Horoscope Today 3rd June 2024 : ఈరోజు జూన్ 3వ తేదీ సోమవారం. వైశాఖమాసం, ఉత్తరాయణం, వసంత రుతువు, నేడు బహుళ ద్వాదశి రాత్రి 11 గంటలకు, నక్షత్రం: అశ్విని రాత్రి 11: 27 నిమిషాల వరకు, రాత్రి 7 గంటల 33 నిమిషాల నుంచి 9 గంటల 4 నిమిషాల వరకు, దుర్ముహూర్తం: మధ్యాహ్నం 1:22 నిమిషాల నుంచి ఒక గంట 16 నిమిషాల వరకు. తిరిగి మధ్యాహ్నం 2 గంటల 58 నిమిషాల నుంచి 3 గంటల 51 నిమిషాల వరకు, అమృతకాలం: సాయంత్రం 5 గంటల 1 నిమిషాల నుంచి 6 గంటల 51 నిమిషం వరకు, రాహుకాలం: ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. సూర్యోదయం: ఉదయం 5:30 నిమిషాలకు, సూర్యాస్తమయం: సాయంత్రం 6:19 నిమిషాల వరకు. వైశాఖ బహుళ ద్వాదశి సోమవారం విశేషమైన రోజు. జూన్ 3, 2024న 12 రాశుల వారికి ఈరోజు ఎటువంటి ఫలితాలు కలుగుతాయో పూర్తి వివరాలతో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
మేషరాశి :
ఈరోజు ఈ రాశి వారికి ఆర్థిక సమస్యలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. నలుగురికి ఉపయోగపడే పనులను ఎక్కువగా చేస్తారు. మీ మంచితనం దయాగుణంతో ఆపదలో ఉన్న వారికి సహాయం చేస్తారు. వ్యాపార ఒప్పందాలు ప్రయోజనకరంగా ఉంటాయి. ఏకాగ్రతతో పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. ఉత్సాహంతో ఉంటారు. ఉద్యోగస్తులకు తోటివారి సహకారం లభిస్తుంది. ఆఫీసులో మంచి పేరు సంపాదిస్తారు. భూముల వ్యవహారం అనుకూలిస్తుంది. నూతన వాహనం కొనుగోలు చేయవచ్చు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు చేస్తారు. ప్రభుత్వ రాజకీయ పనులు కలిసివస్తాయి. శుభకార్యాల వల్ల ఖర్చులు పెరుగుతాయి. ఈరోజు మీకు మిశ్రమ రోజుగా ఉంటుంది. మీ పిల్లల వివాహంలో సమస్య వస్తుంది. కుటుంబంలో సంతోషాలు ఉంటాయి. మీ కుటుంబ సభ్యుల్లో ఒకరి ఆరోగ్యం గురించి ఆందోళన ఉంటుంది. విద్యార్థులు చదువులో ఏకాగ్రత వహించాలి. అప్పుడే విజయం సాధించగలుగుతారు.
ప్రేమ సంబంధాలలో సునీతత్వం కలిసివస్తుంది. మీ తల్లిదండ్రులతో కొంత సైదాంతిక అభిప్రాయ వేదాలను కూడా చూస్తారు. దేవత గురుభక్తి పెరుగుతుంది. కుటుంబంతో సంతృప్తిగా కాలం గడుపుతారు. సాంస్కృతిక ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన పనులు విజయాన్ని సాధిస్తారు. రుణ ప్రయత్నాలు తొందరగా ఫలిస్తాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. ప్రయాణాలు ఎక్కువ చేస్తారు. తలపెట్టిన పనులన్నీ శ్రమ లేకుండా పూర్తవుతాయి. ఉద్యోగంలో ప్రమోషన్‌కి అవకాశం ఉంది. దూర ప్రాంతాల్లో ఉన్న పిల్లలు చూడడానికి వస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారులు పురోగతిని సాధిస్తారు. ప్రేమ సఫలమవుతుంది. ఆర్థిక లావాదేవీలు జరపవద్దు. కీలక పనులు మధ్యాహ్నం లోపు చేసుకోవడం మంచిది. దుర్గామాత దర్శనం శుభప్రదం. మొత్తం ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి.
