Kandipappu Deepam : అప్పుల బాధతో ఇబ్బందులు పడుతున్నారా? ఆర్థిక ఇబ్బందుల నుంచి ఎలా బయటపడాలో తెలియడం లేదా? అయితే, అప్పులన్నీ తీర్చి సొంత ఇంటి కలను నెరవేర్చుకోవడానికి అద్భుతమైన పరిహారం ఒకటి ఉంది. అదేంటో తెలుసా? అదే.. కందుల దీపం.. ఈ పరిహారంతో భయంకరమైనటువంటి అప్పుల బాధలను క్రమక్రమంగా తగ్గించుకోవచ్చు. ఒక అప్పు తర్వాత ఇంకొక అప్పు చేస్తున్నప్పుడు ఆ అప్పులన్నీ కూడా తొందరగా తీర్చుకోవచ్చు. ఏదో ఒక విధంగా ధనం కలిసొచ్చి తీరిపోతుంది.
అలాగే, సొంత ఇంటి కలలు తొందరగా సాకారం చేసుకోవాలన్నా కూడా ఇల్లు కొనుక్కోవాలన్నా.. స్థలాలు కొనుక్కోవాలన్నా.. పొలాలు కొనుక్కోవాలన్నా.. ఈ కందుల దీపాన్ని వెలిగించాలని పరిహార శాస్త్రంలో చెప్పడం జరిగింది. ఈ కందుల దీపాన్ని కార్తీక మాసంలో వచ్చే మంగళవారం గానీ లేదా ఏ నెలలో వచ్చే మంగళవారం అయినా సరే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి చిత్రపటం దగ్గర వెలిగించుకోవచ్చు. జీవితంలో ఉన్నటువంటి అన్ని రకాలైన అప్పులను సంపూర్ణంగా పోగొట్టే కందిపప్పు దీపాన్ని ఎలా వెలిగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
షట్కోణా ముగ్గు ఎలా వేయాలంటే? :
మీ గృహాల్లో కార్తీకమాస మంగళవారం లేదా ఏ మాసంలో వచ్చే మంగళవారం అయినా సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి చిత్రపటానికి గంధం బొట్లు, కుంకుమ బొట్లు పెట్టి అలంకరించాలి. సుబ్రమణ్య స్వామి ఫొటో దగ్గర ఒక పీట ఏర్పాటు చేసుకోవాలి. ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ఆ పీట మీద బియ్యం పిండితో షట్కోణం ముగ్గు వేయాలి. మనకు ముగ్గులు ఎలాగో షట్కోణా ముగ్గు అని కూడా ఉంటుంది..అంటే ఒక ఊర్ధ్వ త్రికోణము ఒక అదోత్రికోణము ఈ రెండు కలిపితే వచ్చే ముగ్గుని షట్కోణా ముగ్గు అంటారు. అది ఒక ఊర్వత్రిక ముగ్గు అవుతుంది.
ఒక అపరి ట్రయాంగిల్, ఒక లూయర్ ట్రయాంగిల్ కలిపి ముగ్గు వేస్తే దాన్ని షట్కోణం ముగ్గు అంటారు. అలా బియ్యం పిండితో షట్కోణం ముగ్గు వేసిన తర్వాత ఆ షట్కోణం ముగ్గు మీద ఒక వెండి పళ్ళెం గాని లేదా ఒక రాగి పళ్లెం లేదా ఒక ఇత్తడి పల్లెంగాని ఏర్పాటు చేసుకోవాలి. ఆ వెండి పళ్ళెం లేదా రాగిపళ్ళెం లేదా ఇత్తడి పళ్లెం ఉన్నచోట గంధం బొట్లు మూడు చోట్ల కుంకుమ బొట్లు పెట్టాలి.
ఆరు ఎర్రటి ఒత్తులను ఏక ఒత్తిగా చేసి :
ఆ తర్వాత ఆ పళ్లాల్లో పసుపు కుంకుమ అక్షింతలు వేయాలి. అలా వేసిన తర్వాత ఆ వెండి పళ్లెంలో లేదా రాగి పళ్లాల్లో లేదా ఇత్తడి పల్లెల్లో మసూర్ పప్పు అని ఉంటుంది. దాన్ని ఎర్ర కందిపప్పు కూడా అంటారు. ఆ ఎర్ర కందిపప్పు కుప్పలా పోయాలి లేదా కందులు కొన్ని తెచ్చి కందులు కుప్పలాగా పోయాలి. మసూర్ పప్పు లేదా ఎర్ర కందిపప్పు వీలుకాని పక్షంలో కొన్ని కందులు ఆ రాగి పళ్ళెం లేదా వెండి పళ్ళెం లేదా ఇత్తడి పల్లెలో పోసి వాటి మీద ఒక మట్టి ప్రమిదలో ఇంకొక మట్టి ప్రమిద పెట్టి ఉంచాలి.
