Daily Horoscope 30th May 2024 : శ్రీక్రోధి నామ సంవత్సరం వైశాఖమాసం, ఉత్తరాయణం, వసంత రుతువు, గురువారం తిధి, సప్తమి, ఉదయం పదకొండు గంటల ఏడు నిమిషాల వరకు, నక్షత్రం.. ధనిష్ట.. ఉదయం ఏడు గంటల 20 నిమిషాల వరకు. వర్జ్యం.. మధ్యాహ్నం రెండు గంటల నాలుగు నిమిషాల నుంచి మూడు గంటల 34 నిమిషాల వరకు.. ధర్ముహూర్తం.. ఉదయం తొమ్మిది గంటల 50 నిమిషాల నుంచి 10:40 నిమిషాల వరకు.. తిరిగి మధ్యాహ్నం రెండు గంటల 53 నిమిషాల నుంచి సాయంత్రం మూడు గంటల 43 నిమిషాల వరకు.. అమృతకాలం.. రాత్రి 11:25 నిమిషాల నుంచి రాత్రి 1256 వరకు. రాహుకాలం.. మధ్యాహ్నం ఒంటిగంట 30 నిమిషాల నుంచి మూడు గంటల వరకు.. సూర్యోదయం.. ఉదయం 5:30 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6:16 నిమిషాలకు.. ఈరోజు విశేషం.. వైశాక గురువారం సప్తమి.
సకల కార్యాలకు శుభదినం గురువారం.. అలాగే సన్మార్గంలో నడవడానికి కూడా గురువారం చాలా విశేషమైన రోజగా చెప్పుకోవచ్చు. గురువారం నాడు దత్త ఆరాధన చేయడం దత్త ఉపవాసం చేయడం కూడా చాలా మంచిదని చెబుతున్నారు పండితులు. ఎవరైతే దత్తాత్రేయుడికి పూజ చేస్తారో వాళ్ళకి లాభదాయకమైన రోజు. అలాగే చాలామంది పిల్లలకు చదివినది గుర్తుండదు. ఇట్టే చదివింది మర్చిపోతారు.
అలాంటి పిల్లలు గురువారంనాడు దత్తాత్రేయుడికి పూజ చేయడం వల్ల చదివినవి గుర్తుంటాయి. అలాగే దక్షిణామూర్తి ఆరాధన కనక గురువారంనాడు చేస్తే.. ఉజ్వల భవిష్యత్తు వాళ్ళ సొంతమవుతుంది. అలాగే గురువారం రోజు సాయిబాబాని పూజించిన విశేషమైన ఫలితం ఉంటుంది. గురువారం నాడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరిని నిందించకూడదు. ముఖ్యంగా గురువులను అస్సలు నిర్ణయించకూడదని పండితులు అంటున్నారు. గురువారం గురుపూజ చేయడం చాలా పవిత్రమైనది.
జీవితంలో విద్యా, ఉద్యోగం, వివాహం, ఆర్థిక పురోగతి, సొంత ఇల్లు వంటి అనేక శుభాలకు గురువు అనుగ్రహం చాలా అవసరం. గురువారం ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేసి ధ్యానం చేయండి. సూర్య ఆజ్యం సమర్పించండి. పసుపు రంగు పూలతో శ్రీమహావిష్ణువును పూజించండి. శ్రీమన్నారాయణకు ఇష్టమైన పసుపు రంగులో ఉండే పండ్లు, పసుపు రంగు వస్త్రాలు సమర్పించండి.
‘ఓం నమో భగవతే వాసుదేవాయ నమః’ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. గురువారం స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపు కలుపుకోండి. గురువారం అరటి చెట్టును పసుపు కుంకుమతో పూజించండి. గురువారం ఉదయం నుంచి ఉపవాసం ఉండి సాయంత్రం శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోండి. గురుపూజ ప్రయోజనాలు ఉంటే జాతకంలో గురుబలం పెరుగుతుంది. అదృష్ట యోగం కలుగుతుంది. చేసే పనులు విజయం సిద్ధిస్తుంది. ఆర్థిక పురోగతి కలుగుతుంది. ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది. అఖండ ఐశ్వర్యం లభిస్తుంది. శుభాలు సకల కార్యసిద్ధి కలుగుతాయి. ఇక 12 రాశుల వారు ఈ రోజు ఎటువంటి ఫలితాలు కలుగుతాయో వివరంగా తెలుసుకుందాం..