వృషభ రాశి :
ఈరోజు ఈ రాశి వారికి కలిసి వస్తుంది. ప్రారంభించిన పనులు ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఫలితాన్ని సాధిస్తారు. ఈరోజు మీ ప్రతిష్టను పెంచే రోజు ఉత్సాహంతో పనులు చేస్తారు. మంచి వారితో సహచర్యం లభిస్తుంది. ఆరోగ్యంగా ఉంటారు. సంగీత సాహిత్య కళాకారులకు అనుకూలమైన రోజు. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. రావాల్సిన డబ్బు ఆలస్యంగా అందుతుంది. కొత్త పనులు ప్రారంభించకుండా చేతిలో ఉన్నవి పూర్తి చేయడం మంచిది. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. భూములు వాహనాలు లావాదేవీలు ఏమర్పాట్లు తగదు. ఉద్యోగస్తుల తోటి వారితో స్నేహంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. అధికారుల ఆదరణ లభిస్తుంది. అనవసరమైన ప్రయాణాలను వాయిదా వేసుకుంటారు.
ధార్మిక కార్యక్రమాలపై మనసు నిలుపుతారు. గురుభక్తికి ప్రాధాన్య ఇస్తారు. తీర్థయాత్రలు విహారయాత్రలపై మనసు నిలుపుతారు. శుభకార్య ప్రయత్నాలు నెరవేరుతాయి. దూరపు బంధువులతో ఆనందంగా గడుపుతారు. ప్రభుత్వ ఉద్యోగాలతో సంబంధం ఉన్న వ్యక్తులు డబ్బు ప్రయోజనాలను పొందుతారు. మీ కుటుంబం పేరు వెలుగులోకి వస్తుంది. కానీ, సామాజిక రంగాలలో పనిచేసే వ్యక్తులు వారి వ్యక్తిగత సమస్యలకు సంబంధించి వివాదాలు ఎదురవుతాయి. విదేశీయాన ప్రయత్నాలు నెరవేర్చుకుంటారు. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. ఉద్యోగానికి సంబంధించి మంచి ఆఫర్ వస్తుంది. ఆదాయం పెరుగుతుంది. అప్పుల వాళ్ళ ఒత్తిడి తగ్గుతుంది. వ్యాపారులకు కొద్దిగా పరవాలేదు. ఎవరికీ హామీలు ఇవ్వొద్దు. వివాహ ప్రయత్నాలు కలిసివస్తాయి. ప్రేమలో విజయం సాధిస్తారు. నవగ్రహ స్తోత్రం చదివితే మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి.
మిధున రాశి :
ఈరోజు ఈ రాశివారికి కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. తలపెట్టిన పండ్లు సకాలంలో పూర్తవుతాయి. ఆదాయం పెరుగుతుంది. అదే సమయంలో ఖర్చులు పెరుగుతాయి. నియంత్రణ అవసరం. వివాహాది శుభకార్యాలు లాభిస్తాయి. సమాజంలో మంచి స్థాయిలో ఉన్న వారి సహకారం లభిస్తుంది. ఆరోగ్యంగా ఉంటారు. ఉత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. పనుల్లో బాధ్యతలు పెరుగుతాయి. సమయానుకూలంగా వాటిని నిర్వర్తిస్తారు. ఈరోజు విద్యార్థులకు మంచి రోజు కానుంది. ఎందుకంటే.. వారు చదువులో బాగా రాణిస్తారు. కచ్చితంగా విజయాన్ని సాధిస్తారు. వ్యాపారానికి సంబంధించిన కొన్ని సమస్యలు ఉంటే.. వాటిని మీ కుటుంబంలోని సీనియర్ సభ్యులతో కలిసి పరిష్కరించుకోవడం మంచిది. ఆహారం వల్ల మీకు కడుపు సంబంధిత సమస్యలు ఉండవచ్చు. మీ రోజు వారి అవసరాలను తీర్చడానికి మీరు కొన్ని వస్తువులను కొనుగోలు చేస్తారు.
అందులో మీ ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకొని మాత్రమే ఖర్చు చేయడం మంచిది. వ్యవసాయదారులకు అనుకూల వాతావరణం. రాజకీయ ప్రభుత్వ కార్యకలాపాలలో ఖర్చులు ఎక్కువ కావచ్చు. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా పనులపై మనసు నిలిపి పట్టుదలతో పూర్తిచేసే ప్రయత్నం చేస్తారు. కోర్టు పనుల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. ప్రయాణాలు వాయిదా పడతాయి. కొత్త పనులను ప్రారంభిస్తారు. మానసిక ఆనందాన్ని పొందుతారు. ఆకస్మిక ధన లాభం ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్య విషయాలను మధ్యాహ్నం లోపు పూర్తి చేయండి. బంధుమిత్రులతో కలహాలు ఏర్పడకుండా జాగ్రత్త పడటం మంచిది. ఆదాయం బాగానే ఉంటుంది. అప్పులు తీరుస్తారు. ఎంతో శ్రమ మీద పనులు పూర్తవుతాయి. శుభకార్యాలకు అవకాశం ఉంది. వ్యాపారులు లాభాలు బాట పడతారు. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయండి. హనుమాన్ చాలీసా చదవండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి.
కర్కాటక రాశి :
ఈరోజు రాశి వారు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. భూములు వాహనాలకు కొనుగోలుయత్నాలు కలిసివస్తాయి. అపరిచిత వ్యక్తుల వల్ల పనులు వాయిదా పడవచ్చు. కొత్త అవకాశాల ద్వారా ఆదాయం పెరుగుతుంది. ప్రయాణాల మూలంగా పనులు నెరవేరుతాయి. అలసట లేకుండా ఏకాగ్రతతో పనులు నిర్వర్తిస్తారు. కోర్టు పనులు అనుకూలంగా ఉంటాయి. స్నేహితులు, బందు వర్గంతో పనులు నెరవేరినా చిన్నపాటి అభిప్రాయ బేధాలు రావొచ్చు. అనవసరపు చర్చలకు దూరంగా ఉండడం మంచిది. ఉద్యోగస్తులు సంతృప్తిగా ఉంటారు. అధికారుల ఆదరణతో కొన్ని పనులు నెరవేరుతాయి. సాహితీవేత్తలకు కళాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది.
ఆరోగ్యంగా ఉంటూ ఉత్సాహంతో పనులు చేస్తారు. ఖర్చులపై నియంత్రణ ఉండాలి. తోటివారితో స్నేహంగా ఉండడం అవసరం. కీలక విషయాలలో అనుకున్న ఫలితాలు వస్తాయి. మానసిక ఆనందం లభిస్తుంది. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ప్రతినిత్య అభివృద్ధిని సాధిస్తారు. ఈరోజు మీకు సంపన్నమైన రోజు అవుతుంది. మీరు కుటుంబ సభ్యుల నుంచి సంతోషకరమైన వార్తలను వింటారు. కానీ, మీ సోదరుడితో కొనసాగుతున్న చర్చ చాలాకాలం పాటు ఆగవచ్చు.
కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. గృహ జీవితం ఆనందంగా ఉంటుంది. ఉద్యోగంలో ఒత్తిడి తగ్గుతుంది. బదిలీ అయ్యే అవకాశం ఉంది. రుణ విముక్తులయ్యే ప్రయత్నం చేస్తారు. వివాహ సంబంధాలు కుదురుతాయి. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఆర్థిక లావాదేవీలకు సమయం కాదు. ప్రేమ వ్యవహారాలు ముందుకు వెళ్ళవు. వ్యాపారులు కష్టపడాల్సి ఉంటుంది. సుబ్రమణ్య భుజంగ స్తోత్రం చదివితే బాగుంటుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి.
సింహరాశి :
ఈరోజు రాశి వారికి ప్రారంభించిన పనులు తాత్కాలికి ఆటంకాలు రావచ్చు. ఓపికతో పరిష్కరించుకోవడం మంచిది కలిసి వస్తుంది. వ్యాపారస్తులకు అనుకూలం. గత పెట్టుబడులకు తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు కొనసాగుతాయి. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. స్థిరాచరాసుల విషయంలో తగాదాలు కొనసాగుతాయి. అయితే, కొన్ని పరిష్కారం కావచ్చు. ఉద్యోగస్తులు ఆఫీసులో సంతృప్తిగా ఉంటారు. అధికారుల అండదండలు లభిస్తాయి. ఉద్యోగా శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కోర్టు ప్రభుత్వ రాజకీయ పనుల్లో విజయం అందుకుంటారు. వ్యవసాయదారులకు కలిసి వస్తుంది. బంధు వర్గంతో పనులు నెరవేరుతాయి. కీలక వ్యవహారాలలో ఆచితూచి అడుగు వేయాలి. విదేశీ అనే ప్రయత్నాలకు అనుకూలమైన సమయం.
ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. రుణ లాభం పొందుతారు. బంధుమిత్రుల వల్ల మేలు జరుగుతుంది. మీరు కొంతమంది వ్యక్తుల పనిలో ఎక్కువ బిజీగా ఉండే మీ పనిపై శ్రద్ధ చూపకపోతే అది మీకు ఇబ్బందిగా ఉంటుంది. మీ మాటల్లోనే మాధుర్యాన్ని కొనసాగించాలి. లేకపోతే మీ సంబంధాలు చేరిక రావచ్చు. తప్పుడు ఆరోపణలను మీపై మోపవచ్చు. దాని కారణంగా మీరు ఆందోళన చెందుతారు. కుటుంబ సభ్యులు మీ విజయాన్ని పూర్తిగా ఆనందిస్తారు. ఉద్యోగంలో ఉన్న వ్యక్తులకు కొత్త పోస్టు కేటాయించవచ్చు. అనుకున్న పనులు పూర్తవుతాయి. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. రియల్ ఎస్టేట్ వారికి స్వయం ఉపాధి వారికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. పెళ్లి సంబంధం కుదురుతుంది.బంధువుల ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఎవరికి హామీలు ఇవ్వొద్దు. ఆరోగ్యం జాగ్రత్త. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. సుబ్రమణ్య అష్టోత్తరం చదవాలి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి.
కన్యారాశి :
ఈరోజు రాశి వారు చాకచక్యమైన ఆలోచన విధానంతో అనుకున్నది సాధిస్తారు. బంధుమిత్రులతో కలుస్తారు. నూతన గ్రహనిర్మాణ ప్రయత్నాలను ప్రారంభిస్తారు. దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోతాయి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఈరోజు ఆర్థికంగా మంచి సంకేతాలు అందుతాయి. కొత్త ఇల్లు దుకాణం మొదలైన వాటి కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తారు. అందులో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే.. మీ సొంత వ్యక్తి మీకు హాని తల పెట్టే శత్రువుగా మారవచ్చు. ప్రారంభించిన పనులు నిరాటంకంగా పూర్తవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు కలుస్తాయి. మంచి ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు అధికారులు నాయకుల ఆదరణ లభిస్తుంది.
Horoscope Today 3rd June 2024 : ఈరోజున ఏయే రాశులవారికి శుభ ఫలితాలు ఉంటాయంటే?
అయితే, బాధ్యతలతో పని భారం పెరగవచ్చు. అందరిలో గౌరవం, మర్యాదలను పొందుతారు. రాజకీయ ప్రభుత్వ కోర్టు పనుల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు కలిసి వస్తాయి. వివాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. భూములు వాహనాలు కొనుగోలుపై జాగ్రత్తలు పాటిస్తారు. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. వ్యవసాయదారులకు అనుకూలంగా ఉంటుంది. పారిశ్రామికవేత్తలకు సిబ్బంది సహకారం లభించడంతో ఉత్పాదికత పెరుగుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆదాయం పెరుగుతుంది. దూర ప్రాంతాలకు బదిలీ అయ్యే అవకాశం ఉంది. వివాహ సంబంధాలు కుదురుతాయి. ప్రేమ వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. సుబ్రమణ్యం భుజంగ స్తోత్రం చదవండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి.
తులారాశి :
ఈరోజ రాశివారు నలుగురిలో గౌరవం మర్యాదలను పొందుతారు. మంచి వ్యక్తుల సహచర్యాన్ని పొందుతారు. ఆర్థికంగా కలిసి వస్తుంది. వ్యవహార ఒప్పందాల విషయంలో తొందరపాటు తగదు. బంధు వర్గంతో పనులు నెరవేరిన అభిప్రాయభేదాలు కలగవచ్చు. వాహన మూలంగా ఖర్చులు పెరగవచ్చు. ఖర్చులపై నియంత్రణ అవసరం. స్నేహితుల మూలంగా పనులు నెరవేరుతాయి. విద్యార్థులకు అనుకూలమైన రోజు పెద్దల సహకారం లభిస్తుంది. ప్రోత్సాహకాలను పొందుతారు. చదువుల ప్రయత్నాలు కొనసాగుతాయి. ప్రయాణాల వల్ల ఆర్థిక లాభం చేపడుతుంది. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. గృహపకరణాలు కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆరోగ్యంగా ఉంటారు. మంచి ఫలితాలను రాబట్టడానికి సరైన సమయం నడుస్తోంది.
విదేశీ ప్రయత్నాలు సులభంగా మారుతుంది. ఆకస్మిక ధనలాభ అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఈరోజు మీకు ప్రత్యేకమైన రోజు. కానీ, మీరు ఏ సందర్భంలోనైనా ఎక్కువ కోపాన్ని ప్రదర్శిస్తే అది మీకు ఇబ్బంది కలిగించవచ్చు. పిల్లలు మీకు ఏ సమస్యలోనైనా సహాయం చేస్తారు. ఇది సభ్యులకు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చాలి. లేకుంటే మీపై కోపం తెచ్చుకోవచ్చు. బంధువులు మీ సహాయం తీసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. లాయర్లకు రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంటుంది. చిన్ననాటి స్నేహితులు పలకరిస్తారు. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో అనుకూల సమాచారం అందుతుంది. ప్రేమ వ్యవహారాలు ముందుకు నడుస్తాయి. ఇష్టదేవతా స్తోత్రం చదవడం మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి.
వృశ్చిక రాశి :
ఈరోజు రాశి వారు ఏదైనా పనిలో పెట్టుబడి పెట్టే అవకాశం లభిస్తే చాలా జాగ్రత్తగా ఆలోచించండి. లేకుంటే మీ డబ్బు నిలిచిపోవచ్చు. వృత్తి వ్యాపారాల్లో సంతృప్తిగా ఉంటారు. అనుకున్న పనులు పూర్తవుతాయి. కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. మంచి వారితో మైత్రి కుదురుతుంది. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పోయిందనుకున్న డబ్బు తిరిగివస్తుంది. కొత్త పెట్టుబడి ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారస్తులకు భాగస్వాములతో అవగాహన పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు వ్యాపార ఒప్పందాలు ప్రయోజనకరంగా ఉంటాయి. ఉద్యోగస్తులు అధికారులతో స్నేహంగా ఉంటూ ఆఫీస్‌లో మంచి పేర్లు పొందుతారు. తద్వారా ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.
శ్రమకు తగిన ఫలితాన్ని పొందుతారు. మీ రంగాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. సహనం వహించండి. బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండాలి. సమయానికి తగిన విశ్రాంతి అవసరం. ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వారికి సామాన్యంగా ఉంటుంది. ఇంట్లో కొన్ని మార్పులు చేయడానికి ప్లాన్ చేస్తారు. విద్యార్థులు మానసిక మేధోభారం నుంచి విముక్తి పొందుతారు. మీరు ఎవరి దగ్గరైనా అప్పు తీసుకుంటే మీ తండ్రిని సంప్రదించడం మంచిది. ఉద్యోగ వ్యాపారాలు సాఫీగా సాగిపోతాయి. ఆదాయం పెరుగుతుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. విదేశాల నుంచి ఉద్యోగానికి సంబంధించిన ఆఫర్ వస్తుంది. దూర ప్రాంతాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. సహచరులనుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ఆరోగ్యం పర్వాలేదు. శ్రీరామనామాన్ని జపించాలి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి.
ధనస్సు రాశి :
ఈరోజు ఈరాశి వారికి ఆదాయం స్థిరంగా ఉంటూ క్రమేపి పెరుగుతుంది. అయితే, దానికి సరిపడా ఖర్చులు ఉంటాయి. తలపెట్టిన పనులు పూర్తవుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. కుటుంబంలో పెద్దలు అభిప్రాయాలకు విలువనిస్తారు. వారి సూచనలను అమలు చేసి సత్ఫలితాలను పొందుతారు. వ్యాపార లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. సంఘంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు అనవసరమైనఖర్చులు ముందుకు వస్తాయి. సాహోఉద్యోగుల సహకారం లభిస్తుంది. పైఅధికారుల విమర్శలు ఎదుర్కోవాల్సి రావచ్చు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. వస్తూ, నగలు కొనుగోలు చేస్తారు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు.
