Gomatha Puja Benefits : గోమాతకి ఏ వారం ఎలాంటి ఆహారాన్ని పెడితే లక్ష్మీ కటాక్షం కలుగుతుందో తెలుసా?

Gomatha Puja Benefits : గోమాతకి ఏ రోజు ఏ ఆహారం తినిపిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసా? అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని పొందాలంటే గోమాతకు ఎలాంటి ఆహారం పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఎప్పుడైనా సరే ఆదివారం రోజు గోమాతకు ఆహారం తినిపించేటప్పుడు నానబెట్టిన గోధుమలు, బెల్లం గోవుకు తినిపించండి. ఇలా చేస్తే ఉద్యోగంలో తొందరగా ప్రమోషన్లు వస్తాయి. తండ్రి తన ఆస్తిపాస్తులన్ని తొందరగా చేతికి అందుతాయి. రాజకీయ రంగంలో మంచి అధికార పదవులు వస్తాయి. అనారోగ్య సమస్యలతో తీవ్రతను తగ్గింప చేసుకోవచ్చు. ఈ ప్రయోజనాలన్నీ కలగాలంటే ఆదివారం రోజు నానబెట్టిన గోధుమలు బెల్లం ఆవుకాహారంగా తినిపించాలి.

అలాగే, సోమవారం రోజు గోమాతకి నానబెట్టిన బియ్యం, అరటిపండు ఆహారంగా తినిపించాలి. ఇలా చేస్తే మానసిక అశాంతిని తొలగింప చేసుకోవచ్చు. మానసికంగా చక్కటి ప్రశాంతత కలుగుతుంది. అలాగే, ఇంట్లో పిల్లలకి బాలారిష్ట దోషాల వల్ల చెప్పిన మాట వినకపోతే మొండితనంగా ప్రవర్తించడం, కిందపడి ఏడవటం, సన్నబడి పోవటం, చిక్కిపోవటం, దృష్టి దోషం ఇలాంటి సమస్యలు ఉన్న ఆ సమస్యలన్నీ పోవటానికి కూడా సోమవారం ఆవుకి అరటిపండు నానబెట్టిన బియ్యం ఆహారంగా తినిపించాలి.

Read Also :  Varahi Navratri 2024 : వారాహిదేవి పూజ రాత్రి వేళలోనే ఎందుకు చేస్తారో తెలుసా? అమ్మవారిని ఇలా ఆరాధిస్తే అన్ని విజయాలే..!

అలాగే మంగళవారం రోజు గోమాతకి నానబెట్టిన కందులు బెల్లం ఆహారంగా తినిపించాలి. ఇలా చేస్తే తొందరగా భూములు కొనుక్కుంటారు. తొందరగా గృహాలు కొనుక్కుంటారు. భూ లాభం, గృహలాభం కలగటానికి మంగళవారం నానబెట్టిన కందులు బెల్లం ఆవుకి తినిపించాలి. అలాగే, రియల్ ఎస్టేట్‌లో సరిగ్గా నడవట్లేదు అని భావించే వాళ్ళు కూడా రియల్ ఎస్టేట్ బ్రహ్మాండంగా నడవాలంటే మంగళవారం నానబెట్టిన కందులు బెల్లం ఆవుకి తినిపించాలి. భయంకరమైన అప్పులు ఉన్న వాళ్ళైనా సరే అప్పుల బాధలన్నీ పోవాలన్నా, కోర్టు సమస్యలు పోవాలన్నా తొందరగా గృహ యోగ లభించాలన్నా మంగళవారం నానబెట్టిన కందులు బెల్లం ఆవుకి ఆహారంగా తినిపించాలి.

Gomatha Puja Benefits And Food Offering To Cows in Telugu
Gomatha Puja Benefits ( Image Credit : Google )

అలాగే పిల్లల విద్యలో బాగా చదవాలన్నా విద్యల బ్రహ్మాండంగా రాణించాలన్నా, ఉద్యోగం లేని వాళ్లకు తొందరగా ఉద్యోగ లభించాలన్నా, వ్యాపారంలో నష్టాలు తొలగిపోయి వ్యాపారంలో లాభాలు రావాలన్నా బుధవారం పూట నానబెట్టిన పెసలు గోవుకాహారంగా తినిపించాలి. అదేవిధంగా గురువారం రోజు నానబెట్టిన సెనగలకు ఆహారంగా తినిపిస్తే.. తొందరగా పెళ్ళిళ్ళు అవుతాయి. పెళ్లి బాగా ఆలస్యం అవుతున్న వాళ్ళు ప్రతి గురువారం కూడా నానబెట్టిన సెనగల గోవుకాహారంగా తినిపించండి. సొసైటీలో గొప్ప పేరు ప్రతిష్టలు రావటానికి కూడా గురువారం నానబెట్టిన సెనగలను అవకాహారంగా తినిపించండి.

Gomatha Puja Benefits : గోమాతకు ఈ నైవేద్యాలు పెడితే అదృష్టమే..

అలాగే ఎప్పుడు భార్యాభర్తల మధ్య గొడవలు ఎక్కువగా అవుతున్న వాళ్ళు భార్యాభర్తల మధ్య గొడవలు అన్నీ తగ్గిపోవాలంటే శుక్రవారం పూట నానబెట్టిన అలసందలు అంటే.. నానబెట్టిన బొబ్బర్లు ఆహారంగా తినిపించాలి. అలాగే, సినిమా రంగంలో టీవీ రంగంలో మీడియా రంగంలో సక్సెస్ అవ్వాలని భావించేవాళ్ళు.. కళా రంగంలో బ్రహ్మాండంగా కొత్త అవకాశాలు రావాలని భావించే వాళ్ళు కూడా శుక్రవారం పూట నానబెట్టిన అలసందలు బొబ్బర్లను ఆవుకు తినిపించండి.

ఎంత కష్టపడుతున్న ఫలితం లేదు. కష్టానికి తగిన ప్రతిఫలం లేదని బాధపడే వాళ్ళు శనివారం రోజు గోమాతకి నువ్వులు బెల్లం కలిపి చిమ్మిరి ఆహారంగా తినిపించండి. అలాగే, ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ఇలాంటి శని దోషాలు కూడా శనివారం రోజు గోమాతకి నువ్వులు బెల్లం కలిపి ఆహారంగా తినిపించండి. తొందరగా విదేశాలకు వెళ్లాలని భావించే వాళ్ళు ఫారిన్ ఛాన్సెస్ తొందరగా రావాలన్నా ఫారిన్‌లో పర్మినెంట్‌గా సెటిల్ అవ్వాలన్నా, వీసా రావాలన్నా ఫ్రెండ్స్‌తో కలిసి ఏమైనా స్టార్ట్ చేసేటప్పుడు బ్రహ్మాండంగా సాగాలన్నా ఆదివారం నానబెట్టిన మినపప్పు గోవుకి ఆహారంగా తినిపించండి.

అలాగే, అనుకోకుండా, ఊహించకుండా హఠాత్తుగా ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి. ఆ ప్రాబ్లం నుంచి బయట పడాలన్నా, తల్లిదండ్రులకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు తగ్గిపోవాలన్నా మంగళవారం ఆవుకి నానబెట్టిన ఉలవలను ఆహారంగా తినిపించాలి. ఇలా వారంలో వచ్చే ఏడు రోజుల్లో మీ సమస్యను బట్టి గోమాతకు ప్రత్యేకమైన ఆహారం తినిపించండి. సకల దేవతా స్వరూపమైన గోమాత అనుగ్రహం వల్ల ఆ సమస్యల నుంచి సులభంగా బయటపడండి.

Read Also : Dream Snake : కలలో ఈ పాము ఇలా కనిపిస్తే.. తొందరగా కోటీశ్వరులు అవుతారట!