Vodafone Idea Share Price : కుప్పకూలిన వొడాఫోన్ ఐడియా షేర్లు.. గోల్డ్‌మన్ సాచ్స్ నివేదిక..!

Vodafone Idea Share Price : ప్రముఖ గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ సంస్థ గోల్డ్‌మన్ సాచ్స్ (Goldman Sachs) 83 శాతం తగ్గుదల అంచనా వేయడంతో భారత మూడవ అతిపెద్ద టెలికాం ఆపరేటర్ వొడాఫోన్ ఐడియా షేర్లు శుక్రవారం (సెప్టెంబర్ 6)న ఒక్కసారిగా 11 శాతానికిపైగా క్షీణించాయి. ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ కంపెనీ రాబోయే మూడు లేదా నాలుగు సంవత్సరాలలో వోడాఫోన్ ఐడియా (VI) మార్కెట్ వాటాలో మరో 300 బేసిస్ పాయింట్లను కోల్పోతుందని అంచనా వేసింది.

తటస్థ నగదు ప్రవాహాన్ని కొనసాగించడానికి టెల్కో సగటు ఆదాయం (ARPU) ప్రస్తుతం రూ. 146తో పోలిస్తే రూ. 200 నుంచి రూ. 270కి పెరగాల్సి ఉంటుందని కూడా సూచించింది. గోల్డ్‌మన్ సాక్స్ తాజా పరిశోధన నివేదికలో టెలికాం కంపెనీలపై ఆందోళన వ్యక్తం చేయడంతో వొడాఫోన్ ఐడియా, ఇండస్ టవర్స్ షేర్లు భారీగా నష్టపోయాయి.

Vodafone Idea Share Price : టార్గెట్ ధర రూ. 350కి పెంపు :

గోల్డ్‌మ్యాన్ స్టాక్‌ను ‘న్యూట్రల్’ రేటింగ్ నుంచి ‘సెల్’కి డౌన్‌గ్రేడ్ చేసిన తర్వాత ఇండస్ టవర్స్ షేర్లు 6 శాతం పైగా పడిపోయాయి. అయితే, టార్గెట్ ధరను రూ. 220 నుంచి రూ. 350కి పెంచింది. గోల్డ్‌మ్యాన్ కంపెనీ ఫండమెంటల్స్, ప్రస్తుత వాల్యుయేషన్‌ల మధ్య డిస్‌కనెక్ట్‌ను గుర్తించారు. ఇండస్ టవర్స్ రీసెంట్ రీ-రేటింగ్ ఎక్కువైందని చెబుతోంది. ముఖ్యంగా, ఇండస్ టవర్స్ స్టాక్ గత ఆరు నెలల్లో 75 శాతానికి పైగా పెరిగింది.

ప్రస్తుతం రూ. 443 వద్ద ట్రేడవుతోంది. గోల్డ్‌మన్ సాచ్స్ టార్గెట్ ధర రూ. 350 కన్నా 26 శాతం ఎక్కువగా ఉంది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE)లో వోడాఫోన్ ఐడియా షేర్లు 11.2శాతం తగ్గి రూ. 13.3కి ట్రేడవుతున్నాయి. మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 90,889.8 కోట్లుగా ఉంది. బీఎస్ఈ(BSE)లో వోడాఫోన్ ఐడియా షేరు 11శాతం క్షీణించి, ఒక యూనిట్ రూ. 13.4కి చేరుకుంది.

వోడాఫోన్ ఐడియా FY26 నుంచి ఏజీఆర్/స్పెక్ట్రమ్-సంబంధిత చెల్లింపులను కలిగి ఉంది. ప్రభుత్వానికి కొంత బకాయిలను ఈక్విటీగా మార్చుకునే అవకాశం ఉన్నప్పటికీ, (ARPU) రూ. 200 నుంచి 270 (వివిధ పరిస్థితులలో 120 శాతం నుంచి 150 శాతం) వరకు పెరగాలని అంచనా వేసింది. వోడాఫోన్ ఐడియా ఇటీవలే ఫాలో-ఆన్ పబ్లిక్ ఆఫర్, ప్రమోటర్ల నుండి క్యాపిటల్ ఇన్ఫ్యూషన్ ద్వారా ఈక్విటీలో రూ.20,100 కోట్లు సేకరించింది.

అదనంగా మరో రూ.25వేల కోట్ల రుణాన్ని సేకరించాలని కంపెనీ యోచిస్తోంది. అయితే, గోల్డ్‌మన్ సాచ్స్ ప్రకారం.. వోడాఫోన్ ఐడియా ఫ్రీ క్యాష్ ఫ్లో స్టేబిలిటీని సాధించడానికి దాని సగటు ఆదాయం (ARPU) డిసెంబర్ 2024 నుంచి వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి 2.2 నుంచి 2.5 రెట్లు స్థాయిలకు పెరగాలి.

Read Also : Gold Investment 2024 : బంగారంలో పెట్టుబడి పెట్టడం మంచిదేనా? భారత్‌లో బంగారాన్ని ఎన్ని మార్గాల్లో పెట్టుబడి పెట్టొచ్చు!