Horoscope Today 7th June 2024 : ఈరోజు జూన్ 7వ తేదీ. శ్రీ క్రోధి నామ సంవత్సరం, జేష్ట మాసం, ఉత్తరాయణం, గ్రీష్మ రుతువు, శుక్రవారం. తిధి: జ్యేష్ట, శుద్ధ పాడ్యమి. సాయంత్రం: 4 గంటల 58 నిమిషాల వరకు, నక్షత్రం: మృగశిర రాత్రి 8: 04 నిమిషాల వరకు, వ్యర్జం: తెల్లవారుజామున 4 గంటల 54 నిమిషాల వరకు, దుర్ముహూర్తం: ఉదయం 8:30 నుంచి 8:05 నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం: 12 గంటల 33 నిమిషాల నుంచి ఒక గంట 15 నిమిషాల వరకు.
అమృతకాలం: ఉదయం 11 గంటల 7 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 41 నిమిషాల వరకు. రాహుకాలం: ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు. సూర్యోదయం: ఉదయం 5 గంటల 29 నిమిషాలకు. సూర్యాస్తమయం: సాయంత్రం 6:05 నిమిషాలకు. ఈరోజు జేష్ట మాసం ప్రారంభం.. చాంద్రమానం ప్రకారం.. జేష్ట మాసం మూడవ నెల. ఈ మాసంలోని పూర్ణిమ రోజు చంద్రుడు జేష్ఠ నక్షత్రంలో సంచరిస్తూ ఉండడం వల్ల జేష్ఠ మాసం అని పేరు వచ్చింది. ఇక 12 రాశుల వారు ఈ రోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారు వివరంగా తెలుసుకుందాం.
మేషరాశి :
ఈరోజు ఈ రాశి వారికి ఉద్యోగంలో పనిఒత్తిడి పెరిగినప్పటికీ సమర్థవంతంగా పనులు పూర్తిచేస్తారు. వ్యాపారంలో భాగస్వామ్యలు సహకరిస్తారు. లాభాలు కరిస్తారు. పరిష్కారం అవుతాయి. శుభకార్యాలను పాల్గొంటారు. ఇప్పటివరకు ఉన్న అనారోగ్యం తగ్గి ఆరోగ్యం ఏర్పడుతుంది. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. పలుకుబడి కలవారితో పరిచయాలు ఏర్పడతాయి. విద్యార్థులు చదువులో సులభంగా వృద్ధి సాధిస్తారు. వృత్తి పనులకు ఇప్పుడు అనుకూలమైన సమయం. డాక్టర్లకు పనిఒత్తిడి అధికంగా ఉంటుంది. టెక్నాలజీ రంగంలో ఉన్నవారికి అభివృద్ధి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఈరోజు ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. స్త్రీల ఆదరణ లభిస్తుంది.
మానసిక ప్రశాంతత లభిస్తుంది. వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో అధికమిస్తారు. కళాకారులకు అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. విద్యార్థులు విజయం సాధిస్తారు. వ్యాపారంలో విజయం సాధించే అవకాశం ఉంది. ఉద్యోగానికి సంబంధించి నిర్ణయం తీసుకోవడంలో జాప్యం జరగవచ్చు. జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. సన్నిహితుల నుంచి సమస్యలు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగులు అధికారుల సాయం అందుతుంది. సోదరులతో ఆస్తి, వివాదాలు తొలగిపోతాయి. శుభకాలం నడుస్తుంది. చేపట్టిన పనులను దైవానుగ్రహంతో పూర్తి చేస్తారు. ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ప్రేమికులకు కలిసి వచ్చే రోజు. శ్రీ వెంకటేశ్వరస్వామి దర్శనం శుభప్రదం. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు వచ్చాయి.
వృషభరాశి :
ఈరోజు రాశి వారికి ఆశించిన అభివృద్ధి ఉంటుంది. ఆదాయపరంగా కలిసి వస్తుంది. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. ఉద్యోగ వివాహ ప్రయత్నాలకు ఇది అనుకూలమైన సమయం. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. కొద్దిగా ప్రయత్నాలు పలుస్తాయి. సామాజిక కార్యకలాపాలు చురుగ్గా పాల్గొంటారు. విద్యార్థులు శ్రమ మీద పురోగతిని సాధిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. నూతన ఉద్యోగాలు తగ్గుతాయి. వ్యాపారాలు ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.
