Navadhanyalu Dream Telugu : నవధాన్యాలు కలలో కనిపిస్తే జరగబోయేది ఇదే.. ఏ పప్పు ఎలా కనిపిస్తే.. ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసా?

Navadhanyalu Dream Telugu : నవధాన్యాల్లో ఏదైనా పప్పును మీరు కలలో చూసినట్టయితే ఎలాంటి ఫలితాలు ఉంటాయనేది తెలుసా? ఒకవేళ మీరు మీ కలలో పప్పును చూసినట్టయితే రకరకాల సందర్భాల్లో చూస్తే రకరకాల ఫలితాలు ఉంటాయి. అందులో మొదటిగా ఒకవేళ మీరు పచ్చి పప్పును (Navadhanyalu Kalalo Kanipisthe) చూసినట్టయితే.. ఉడకబెట్టకుండా ఉండేటివి.. రాబోయే రోజుల్లో మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది అని అర్థం. అంతేకాకుండా మీ జీవితంలో రాబోయే రోజుల్లో ఎదుగుదల అనేది చాలా బాగుంటుంది. రాబోయే రోజుల్లో మీరు శుభవార్తను వినబోతున్నారని ఇది మీకు సూచిస్తుంది. మీకు సంతోషం కలిగేలాంటి ఏదైనా సంఘటన జరగవచ్చు అని అర్థం.

అదే ఒకవేళ మీరు మీ కలలో ఉడకబెట్టిన పప్పును చూసినట్టయితే.. అది అంత మంచి కల కాదని గమనించాలి. రాబోయే రోజుల్లో మీకు ఏదైనా సమస్య ఉంటే.. అలాంటి సమస్య త్వరగా తీరిపోదని కల మీకు సూచిస్తుంది. అది ఇంకా కొన్ని రోజులు అలాగే కొనసాగుతుంది. మీరు ఏదైనా విషయం జరగాలి లేదా ఏదైనా పనిజరగాలి లేదా ఏదైనా వస్తువు కావాలి అని ఆశపడుతున్నట్టయితే.. అలాంటివి జరగకుండా వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని అర్థం. అదే ఒకవేళ.. మీరు మీ కలలో పప్పును తింటున్నట్టుగా మీరు చూసినట్టయితే.. అవి పచ్చివి అయినా లేదా ఉడకబెట్టిన పప్పు అయిన మీరు తింటున్నట్టుగా అయితే ఇది కూడా అంత మంచి కల కాదు. రాబోయే రోజుల్లో వేరే వాళ్ళ వల్ల మీకు సమస్యలు వస్తాయని ఈ కల మీకు సూచిస్తుంది.

నవధాన్యాలు ఏ విధంగా కలలో వస్తే ఎలాంటి ఫలితం :
మీరు చేసే పనులలో అడ్డంకులు ఇబ్బందులు కలుగుతాయని అర్థం. మీరు కొద్దిగా జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది. అంతేకాకుండా.. మీ ఆస్తుల విషయాలలో ఏవైనా సమస్యలు రావచ్చుని కల మీకు సూచిస్తుంది. అదే ఒకవేళ మీ కలలో పప్పును కడుగుతున్నట్టుగా మీరు చూసినట్టయితే.. రాబోయే రోజుల్లో మీ సమస్యలు తీరిపోతాయని అర్థం. ఇది ఒక మంచి కల. మీకు రాబోయే రోజుల్లో ధన లాభం కూడా కలుగవచ్చు. మీకు ధన ప్రాప్తి కలుగుతుంది అని అర్థం. అదే, ఒకవేళ మీరు మీ కలలో పప్పును కొనుకుంటున్నట్టుగా కల వస్తే.. రాబోయే రోజుల్లో మీకు మంచి స్నేహితులు దొరుకుతారని అర్థం. మీ స్నేహితుల వల్ల మీకు సహాయం లభిస్తుందని అర్థం.

ఒకవేళ మీ కలలో పప్పును అమ్ముతున్నట్టుగా మీరు చూసినట్టయితే.. రాబోయే రోజుల్లో మీరు శుభవార్తను వినబోతున్నారని అర్థం. మీ స్నేహితులని మీరు కలుస్తారని కల మీకు సూచిస్తుంది. ఒకవేళ మీ కలలో పప్పును పారేస్తున్నట్టుగా మీరు చూసినట్టయితే.. రాబోయే రోజుల్లో మీరు ఏదో ఒక రకమైన పొరపాటు అనేది చేస్తారని అర్థం. అంటే.. పొరపాటు చేసే అవకాశాలు ఉన్నాయని అర్థం. మీరు కొద్దిగా జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది.

అదే ఒకవేళ మీరు మీ కలలో పప్పు కింద పడిపోయినట్టుగా మీరు చూస్తున్నట్లయితే.. రాబోయే రోజుల్లో మీరు మోసగాళ్ల వల్ల నుంచి బయట పడతారని ఈ కల మీకు సూచిస్తుంది. అదే ఒకవేళ మీరు మీ కలలో పప్పు తోటలో పనిచేస్తున్నట్టుగానో లేదా ఊరికే అలా తోటని చూస్తున్నట్టుగానూ కల వస్తే.. చాలా మంచి కల. రాబోయే రోజుల్లో మీకు అన్ని విషయాలలో చాలా మేలు జరుగుతుంది అని అర్థం. మీకు ధన లాభం కలుగుతుంది. మీ జీవితంలో మంచి ఎదుగుదల ఉంటుందని ఈ కళ మీకు సూచిస్తుంది.

