Dream Snake : సాధారణంగా కలలో అప్పుడప్పుడు పాములు కనిపిస్తూ ఉంటాయి. అయితే, పాములు ప్రత్యేకంగా కలలో కనిపిస్తే రాజయోగం పడుతుందట.. ఇదే విషయాన్ని స్వప్న సిద్ధాంతంలో చెప్పారు. ఎప్పుడైనా కలలో తెల్లపాము కనిపిస్తే.. చాలా మంచిది. శ్వేత సర్పం కనిపిస్తే.. శివుడి అనుగ్రహం వల్ల కష్టాల నుంచి తొందరగా బయటపడతారు. జీవితంలో విజయం సాధిస్తారు. అలాగే కలలో త్రాచుపాము కనిపిస్తే చాలా మంచిది. అసలు త్రాచుపాము కలలో కనిపించిన వాళ్లకి తొందరలోనే విశేషమైనటువంటి ధనలాభం, సంపద కలుగుతాయి. విపరీతమైన రాజయోగం పడుతుంది. అలాగే సంఘంలో గౌరవమర్యాధలు కూడా పెరుగుతాయి. ఎప్పుడైనా కలలో పాము కనిపించినప్పుడు పాము తలా తోక మొత్తం కనిపించినా కూడా అదృష్టమే.
సర్పం తల నుంచి తోక వరకు మొత్తం కలలో కనిపిస్తే.. తొందరలోనే ధనప్రాప్తి కలుగుతుందని అర్థం చేసుకోవాలి. అలాగే ఎప్పుడైనా కలలో మీకు పాము పుట్ట లోపలికి వెళ్తున్నట్టుగా కనిపిస్తే మాత్రం కచ్చితంగా తొందరలోనే ధనయోగం కలుగుతుందని స్వప్న సిద్ధాంతంలో చెప్పారు. ఎప్పుడైనా మీకు కలలో పాము వెంటాడుతున్నట్టుగా కనిపిస్తే ఉన్న డబ్బులు మొత్తం పోతాయి. అలాగే ఎప్పుడైనా కలలో పాము చెట్టు ఎక్కినట్టు మీకు కనిపిస్తే.. తొందరలోనే జీవితంలో డెవలప్ అయి విశేషమైనటువంటి ధన యోగం కలుగుతుందని అర్థం.
అంతేకాకుండా చెట్టు నుంచి పాము కిందకు దిగుతున్నట్టుగా కల వస్తే.. మీరు ఉన్న పొజిషన్ మొత్తం డౌన్ అయిపోయి చాలావరకు ధన నష్టం కలుగుతుందని అంటారు. అందుకే, స్వప్న సిద్ధాంతం ప్రకారం.. ఎప్పుడైనా కలలో మీకు ఒక దేవాలయంలో పాము ఉన్నట్టుగా కలలో కనిపిస్తే మాత్రం చాలా అద్భుతమైన రాజయోగం పడుతుంది. మీ కోరికలు ఒకదాని తర్వాత మరొకటి తీరుతూ ఉంటాయని స్వప్న సిద్ధాంతంలో చెప్పారు.
Dream Snake : కలలో చనిపోయిన పాము కనిపిస్తే దోషమా?
ఇంట్లో పాము ఉన్నట్టు కలలో కనిపిస్తే.. తొందరలోనే శుభఫలితాలు కలుగుతాయి. అలాగే మీకు కలలో పాములు కొట్టుకుంటున్నట్టుగా వస్తే.. భవిష్యత్తులో సామాజిక సమస్యల కోసం పోరాడుతారు. ఒక సమస్య కోసం భవిష్యత్తులో సమాజం కోసం కచ్చితంగా పోరాడతారని ఈ కలను మనం ఉదాహరణగా తీసుకోవాలి. అలాగే ఎప్పుడైనా కలలో చనిపోయిన పాము కనిపిస్తే మాత్రం అది దోషంగా పరిగణించాలి. మీకు ఇబ్బందులు రాబోతున్నాయని అర్థం. అలాంటప్పుడు శివాలయానికి వెళ్లి రుద్రాభిషేకం చేయించుకోవాలి.

అప్పుడు ఆ కల వల్ల వచ్చిన చెడు ఫలితాల నుంచి బయటపడొచ్చు. అలాగే ఎప్పుడైనా పాము ఇంటి పైకప్పు నుంచి కింద పడ్డట్టుగా కలలో కనిపిస్తే.. ఇంట్లో వాళ్లకి ఒక అనారోగ్యం రాబోతుందని అర్థం చేసుకోవాలి. అలాంటప్పుడు కూడా శివాలయానికి వెళ్లి రుద్రాభిషేకం చేయించుకోవాలి. అలా చేయించుకుంటే ఈ నెగటివ్ వైబ్రేషన్ అనేది తగ్గిపోతుంది. అలాగే ఎప్పుడైనా పాము అగ్నిలో పడినట్టుగా కలలో కనిపిస్తే.. విపరీతంగా ఇంట్లోకి ధనం కరిగిపోతుందని ఈ కళకు అర్థం.
స్నేహితుల వల్ల గాని బంధువుల వల్ల గాని ఇబ్బంది ఎదుర్కోబోతున్నారు తస్మాత్ జాగ్రత్త అని అర్థం చేసుకోవాలి. అసలు మనం పాముని కలలో చూడగానే మనకు బాగా భయమేస్తే.. మీ స్నేహితులు గాని బంధువులు కానీ మీకు ఏదో ఒక సమస్య చేయబోతున్నారని అర్థం. అందుకే మీరు ఎప్పుడైనా కలలో పామును చూసి భయపడ్డారు అనుకోండి.. వెంటనే తొందరలోనే సుబ్రహ్మణ్యస్వామి ఆలయానికి వెళ్లి ఒకసారి అభిషేకం చేయించుకోవాలి. లేకపోతే స్నేహితులు గాని బంధువులు కానీ ఏదో ఒక సమస్యలో మిమ్మల్ని ఇరికిస్తారని స్వప్న సిద్ధాంతం ఈ కల ద్వారా తెలియజేస్తోంది.
ఇలా పాములు కలలో కనిపిస్తే ప్రత్యేకమైనటువంటి రాజయోగాలు పడతాయి. ఆ పాము తరచుగా కలల వల్ల చక్కటి శుభ ఫలితాలు కలుగుతాయి. ఆశుభమైన సర్పాలు కలలో వచ్చినప్పుడు ఆ దోషాన్ని తొలగించుకోవడానికి మీ ఇష్టదైవానికి పూజించి ఏదైనా దేవాలయానికి వెళ్లి అభిషేకం వంటి పూజలు చేయించుకోవాలి. అలా కలలో పాములు కనిపించడం ద్వారా కలిగే అశుభ ఫలితాల నుంచి జీవితంలో రాబోయే సమస్యల నుంచి తొందరగా బయటపడవచ్చు.
Read Also : Money Remedies : డబ్బులు ఇలా లెక్కపెడుతున్నారా? ఈ తప్పులు అసలు చేయొద్దు.. లక్ష్మీదేవి ఇంట్లో ఉండదు!