Today Horoscope 31th May 2024 : మే 31 రాశి ఫలాలు.. ఈ రోజు పంచాగం.. 12 రాశుల వారికి ఆర్థికపరంగా ఎలాంటి ఫలితాలు కలుగుతాయంటే?

Today Horoscope 31th May 2024 : ఈరోజు మే 31వ తేదీ.. శ్రీ క్రోధినామ సంవత్సరం వైశాఖమాసంలో శుక్రవారం తేదీ అష్టమి వచ్చింది. ఈరోజు ఉదయం 8 గంటల 46 నిమిషాల వరకు ఉంటుంది.నక్షత్రం శతభిషా. ఉదయం 5 గంటల 48 నిమిషాల వరకు.. వ్యర్జం ఉదయం 11:45 నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒక గంట 15 నిమిషాల వరకు. దుర్ముహూర్తం.. ఉదయం 8 నిమిషాల నుంచి 8 గంటల 59 నిమిషాల వరకు.. తిరిగి మధ్యాహ్నం 1:21 నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒక గంట 11 నిమిషాల వరకు. అమృతకాలం.. రాత్రి 9:16 నుంచి 10 గంటల 47 నిమిషాల వరకు. రాహుకాలం.. ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. సూర్యోదయం.. ఉదయం 5:30 వరకు. సూర్యాస్తమయం.. సాయంత్రం 6:16 నిమిషాల వరకు ఉంటుంది. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతారో వివరంగా తెలుసుకుందాం

మేషరాశి :
ఈరోజు ఈ రాశి వారికి శుభప్రదమైన కాలం. గౌరవం పెరుగుతుంది. సుఖసంతోషాలు ఉంటాయి. ఉద్యోగంలో కలిసి వస్తుంది. అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలు వేస్తారు. వ్యాపారంలో జాగ్రత్త వహించాలి. ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాలు ఉత్తమ భవిష్యత్తుని ఇస్తాయి. విదేశీ అన్న ప్రయత్నాలు పలుస్తాయి. కుటుంబంలో అనుకోకుండా లాభం ఏర్పడే అవకాశం ఉంటుంది. నిరంతర శ్రమ విజయం ఇస్తుంది.ధన యోగం సంపూర్ణంగా ఉంటుంది. గౌరవ మర్యాదలు అధికమవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబంలో ఆనందోసహాలు వెలుగరుస్తాయి. దేనికి కాలిక సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. నిరుద్యోగులకు మంచి కంపెనీలో ఉద్యోగం లభిస్తుంది. తలపెట్టిన పనుంది పూర్తి చేస్తారు.

దగ్గర బంధువు ఒక్కరికి ఆర్థికంగా సహాయపడతారు. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆదాయపరంగా వ్యాపారులకు బాగానే ఉంటుంది. పిల్లల వల్ల సంతోషం కలుగుతుంది. అద్భుత శక్తి సామర్థ్యాలను పొందగలుగుతారు. నూతన కార్యాలు ప్రారంభిస్తారు. విజయం సాధిస్తారు. శత్రు బాధలు ఉండవు. శుభవార్తలు వింటారు. అల్ప భోజనం వల్ల అనారోగ్యాన్ని పొందుతారు. ఆకస్మిక ధన లాభం ఉంటుంది. ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. కొద్దిగా మారడానికి చేసే ప్రయత్నాలు పలుస్తాయి. కొత్త ప్రయత్నాలు.. కొత్త నిర్ణయాలు ఉపకరిస్తాయి. ఆర్థిక లావాదేవీలు లాభాలను ఇస్తాయి. శివారాధన శక్తినిస్తుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని నిత్యం పూజించడం ద్వారా అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు. మొత్తంగా ఈరోజు రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి.

వృషభరాశి :
ఈరోజు ఈ రాశి వారు ఇష్ట కార్యాలు విశేషమైన ప్రగతిని సాధిస్తారు. ఆస్తికి సంబంధించి వివాదం నడుస్తుంటే.. సామరస్యంగా పరిష్కరించుకునే ప్రయత్నం చేయండి. అనుకున్న స్థాయికి చేరుతారు. అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఖర్చులు బాగా పెరుగుతాయి. గతంలో మీ వల్ల సహాయం పొందిన వారు మిమ్మల్ని ఆదుకుంటారు. ఉద్యోగంలో సానుకూల మార్పులు చేర్పులు చేసుకుంటాయి. నిరుద్యోగులకు చిన్నపాటి ఉద్యోగాన్ని లభిస్తుంది. ఎవరికీ హామీలు ఇవ్వద్దు. ఆకస్మిక ధన లాభం వచ్చే అవకాశం ఉంది. కొన్ని బాధలు ఉంటాయి. వృధా ప్రయాణాలు చేస్తారు. సన్నిహితులతో విరోధం ఏర్పడకుండా మెలగడం మంచిది. ఆర్థిక లావాదేవీల వల్ల ఇబ్బందులు కొంతవరకు తగ్గుతాయి. మహావిష్ణువు స్మరించండి.

మిధున రాశి :
ఈరోజు రాశి వారికి చాలా మంచి రోజు. జీవిత భాగస్వామి మద్దతుతో ఆర్థికపరమైన జీవిత భాగస్వామి మద్దతుతో ఆర్థికపరంగా పనులను చేపడతారు. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. కొన్ని కొత్త పనులు చేపడతారు. మంచి విజయాన్ని అందుకుంటారు. సొంత నిర్ణయం వద్దు. ప్రతిదీ కుటుంబ సభ్యులతో చర్చించండి. ఉద్యోగ అభివృద్ధి విశేషంగా ఉంటుంది. వ్యాపారంలో జాగ్రత్తలు పాటించాలి. బంధుమిత్రుల సూచనలు అవసరాలకు దూరంగా ఉండాలి. ఆకస్మిక ధన ప్రాప్తి గోచరిస్తుంది. ఆరోగ్యం చాలా వరకు మెరుగు పడుతుంది. బంధుమిత్రులతో కలిసి విందులో పాల్గొంటారు. పాజిటివ్‌గా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. నూతన కార్యాలు ప్రారంభిస్తారు. వీలైనంత వరకు అబద్ధాలు ఆడకుండా ఉంటే మంచిది. అనవసరపు భయాందోళనలకు గురికాకండి. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. అనుకున్న పనులు మిత్రుల సహాయంతో పూర్తవుతాయి. వ్యాపారంలో బాగా ఒత్తిడి ఉన్న దానివల్ల ప్రయోజనం పొందుతారు. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. దూర ప్రాంతాల్లో ఉన్న సంతాన నుంచి శుభవార్తను వింటారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది.

కర్కాటక రాశి :
ఈరోజు రాశి వారికి అదృష్ట యోగం ఉంది. ఎదురుచూస్తున్న పని పూర్తవుతుంది. సంపద పెరుగుతుంది. మీ ఆదాయం ఇంకా పెరుగుతుంది. ఆర్థికంగా బలపడే మార్గాలు పెరుగుతాయి. ఉద్యోగులు, పురోభివృద్ధి సాధిస్తారు. పనుల్లో స్పష్టత ఉండాలి. అపార్థాలకు తావింపకూడదు. ఓర్పుతో పనులు పూర్తి చేయండి. ధైర్యంగా ముందుకు వెళ్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఇంట్లో శుభకార్యాల గురించి ఆలోచిస్తారు. ఇంటికి బంధువుల రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. సమాజంలో పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. విదేశీ ప్రయత్నం సులభంగా నెరవేరుతుంది. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి.

ఆకస్మిక ధన లాభం చేకూరుతుంది. నూతన కార్యాన్ని వాయిదా వేసుకుంటారు. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. సామాజిక హోదా పెరుగుతుంది. ఆరోగ్యానికి ఆదాయానికి తిరుగులేదు. వృత్తి ఉద్యోగాలు తోటి వారి సహకారం అందుతుంది. శ్రమ ఫలిస్తుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. దైవభక్తి పెరుగుతుంది. అవసరానికి తగిన సహాయం అందుతుంది. ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండాలి. బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాల్లో పాల్గొంటారు. ఉద్యోగంలో మార్పులు చేర్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. విద్యార్థులు బాగా శ్రమ పడితే మంచి ఫలితం ఉంటుంది. కానీ, ఆశించిన స్థాయిలో ఫలితం ఉండదు. ఐటీ నిపుణులకు అధ్యాపకులకు అనే విధాల బాగుంటుంది. విష్ణు ఆరాధన మొత్తంగా ఈరోజు రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి.

Today Horoscope 31th May 2024 : 12 రాశులు ఈరోజు ఎలా కలిసి వస్తుందంటే?  

సింహరాశి :
ఈ రాశి వారికి ఈరోజు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఎటుచూసిన విషయమే ప్రోత్సహిస్తుంది. వెతుకుతున్నది.. దొరుకుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు వృద్ధి చెందుతాయి. ధర్మ మార్గంలో పైకి వస్తారు. లక్ష్యాలను సాధిస్తారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. సహన వహించడం అనేవి ఒక మంచి వార్తను వింటారు. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. సంపాదనకు అవకాశం ఉన్న ఉద్యోగం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. స్నేహితుల సహాయంతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. వ్యాపారుల ఆర్థిక పరిస్థితి మూడు పువ్వులు ఆరుకాయలుగా ఉంటుంది. వీలైనంతగా రుణ భారం తగ్గించుకుంటారు. వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. బంధుమిత్రులతో వైరం రాకుండా జాగ్రత్త వహించాలి. శారీరకంగా బాగానే ఉంటారు. విందులు వినోదాలు పాల్గొంటారు. వృత్తిని పనులకు సమయం బాగుంది. ఒక శుభకార్యంలో ఇష్టమైన బంధువులను కలుసుకునే అవకాశం ఉంది. కుటుంబంతో సంతోషంగా గడపడానికి ప్రాధాన్యతనిస్తారు. ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవడం ఎంతో ఉత్తమం. మొత్తంగా ఈరోజు ఈ రాశి ఫలితాలు అన్ని శుభపరంగా గోచరిస్తున్నాయి.

కన్య రాశి :
ఈరోజు రాశి వారికి చాలా మంచి రోజు. పాత వ్యాపార ఒప్పందం.. మీకు ఆకస్మిక లాభాలను ఇస్తుంది. మీ మనసు చాలా సంతోషంగా ఉంటుంది. సమాజంలోని కొంతమంది మంచి వ్యక్తులతో కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. కోఆపరేటివ్ సొసైటీలో పని చేసే వారికి శుభ సమయం. ఇంటి పనుల గురించి కుటుంబంతో చర్చిస్తారు. ఉద్యోగంలో ఉత్తమ ఫలితం ఉంటుంది. మొదలు పెట్టిన పనులు త్వరగా పూర్తవుతాయి. పెద్దల సహకారం లభిస్తుంది. దైవబలం విశేషంగా ఉంటుంది. ఈ సమయంలో చేసే పనులు సంతృప్తికర జీవితాన్ని ఇస్తాయి. మేలు చేసేవారు ఉంటారు. వ్యాపారంలో లాభాలు ధరించడానికి అవకాశం ఉంది. ఖర్చులను బాగా తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరిని నమ్మి ఆర్థిక బాధ్యతలను అప్పగించవద్దు.

Daily Horoscope 31th May 2024 _ Today Panchangam And Rasi Phalalu For 12 Zodiac Signs in Telugu
Daily Horoscope 31th May 2024 _ Today ( Photo Credit : Google )

తోటి వారితో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. వ్యాపార మూలంగా లాభం కలిగే అవకాశాలు ఉన్నాయి. వృధా ప్రయాణాలు ఎక్కువ చేస్తారు. కుటుంబ విషయాలు ఒక ప్రణాళికతో ఉంటారు. స్త్రీలు విశ్రాంతి తీసుకోవడం అవసరం. కొందరు పలుకుబడి ఉన్న వారితో పరిచయాలు ఏర్పడతాయి. బంధుమిత్రులకు సహాయంగా ఉంటారు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. లాయర్లకు డాక్టర్లకు చిన్న వ్యాపారులకు శ్రమ ఎక్కువవుతుంది. అడుగుపెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. అనవసరమైన ప్రయాణాలు వాయిదా వేసుకుంటే మంచిది. శివారాధన చేసుకోండి. మీకు అంతా మంచే జరుగుతుంది.