Daily Horoscope 30th May 2024 : 12 రాశుల వారికి ఈరోజు ఎలాంటి ఫలితాలు ఉంటాయంటే? :
మేషరాశి :
ఈ రాశి వారికి ఈరోజు శ్రమను బట్టి ఫలితం ఉంటుంది. ఉపయోగకరమైన విషయాలు చర్చకు వస్తాయి. ఉద్యోగ వ్యాపారాలను ఒత్తిడి పెరుగుతుంది. వివాదాలకు తావివ్వకండి. అపార్థాలకు అవకాశం ఉంది. ఆర్థిక పరిపుష్య ఉంటుంది. కొన్ని విషయాలలో సంఘర్షణ ఏర్పడుతుంది. శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది. గతంలో తలపెట్టిన పనులకు ధనలాభ సూచనలు ఉన్నాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. దేవాలయాలను దర్శించుకుంటారు. బంధుమిత్రుల రాకపోకలతో ఖర్చులు పెరుగుతాయి. దూర ప్రయాణాలు చేస్తే సూచనలు ఉన్నాయి. సంతాన యోగానికి అవకాశం ఉంది. రెండవ ఆదాయం మార్గం ఏర్పడుతుంది. ఆరోగ్యానికి డోకా లేదు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. విద్యార్థులు చదువులో బాగా రాణిస్తారు.
వృషభ రాశి :
ఈ రాశి వారికి ఈరోజు ధనధాన్యాలు ఉంటాయి. అదృష్ట ఫలాలు అందుతాయి. విజ్ఞాలను సునాయాసంగా అధిగమిస్తారు. అనుకున్న సమయానికి పనులు పూర్తవుతాయి. మానసికృఢత్వం అవసరం. ప్రయత్నం ఫలిస్తుంది. కొందరు అడ్డుపడే ప్రయత్నం చేసిన అంతిమంగా కార్యసిద్ధి ఉంటుంది. మాట పట్టింపులకు పోవద్దు. పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి. విద్యార్థులు శ్రమకు తగిన ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగులు అధికారుల మన్ననలు అందుకుంటారు. స్నేహితులతో కార్యసిద్ధి ఉంటుంది. ఉత్సాహంతో పనులు చేస్తారు. సమయానుకూల నిర్ణయాలతో సత్ఫలితాలు సాగిస్తారు. చర్చలకు దూరంగా ఉండడం మంచిది.
రాజకీయ నాయకుల పలుకుబడి పెరుగుతుంది. కోర్టు కేసుల్లో అనుకూల తీర్పులు వెలబడతాయి. రావాల్సిన డబ్బు సమయానికి అందుతుంది. ఆదాయం పెరుగుతుంది. కానీ, అందుకు తగ్గట్టుగా ఖర్చులు కూడా పెరుగుతాయి. విహారయాత్రకు వెళ్తారు. వ్యాపారం ప్రారంభించగానే ఆటంకాలు పెరుగుతాయి. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. ఎవరికి ఏ విషయంలోనూ ఎక్కువ హామీలు ఇవ్వవద్దు. ఉద్యోగ వ్యాపారాల్లో కొంత ఒత్తిడి పెరుగుతుంది. అప్పులు తీరుస్తారు. ఇంటి కోసం కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. గణపతి దర్శనం శక్తినిస్తుంది. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మిశ్రమ ఫలితాలు అందుతాయి.