అన్ని రంగాల్లో విజయాలు సాధిస్తారు. మానసిక ఆనందం పొందుతారు. ప్రయాణాలు చేస్తారు. మీ ఆరోగ్యం సాధారణంగానే ఉంటుంది. మీ తల్లిదండ్రుల ఆశీస్సులతో మీరు ఏ పనిచేసినా తప్పకుండా విజయం సాధిస్తారు. జీతాలు తీసుకునే వారికి మరో ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. కానీ, పాతదానికి కట్టుబడి ఉండడం మంచిది. ప్రతికూల పరిస్థితుల్లో మీ కోపం చలాయించకుండా చూసుకోవాలి. అప్పుడే మీరు ఏ సమస్య అయినా సులభంగా పరిష్కరించగలుగుతారు. ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది. సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. తలచిన పనులు నెరవేరుతాయి. వివాహ ప్రయత్నాలు కలుస్తాయి. పిల్లల్లో ఒకరికి దూరప్రాంతాల్లో ఉద్యోగం వస్తుంది. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. వ్యాపారులకు బాగుంది. సుబ్రమణ్య స్వామిని ఆరాధిస్తే మంచిది. మొత్తంమీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి.
మకర రాశి :
ఈరోజు రాశి వారు డబ్బు విషయంలో జాగ్రత్త పడడం అవసరం. ఇంటికి కావలసిన వస్తువులు కొనుగోలు చేస్తారు. బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. విద్యార్థులు మంచి స్థాయిలో నిలుస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు కలిసివస్తాయి. కొత్త ఉద్యోగంలో సంతృప్తిగా ఉంటారు. పనులను అనుకున్న సమయంలో పూర్తి చేస్తారు. రావాల్సిన డబ్బు ఆలస్యంగా చేతికందుతుంది. కొన్ని పనులు జాతీయం జరగవచ్చు. కర్షకులకు అనుకూల వాతావరణం పెరుగుతుంది. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. వృత్తి ఉద్యోగ రంగంలో అభివృద్ధి ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్త. ఈరోజు మీకు అనుకూల ఫలితాలు వస్తాయి.
మీరు మీ జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. మీరు పనిలో మీ మద్దతుని ఇస్తారు. మీరు నడకకు వెళ్లాలని ప్లాన్ చేసుకోవచ్చు. అందులో మీ తండ్రిని సంప్రదించిన తర్వాత వెళ్లడం మంచిది. కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు కూడా స్నేహపూర్వకంగా ఉంటాయి. ఆదాయంతో పాటు ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారంలో పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. ఉద్యోగానికి ఆఫర్లు వస్తాయి. శ్రమ మీద పనులు పూర్తవుతాయి. వ్యాపారులు పురోగతిని సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో ముందంజ వేస్తారు. కోర్టు కేసులు ఒక కొలిక్కి వస్తాయి. మీరు మీ పిల్లలను కొత్త కోర్సులో చేర్చవచ్చు. దత్తాత్రేయ స్వామి ఆరాధన శుభఫలితాలను ఇస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి.
కుంభరాశి :
ఈరోజు ఈరాశి వారికి అన్నివిధాలా బాగుంటుంది. స్థిరాస్తుల విషయంలో జాగ్రత్త. అందర్నీ గుడ్డిగా నమ్మి ఒక మంచి అవకాశాన్ని కోల్పోతారు. బాధ్యతలు పెరుగుతాయి. సమస్యలను విశ్లేషణాత్మక దృష్టితో చూసి పరిష్కరించుకుంటారు. ఉద్యోగస్తులకు అధికారుల అండదండలు లభిస్తాయి. బంధుమిత్రులతో కలిసి పార్టీలకు వెళ్తారు. సాహో ఉద్యోగులతో అభిప్రాయభేదాలు ఏర్పడవచ్చు. ప్రభుత్వ రాజకీయ పనుల మూలంగా ఖర్చు పెరగవచ్చు. కళాకారులకు అనుకూలమైన రోజు. ఖర్చులను నియంత్రించాల్సిన అవసరం ఉంది. ఆస్తి తగాదానికి కొంతవరకు పరిష్కారం అవుతాయి. ఇంటికి కావాల్సిన వస్తువులు కొనుగోలు చేయడంలో జాప్యం జరగవచ్చు. విద్యార్థులకు మిశ్రమ సమయం. ఉన్నత విద్యా ప్రయత్నాలు వాయిదా పడతాయి. అన్ని రంగాల వారికి సానుకూలమైన సమయం. ప్రయాణాల వల్ల లాభాన్ని పొందుతారు.

నూతన కార్యాలు వాయిదా వేసుకోక తప్పదు. ఆకస్మిక లాభం ఉంది. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. మీరు కుటుంబంలో కార్యాలయంలో కూడా సరదాగా ఉంటారు. అయితే, మీకు కార్యాలయాలు ఏదైనా బాధ్యతాయుతమైన పనిని కేటాయించినట్లయితే మీరు దానిని జాగ్రత్తగా చేయాలి. మీరు పురోగతి సాధించేందుకు కృషి చేస్తారు. మీరు చుట్టుపక్కల నుంచి శుభవార్తలను వింటూనే ఉంటారు. దాని కారణంగా మీ మనసు కూడా సంతోషంగా ఉంటుంది. కొనసాగుతున్న ప్రాజెక్టులలో మీరు కొన్ని సమస్యలను అధిగమిస్తారు. ఆర్థికంగా చాలా బాగుంది. సామాజిక సేవా కార్యక్రమాలు పాల్గొంటారు. రాజకీయ నాయకులతో పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగంలో అధికారుల ప్రోత్సాహం లభిస్తుంది. వ్యాపారులు సునాయాసంగా లాభాలు ఆర్చిస్తారు. కోర్టు కేసుల్లో నేర్పుతారు. ఆరోగ్యం పర్వాలేదు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. శివారాధన వల్ల శుభ ఫలితాలు ఉంటాయి. మొత్తం మీద ఈ రాశివారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి.
మీనరాశి :
ఈరోజు రాశి వారికి నలుగురి సహకారం లభిస్తుంది. విద్యార్థులకు అనుకూలం. మెరుగైన ఫలితాలు సాధిస్తారు. ఉన్నత విద్య కోసం దూర ప్రయాణ ప్రయత్నాలు కలుస్తాయి. ఉద్యోగస్తులకు సహచరులతో అసంతృప్తి కలగవచ్చు. అధికారుల ఆదరణ ఉంటుంది. వివాహాది శుభకార్యాలు సఫలం అవుతాయి. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. పనులను బాధ్యతతో నిర్వర్తిస్తారు. వ్యాపారులకు లాభసాటిగా ఉంటుంది. పాత బాకీలు వసూలు అవుతాయి. వ్యవసాయదారులకు అనుకూలం. వ్యాపారులకు కొత్త ఒప్పందాలు సత్ఫలితాలు ఇస్తాయి. ఆర్థిక లావాదేవీలు ప్రయోజనకరంగా ఉంటాయి. కీలక పనులు, బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఆకస్మిక ధనలాభం ఏర్పడే అవకాశం ఉంటుంది. ప్రయాణాలు జాగ్రత్త. స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటారు.
మానసిక ప్రశాంతత కోసం దైవచింతన అవసరమవుతుంది. ఈరోజు మీకు సంతోషకరమైన రోజు. విదేశాలకు వెళ్లాలని మీ కోరిక నెరవేరుతుంది. మీరు విదేశీ పర్యటనలను చాలా ఆనందిస్తారు. మీరు కుటుంబ సభ్యుల ముందు మీ మనసులో కొన్ని ఆలోచనలు వారికి తెలియజేస్తారు. భవిష్యత్తులో షేర్ మార్కెట్ మొదలైన వాటిలో పెట్టుబడి గురించి ఎక్కువ ఆలోచిస్తారు. సోదరీ వివాహాలకు వస్తున్న అడ్డంకులు స్నేహితులు సహాయంతో అధిగమిస్తారు. ఆదాయానికి ఆరోగ్యానికి లోటు లేదు. తలపెట్టిన పనులు చాలా వరకు పూర్తి చేస్తారు. బంధువుల రాకపోకలు ఉంటాయి. ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వ్యాపారులకు బాగుంటుంది. ఆరోగ్యం జాగ్రత్త. కోర్టు కేసులో విజయం సాధిస్తారు. సూర్య ఆరాధన మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి.