also : Sharing Same Soap : మీ ఇంట్లో వారంతా ఒకే సబ్బును వాడుతున్నారా? తస్మాత్ జాగ్రత్త.. ఈ పొరపాటు అసలు చేయొద్దు..!