ఆకస్మిక ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడుతుంది. విద్యార్థుల కెరియర్‌లో విజయాలు సాధించే సూచనలు కనిపిస్తున్నాయి ఈరోజు మీరు మీ ఆరోగ్యంతో సంతోషంగా ఉంటారు. చేపట్టిన పనుల్లో మంచి ఫలితాలు అందుకుంటారు. మీ వెంట దైవబలం ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా సమయం గడుపుతారు. వ్యాపారంలో శుభఫలితాలు ఉన్నాయి. ఇష్టదేవతా దర్శనం మంచిది.
మిధున రాశి :
ఈరోజు రాశి వారికి అనుకోకుండా ఉద్యోగ బాధ్యతలు మార్పులు చేర్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. సమాజంలో పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. సామాజిక హోదా పెరుగుతుంది. ప్రతి ఉద్యోగ వ్యాపారాలను బాగా ఒత్తిడి ఉన్న ఫలితం ఉంటుంది. ఇల్లు మారాల్సిన అవకాశాలు ఏర్పడతాయి. విందులు, విహారాలు ఎక్కువగా ఉంటాయి. శుభకార్యాల గురించి ఆలోచిస్తారు. శుభవార్తలు వింటారు. విద్యార్థులు తేలిక విజయాలు సాధిస్తారు. ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. కుటుంబంలో ప్రోత్సాహం లభిస్తుంది.
వాహనయోగం కలుగుతుంది. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. రాజకీయ నాయకులు ఈరోజు పురోభివృద్ధిలో ఉంటారు. ముఖ్యమైన పనులలో ఆటంకాలు ఉంటాయి. వ్యాపారంలో సమస్యలు తీరుతాయి. ఉద్యోగులకు పనిఒత్తిడి పెరుగుతుంది. కొన్ని వ్యవహారాలలో అధిక కష్టంతో అల్ప ఫలితం పొందుతారు. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. అనవసరపు విషయాలతో కాలాన్ని వృధా చేయకండి. కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్తారు. శివారాధన మంచి చేస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు వస్తున్నాయి.
కర్కాటక రాశి :
ఈరోజు రాశి వారు ఆర్థిక ఇబ్బందుల నుంచి చాలా వరకు బయటపడతారు. ఖర్చులు తగ్గించుకోవలసిన అవసరం కూడా ఉంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యమైన పనులు స్నేహితులు సహాయపడతారు. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. విద్యార్థులు శ్రమ మీద రాణిస్తారు. రియల్ ఎస్టేట్ రాజకీయాలు, సామాజిక సేవ రంగాల వారికి సమయం అనుకూలం. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంది. ఆరోగ్యం చూసుకోవాలి. ఈరోజు కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు చూస్తారు. వాహన యోగం ఉంది. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. సమాజంలో ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది.

వ్యాపారాలు, ఉద్యోగాలకు ఆటుపోట్లు తగ్గుతాయి. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. వ్యాపారాలను వృద్ధి కలుగుతుంది. ఉద్యోగాల్లో ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. మిత్రుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. వ్యాపారాలు సాగుతాయి. ఉద్యోగంలో సమస్యలు తొలుగుతాయి. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. శుభకార్యాలకు ధనవ్యయం చేస్తారు. వ్యాపారంలో కొత్త అవకాశాలు లభిస్తాయి. రంగాల్లో శ్రమ పెరుగుతుంది. చిన్నచిన్న విషయాలకు కంగారు పడిపోతారు. సమస్యలు అధికం కానున్నాయి. మనో విచారాన్ని కలిగించే సంఘటనలు చోటుచేసుకుంటాయి. దుర్గా ధ్యానం శుభప్రదం.
సింహరాశి :
ఈరోజు ఈ రాశివారికి ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ధనప్రాప్తి కలుగుతుంది. వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. వ్యాపారాల్ని ఇంకా విస్తరిస్తారు. పెండింగ్లో ఉన్న పనుల్లో చాలా వరకు పూర్తవుతాయి. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగంలో అనుకూల మార్పులు చోటుచేసుకుంటాయి. స్నేహితులకు కానీ బంధువులకు కానీ ఆస్తి విషయాల్లో హామీలు ఇవ్వొద్దు. ఇబ్బందులు ఎదుర్కొంటారు. విద్యార్థులు చదువులో పురోగతి చెందుతారు. ఇంటాబయట బాగా ఒత్తిడి శ్రమ తగ్గుతుంది. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.
