Pushpa 2 Couple Song : ఆరు భాషల్లో మిలియన్ల వ్యూస్‌తో పుష్ప 2 కపుల్ సాంగ్ రికార్డు.. అగ్రస్థానంలో పుష్ప పుష్ప టైటిల్ సాంగ్!

Pushpa 2 Couple Song Record : టాలీవుడ్ ఐకన్ స్టాన్ అల్లు అర్జున్‌, హీరోయిన్ ర‌ష్మిక మంద‌న్నా జంటగా నటించిన పుష్ప మూవీ అఖండ విజయాన్ని అందుకుంది. పుష్ప సీక్వెల్‌తో పుష్ప-2 ది రూల్ మూవీ రాబోతోంది. అయితే, ఈ మూవీకి సంబంధించి రెండో సాంగ్ ఇటీవల రిలీజ్ అయింది. కొద్దిగంటల్లోనే ‘సూసేకి అగ్గి రవ్వలా’ సాంగ్ భారీ రెస్పాన్స్ అందుకుంది. అంతకంటే ముందు వచ్చిన మొదటి పుష్ప టైటిగ్ సాంగ్ కూడా అదే రేంజులో అభిమానులను ఆకట్టుకుంది.

పుష్ఫ ది రూల్ మూవీలో ‘సూసేకి అగ్గి రవ్వలా ఉంటాడే నా సామీ’ క‌పుల్ సాంగ్ ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది. ఈ పాట‌లో అల్లు అర్జున్, రష్మిక తమదైన హవాభావాలతో స్టెప్స్ ఇరగదీశారు. ఈ పాటలో హుక్ స్టెప్స్ మరింతగా ఆకట్టుకుంటుంది. ఇప్పుడు ఈ సూసేకి సాంగ్ సరికొత్త రికార్డు సృష్టించింది.

6 వేర్వేరు భాషల్లో 100 మిలియన్లకుపైగా వ్యూస్ :
ప్రత్యేకించి ఇన్‌స్టాగ్రామ్‌లో లక్షలకుపైగా రీల్స్ ట్రెండ్ అయ్యాయి. అద్భుతమైన రెస్పాన్స్‌తో ఈ కపుల్ సాంగ్ నెట్టంట్లో దూసుకుపోతుంది. ఇప్పుడు ఎక్కడా చూసినా పుష్ప మూవీ పాట‌లే దేశంలో ట్రెండింగ్ అవుతున్నాయి. పుష్ప 2 మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందించారు. ఈ కపుల్ సాంగ్ మొత్తం 6 వేర్వేరు భాషల్లో 100 మిలియన్ల వ్యూస్ మార్క్ దాటేసింది.

Pushpa 2 Couple Song And Title Song Creates new record with 100 million views in Telugu
Pushpa 2 Couple Song ( Photo Credit : Google )

అంతేకాదు.. 2.26 మిలియన్లకు పైగా లైకులను క్రాస్ చేసింది. ది కపుల్ సాంగ్ కొద్దిరోజుల్లోనే 53 మిలియన్ల వ్యూస్ సాధించగా, 1.16మిలియన్ల లైకులను సాధించి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. తద్వారా ప్రపంచ చార్ట్‌బస్టర్‌‌గా మారింది. పుష్ప మూవీ పాటలు రిలీజ్ అయినప్పటి నుంచి మిలియన్ల మంది ట్యూన్లకు హుక్ స్టెప్ చేయడంతో మరింత వైరల్‌గా మారింది.

Pushpa 2 Couple Song Record : కపుల్ సాంగ్ పాడిన సింగర్ శ్రేయాఘోషల్ :

క‌పుల్ సాంగ్ పాట‌ను టాప్ సింగ‌ర్ శ్రేయాఘోష‌ల్ మొత్తం ఆరు భాష‌ల్లో పాడారు. గ‌తంలో పుష్ప శ్రీ‌వ‌ల్లి పాట కూడా బాగా పాపులర్ అయిన సంగతి తెలిసిందే. ఆ పాటలోని శ్రీవల్లి నా సామి స్టెప్ ఇప్పటికీ కూడా ట్రెండ్ అవుతోంది. సుకుమార్ దర్శకత్వం వహించిన పుష్ప మూవీ వచ్చే ఆగస్టు 15న థియేటర్లలోకి రానుంది. ఈ మూవీ రిలీజ్ కాకముందే భారీ అంచనాలు నెలకొన్నాయి. పుష్ప 2 మూవీలో కూడా అదే నటులు కనిపించనున్నారు. ఫహాద్ ఫాసిల్ లీడ్ రోల్ పోషిస్తుండగా.. అనసూయ భరద్వాజ్, సునీల్, ధనంజయ, రావు రమేష్ కూడా క‌నిపించ‌నున్నారు.

అగ్రస్థానంలో పుష్ప పుష్ప టైటిల్ సాంగ్ :
వాస్తవానికి, ఇటీవల, ఒక జర్మన్ ఇన్‌ఫ్లుయెన్సర్ ముంబైలోని లోకల్ ట్రైన్‌లో ‘పుష్ప పుష్ప’ పాటపై వీడియోను రూపొందించాడు. ఇప్పుడా వీడియో కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. మొత్తానికి పుష్ప సినిమా పాటలు వైరల్ సెన్సేషన్ మాత్రమే కాకుండా ప్రతిచోట అగ్రస్థానంలో నిలిచాయి.

ఇటీవల, అత్యధికంగా ప్లే చేసిన 50 తెలుగు పాటల జాబితాలో ‘పుష్ప పుష్ప’ అగ్రస్థానంలో నిలిచింది. ‘పుష్ప పుష్ప’ ‘ది కపుల్ సాంగ్’తో, రాక్‌స్టార్ డీఎస్పీ అద్భుతమైన సంగీతంతో మైమరిపించారు. ప్రపంచ ప్రేక్షకులతో కనెక్ట్ అయ్యేలా చేయడంలో మరోసారి దేవీశ్రీ ప్రసాద్ నిరూపించుకున్నాడు. ‘పుష్ప 2: ది రూల్’ తో మరో జాతీయ అవార్డు కూడా గెలుచుకుంటాడని కంపోజర్ అభిమానులు భావిస్తున్నారు.

Read Also : Pushpa 2 Video Song : పుష్ప‌ 2 మూవీ నుంచి ‘సూసేకి అగ్గిరవ్వ’ రెండో సాంగ్ చూశారా? శ్రీవల్లి అదరగొట్టిందిగా!