Navadhanyalu Dream Telugu : ఏయే ధాన్యం కలలో కనిపిస్తే ఏయే ఫలితాలు ఉంటాయంటే? :

మీకు కలలో నవధాన్యాలు కనపడితే అనేక ఫలితాలు ఉంటాయని ప్రాచీన శాస్త్రాల ఆధారంగా చెబుతారు. నవధాన్యాలు కలలో కనబడినట్లైతే మీకు మంచి గౌరవ మర్యాదలు దక్కుతాయి. మీ భవిష్యత్తులో ఉన్నత స్థితిని చూడబోతున్నారని చెప్పవచ్చు. మీరు చేసే పనులు మంచి మార్పులు జరుగుతాయి. గొప్ప సక్సెస్ చూడబోతున్నారని సూచన. ఇక కలలో ఒక్కొక్క ధాన్యం కలలో కనపడితే ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం.

ధాన్యం కలలో కనబడినట్లైతే.. ధన లాభం కలుగుతుంది. ఆస్తులు కలిసి వస్తాయి. మీ జీవితంలో మంచి మార్పులను చూడబోతున్నారని మీరు చేసే ప్రయత్నాలు పనులు బాగా కలిసి వస్తాయి. భవిష్యత్తులో చాలా సంతోషంగా ఉండబోతున్నారని సూచన. కందులు కలలో కనపడితే ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం. మీకు మీ కుటుంబ సభ్యులతో గానీ దగ్గర వాడితో గాని గొడవలు వచ్చే అవకాశం ఉంది. పెసలు కలలో కనపడితే మీకు మంచి అభివృద్ధి కలుగుతుంది. మీరు చేసే పనులలో మంచి విజయం సాధిస్తారని సూచన.

Navadhanyalu Kalalo Kanipisthe
Navadhanyalu Kalalo Kanipisthe ( Image Source : Google )

మినుములు కలలో కనబడినట్లైతే మీకు భవిష్యత్తులో మీరు చేసే పనులలో గాని చేయబోయే పనులో గాని అంతగా రాణించవు. ఆరోగ్యం క్షీణించగలదు. మీకు ఏదైనా హానీ కీడు కలగబోతుందని సూచన. అలాగే, శనగలు కలలు కనపడినట్లయితే.. ఇది ఒక శుభ సూచకం. మీకు ఏదన్నా అనారోగ్యం ఉన్న ఆ సమస్య తీరుతుంది. మీరు పూర్తిగా ఆరోగ్య వంతులు అవుతారు. మీ భవిష్యత్తులో సుఖంగా సంతోషంగా జీవిస్తారు. గోధుమలు కలలో కనపడినట్లయితే.. మీకు ఒక మంచి కల. మీరు చేసే పనిలో గాని చేయబోయే పనిలో గాని మంచి ఎదుగుదల ఉంటుంది. మీ వృత్తి వ్యాపారాల్లో మంచి లాభం కలుగుతుంది. ఆరోగ్యంగా ఉంటారు. ఉలువలు కలలు కనపడినట్లయితే.. మీకు పశుసంపద ఉన్నట్లయితే అవి బాగా వృద్ధి చెందుతాయి. మీకు ఆనందాన్ని అనురాగాలను పెంచుతాయని అర్థం.

బొబ్బర్లు కలలో కనపడినట్లయితే.. మీకు మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. మీకు ఏవైనా సమస్యలు ఉన్న అవి తొలగిపోతాయి. మీరు ఎంతో సంతోషంగా ఉంటారు అని అర్థం. నువ్వులు కలలో కనబడినట్లైతే.. ఇది అంతా మంచిది కాదు. జీవితంలో కష్టపడతారు. బాధలను ఎదుర్కోవాల్సి వస్తుందని సూచిస్తుంది. మీకు కలలో నవధాన్యాలు మీరు ఎవరికైనా ఇస్తున్నట్లు కల వచ్చినా ఇది అంత మంచిది కాదు. మీరు కొన్ని ఆర్థిక పరిస్థితులను ఆర్థిక నష్టాలను ఎదుర్కోవడం తప్పదని అర్థం. మీకు కలలో నవధాన్యాలను మీరు చూస్తున్నట్లు కల వచ్చినా ఇది మంచి శుభ సూచకం. మీరు చేసే ప్రతి పనిలో ముందడుగు వేస్తారు. విజయాన్ని సాధిస్తారు. నలుగురిలో గౌరవ మర్యాదలు పేరు ప్రతిష్టలు పొందుతారని సూచనగా చెప్పవచ్చు.

Read Also : Black Crow Superstition : శనివారం నల్లకాకి కనిపిస్తే వెంటనే ఇలా చేయండి.. లేదంటే రాబోయో అదృష్టాన్ని వదులుకున్నట్టే!