ఉద్యోగాలలో మరింత అనుకూలత లభిస్తుంది. అనుకుని ఖర్చులు ఇబ్బంది పడతాయి. ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. ఉద్యోగాలలో మార్పులు చేర్పులు ఉంటాయి. వ్యాపారాలు లావాదేవీలు ముందుకు సాగుతాయి. రాజకీయాల్లో పురోగతితో సంతోషంగా ఉంటారు. చంద్రుడు రాజకీయాల్లో విజయాన్ని అందించగలడు. తండ్రి ఆశీస్సులు తీసుకోండి. ఆర్థిక లాభాలు సాధ్యమే. ఉద్యోగులకు ఇతరులనుంచి సమస్యలు తొలగుతాయి. చేపట్టిన పనులు ముందుకు సాగుతాయి. బంధు వర్గంతో మాట పట్టింపులు తగ్గుతాయి. భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. పైఅధికారులతో అప్రమత్తంగా ఉండాలి. ఆదాయానికి తగ్గ ఖర్చులు ఉంటాయి. సూర్యారాధన శుభప్రదం.
కన్య రాశి :
ఈరోజు కన్యరాశి వారు శుభవార్తలు వింటారు. ఉద్యోగానికి సంబంధించిన ఆఫర్లు వస్తాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. కొన్ని ముఖ్యమైన పనులు ఆలస్యం అవుతుంటాయి. మానసిక ఒత్తిడి ఉంటుంది. ఆదాయం మెరుగుపడుతుంది. వృధా ఖర్చులు పెరుగుతాయి. వ్యాపార మార్పుకు సంబంధించిన ఏదైనా నిర్ణయాన్ని జాగ్రత్తగా తీసుకోండి. ప్రయాణం ఆహ్లాదకరంగా ఉంటుంది. దూర ప్రయాణాలు చేయక తప్పదు. స్నేహితులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. అనుకున్న పెళ్లి సంబంధం కుదురుతుంది.
Horoscope Today 7th June 2024 : 12 రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయంటే?
మీ పిల్లలు ఒకరికి దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఇల్లు మారే అవకాశం ఉంది. సంఘంలో గౌరవం మర్యాదలు పొందుతారు. ఈరోజు కొన్ని విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. క్లిష్టమైన పనులు విజయం సాధిస్తారు. వ్యాపారాలు ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి. పనులు ముందుకు సాగుతాయి. ఉద్యోగస్తులకు స్థానాచలనాలు తప్పవు. ఆకస్మికంగా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. చేపట్టిన పనులను ఆత్మవిశ్వాసంతో చేయాలి. శ్రద్ధతో పనిచేస్తే గొప్ప ఫలితాలు అందుకుంటారు. మీ ప్రతిభతో విజయాలను అందుకుంటారు. ప్రయాణాలు చేసే అవకాశం ఉంది.
తులారాశి :
ఈరోజు ఈ రాశి వారు ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటారు. మీ మంచితనంతో ఇంటాబయట విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. మీ నుంచి సహాయం పొందే వారు మీకు మేలు చేస్తారు. ఆదాయం పెరిగే సూచనలు ఉన్నాయి. ఆశించిన పనులన్నీ శ్రమ మీద పూర్తవుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఉన్నవారికి ఒక మోస్తరుగా ఉంటుంది. విద్యార్థులకు పర్వాలేదు. బ్యాంకింగ్ వ్యాపారాలు ఆర్థిక రంగాల్లో ఉన్నవారికి కాలం కలిసి వస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగాలకు సంబంధించి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. ఈరోజు లాభాలు కలుగుతాయి పలుకుబడి పెరుగుతుంది. కొత్త విద్యా అవకాశాలు ఉంటాయి. ప్రత్యేక శ్రద్ధతో పని చేస్తే గొప్ప ఫలితాలు అందుకుంటారు. మీ ప్రతిభతో విజయాలను అందుకుంటారు. ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. విద్యార్థులకు కలిసివచ్చే కాలం. విష్ణునామస్మరణ మేలు చేస్తుంది.