మిధున రాశి :
ఈ రాశి వారు ఈరోజు విజయానికి చేరువలో ఉంటారు. కష్టానికి తగ్గ ప్రతిఫలం అందుతుంది. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ముఖ్య కార్యాల్లో జాగ్రత్త అవసరం. మనోధైర్యం కాపాడుతుంది. ఆపదలు దూరమవుతాయి. అనవసరపు విషయాల్లో తలదూర్చవద్దు. నమ్మిన వారే ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. అంతరంగిక విషయాలను ఎవరితో చర్చించవద్దు. శ్రమ పెరుగుతుంది. అందుకు తగ్గ ఫలితం లభిస్తుంది. పెద్దల సలహాలు పాటించడం వల్ల పనులు నెరవేరుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలను పాల్గొంటారు. మనశాంతి కోసం విహారయాత్రలకు వెళ్తారు. మానసిక ఒత్తిడి తగ్గుతుంది.
ఆరోగ్యం మెరుగుపడుతుంది. పిల్లలు ఒకరికి మంచి ఉద్యోగం లభిస్తుంది. వివాహ ప్రయత్నంలో ఉన్నవారికి ప్రయత్నాలు కలుస్తాయి. అనుకొని ఖర్చులు చేసే సూచనలు ఉన్నాయి. డబ్బు విషయంలో ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. శనిదేవుని ఆరాధన చేయడం మంచిది. స్నేహితుడు మిమ్మల్ని అపార్థం చేసుకుని అవకాశం ఉంటుంది. ఎవరికీ ఏ విధంగా హామీలు ఇవ్వొద్దు. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి. కోర్టు కేసు ఒకటి పరిష్కారం అవుతుంది.విద్యార్థులు చదువు విషయంలో మరింత శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. లక్ష్మీ ధ్యానం శుభప్రదం. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మిశ్రమ ఫలితాలు అందుతాయి.
కర్కాటక రాశి :
ఈ రాశి వారికి ఈరోజు అంతా శుభం కలుగుతుంది. నిర్ణయాలు బంగారు భవిష్యత్తునిస్తాయి. మరింత ఉత్సాహం పెరుగుతుంది. ఉద్యోగంలో పెద్దల ప్రోత్సాహం లభిస్తుంది. సమస్యలకు చక్కటి పరిష్కారం దొరుకుతుంది. ఉత్తమ కార్యాలు చేస్తారు. సమాజంలో ప్రత్యేకమైన గుర్తింపు పొందుతారు. సంపదని వృద్ధి చెందుతాయి. శుభకార్య ప్రయత్నాలు పలుస్తాయి. రాబడి పెరుగుతుంది. ఆరోగ్యంగా ఉంటారు. కొత్త ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. లావాదేవీల విషయాల్లో జాగ్రత్త వహించడం అవసరం. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు పొందుతారు.
తీర్థయాత్రలు చేస్తారు. వాహన మూలంగా ఖర్చులు ముందుకు వస్తాయి. పాత బాకీలు వసూలు అవుతాయి. చేపట్టిన పనులు నిరాటంకంగా కొనసాగుతాయి. ఆదాయం పెరిగే సూచనలు ఉన్నాయి. భాగస్వామ్యంతో కొత్తగా వ్యాపారం ప్రారంభించడానికి ప్రయత్నాలు సాగిస్తారు. సొంత ఇల్లు కలిగి ఉంటారు. పలుకుబడి పెరుగుతుంది. ఉద్యోగంలో పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. విద్యార్థులు ఉత్తీర్ణతను సాధిస్తారు. లాయర్లకు డాక్టర్లకు అనుకూలమైన సమయం. టెక్నాలజీ నిపుణులకు విదేశాల నుంచి మంచి కబురు అందుతుంది. ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు.
సింహరాశి :
ఈ రాశి వారికి ఈరోజు ఆర్థికంగా అనుకూల ఫలితాలు ఉన్నాయి. కొన్ని విషయాల్లో నమ్మకంతో పనులు ప్రారంభించండి. అధిక వ్యయం అయ్యే అవకాశం ఉంది. ఆంజనేయ స్వామిని దర్శించుకోండి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆత్మీయుల రాకతో ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. పెండింగ్‌లో ఉన్న పనుల్లో కదలిక వస్తుంది. సమయాన్ని కూడా నిర్ణయాలతో లబ్ధి పొందుతారు. వ్యాపార భాగస్వామిల మధ్య అవగాహన పెరుగుతుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు విజయవంతమవుతాయి. రోజువారి కార్యకలాపాలు సజావుగా సాగుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.

పలుకుబడి పెరుగుతుంది. పలుకుబడి పెరుగుతుంది. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు ఏర్పడవచ్చు. కళాకారులకు మంచి సమయంగా చెప్పవచ్చు. రాజకీయ పరిచయాలు పెరుగుతాయి. రియల్ ఎస్టేట్ వారికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. మీ పనుల్లో భార్య పిల్లలు సహాయ సహకారాలు అందిస్తారు. బంధువులతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. విద్యార్థులు చదువులో బాగా శ్రద్ధ పడితే రానిస్తారు. వ్యాపారం సామాజిక సేవ రంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంటుంది. ఇష్టదేవతా దర్శనం శాంతినిస్తుంది. మొత్తానికి ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలను అందిస్తుంది.
కన్యారాశి :
ఈ రాశి వారికి ఈరోజు విజయం లభిస్తుంది. అదృష్టవంతులు అవుతారు. మంచి వృత్తిని సాధిస్తారు. ఆర్థికంగా శుభ ఫలితాలు వస్తాయి. అడుగడుగునా అడ్డుపడేవారు ఉంటారు. సమయానికి పనులు పూర్తి చేయగలిగితే ఏ సమస్య రాదు. గౌరవం పెరుగుతుంది. ముఖ్య వ్యక్తులతో సత్సంబంధాలు మీద దృష్టి పెట్టండి. వ్యతిరేకతల నుంచి బయటపడతారు. నలుగురికి సాయపడతారు. నలుగురిలో మంచి పేరు వస్తుంది. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఇంట్లోకి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆత్మీయుల సహకారం పొందుతారు. అదృష్టం కలిసివస్తుంది. గృహ నిర్మాణాధి కార్యక్రమాలు చేపడతారు. వ్యవసాయదారులకు ఆదాయం పెరుగుతుంది. సంతోషంగా ఉంటారు.
సహోద్యోగులతో సఖ్యతగా ఉంటారు. అధికారుల మన్ననలు అందుకుంటారు. పదోన్నతికి అవకాశం ఉంది. ఖర్చుల నియంత్రణ అవసరం. పెద్దల సూచనలు పాటిస్తారు. జీవిత భాగస్వామి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. బంధువులతో విభేదాలు కలుగుతాయి. కొన్ని సమస్యల కారణంగా ఇంట్లో చికాకుల బయలుదేరుతాయి. పని విషయంలో పైఅధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ప్రేమ వ్యవహారాలు ఫలించి విహారయాత్రలు చేస్తారు. విద్యార్థులు చదువులో ఇంకాస్త శ్రమ పడాల్సి ఉంటుంది. ఎవరికి ఏ విధంగా హామీలు ఇవ్వద్దు. వెంకటేశ్వర స్వామిని ధ్యానించండి. మొత్తంమీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి.
తులారాశి :
ఈ రాశి వారికి ఈరోజు శుభయోగాలు ఉన్నాయి. గొప్ప భవిష్యత్తుకు పునాదులు వేస్తారు. ఉద్యోగ వ్యాపారాల్లో అధిక లాభాలు ఉంటాయి. ప్రయత్నాన్ని బట్టి రెట్టింపు ఫలితం ఉంటుంది. సామరస్య ధోరణితో ముందుకు సాగండి. అంతా అనుకున్నట్టుగానే జరుగుతుంది. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. విద్యార్థులు శ్రమకు తగిన ఫలితాలను సాధిస్తారు. స్నేహితులు బంధువుల సహకారం లభిస్తుంది. ఆభరణాలు కొనుగోలు చేస్తారు.
విహార యాత్రలకు వెళ్తారు. మంచి రాబడి పెరుగుతుంది. ఖర్చుల నియంత్రణ అవసరం. వ్యాపారులకు మంచి సమయం. అయితే, కొత్త పెట్టుబడుల విషయంలో తొందరపాటు తగదు. తలపెట్టిన పనులు మొదట ఆటంకాలు వచ్చినప్పటికీ పూర్తవుతాయి. కోర్టు తీర్పులు అనుకూలంగా వెలుపడతాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కలిసివస్తుంది. సామాజిక కార్యకలాపాలు చురుగ్గా పాల్గొంటారు. లక్ష్మీ దర్శనం సంకల్ప సిద్ధిస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభఫలితాలు కూడా గోచరిస్తున్నాయి.
వృశ్చిక రాశి :
ఈ రాశి వారికి ఈరోజు సౌభాగ్య యోగం ఉంది. అవసరాలకు ధనం అందుతుంది. ఆశించిన ఫలితం వెంటనే లభిస్తుంది. వ్యాపారుల లాభం ఉంటుంది. అదృష్టం పడుతుంది. ఆస్తిని వృద్ధి చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగులకు పని భారం పెరుగుతుంది. అయితే, శ్రమకు తగిన ప్రతిఫలం పొందుతారు. పలుకుబడి ఉన్న వారితో పరిచయాలు ఏర్పడతాయి. స్నేహితులు ఆత్మీయులతో పనులు నెరవేరుతాయి.
భూముల కొనుగోలు ప్రయత్నాలు విజయవంతమవుతాయి. వ్యాపార భాగస్వామి దృష్టి సారించండి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. గణితం కంప్యూటర్ విద్యార్థులు చదువులో సులభంగా మంచి మార్కులు సాధిస్తారు. టెక్నాలజీ పరంగా సామాజిక సేవరంగాల్లో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. శివారాధన ఈరోజు వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి.
ధనస్సు రాశి :
ఈ రాశి వారు ఈరోజు బుద్ధి బలంతో పని చేయండి. సొంత నిర్ణయం రక్షిస్తుంది. తప్పనిసరైన పనులు అధిక శ్రద్ధ చూపండి. ఎవరిని నమ్మవద్దు. మోసపోయే ప్రమాదం ఉంది. బాధ్యతాయుతమైన ప్రవర్తన కష్టాలను బయటపడేస్తుంది. తలపెట్టిన పనులు అనుకున్న సమయంలో పూర్తవుతాయి. శుభకార్య ప్రయత్నాలు పూర్తవుతాయి. నలుగురిలో మంచి పేర్లు పొందుతారు. స్నేహితులతో పనులు నెరవేరుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొని నలుగురికి సహాయపడతారు.
విద్యార్థులకు మంచి సమయం. ఉద్యోగులకు పదోన్నతి స్థానచరణ సూచన ఉంటుంది. శ్రమ పెరిగిన అందుకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆరోగ్యంగా ఉంటారు. విదేశాల్లో ఉన్న సంతాన నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఉద్యోగంలో పైఅధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. సహోదయోగుల్లో కొందరు మీకు వ్యతిరేకంగా ప్రచారం చేసే అవకాశం ఉంది. సైన్స్ విద్యార్థులకు అనుకూలంగా ఉంది. శని దేవత ఆరాధన చేయడం శుభ ఫలితాలను ఇస్తుంది.
మకర రాశి :
ఈ రాశి వారికి ఈరోజు అర్ధ లాభం కలుగుతుంది. లక్ష్యాన్ని సకాలంలో చేరుతారు. బుద్ధిబలంతో విజయం లభిస్తుంది. ఎటువంటి సమస్యనైనా ఇట్టే అధిగమిస్తారు. బంధుమిత్రుల సహకారం ఉంటుంది. భూగృహ వస్తు వస్త్ర లాభాలు ఉన్నాయి. అన్ని ఇష్టాలు సిద్ధిస్తాయి. ఖ్యాతి లభిస్తుంది. ఒక ఆపద నుంచి తృటిలో బయటపడతారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలం గడుపుతారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. ఆరోగ్యంగా ఉంటారు. ప్రభుత్వ పనుల్లో కదలిక ఉంటుంది. రాజకీయంగా పలుకుబడి పెరుగుతుంది. రాబడి పెరుగుతుంది. ఖర్చులు కూడా అధికమవుతాయి. కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి.
ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతారు. నలుగురికి సాయపడతారు. గతంలోని మూలంగా ఆదాయం వస్తుంది. ఇంట్లో పెళ్లి రోజు శుభకార్యాలు జరిపే సూచనలు ఉన్నాయి. బంధుమిత్రుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. విద్యార్థులు అధ్యాపకుల ప్రశంసలు అందుకుంటారు. వివాహ ప్రయత్నాలు పలుస్తాయి. బంధువులతో కొన్ని విభేదాలు తలెత్తవచ్చు. కోర్టు కేసులు నెమ్మదిగా సాగుతాయి. ప్రేమ వ్యవహారాలలో ఎదురుచూపులు తప్పవు. సుబ్రమణ్య స్వామికి పూజ చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు. ఇష్ట దేవతారాధన ప్రశాంతతను ఇస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి.
కుంభరాశి :
ఈ రాశి వారు ఈరోజు ఆత్మవిశ్వాసంతో పనిచేసి అద్భుతమైన విజయాన్ని పొందుతారు. ఆనందం ఉత్సాహం లభిస్తాయి. గతంలో ఆగిన కొన్ని కార్యాలు ఇప్పుడు కార్యరూపాన్ని దాలుస్తాయి. సమస్యలు సాధ్యమతాయి. శ్రమ ఫలిస్తుంది. ప్రశంసలు పొందుతారు. ఆర్థికంగా కలిసి వచ్చే కాలమిది. ఉద్యోగంలో ప్రోత్సాహం ఉంటుంది. శుభవార్త ఆనందాన్నిస్తుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. శుభకార్య ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతారు. నలుగురు సహకారం లభిస్తుంది. ప్రయాణాల వల్ల కార్య సాఫల్యత ఉంటుంది. పట్టుదలతో పనులు చేస్తారు. కోర్టు కేసుల్లో కదలిక వస్తుంది.
స్నేహితులతో పనులు నెరవేరుతాయి. రైతులకు మంచి దిగుబడి వస్తుంది. పలుకుబడితో పనులు నెరవేరుతాయి. ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. వాయిదాలు ఉన్న పనులు పూర్తవుతాయి. కొనుగోళ్ల విషయంలో ఒక ముఖ్య నిర్ణయం తీసుకుంటారు. ఆరోగ్య ఆదాయ విషయాలు ఎటువంటి లోటు ఉండదు. నమ్మకం పెట్టుకున్న స్నేహితులు మోసం చేసే అవకాశం ఉంది. రెండో ఆదాయ మార్గం గురించి ఆలోచిస్తారు. అప్పులు తీరుస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలో ఆశించిన ఫలితాలు పొందుతారు. ఇరుగుపొరుగు నుంచి సహకారం అందుతుంది. ఇష్ట దైవ స్మరణ మేలు చేస్తుంది. మొత్తానికి ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి.
మీనరాశి :
ఈ రాశి వారికి ఈ రోజు శుభకాలం నడుస్తుంది. పనులు త్వరగా పూర్తవుతాయి. మనసులోని కోరిక నెరవేరుతుంది. అపార్ధాలకు అవకాశం లేకుండా స్పష్టంగా మాట్లాడండి. గౌరవం పెరుగుతుంది. ఉద్యోగం బాగుంటుంది. ఆదాయం పెరుగుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. శుభకార్య ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. గృహ నిర్మాణంపై మనసు నిలుపుతారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు.
వాహనం కొనుగోలు చేస్తారు. ఆత్మీయులతో మనస్పర్ధలు రావచ్చు. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. స్థలం కానీ ఇల్లు కానీ కొనే అవకాశం ఉంది. వివాహ సంబంధం కుదురుతుంది. ఆదాయం పెరుగుతుంది. స్త్రీలతో అనవసరపు పరిచయాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యానికి డోకా లేదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. పుణ్యక్షేత్ర సందర్శనకు అవకాశం ఉంది. సంతాన నుంచి శుభవార్తను వింటారు. సుబ్రమణ్యం ఆరాధన శ్రేష్టమైన ఫలితాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మంచి ఫలితాలు ఉంటాయి.