Dharma Sandehalu : భార్యాభర్తల అనుబంధం గురించి మన హిందూ సాంప్రదాయంలో ఎన్నోరకాల నియమాలను చెప్పారు. అయితే, భార్య భర్త ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటే కనుక ఇప్పుడు చెప్పే ఆభరణాలను ఎట్టిపరిస్థితుల్లోనూ ఇలా అసలే ధరించకూడదట.. అలా కనుక భార్య ఆభరణాలను ధరిస్తే.. ఆమె భర్తకు ఆయుక్షీణం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. ఇంతకీ అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
హిందూ వివాహ సంప్రదాయంలో కాలిమెట్టలకు ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతాకాదు. వివాహం జరిగిన దగ్గర నుంచి మంగళసూత్రంతో పాటు కాలి మెట్టెలు కూడా ఆమె సౌభాగ్యానికి చిహ్నంగా చెబుతారు. ఇంతకీ కాలి మెట్టెలు ఎందుకు ధరిస్తారు. వీటి వెనుక ఏమైనా అంతర్థాలు ఉన్నాయా అంటే.. అవును.. ఉన్నాయనే చెప్పాలి. ఎందుకంటే.. బంగారం లక్ష్మీదేవితో సమానంగా చెబుతారు. నడుము భాగం నుంచి కిందకు ధరించే ఆభరణాలు బంగారంతో చేయించకూడదు అనేది ఒక విశ్వాసం.
బంగారంతో పోల్చుకుంటే.. వెండికి విద్యుత్ వాహకత చాలా ఎక్కువ. తద్వారా భూమికి, శరీరానికి మధ్య ఒక అనుసంధానంగా కాలిమెట్ట పనిచేస్తుంది. భూమి మీద నుంచి వెలబడే శక్తి తరంగాలను శరీరానికి అందజేస్తుందని నమ్మకం. మన శరీరంలోని నాడులన్నీ చేతులు, ఖాళీ వేళల్లో కేంద్రీకృతం అయ్యాయని ప్రాచీన వైద్యం చెబుతోంది. మన చేతులు కాళ్ళలోని ఒక్కో ప్రాంతం మీద ఒత్తిడి తీసుకురావడం వల్ల ఒక్కో అవయవం పనితీరుని ప్రభావితం చేయవచ్చుని అంటారు. అలా కాలికి ఉండే రెండో వేలు మీద ఒత్తిడి ఏర్పడినప్పుడు గర్భాశయపు పనితీరు మెరుగుపడుతుందని చెబుతున్నారు.
స్త్రీకి పెళ్లి అయిందంటే.. కాలిమెట్టలే చిహ్నం :
తద్వారా రుతు సంబంధమైన సమస్యలు, సంతానం కలగడంలో ఏర్పడుతున్న ఇబ్బందులు తొలగిపోతాయి అంటున్నారు. స్త్రీకి వివాహం అయిందని తెలిపేందుకు కాలిమెట్టెలు ఒక చిహ్నం. ఆమెను తల్లిగా భావించాలని ఆమెతో మర్యాదగా మెలగాలని ఒక సూచన. పైగా కొన్ని ప్రాంతాలలో భర్త చనిపోయిన కూడా ఆమె సోదరుడు ఎవరన్నా జీవించి ఉంటే.. రెండు మెట్టలలో ఒకటి తీసివేసే సంప్రదాయం ఉంది. ఎందుకంటే.. ఆ మహిళకు రక్షణగా ఆమె సోదరులు ఇప్పటికీ ఉన్నారనే విషయాన్ని ఇందులో తెలియజేస్తుంది. అలాగే, హైందవ సంప్రదాయంలో వేలయేళ్లుగా మెట్టెలు ధరించే ఆచారం కొనసాగుతోంది. వైదిక సాహిత్యంలో దీని ప్రస్తావన లేకపోయినా పురాణాలలో మాత్రం మెట్టల ప్రస్తావన ఉంటుంది.
Dharma Sandehalu : పొరపాటున కూడా కాలిమెట్టెలు ఇలా ధరించకూడదు
ఇలా మెట్టెలు ధరించే అలవాటు.. ఈజిప్టు వంటి ఇతర ప్రాచీన సంస్కృతుల దగ్గర నుంచి నేటి పాశ్చాత్య దేశాల వరకు కనిపించినా ఇవి అలంకారం కోసమే కానీ సౌభాగ్యానికి ఆరోగ్యానికి ఉపయోగించడం తక్కువే. అయితే, రోజురోజుకీ నాడీ వ్యవస్థకు, కాలివేలకు మధ్య ఉన్న సంబంధం గురించి ప్రచారం పెరిగిపోతుంది. అందుకనే మ్యాగ్నెటిక్ టోరింగ్స్ పేరుతో రకరకాల మెట్టెలు మార్కెట్లో ముంచేత్తుతున్నాయి.

కానీ, అలాంటి ప్రచారం ఏది అవసరం లేకుండానే వివాహ ఆచరణలో భాగంగా భారతీయ స్త్రీలు తరతరాలుగా మెట్టలను ధరిస్తూనే వస్తున్నారు. ఏడు వారాలు 7 వారాలకు గ్రహాధిపతి ఉంటాడు. ఉదాహరణకు.. ఆదివారానికి సూర్యుడు అధిపతి అయితే, శుక్రవారానికి శుక్రుడు అన్నట్టుగా ఆయా వారాన్ని బట్టి ఆ రోజుకు ఉండే గ్రహాధిపతిని అనుసరించి ఏ నగలు ధరించాలో జ్యోతిష్యల్లో చెప్పబడింది.
ఏ వారం ఏయే ఆభరణాలు ధరిస్తే శుభప్రదం :
ఆదివారం సూర్యునికి ఇష్టమైన రోజు కాబట్టి.. ఆ రోజు నా కెంపులతో చేసిన నగలు, హారాలు చెవి పోగులు ధరించడం ద్వారా శుభ ఫలితాలు ఉంటాయి. చంద్రుడికి ఇష్టమైన సోమవారం నాడు ముత్యాలతో తయారుచేసిన ఆభరణాలు ధరించడం శ్రేష్ఠం. ముత్యాల హారాలు, ముత్యాల గాజులతో అలంకరించుకోవాలి. ఇక మంగళవారం కుజుడికి చాలా ఇష్టమైనది. ఆ రోజున పగడాలతో చేసిన నగలు పెట్టుకోవాలి. బుధుడికి ఇష్టమైనది బుధవారం. ఆరోజు ఆయనకి ఇష్టమైన పచ్చ రంగు హారాలు, గాజులు ధరించడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి.
గురువారం గృహస్పతిది.. అందుకే గురువారం రోజు పుష్ప రాగంతో చేసిన చెవిపోగులు ఉంగరాలు ధరించాలి. శుక్రవారం లక్ష్మీదేవి అనుగ్రహం కూడా పొందిన వారవుతారు. శనివారం శని భగవానుడికి ఇష్టమైన రోజు కాబట్టి.. ఆయనకి ఇష్టమైన నీలమణి నగలు ధరించాలి. నీలంతో చేసిన కమ్మలు నగలు, ముక్కుపుడక పెట్టుకోవాలని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. అయితే, బంగారపు మెట్టెలు, బంగారపు పట్టీలు పగిలిన గాజులు, ప్లాస్టిక్ గాజులు ఇలాంటివి అసలు ధరించకూడదు. అలా ధరిస్తే భర్తకు ప్రాణగండమని అంటారు.