వృశ్చిక రాశి :
ఈరోజు ఈ రాశి వారికి ఆదాయం నిలకడగా ఉంటుంది. వివాహ ప్రయత్నాలు చాలా వరకు అనుకూలిస్తాయి. ఉద్యోగానికి సంబంధించి విదేశాల నుంచి ఆఫర్ అందవచ్చు. సంతాన నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో అధికారుల ప్రశంసలు పొందుతారు. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలలో ఆచితూచి అడుగు వేయాలి. వృత్తి, చిన్న వ్యాపారులకు అనుకూలమైన సమయం. ఈరోజు మీరు మొదలు పెట్టిన పనులు పూర్తవుతాయి. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి. దైవచింతన మేలు చేస్తుంది. ఈ రాశి వారు ఈ రోజు దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. జీవితానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు.
పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు. వ్యాపారాలను వృత్తి కనిపిస్తుంది. చేపట్టిన పనులను ఆ ప్రయత్నం చేస్తే కలుగుతుంది. వ్యాపారంలో నూతన పెట్టుబడులు అందుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు కొంత అనుకూలిస్తాయి. సమాజంలో ఉద్యోగంలో సమస్యలు అధిగమించి ముందుకు సాగుతారు. మిత్రుల నుంచి విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు. ఆర్థిక సంతోషానికి సంబంధించి సంతోషం ఉంటుంది. విద్యార్థులు చదువులో వారి పనితీరు పట్ల సంతృప్తి చెందుతారు. చేపట్టిన పనులను మీరు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. అన్ని రంగాల్లో మీరు ఊహించని ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ప్రేమికులు విజయం సాధిస్తారు. శివాభిషేకం మంచి ఫలితాలను ఇస్తుంది.
ధనస్సు రాశి :
ధనస్సు రాశి వారికి ఆదాయపరంగా అభివృద్ధి కనిపిస్తుంది. ఆప్తుల నుంచి ధన సహాయం అందుతుంది. ఆదాయం మార్గాలు విస్తృతమవుతాయి. చేపట్టిన పనుల్లో వృద్ధి కలుగుతుంది. వ్యాపారంలో ఆశించిన లాభాలు అందుతాయి. ఉద్యోగస్తుల కలలు పలుస్తాయి. ముఖ్య కార్యాల్లో పాల్గొంటారు. ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. విద్యార్థులు రాణిస్తారు. కొద్దిగా కష్టపడాల్సి ఉంటుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ప్రోత్సాహం లభిస్తుంది. విద్యార్థులు చదువులో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఏదైనా పెద్ద మతపరమైన ఆచారాలు ఇంట్లో చేయవచ్చు. అన్ని రంగాల వారికి ఆర్థికంగా బాగుంటుంది. శుభ ఫలితాలు సాధిస్తారు. మానసిక ప్రశాంతతను కోల్పోకుండా ముందుకు సాగాలి. శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం శుభకరకం.
మకర రాశి :
ఈరోజు ఈ రాశి వారికి అన్ని విధాల అనుకూలమైన సమయం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వాహన యోగం కలుగుతుంది. ఉద్యోగ వివాహ ప్రయత్నాలు కలిసివస్తాయి. ఉద్యోగానికి సంబంధించి కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి. విద్యార్థులు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్తారు. బంధుమిత్రుల నుంచి ఊహించని విధంగా సహాయం అందుతుంది. విద్యార్థులు టీచర్ల ప్రశంసలు అందుకుంటారు. శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఈరోజు మీకు వ్యతిరేకంగా ఉన్నవారు అనుకూలంగా మారుతారు. వ్యాపారాలు ఉద్యోగాలలో మీదే పైచేయి అవుతుంది. వ్యాపారాలు పొందుకుంటాయి. ఉద్యోగాలను పురోగతికి కనిపిస్తుంది. ప్రయాణం ఉండవచ్చు. వ్యాపారంలో ఏదైనా మార్పు గురించి శుభవార్త ఉంటుంది. వ్యాపారంలా ఉద్యోగంలో అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. మీ రంగాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ఉద్యమాలతో పనిచేస్తే పనులు జరుగుతాయి. ఇతరుల జోలికి వెళ్ళకూడదు. విహారయాత్ర ప్లాన్ చేసే అవకాశం ఉంది. అష్టలక్ష్మి దేవి సందర్శనం శుభప్రదం.
