Daily Horoscope Today 6th June 2024 : ఈరోజు శనిజయంతి.. ఈ 12 రాశుల వారు శనిదేవుని అనుగ్రహంతో పాటు ఏయే ఫలితాలు కలిసివస్తాయంటే?

Daily Horoscope Today 6th June 2024 : ఈరోజు జూన్ 6వ తేదీ.. శ్రీక్రోధి నామ సంవత్సరం వైశాఖ మాసం, ఉత్తరాయణం, వసంత రుతువు, గురువారం, తిథి: అమావాస్య, సాయంత్రం 5 గంటల 58 నిమిషాల వరకు, నక్షత్రం: రోహిణి రాత్రి 8:35 వరకు. వ్యర్జం : మధ్యాహ్నం 12 గంటల 47 నిమిషాల నుంచి 2 గంటల 21 నిమిషాల వరకు, తిరిగి రాత్రి 2:08 నుంచి తెల్లవారుజామున 3 గంటల 44 నిమిషాల వరకు. దుర్ముహూర్తం: ఉదయం 9.47 నుంచి 10:39 నిమిషాల వరకు, తిరిగి 2.59 నిమిషాల నుంచి 3.51 నిమిషాల వరకు. అమృతకాలం: సాయంత్రం 5 గంటల 12 నిమిషాల నుంచి 6.64 నిమిషాల వరకు, రాహుకాలం: మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల నుంచి 3 గంటల వరకు, సూర్యోదయం: ఉదయం 5:36 వరకు, సూర్యాస్తమయం: సాయంత్రం 6:17 నిమిషాల వరకు.

ఈరోజు వైశాఖ బహుళ అమావాస్య. శనిజయంతి. అమావాస్యకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఈరోజున పేదలకు దానధర్మాలు చేస్తే అద్భుతమైన ప్రయోజనాలు దక్కుతాయి. వైశాఖ అమావాస్య రోజున శనిదేవుని ఆరాధన కూడా ముఖ్యమే. ఏటా వైశాఖ అమావాస్య తిధి రోజున శనిజయంతి నిర్వహిస్తారు. ఈ సంవత్సరం జూన్ 6వ తేదీ గురువారం రోజున శనిజయంతి వచ్చింది. ఈరోజు శనీశ్వరుని భక్తిశ్రద్ధలతో పూజిస్తే అనుగ్రహంతో కష్టాలు దూరమై అదృష్టం కలిసి వస్తుంది. అష్టమ శని అర్ధాష్టమ శని, ఇతర శని దోషాల బారిన పడిన వారికి లాభాలు పొందడానికి ఈరోజున శనిదేవుని పూజించడం చాలా మంచిది. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎలాంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం.

మేషరాశి :
ఈ రాశి వారు ఈరోజు ఉత్సాహంతో పనులు చేస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు. నూతన పెట్టుబడులకు అనుకూలమైన రోజు. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. కొత్త అవకాశాలతో సంతోషాన్ని పొందుతారు. వ్యాపార విస్తరణకు ప్రయత్నాలు చేస్తారు. అంతటా సుఖమే లభిస్తుంది. ఆకస్మిక ధన లాభం ఉంటుంది. బంధుమిత్రుల సహాయ సహకారాలు లాభిస్తాయి. ఉద్యోగంలో సంతృప్తి పొందుతారు. నూతన వస్తూ,ఆభరణాలు కొనుగోలు చేస్తారు.

డబ్బు విషయంలో జాగ్రత్త అవసరం. వృధా ఖర్చులు ఉండవచ్చు. ఆస్తి, వివాదాలు పరిష్కారం అవుతాయి. శుభకాలం నడుస్తుంది. ఇప్పుడు చేసే పనులు గొప్ప ఫలితాన్ని ఇస్తాయి. ఉద్యోగ వ్యాపారాల్లో మంచి జరుగుతుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఖర్చు పెరిగిన ఆర్థికంగా బాగుంటుంది. ప్రయాణాలు లాభస్థాయిగా ఉంటాయి. మీ మనసులోని భావాలను వ్యక్తీకరించడానికి క్లియర్ చేయడానికి ఈరోజు సరైనది. ఇంతకుముందు మీకు అలాంటి అవకాశం వచ్చి ఉండకపోవచ్చు. ఈరోజు మీరు బాగా అర్థం చేసుకునేలా మీ హృదయాన్ని సిద్ధం చేసుకోండి. ఈరోజు కొత్త పనులను ప్రారంభించండి. లక్ష్మిదేవి ధ్యానం శుభప్రదంగా ఉంటుంది.