తులారాశి :
ఈ రాశి వారికి ఈరోజు శ్రేష్టమైన ఫలితం ఉంటుంది. శుభ సమయం నడుస్తుంది. మీ వ్యాపారం పుంజుకుంటుంది. లాభాలు వస్తాయి. కుటుంబ వాతావరణ బాగుండాలంటే మీ ఆలోచన విధానం మార్చుకోవాలి.విజయాలు వాటంతటావే వస్తాయి. ఉద్యోగ వ్యాపారాలు శ్రమ ఫలిస్తుంది. నూతన ప్రయత్నాలు పెట్టండి. సమాజానికి అవసరమైన పనులు చేసి విశేషమైన అభివృద్ధిని పొందుతారు. ఉద్యోగంలో బాధ్యతలు బాగా పెరుగుతాయి. ఆర్థికంగా బాగుంటుంది. చికాకులు ఉంటాయి. ప్రయాణాలు విరమించి కుటుంబంతో కొంత సమయం గడపడం మంచిది. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది. ఆకస్మిక ధన లాభంతో ఆనందాన్ని పొందుతారు. ఇతరులకు ఉపకారం చేస్తే కార్యాన్ని అవుతారు. స్త్రీల మూలికంగా లాభం ఉంటుంది. రుణ బాధలు తొలగిపోతాయి. ఆరోగ్యం మెరుగవుతుంది. కీలక సమస్యలను పరిష్కరించి అందరి మన్ననలు పొందుతారు. వృతి, వ్యాపారాల్లో ఉన్నవారు లాభాలు అర్పిస్తారు. ఇరుగుపొరుగు వారితో వివాదాల తలెత్తే అవకాశం ఉంది. ఈరోజు ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. ఎవరికీ డబ్బు ఇవ్వడం తెలుసుకోవడం చేయవద్దు. గణపతి ఆరాధన చేస్తే మంచిది. రాశివారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి.

వృశ్చిక రాశి :
ఈరోజు రాశి వారు దృఢ సంకల్పంతో లక్ష్యాన్ని చేరుకోవాలి. చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. వ్యాపారులు లాభపడతారు. అధికారుల ప్రోత్సాహం శక్తినిస్తుంది. సమాజంలో గుర్తింపు పొందుతారు. ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది. ఒక సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. డబ్బు ఇవ్వాల్సిన వారు ఇవ్వడంతో కొద్దిగా ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. ఉద్యోగ వ్యాపారాల నుంచి ఆదాయం నిలకడగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది. డాక్టర్లు, లాయర్లు, స్వయం ఉపాధి వారి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగంలో తోటి వారి సహకారం అందుతుంది. మీ ఆర్థిక స్తోమతకు మించి ఇతరులతో సహాయం చేస్తారు.

వృత్తి ఉద్యోగ రంగాల్లో కోరుకున్న అభివృద్ధి ఉంటుంది. ఆకస్మిక ధన లాభాన్ని పొందుతారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది. పిల్లలకు సంతోషం కలిగించే కార్యాలు చేస్తారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగులు మంచి ఉద్యోగం కోసం వేచి చూడక తప్పదు. పిల్లలు ఒకరికి దూర ప్రాంతానికి బదిలీ అయ్యే అవకాశం ఉంది. అదే ఇంట్లో ఉన్నవారు ఇల్లు మారుతారు. ప్రస్తుతానికి ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలను పెట్టుకోవద్దు. ఒక ముఖ్యమైన సమస్య పరిష్కారం అవుతుంది. సమయానికి సహాయం చేసేవారు ఉన్నారు. బంధుజను సహకారం ఉంటుంది. కళాకారులకు మీడియా రంగాల వారికి మంచి అవకాశాలు వస్తాయి. దేహాలంకరణకు ఎక్కువ ప్రాధాన్యతని ఇస్తారు. నూతన వస్తూ వస్త్ర ఆభరణాలు పొందుతారు. హనుమాన్ చాలీసా చదివితే మంచిది. మొత్తంగా ఈ రోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి.

ధనుస్సు రాశి :
ఈరోజు ఏ రాశి వారికి చాలా బాగుంటుంది. కోరుకున్న ఫలితం వెంటనే సిద్ధిస్తుంది. ఉత్తమ కార్యసిద్ధి ఉంటుంది. అధికారులతో సమన్వయంగా వ్యవహరించండి. సంఘర్షణలు తొలుగుతాయి. తొందరపడకుండా విసుగు చెందకుండా కృషి చేయాలి. ఆర్థిక స్తోమత పెరుగుతుంది. సమాజానికి మేలు జరిగే పనులు చేపడతారు. ఒక వ్యక్తిగత సమస్య నుంచి బయటపడతారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఏదైనా కొత్త వ్యాపారం చేయాలని తాపత్రయం పెరుగుతుంది. ఆదాయం పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు.

బంధుమిత్రులతో కలిసి విందులు పాల్గొంటారు. ముఖ్యమైన కార్యాలు పూర్తవుతాయి. సొంత నిర్ణయాలు ఉద్యమం కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి మంచి గుర్తింపు లభిస్తుంది. అధికార యోగానికి అవకాశం ఉంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్ వస్తుంది. రుణ ప్రయత్నాలు పలుస్తాయి. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. మానసిక ఆందోళన చెందుతారు. స్త్రీలకు స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి. బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. ముఖ్యమైన పనులకు కుటుంబ సభ్యుల సహాయం తీసుకోండి. ఇష్ట దేవతా స్మరణ మంచిది. మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి.

మకర రాశి :
ఈరోజు రాశి వారికి అన్ని విధాన మంచి కాలం. అతిపెద్ద సమస్యను చాలా సులభంగా పరిష్కరిస్తారు. ఆర్థికపరంగా గతంలో చేసిన ప్రయత్నాలు ఇప్పుడు పలుస్తాయి. మీ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఉద్యోగానికి సంబంధించి కొత్త వార్తలు వింటారు. వ్యాపారాలు ఉత్తమ ఫలితాలు ఉంటాయి. ఆర్థికంగా మేలు జరుగుతుంది. ధైర్యంగా నిర్ణయాలు తీసుకోండి. ఒక మంచి పనిచేసి ప్రశంసలు పొందుతారు. నూతన ప్రయత్నాల ద్వారా గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలో మేలు చేసేవారు ఉంటారు. ప్రతి వ్యాపారాలు నిలకడగా సాగుతాయి. ఆశించిన స్థాయిలో కాకపోయినా సంతృప్తికరంగా లాభాలు భరిస్తారు. కొత్త పరిచయాలు పెరుగుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. ఆకస్మిక ధన లాభం ఉంటుంది.

కుటుంబంలో ఆనందసహాలు లభిస్తాయి. బంధుమిత్రులతో కలుస్తారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. ప్రతి విషయంలో అభివృద్ధి ఉంటుంది. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. చేపట్టే పనులు మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. కొన్ని కీలకమైన ప్రణాళికలు వేస్తారు. వాటిని ప్రారంభించడంలో స్వల్ప ఆటంకాలను ఎదుర్కొంటారు. కుటుంబంలో ప్రశాంత వాతావరణ నెలకొంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. తలపెట్టిన పనులు చాలా వరకు పూర్తవుతాయి. బంధువుల అనారోగ్యం పట్ల కొంత ఆందోళన కలుగుతుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. వెంకటేశ్వర స్వామి సందర్శనం ఉత్తమం. ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి.

కుంభరాశి :
ఈ రాశి వారు ఈరోజు మనస్పూర్తిగా ఏ పని చేసినా కలిసి వస్తుంది. నమ్మకంతో పనులు మొదలుపెట్టండి. సంపాదన పెరుగుతుంది. మనసులో అనుకున్నదే చేయండి. కుటుంబ సభ్యులకు లభించే సూచనలు ఉన్నాయి. ఏ పని చేసినా పూర్తి చేస్తారు. మీ సీనియర్ల నుంచి ప్రయోజనం పొందుతారు. వృత్తిపరంగా ఉద్యోగ పరంగా పరిస్థితి బాగుంటుంది. వ్యాపారంలో శ్రమ ఉన్న తొందరపడవద్దు. తలపెట్టిన పనులు శ్రమ పడితే త్వరగా పూర్తవుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కుటుంబానికి సంబంధించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థికంగా అభివృద్ధికి మంచి అవకాశం ఉంది. చేస్తున్న ఉద్యోగంలో ఆశించిన గుర్తింపు లభిస్తుంది. అపకీర్తి రాకుండా జాగ్రత్త పడటం మంచిది. సోదరులతో వైరం పడకుండా మెలగాలి.

తలచిన కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. ఆర్థిక ఇబ్బందులు ఆలస్యంగా తొలగిపోతాయి. నూతన వ్యక్తుల జోలికి వెళ్ళకూడదు. ప్రస్తుతానికి ఉద్యోగం మారే ఆలోచన పెట్టుకోకండి. అందుకు సమయం అనుకూలంగా లేదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి వ్యాపారాల వారికి ఆర్థికంగా ఎంతో అనుకూలమైన సమయం. వ్యక్తిగత సమస్యలను లెక్కచేయకుండా బంధుమిత్రులకు సహాయపడతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. మానసిక ఆనందాన్ని పొందుతారు. వృత్తి ఉద్యోగ రంగాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. వాయిదా వేసిన కొన్ని పనులు ఈరోజు పూర్తి చేసుకోగలుగుతారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. మీ పని తీరుకు ప్రశంసల లభిస్తాయి. ఎవరికీ హామీలు పూచికత్తులు ఉండకూడదు. హనుమాన్ చాలీసా పారాయణ చేయడం మంచిది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలకు గోచరిస్తున్నాయి.

మీనరాశి :
ఈ రాశి వారికి ఈరోజు శుభ దినం. స్నేహితులతో సంబంధాలు మునుపటి కంటే మెరుగ్గా ఉంటాయి. ఇంట్లో మతపరమైన కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్రణాళికలు వేసుకుంటారు. మీ సంతానం కారణంగా సంతోషంగా ఉంటారు. బుద్ధి బలంతో అదృష్టాన్ని సొంతం చేసుకుంటారు. ఉద్యోగంలో మేలు జరుగుతుంది. వ్యాపార లాభాలు ఉంటాయి. బంధుమిత్రుల సహకారం అవసరం. సరైన నిర్ణయం ఇస్తుంది. వృత్తి వ్యాపారాలు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. నిరుద్యోగులు మంచి ఉద్యోగం కోసం మరికొంతకాలం నిరీక్షించాల్సి ఉంటుంది. ఎవరిని ఎక్కువగా నమ్మవద్దు. వ్యక్తిగతంగా ఆర్థిక పరిస్థితి కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. బంధువులు మీకు చేదోడు వాదోడుగా ఉంటారు. ప్రయత్న కార్యాలన్నీ వెంటనే ఫలిస్తాయి. ఆకస్మిక ధన లాభం ఏర్పడుతుంది. సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు.

నూతన వస్తూ ఆభరణాలు పొందుతారు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. రుణ బాధలు తొలగిపోతాయి. ధైర్య సాహసాలతో ముందుకు వెళ్తారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఈ రోజు ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. విద్యార్థులు మంచి ఫలితాలు పొందుతారు. ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీ కామర్స్ విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంటుంది. ఆకస్మిక ధన లాభం ఉంటుంది. కుటుంబంలో ఆనందోసహాలు నబిస్తాయి. బంధుమిత్రులతో కలుస్తారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. ఆరోగ్య వంతులుగా ఉంటారు. ప్రతి విషయంలో అభివృద్ధి ఉంటుంది. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. ఇష్టదైవారాధన శుభప్రదం మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి.

Read Also : Daily Horoscope 30th May 2024 : మే 30 పంచాగం.. ఈ 12 రాశులకు ఈరోజు ఎలా ఉంది? ఏ పనులు కలిసివస్తాయి? ఎలాంటి ఫలితాలు ఉంటాయంటే?