కుంభరాశి :
ఈరోజు ఈ రాశి వారికి జీవితంలో రాదు. అనుకునేటప్పుడు చేతికి వస్తుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. విద్యార్థులు, చదువులు సులభంగా పురోగతిని సాధిస్తారు. ప్రేమలో ఉన్నవారు ముందు అడుగు వేస్తారు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం ఉంది. చిన్న వ్యాపారులకు అభివృద్ధికి అవకాశముంది. అనుకోకుండా ఒక వ్యక్తిగత సమస్య నుంచి బయటపడతారు. రోజు చేపట్టిన పనులు పురోగతికి కనిపిస్తుంది. సోదరులు సోదరీమణులతో సంగతి ఏర్పడుతుంది. పలుకుబడి పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన సంఘటనలు జరుగుతాయి. వ్యాపారాలు ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.
ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. బంధువులు సన్నిహితులు కలుస్తారు. వ్యాపారాలు కూడా లాభసాటిగా ఉంటాయి. విందులు వినోదాలు పాల్గొంటారు. ఉద్యోగాల్లో ఇబ్బందులు తొలగిపోతాయి. వ్యాపారస్తులకు నూతన అవకాశాలు లభిస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు కలుస్తాయి. ఆప్తుల నుంచి ఆశించిన సాయం అందుతుంది. ఉద్యోగంలో పదోన్నతులు పెరుగుతాయి. అన్నిరకాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనులు శ్రమకు తగిన ఫలితం పొందుతారు. ఈరోజు మీ మనసు ఆధ్యాత్మికంగా బాగుంటుంది. ఆహ్లాదకరమైన ప్రయాణానికి కూడా అవకాశం ఉంది. రాజకీయ నాయకులు లాభపడతారు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. చేపట్టిన పనుల్లో జరిగే సూచనలు ఉన్నాయి. పైఅధికారులతో జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణంలో జాగ్రత్త. శివాష్టోత్తర పారాయణం చేయడం మంచిది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి.
మీనరాశి :
ఈరోజు ఈరాశి వారు కొత్త ఉద్యోగంలో చేరుతారు. మీకు సహాయ సహకారాలు అందిస్తారు. నిరుద్యోగులకు చిన్నపాటి ఉద్యోగం లభించవచ్చు. చిన్ననాటి స్నేహితులతో ఇందులో పాల్గొంటారు. వివాహ సంబంధాల కోసం ప్రయత్నాలు ప్రారంభిస్తారు. విద్యార్థులు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. వ్యాపార స్వయం ఉపాధి రంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలలో జాగ్రత్తగా పొందకు వెళ్లడం మంచిది. ఎవరికీ హామీలు ఉండవద్దు. ఈరోజు సన్నిహితులతో సఖ్యత ఏర్పడుతుంది. కుటుంబంలో సమస్యలు తీరుతాయి. దైవ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు ఉద్యోగాలలో వరదలు తగ్గుతాయి. వ్యాపారాల్లో వృత్తి ఉంటుంది. ఉద్యోగాల్లో ప్రశంసలు దక్కుతాయి.
కళాకారులకు సన్మానాలు అందుతాయి. ఆకస్మిక ధన లాభం చేపడుతుంది. సోదరులు కలుసుకునే అవకాశం ఉంటుంది. వ్యాపారాలు శుభప్రదంగా ఉంటాయి. డబ్బు ఖర్చు కావచ్చు. స్నేహితుల సహకారం వల్ల ప్రయోజనం ఉంటుంది. నూతన కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో ఆలయ సందర్శనాలు చేసుకుంటారు. ప్రతి ఉద్యోగాల్లో కీలక సమాచారం అందుతుంది. నూతన వ్యాపార ప్రారంభానికి పెట్టుబడులు పొందుతాయి. దీర్ఘకాలిక రుణ సమస్యలను పరిష్కరించుకుంటారు. శుభకాలం ఇష్టమైన వారితో సరదాకాలాన్ని గడుపుతారు. ఆర్థికంగా అనుకూలమైన సమయం డబ్బు చేతికందుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు ఉంటాయి. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు.