Balakrishna Trolls : నందమూరి నటసింహం బాలయ్య బాబుపై సోషల్ మీడియాలో భారీగా ట్రోలింగ్ అవుతోంది. ట్రోలర్స్ బాలయ్యను ఒక ఆట ఆడేసుకుంటున్నారు. హీరో విశ్వక్ సేన్, నేహా శెట్టి, అంజలీ నటించిన కొత్త మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఈ మూవీ గత మే 31న రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్ కోసం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు బాలకృష్ణ చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. ఈ సందర్భంగా బాలయ్య తనదైన శైలిలో స్పీచ్ అదరగొట్టారు. అదే వేదికగాపై అంజలి, నేహా శెట్టిపై బాలయ్య సరదగా మాట్లాడారు. ఈ క్రమంలో అంజలిని బాలయ్య పక్కకు గట్టిగా తోసేశారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ట్రోలర్స్ ఈ వీడియోను షేర్ చేస్తే ట్రోలింగ్ చేస్తున్నారు.
నిర్మాత నాగవంశీ, హీరో విశ్వక్ సేన్ కూడా దీనిపై క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. ఈ వివాదంపై హీరోయిన్ అంజలి కూడా గట్టిగానే స్పందించారు. బాలయ్యపై ట్రోలింగ్ వివాదంపై స్పందించకుండా పరోక్షంగా అంజలి కౌంటర్ ఇచ్చారు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీరిలీజ్ ఈవెంట్‌కు వచ్చినందుకు బాలకృష్ణ గారికి ధన్యవాదాలు అంటూ అంజలి ట్వీట్ చేసింది. బాలకృష్ణ గారికి అందరి పట్ల గౌరవం ఉందని, చాలాఏళ్లుగా మంచి స్నేహితులమని ట్వీట్‌లో పేర్కొంది.
Balakrishna Trolls : బాలకృష్ణపై ట్రోలర్లకు ఇచ్చిపడేసిన నటి అంజలి
చాలా రోజుల తర్వాత బాలయ్యతో మళ్లీ వేదికగా కలుసుకోవడం చాలా అద్భుతంగా ఉందన్నారు. బాలయ్యను ట్రోల్ చేస్తున్న క్లిప్ కూడా షేర్ చేస్తూ.. పరోక్షంగా కౌంటర్ ఇచ్చింది అంజలి. అంజలి కొత్త చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ప్రమోషన్‌లో బిజీగా ఉంది. కృష్ణ చైతన్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నటుడు-దర్శకుడు విశ్వక్ సేన్, నేహా శెట్టి, నాసర్, పి. సాయి కుమార్ తదితరులు నటించారు.

నెటిజన్ల రియాక్షన్ :
మైక్రోబ్లాగింగ్ సైట్‌లో ఈ వీడియో వైరల్ అయ్యింది. దాదాపు 657వేల కన్నా ఎక్కువ వ్యూస్, 6.5వేల లైక్‌లను పొందింది. ఈ పోస్ట్‌పై నెటిజన్లు అనేక రకాలుగా స్పందిస్తున్నారు. కొందరు విమర్శిస్తుంటే మరికొందరు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ‘ లిసా’ నటి బాలయ్యకు అండగా నిలబడనందుకు భారీగా ట్రోల్ అయింది. చాలా మంది ఆమె పట్ల సానుభూతి కూడా వ్యక్తం చేశారు.
అంజలీ.. మీకు మా సహాయం కావాలంటే త్వరగా రెండుసార్లు కళ్ళు రెప్పవేయండి. రక్షించండి.. అని ఒక యూజర్ చమత్కరించారు. మీరు సిస్టమ్‌కు వ్యతిరేకంగా వెళ్లలేరని నాకు అర్థమైంది. ఎందుకంటే సిస్టమ్ అదుపులో ఉంది. మీరు మంచి అర్హత కలిగి ఉంటారు. ప్రభువు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఒకరోజు సమయం కోసం వేచి ఉండండని మరొకరు కామెంట్స్ చేశారు. లాంగ్ లివ్ ఫెమినిజం వేధింపులకు గురైన స్త్రీవాదులకు, మహిళలకు అంజలి అవమానకరమని మరొకరు వ్యాఖ్యానించారు.
Read Also : Pushpa 2 Update : పుష్ప గాడు వస్తున్నాడోచ్.. రిలీజ్ ప్లానింగ్ అదిరిందిగా.. ఫైనల్ షూటింగ్ అప్‌డేట్!