ఆ మట్టి ప్రమిదకు మూడు చోట్ల కుంకుమ బొట్లు పెట్టి ఆవు నెయ్యి గానీ నువ్వుల నూనె గానీ పోసి 6 ఎర్రటి వత్తులు తీసుకొని వాటిని కలిపి ఒకే ఒత్తి లాగా చేసి దక్షిణ దిక్కు వైపు ఆ ఒత్తిని వేసి ఏక హారతితో గాని అగరబత్తితో గాని వెలిగించాలి. దీన్నే కందుల దీపం అనే పేరుతో పిలుస్తారు. ఎర్రటి వత్తులు మీకు అందుబాటులో లేకపోతే తెల్లటి వత్తులు తీసుకొని వాటి కొద్దిగా కుంకుమ రాయండి.
Kandipappu Deepam : కందుల దీపం వెలిగించి ఈ మంత్రాన్ని జపించాలి :
అలా ఆరు ఎర్రటి వత్తులు తీసుకొని వాటన్నిటిని కలిపి ఒకే ఒత్తి లాగా చేసి దక్షిణ దిక్కు వైపు ఆ వత్తి వెలిగేలాగా సుబ్రహ్మణ్య స్వామి చిత్రపటం దగ్గర వెలిగించండి. ఇలా కందుల దీపాన్ని వెలిగించిన తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన ‘ఓం పిశితాశ ప్రభంజనాయ నమః’ అనే మంత్రాన్ని 21సార్లు చదువుకుంటూ స్వామి చిత్రపటానికి ఎర్రటి మందార పూలతో గాని ఎర్ర గులాబీ పూలతో గాని పూజ చేయాలి. సుబ్రమణ్య స్వామికి దానిమ్మ పండు గింజలు నైవేద్యంగా సమర్పించాలి.

ఇలా కందుల దీపం వెలిగించి ఆ దీపం కొండెక్కిన తర్వాత ఆ దీపం పెట్టటానికి ఉపయోగించిన మసూర్ పప్పు లేదా ఎర్ర కందిపప్పు లేదా కందులు ఆహారంలో వినియోగించుకోవాలి. లేదంటే ఆ కందులను నానబెట్టి గోమాతకు ఆహారంగా తినిపించడం చేయాలి. కార్తీక మాసంలో వచ్చే మంగళవారం లేదా ఏ మాసంలో వచ్చే మంగళవారైనా ఈ కందుల దీపాన్ని వెలిగించి తీవ్రమైన అప్పుల బాధలనుంచి బయటపడొచ్చు. అలాగే, తొందరగా సొంతింటి కలను సాకారం చేసుకోవచ్చు.
కుజుడుకి కందిపప్పు దీపం వెలిగించే పద్దతి :
కొన్ని ప్రత్యేకమైనటువంటి దీపాలు ప్రత్యేకమైన రోజుల్లో వెలిగిస్తే అనేక రకాల అప్పుల బాధలు తొలగిపోతాయి. అప్పుల విషవలయంలో కొట్టుమిట్టాడుతున్న వాళ్ళు ఏదో ఒక రకంగా డబ్బులు కలిసి వచ్చి అప్పుల విషవలయం నుంచి బయట పడవచ్చు. ప్రత్యేకమైన రోజుల్లో ప్రత్యేకమైన దీపాలు వెలిగించాలని పరిహార శాస్త్రంలో ఉంది. ఎంతటి పెద్ద రుణ బాధలు ఉన్నా సరే అవన్నీ పోగొట్టే శక్తి కందిపప్పు దీపానికి ఉంది.
ఎవరైతే కందిపప్పు దీపాన్ని 9 మంగళవారాలు గృహంలో వెలిగిస్తారో వాళ్లకి 9 మంగళవారాలు పూర్తయిన తర్వాత అతి త్వరలోనే ధనం చేతికొచ్చి పెద్దపెద్ద అప్పుల సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చ. మరి ఈ కందిపప్పు దీపాన్ని మంగళవారం రోజు ఎలా వెలిగించాలి? కందిపప్పు దీపాన్ని వెలిగించడానికి అప్పుల సమస్యలు పోవడానికి ఉన్న సంబంధం ఏంటి? అనే విషయాన్ని పరిశీలిద్దాం..
కుజగ్రహ దోషం తొలగాలంటే? :
నవగ్రహాలలో కుజుడు దోషంగా ఉంటే.. జాతకంలో అప్పులు ఎక్కువ అవుతాయి. కుజుడి బలం పెరగాలంటే కుజుడికి ఇష్టమైనది కందిపప్పు. అందుకే కందిపప్పు దీపాన్ని వెలిగించాలి. కందిపప్పు దీపం పెడితే కుజుడు ఆనందిస్తాడు. జాతకంలో కుజుడు బలం పెరుగుతుంది. దానివల్ల రుణ బాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. మంగళవారం కందిపప్పు దీపం పెట్టాలి అంటే.. 9 కాబట్టి 9 మంగళవారాలు కందిపప్పు దీపం వెలిగించాలి. ఈ కందిపప్పు దీపం ఎలా వెలిగించాలంటే ముందుగా మంగళవారం రోజు మీ పూజ గదిలో ఒక పీఠ ఏర్పాటు చేసుకోవాలి. ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. ఆ పీట మీద షట్కోణా ముగ్గు వేయాలి.