వృషభ రాశి :
ఈరోజు ఈ రాశి వారు ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగరీత్యా అనుకూలమైన సమయం. అధికారులు సహాయ సహకారాలతో చాలా పనులు నెరవేరుతాయి. శుభకార్యాలు చేస్తారు. మిత్రుల రాక సంతోషాన్ని ఇస్తుంది. వాహనం మూలంగా పనులు నెరవేరుతాయి. వ్యవసాయదారులకు కలిసి వస్తుంది. ఖర్చులు పెరిగినా స్నేహితుల మూలంగా పనులు నెరవేస్తాయి. గతంలో ఇచ్చిన సొమ్ము చేతికి అందుతుంది. విద్యార్థులు సంతృప్తికరంగా ఉంటారు. మంచి స్థాయిలో నిలుస్తారు. వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా కొనసాగుతాయి. అనుకున్నది సాధిస్తారు.

గుర్తింపు ప్రశంసలు లభిస్తాయి. తగినంత మానవ ప్రయత్నం అవసరం. ఎదురుచూస్తున్న పనులు కొన్ని సఫలమవుతాయి. దేనికి వెనకడుగు వేవద్దు. తోటి వారి సలహాలు పనిచేస్తాయి. జీవితంలో ఎదుగుదలకు ప్రణాళికలు వేసుకునే సమయమిది. మీరు ఇప్పటికే తీసుకున్న నిర్ణయం గురించి పునరాలోచించడం అవసరం. అయితే, రెండవ ఆలోచన ఉండవచ్చు. మీరు సాయం చేసిన ఎవరైనా ఆ సాయాన్ని తిరిగి ఇవ్వవచ్చు. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేసుకోవలసి వస్తుంది. వృధా ప్రయాణాలు చేస్తారు.

మిధున రాశి :
ఈరోజు ఈ రాశి వారికి కార్యసిద్ధి ఉంటుంది. శ్రేష్టమైన జీవితం లభిస్తుంది. ఉద్యోగంలో ఉత్తమ స్థితి వస్తుంది. ఒక మంచి పని చేస్తారు. పనులు త్వరగా పూర్తవుతాయి. వ్యాపారంలో లాభం వస్తుంది. మీరు చాలా ప్రయత్నాలు చేస్తూ ఉండవచ్చు. కానీ, అంత సులభంగా ఆమోదం పొందకపోవచ్చు. పని ప్రదేశంలో సానుకూలమైనప్పటికీ నెమ్మదిగా కదలిక ఉన్నట్లు అనిపిస్తుంది. నలుగురితో చర్చించి తీసుకునే నిర్ణయాలు ఇస్తాయి. సహనం, ఉద్యోగ ప్రయత్నాలు పలుస్తాయి. ఆదాయం పెరుగుతుంది.

ఆరోగ్యంతో ఉత్సాహంగా పనులు చేస్తారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు పలుస్తాయి. స్నేహితులు ఆత్మీయుల మూలంగా పనులు నెరవేరుతాయి. వ్యాపారస్తులకు భాగస్వాములతో సంబంధాలు పెరుగుతాయి. అనవసరమైన ఖర్చులు నియంత్రించుకోవడం అవసరం. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. కళాకారులకు రచయితలకు మంచి అవకాశాలు వస్తాయి. నరసింహ స్వామిని ప్రార్థించండి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి.

కర్కాటక రాశి :
ఈరోజు ఈరాశి వారికి కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. మనోబలంతో లక్ష్యం సిద్ధిస్తుంది. విఘ్నాలు ఎదురైనా బుద్ధిబలంతో అనుకున్నది సాధిస్తారు. పట్టుదల ముందుకు నడిపిస్తుంది. మిత్రుల ద్వారా ఒక మంచి జరుగుతుంది. మంచి వ్యాయామ దినచర్య అవసరం కావచ్చు. ఆకస్మిక ధన లాభం ఉంటుంది. ప్రయత్నం, కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. ఇంటి బరువు బాధ్యతలు పెరుగుతాయి. సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోవడం అవసరం. తలపెట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి.

దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. ఉద్యోగస్తులకు తోటి వారితోపై అధికారులతో కలిసికట్టుగా పనిచేస్తారు. అందరిని కలుపుకునే ప్రయత్నం చేయండి. రావాల్సిన డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది. కొన్ని పనుల్లో జాప్యం జరగవచ్చు. వ్యవసాయదారులకు అనుకూలిస్తుంది. కొన్ని వ్యవహారాలలో జాగ్రత్త పాటించడం అవసరం. సాహితీవేత్తలకు కళాకారులకు కొత్త అవకాశాలు రావచ్చు. పారిశ్రామికవేత్తలు న్యాయపరమైన సమస్యలను ఇస్తారు. బంధుమిత్రులతో జాగ్రత్తగా మెలగడం మంచిది. కుటుంబ విషయాలు మార్పులు ఉంటాయి. ఇష్ట దైవాన్ని సందర్శిస్తే మంచిది. మొత్తం మీద ఈరోజు వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి.

సింహరాశి :
ఈరోజు ఈ రాశి వారికి ఇంటాబయట అనుకూల ఫలితాలు ఉంటాయి. గృహ వాహనాల యోగాలు అనుకొనిస్తాయి. నూతన ప్రయత్నాలు విజయం ఉంటుంది. అదృష్టవంతులు అవుతారు. ఈరోజు మీరు చాలా వరకు పాత స్నేహితులు నుంచి ఆనందకరమైన ఆశ్చర్యానికి లోనవుతారు. సంతోషంగా కాలం గడుపుతారు. శుభవార్తను వింటారు. ఆదాయం స్థిరంగా ఉంటుంది. కొత్త పనులపై మనసు నిలుపుతారు. కళాకారులకు అవకాశాలు వస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. సాంస్కృతిక దైవిక కార్యక్రమాలపై మనసు నిలుపుతారు. రాజకీయ ప్రభుత్వ పనుల్లో జాప్యం జరగవచ్చు. స్నేహితులు బంధువులతో సత్సంబంధాలను కొనసాగిస్తారు.

Horoscope Today 3rd June 2024 : Daily Panchangam And Rasi Phalalu Telugu
Daily Horoscope Today 6th June 2024 ( Photo Credit : Google )

పెద్దల సలహాలు ఆచరణలు పెట్టి సత్ఫలితాలు పొందుతారు. సమాజంలో మంచి పేరును పొందుతారు. ఆరోగ్యంగా ఉంటూ ఉత్సాహంతో పనులు చేస్తారు. ఉద్యోగస్తులు అధికారుల ప్రశంసలు పొందుతారు. పనిభారం పెరిగిన సంతృప్తిగా పూర్తిచేస్తారు. అద్భుతమైన శుభకాలం అనుకున్న పనులు సకాలంలో పూర్తి అవుతాయి. కుటుంబ పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. తోటివారి ప్రశంసలు అందుకుంటారు. విందులు వినోదాల్లో పాల్గొనే అవకాశం ఉంది. ఆర్థికంగా ఈ రోజు ఈరాశి వారికి మంచి ఫలితాలు విచారిస్తున్నాయి. సంతృప్తికరంగా ఉంటుంది. తోటి వారి ప్రశంసలు అందుకుంటారు. విందులు వినోదాల్లో పాల్గొనే అవకాశం ఉంది. ఆర్థికంగా బలపడతారు. లక్ష్మీదేవిని ధ్యానించండి.

కన్యరాశి :
ఈ రాశివారికి ఈరోజు మనసులో అనుకున్నది కార్యరూపం దాలుస్తారు. ఆర్థిక స్థితిగతులు మెరుగవుతాయి వెతకబోయిన తీగ కాలికి తగులుతుంది. శుభవార్తలు వింటారు. ఆరోగ్యం అనుకూలిస్తుంది. రావాల్సిన డబ్బు చేతికందుతుంది. ప్రణాళిక ప్రకారం.. పనిచేస్తే ఉన్నత స్థితి లభిస్తుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆస్తి వివాదాల్లో వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆదాయం పెరుగుతుంది. ఆత్మీయులు సహకరిస్తారు. సమాజంలో స్నేహ సంబంధాలు పెంపొందుతాయి.

Daily Horoscope Today 6th June 2024 : శనిజయంతి రోజున శని దోషాలు పోవాలంటే? :

ఆధ్యాత్మిక ప్రవచనాలకు సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతారు. ఆర్థిక ఒప్పందాలు లాభదాయకంగా ఉంటాయి. పారిశ్రామికవేత్తలకు సిబ్బంది సహకారం లభిస్తుంది. సహద్యోగుల సహకారంతో సకాలంలో పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగ ఫలాలు అద్భుతంగా ఉంటాయి. కొత్త డైట్ లేదా రొటీన్ వర్క్ అవుట్ ఇప్పటికే మిమ్మల్ని ఆరోగ్యంగా చేస్తుంది. ఇంతవరకు అనుభవించిన కష్టాలన్నీ క్రమేపి తొలగిపోతాయి. నూతన కార్యాలకు శ్రీకారం చుడుతారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. ఆకస్మిక ధన లాభం ఉంటుంది. గొప్ప వ్యక్తిని కలుస్తారు. విష్ణు దర్శనం మంచి ఫలితాన్ని అందిస్తుంది.

తులారాశి :
ఈరోజు రాశి వారు ఓపికతో పనులు చేసుకోవడం ఉత్తమం. ఆశయం నెరవేరుతుంది. పెద్దల ఆశీర్వచనం లభిస్తుంది. సమాజంలో గుర్తింపు ఉంటుంది. ఉద్యోగ పరంగా ఉన్నత స్థితి కలుగుతుంది. ధర్మబద్ధంగా నిర్ణయం తీసుకోండి. అవసరమైన సహకారం అందుతుంది. మీరు చేసే పనికి ప్రశంసలు అందుకునే అవకాశం ఉంది. మీరు చాలాకాలంగా కలవాలనుకుంటున్న వ్యక్తితో ఎక్కువ సమయం గడపవచ్చు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. నూతన కార్యాలు ప్రారంభించకుండా ఉండడం మంచిది. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. ఓపికతో పరిష్కరించుకోవడం మంచిది. ఉద్యోగస్తులు ఆఫీసులో సంతృప్తిగా ఉంటారు.అధికారులు లాభిస్తాయి. కోర్టు ప్రభుత్వ రాజకీయ పనుల్లో విజయం చేకూరుతుంది. వ్యవసాయదారులకు బాగా కలిసి వస్తుంది. ఆత్మీయుల సహాయ సహకారాల కోసం సమయం వెచ్చించాల్సి వస్తుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని స్మరించండి. మొత్తం మీద ఈరోజు వారికి శుభఫలితాలు గోచరిస్తున్నాయి.

వృశ్చిక రాశి :
ఈ రాశి వారి ప్రయత్నాలు ఈరోజు కార్యరూపాన్ని దాలుస్తాయి. మనోబలం అవసరం. అధికారులతో సౌమ్యంగా వ్యవహరించండి. ఉద్యోగంలో తగినంత గుర్తింపు ఉంటుంది. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. కుటుంబ పరంగా మేలు చేకూరుతుంది. పనిలో కొత్త పరిణామాలు ఏవి ప్రస్తుతానికి మిమ్మల్ని ప్రేరేపించకపోవచ్చు. ప్రారంభించిన పనులను పట్టుదలతో పూర్తి చేస్తారు. ప్రభుత్వ పనుల మూలంగా ఖర్చులు పెరుగుతాయి. నలుగురిలో గౌరవం మర్యాదలు పొందుతారు. సంతోషంతో పనులు పూర్తి చేస్తారు. స్నేహితులు కార్యకర్త ఉంటుంది. అయితే, వృధా ఖర్చుల నియంత్రణ అవసరం.

వివాదాలకు దూరంగా ఉండండి. స్థిరాచరాసుల విషయంలో వివాదాలు కొనసాగుతాయి. ఆరోగ్యంపై మనసు నిలుపుతారు. సంగీత సాహిత్య కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. పారిశ్రామికవేత్తలకు నలుగురు సహకారం లాభిస్తుంది. శుభాలు జరుగుతాయి. శూన్యతను పూజించటానికి అనుకుంటారు. అయితే, తాత్కాలికంగా ఫలించకపోవచ్చు. ఆకస్మిక ధన లాభాన్ని పొందుతారు. కుటుంబ సౌఖ్యం, సంపూర్ణంగా లాభిస్తుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పిల్లలకు సంతోషం కలిగించే కార్యాలు చేస్తారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. ఇష్ట దైవాన్ని స్తుతించండి.

ధనస్సు రాశి :
ఈ రాశి వారికి ఈరోజు తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. సమాజంలో మంచి స్థాయిలో ఉన్నవారు సహకారం లభిస్తుంది. ఆరోగ్యంగా ఉంటారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. పనుల్లో బాధ్యతలు పెరుగుతాయి. సంయమనంతో వాటిని నిర్వర్తిస్తారు. వ్యవసాయదారులకు అనుకూల వాతావరణం ఉంటుంది. రాజకీయ ప్రభుత్వ కార్యకలాపాలు ఖర్చులు ఎక్కువ కావచ్చు. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా పనులపై మనసు నిలిపి పట్టుదలతో పూర్తిచేసే ప్రయత్నం చేస్తారు. విజయం చెరువులోనే ఉంటుంది. బలమైన ప్రయత్నం చేయాలి. లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రారంభిస్తే.. అద్భుతమైన విజయం లభిస్తుంది.

ఆదాయం పెరుగుతుంది. అదే సమయంలో ఖర్చులు పెరుగుతాయి. నియంత్రణ అవసరం ఉద్యోగ పరంగా కోరుకున్న ఫలితం లభిస్తుంది. వ్యాపార బలం ఉంటుంది. వస్తుప్రాప్తి వాహన యోగాలు ఉన్నాయి. మొహమాటం వల్ల శ్రమ కలుగుతుంది. కుటుంబ సభ్యుల సహకారం తీసుకోవాలి. చాలాకాలం తర్వాత మీకోసం కొంత నాణ్యమైన సమయాన్ని వెచ్చించాలని మీకు అనిపించవచ్చు. అందుకు అనువైన మార్గాలు ఉంటాయి. కానీ, మీరు తప్పనిసరిగా లుక్ అవుట్‌లో ఉండాలి. వారిని పరిశీలించడం మంచిది. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. శుభవార్తలు వింటారు. బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. ముఖ్యమైన కార్యాలు పూర్తవుతాయి. సూర్యస్తుతి ఉత్తమం.

మకర రాశి :
ఈ రాశి వారికి ఈరోజు మనసులోని సంకల్పం నెరవేరుతుంది. ఎదురుచూస్తున్న పనిఒకటి ఇప్పుడు పూర్తవుతుంది. క్రమంగా అవరోధాలు కలుగుతాయి. ఏకాగ్రతకు భంగం కలిగించే వారు ఉంటారు. ఓర్పుతో లక్ష్యాన్ని చేరాలి. సహనానికి పరీక్ష కాలంగా అనిపిస్తుంది. వ్యక్తులు మీకు చాలా మంచి అనుభూతిని కలిగించవచ్చు. వ్యాపారంలో కలిసి వస్తుంది. కొంత అవకాశాల ద్వారా ఆదాయం పెరుగుతుంది. ప్రయాణాలు మూలంగా పనులు నెరవేరుతాయి. అలసట లేకుండా ఏకాగ్రతతో పనులు నిర్వర్తిస్తారు. కోర్టు పనులు అనుకూలంగా ఉంటాయి.

స్నేహితులు బంధు వర్గంతో పనులు నెరవేరిన చిన్నపాటి అభిప్రాయ విభేదాలు తలెత్తవచ్చు. అనవసరపు చర్చలకు దూరంగా ఉండటం మంచిది. ఉద్యోగస్తులు సంతృప్తిగా ఉంటారు. అధికారుల ఆదరణతో కొన్ని పనులు నెరవేరుతాయి. భూములు, వాహనాల కొనుగోలు వాయిదా పడొచ్చు. వ్యవసాయదారులకు, సాహితీవేత్తలకు కళాకారులకు ప్రోత్సాహకంగా ఉంటుంది. అనారోగ్య బాధలు తగ్గుతాయి. విద్యార్థులకు అనుకూలం. వ్యాపార రంగంలోని వారు జాగ్రత్తగా ఉండడం మంచిది. స్త్రీలు పిల్లల పట్ల మిక్కిలి శ్రద్ధ వహిస్తారు. దుర్గాదేవిని స్మరించండి.

కుంభరాశి :
ఈ రాశి వారు ఈరోజు ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఏకాగ్రతతో పనిచేస్తారు. శుభకార్యాలు మూలంగా ఖర్చులు పెరుగుతాయి. నలుగురికి ఉపయోగపడే పనులు చేస్తారు. ఉత్సాహంతో ఉంటారు. ఉద్యోగస్తులకు తోటి వారి సహకారం లభిస్తుంది. ఆఫీసులో మంచి పేర్లు సంపాదిస్తారు. నూతన వాహనం కొనుగోలు చేయవచ్చు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు చేస్తారు. ప్రభుత్వ రాజకీయ పనులు కలిసి వస్తాయి. కుటుంబంతో సంతృప్తిగా కాలం గడుపుతారు. సాంస్కృతిక ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక సమస్యలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. వ్యాపార ఒప్పందాలు ప్రయోజనకరంగా ఉంటాయి. వ్యాపారబలం అద్భుతంగా ఉంటుంది.

కోరుకున్న విధంగానే ఫలితాలు సిద్ధిస్తాయి. ధైర్యం ముందుకు నడిపిస్తుంది. కాలం మిశ్రమంగా ఉంటుంది. అవసరాలకు తగ్గట్టు కార్యాచరణను రూపొందించాలి. అపార్థాలకు అవకాశం ఉంది. పాత విషయాలను కూడా అనుమతించవచ్చు. ధర్మ మార్గంలో ఫలితాలు రాబట్టాలి. సమయస్పూర్తితో ఉద్యోగంలో విజయం సాధిస్తాడు. మీ జీవితంలో కొన్ని పాత విషయాలను కూడా అనుమతించవచ్చు. విష్ణుస్మరణ మంచిది. వారికి మంచి ఫలితాలు ఆచరిస్తున్నాయి.

మీన రాశి :
ఈరోజు రాశి వారు ఉత్సాహంతో పనులు చేస్తారు. ధార్మిక కార్యక్రమాలపై మానుస్తూ నిలుపుతారు. మంచి వారి సహచర్యం లభిస్తుంది. సంగీతా సాహిత్య కళాకారులకు అనుకూలం. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. రావాల్సిన డబ్బు అందుతుంది. కొత్త పనులు ప్రారంభించకుండా చేతిలో ఉన్నవి పూర్తి చేయడం మంచిది. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. భూములు వాహనాల లావాదేవీలు ఏమరుపాటు తగదు. ఉద్యోగస్తులు తోటి వారితో స్నేహంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. సమయానికి డబ్బు చేతికి అందుతుంది. రుణప్రయత్నం ఫలిస్తుంది. చెడు సహవాసం వైపు వెళ్లకుండా ఉంటే గౌరవం దక్కుతుంది. ఆరోగ్యంగా ఉంటారు. అధికారుల ఆదరణ లభిస్తుంది.

అనవసరమైన ప్రయాణాలను వాయిదా వేసుకుంటారు. తీర్థయాత్రలు విహారయాత్రలపై మనసు నిలుపుతారు. ఉత్తమ కాలం నడుస్తుంది. బాధ్యతలకు తగ్గట్టుగా కార్యాచరణ ఉండేటట్లు చూసుకోవాలి. సంతోషించే వార్తలు వింటారు ఆనందపదంగా కాలం ముందుకు సాగుతుంది. వ్యాపారంలో ధన లాభం ఉంటుంది. ఇష్ట కార్యసిద్ధి ఉంటుంది. మీరు ఏదైనా వెతుకుతున్నట్లయితే పొరుగువారు ఆశ్చర్యకరంగా సహాయం చేయవచ్చు. శివస్మరణ మంచిది.

Read Also : Shani Jayanti 2024 : జూన్ 6న పంచగ్రహ కూటమి, శనైశ్చర జయంతి రోజున ఇలా చేస్తే.. శనిదోషాలు పోయి రాజయోగం పడుతుంది