Bigg Boss Season 8 Telugu : బిగ్‌బాస్ 8 తెలుగు కంటెస్టెంట్స్ వీళ్లేనట..? హౌస్‌లోకి వెళ్లేవారి లిస్టులో ఎవరెరు ఉన్నారంటే?

Bigg Boss Season 8 Telugu : బిగ్‌బాస్ 8 తెలుగు సీజన్ రాబోయే నెలల్లో మొదలుకాబోతోంది. ఈ టీవీ రియాల్టీ షో గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. బిగ్ బాస్ 8 సీజన్ గురించి సోషల్ మీడియాలో అనేక కథనాలు వినిపిస్తున్నాయి. రాబోయే 8 సీజన్ బిగ్‌బాస్ కంటెస్టెంట్ల గురించి ముందుగానే లీక్‌లు మీద లీక్‌లు వచ్చేస్తున్నాయి. బిగ్‌బాస్ ఇప్పటివరకూ తెలుగులో 7 సీజన్స్ పూర్తిచేసుకోగా.. మరికొద్ది నెలల్లో బిగ్ బాస్ 8 సీజన్ కూడా ప్రారంభం కానుంది.

దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్ల కోసం సన్నాహాలు మొదలయినట్టు తెలుస్తోంది. అయితే, ఈ కొత్త సీజన్‌లో వచ్చే కంటెస్టెంట్లలో ఎప్పటిలానే ఈసారి కూడా సీరియల్ యాక్టర్స్, యాంకర్స్, యూట్యూబ్ స్టార్స్, సోషల్ మీడియా స్టార్స్ అనేక రంగాల వారిని సెలెక్ట్ చేస్తుంటారు. ఇదివరకే బాగా జనాలకు తెలిసిన వారిని హౌజ్‌‌లోకి తీసుకొచ్చే అవకాశం కనిపిస్తోంది.

సోషల్ మీడియా ఫేమస్ అయిన వారే ఎక్కువ మంది ఉన్నారట. వీరిందరిన బిగ్‌బాస్ హౌస్‌లోకి తీసుకొచ్చేందుకు భారీగానే ప్లాన్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. బిగ్‌బాస్ సీజన్ 7 సక్సెస్ తరహాలో రాబోయే బిగ్‌‌బాస్ 8 సీజన్ తెలుగు కూడా అంతకంటే సక్సెస్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఈ సీజన్‌కు సంబంధించి అవసరమైన ప్రణాళికలు కూడా సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. రాబోయే సీజన్ గురించి కంటెస్టెంట్లను ఒక్కొక్కరిగా ఎంపిక చేస్తున్నారట.

Bigg Boss Season 8 Telugu : బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8 కంటెస్టెంట్లు వీరేనా?

ఇందుకోసం కంటెస్టెంట్లతో చర్చలు కూడా జరుపుతున్నారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే, బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్లు గురించి కొన్ని పేర్లు కూడా నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. వాస్తవానికి ఇప్పటివరకూ బిగ్ బాస్ నిర్వాహాకులు 8 సీజన్ కంటెస్టెంట్ల ఎవరు అనేది అధికారికంగా రివీల్ చేయలేదు. కానీ, కంటెస్టెంట్లు వీళ్లే అంటూ ఒక లిస్టు మాత్రం తెగ వైరల్ అవుతుంది. ఆ జాబితాలో టీవీ యాంకర్లలో నిఖిల్, నయని పావని, అంజలి పవన్, వింధ్య విశాక ఉన్నారట..

Bigg Boss Season 8 Telugu Contestants Complete List Out Viral
Bigg Boss Season 8 Telugu Contestants ( Photo Credit : Google)

అంతేకాదు.. యూట్యూబర్ల నుంచి జబర్దస్త్ కమెడియన్ల వరకు చాలామంది ఇందులో ఉన్నారట. జబర్తస్ కమెడియన్ కిరాక్ ఆర్పీ, అమృతా ప్రణయ్, రీతూ చౌదరితో పాటు కుమారి ఆంటీ, అనీల్ గీలా, బర్రెలక్క పేర్లు కూడా వినిపిస్తున్నాయి. జబర్దస్త్ కమెడియన్లలో బుల్లెట్ భాస్కర్, యూట్యూబర్ బమ్ చిక్ బబ్లూ, హీరో సోనియా సింగ్, హీరోయిన్ కుషితా కల్లపు, అలాగే సురేఖా వాణి కుమార్తె సుష్రిత పేర్లు కూడా ఈ లిస్టులో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.

బిగ్ బాస్ 8 సీజన్ హౌస్‌లోకి వీరంతా వెళ్లనున్నారంటూ పుకార్లు వినిపిస్తున్నాయి. బిగ్ బాస్ నిర్వాహకులు అధికారిక కంటెస్టెంట్ల లిస్టును రిలీజ్ చేసేవరకు ఈ పుకార్లకు బ్రేక్ పడేలా కనిపించడం లేదు. అధికారిక బిగ్ బాస్ 8 సీజన్ లిస్టులో కూడా వీరందరి పేర్లు ఉంటాయా? లేదా అనేది తెలియాలంటే అప్పటివరకూ ఆగాల్సిందే.

Read Also : Balakrishna Trolls : బాలకృష్ణపై భారీ ట్రోలింగ్.. ఒక్కమాటతో గట్టి కౌంటర్ ఇచ్చిన హీరోయిన్ అంజలి..!