Shani Jayanti 2024 : జూన్ 6న పంచగ్రహ కూటమి, శనైశ్చర జయంతి రోజున ఇలా చేస్తే.. శనిదోషాలు పోయి రాజయోగం పడుతుంది

Shani Jayanti 2024 : వైశాఖ మాసంలో వచ్చే అమావాస్య చాలా శక్తివంతమైంది. ఆరోజు దుర్గా ఆలయ దర్శనం చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. వైశాఖ అమావాస్య రోజు దుర్గాదేవి ఆలయానికి వెళ్లి ఆలయంలో దుర్గాదేవిని దర్శనం చేసుకోవాలి. కుంకుమార్చన చేయించుకుని ఆ కుంకుమ బొట్టు ధారణ చేస్తే అన్ని రకాలైన కష్టాలు తొలగిపోతాయి. 2024వ సంవత్సరంలో వైశాఖ మాసంలో వచ్చే అమావాస్య కన్నా ఇంకొక ప్రత్యేకత ఏంటంటే.. ఆరోజు శనైశ్చర జయంతి. శని భగవానుడి పుట్టినరోజు. ఆరోజు నవగ్రహాలయంలో శని విగ్రహానికి ప్రత్యేకంగా పూజ చేయాలి. శని భగవానుడికి నువ్వుల నూనె అభిషేకంతో పాటు కొబ్బరినీళ్ళ అభిషేకం చేయాలి. శనిదేవుడికి కొబ్బరినీళ్లతో అభిషేకం చాలా ఇష్టం. కొబ్బరినీళ్లు శని విగ్రహం మీద ఎక్కడైనా నవగ్రహాలయంలో పోస్తే.. ధనపరమైన సమస్యలు తగ్గిపోతాయి. చాలామంది ఆర్థికంగా డబ్బు నిలబడక అవసరానికి ధనం చేతికి అందక ఇబ్బంది పడుతుంటారు.

జమ్మి ఆకుతో శనిదేవున్ని పూజిస్తే.. :
అలాంటి వాళ్ళందరూ కూడా వైశాఖ అమావాస్య శనిశ్చర జయంతి రెండూ కలిసి వచ్చిన అరుదైన రోజు. ఆరోజు శని విగ్రహం మీద కొబ్బరినీళ్లు నవగ్రహాలయాల్లో పోయండి. దానివల్ల శని ప్రసన్నుడై మీకు అవసరానికి ధనం అందేలా చూస్తాడు. ఆర్థిక ఇబ్బందులు తగ్గిపోతాయి. అలాగే శని భగవానుడికి నీలం రంగు పుష్పాలంటే చాలా ఇష్టం. శనీశ్వరా జయంతి రోజు నవగ్రహాలయంలో శని విగ్రహం దగ్గర నీలం రంగులో ఉన్న పుష్పాలు కొన్ని ఉంచండి. అలాగే కొన్ని నల్ల మినుములు శని విగ్రహం పాదాల చెంత ఉంచి నమస్కారం చేసుకోండి. కొద్దిగా రాళ్ల ఉప్పు కూడా శని విగ్రహం పాదాల చెంత ఉంచండి. మీకు జమ్మి ఆకు దొరికితే ఆ జమ్మి ఆకు మీద కొద్దిగా ఉప్పు రాయాలి. అలా ఉప్పు రాసిన జమ్మి ఆకును శని విగ్రహం పాదాల చెంత నవగ్రహాలయంలో ఉంచండి.

శనైశ్చర జయంతి.. వైశాఖమాస్య అరుదైన రోజున శని విగ్రహం దగ్గర మూడు విధివిధానాలు పాటించాలి. అందులో మొదటిది.. ఉప్పు రాసిన జమ్మి ఆకును ఉంచటం. ఇక రెండోది కొన్ని నల్ల మినుములను ఉంచటం. మూడోది.. కొద్దిగా రాళ్ళ ఉప్పు ఉంచడం. ఈ మూడు విధి విధానాల్లో ఏ ఒక్క విధివిధానం పాటించిన లేదా ఈ మూడు విధివిధానాలు పాటించిన శని భగవానుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. సమస్త జాతక శని దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. ఆ తర్వాత నవగ్రహాల చుట్టూ 25 ప్రదక్షిణాలు చేస్తూ ‘ఓం శంశనేశ్వరాయ నమః’ అని మనసులో జపించుకోండి. 25 ప్రదక్షిణాలు చేయాలి. శని జయంతి రోజు 25 ప్రదక్షిణాలు చేస్తూ ‘ఓం శం శనేశ్వరాయ నమః’ అని జపిస్తే.. మీరు పుట్టిన జాతకంలో మీ జన్మ కుండలిలో ఎలాంటి శని దోషాలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయి.

రావి చెట్టును పూజిస్తే.. :
వైశాఖమాస్య జయంతి కలిసి వచ్చిన అరుదైన రోజు నవగ్రహాలయంలో శని విగ్రహానికి ఈ ప్రత్యేకమైనటువంటి విధివిధానాలు పాటించి ఆ తర్వాత నువ్వులతో చేసినటువంటి పదార్థాలు శని విగ్రహం దగ్గర పెట్టాలి. ఆ తర్వాత శనిదేవునికి నైవేద్యం పెట్టి నమస్కారం చేసుకోండి. అలాగే దుర్గాదేవికి కుంకుమ పూజ చేయించినటువంటి ఆ కుంకుమ బొట్టును ధారణ చేయండి. ఆరోజు పులిహోర పంచి పెడితే చాలా మంచిది. ఎక్కడైనా దేవాలయ ప్రాంగణంలో నిమ్మకాయ పులిహోర కనీసం 11 మందికి వైశాఖమాస రోజు పంచి పెట్టండి. దానివల్ల అద్భుతమైన ప్రయోజనాలు చేకూరతాయి. అలాగే వైశాఖ అమావాస్య జయంతి రెండు కలిసి వచ్చిన రోజు రావి చెట్టును పూజిస్తే.. అద్భుత విజయాలు కలుగుతాయి.

వైశాఖమాసం విష్ణుమూర్తికి ఇష్టం.. రావిచెట్టు విష్ణు స్వరూపం. శని దోషాలు పోగొట్టే శక్తి రావి చెట్టుకు ఉంటుంది. కాబట్టి.. వైశాఖ అమవాస్య శనిజయంతి రెండు కలిసి వచ్చిన రోజు రావి చెట్టు దగ్గర మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి ఎనిమిది ఒత్తులు విడిగా వేసి దీపం పెట్టాలి. ఆపై రావి చెట్టుకి ఎనిమిది ప్రదక్షిణాలు చేయాలి. అలా చేసినవాళ్ళు శని దోషాలు పోగొట్టుకుంటారు. విష్ణుమూర్తి అనుగ్రహం పొందుతారు. ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా అద్భుతమైన ప్రయోజనాలు అందిపుచ్చుకోగలుగుతారు. ఈ విధివిధానాలు పాటించండం ద్వారా సకల శుభాలను పొందవచ్చు.

Shani Jayanti 2024 : శనీశ్వర జయంతిన ఈ పని చేస్తే చాలు.. శని మొత్తం పోతుంది :

జూన్ 6, 2024 గురువారం రోజున అంటే.. వైశాఖ బహుళ అమావాస్య రోజున శనీశ్వరు జయంతిగా జరుపుతారు. శనీశ్వరు జయంతి రోజున శనీశ్వరుని ధ్యానించినట్లయితే.. శని గ్రహ సంబంధిత దోషాలన్నీ కూడా ఉపసమిస్తాయి. నీలాంజన సమాభాసం.. ‘రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం నమామి’ ఈరోజున శనీశ్వరుని ప్రార్థించాలి. శని భగవానుని ప్రీతికై శివార్చన గ్రహశాంతి కోసం దానం జపం వంటివి చేయటం వలన శని దేవుని అనుగ్రహన్ని పొందవచ్చు. ఈ జాతకంలో ఉన్న శిరీగ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. నవగ్రహాలను శని దేవుడు నీలాకాశంలో నీలాంజన సభా బాసురై నీలి హార్మియల్లో నీలమనులతో ఉన్న దివ్యాలయంలో ఆయన కొలువుతీరు ఉంటాడు. ఎన్నో ఉపగ్రహాలతో కాంతి వలయంలో తేజోమయుడుగా దర్శనమిస్తాడు.

గ్రహరాజైన సూర్య దేవునికి ఛాయాదేవికి సావరుని మనము తర్వాత జన్మించినవాడు శని దేవుడు. మెల్లనైన నడక కలవాడు కాబట్టి.. శనీశ్వరుడు మందుడనే పేరు కూడా ఉంది. అలాగే, శనివారంతో కలిసి ఉన్న త్రయోదశి స్థితిని శని త్రయోదశిగా వ్యవహరిస్తారు. ప్రతిఏటా రెండు మూడు శనిత్రయోదశి స్థితిలో వస్తాయి. శనిజయంతి శనిత్రయోదశి తిధులతో పాటు మాఘ బహుళ చతుర్దశి మార్గశిర శుద్ధ అష్టమి శ్రావణమాసంలో వచ్చే రెండో శనివారం కూడా శని ఆరాధనకు శ్రేష్టమైనవి.

ఈ రోజున నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే.. :
వైశాఖ బహుళ అమావాస్య రోజున శనీశ్వరునికి నువ్వుల నూనె దీపం వెలిగిస్తే.. కోరుకున్న కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి. శనిదేవుడు జీవుల కర్మఫల ప్రదాత. మనం చేసిన పాప పుణ్యకార్యాలకు ఫలితాన్ని ఇచ్చేది శనీశ్వరుడే. శివుడు శనికి వక్రదృష్టి ఇతర శక్తులను ఇచ్చి కర్మఫల దాతలు చేశాడు. వాటి సాయంతో ఆయన క్రమశిక్షణ మంచి లక్షణాలతో ఉన్న వారిని కాపాడుతూ చెడును చెడ్డవాళ్లను వారు చేసే కర్మలను అనుసరించి శిక్ష వేయడం చేస్తాడు. ఇంకా మంచి పనులు చేసే వాళ్లకు శుభాలు ఉన్నత స్థితి కల్పించడం చేస్తాడు. శని వక్రదృష్టి నుంచి తప్పించుకోవాలంటే చట్ట పనుల్ని చేయకుండా ఉండాలి. మంచి పనులే చేయాలి. అందుకే, శనీశ్వర జయంతి రోజున నలుపు రంగు దుస్తుల్ని సమర్పించుకోవాలి.

శంకు పూలతో ఆయన పూజించాలి. తైలాభిషేకం చేయించాలి. దశరధక్రత శని స్తోత్రాన్ని భక్తితో పటించే వారికి ఇతిబాధలు అనేవి ఉండవు. శనిని పాపగ్రహంగా భావిస్తారు. చాలామంది శని పేరు వింటేనే అరిష్టమని ఆయన విగ్రహాన్ని తాకడం కూడా దోషం అంటూ భావిస్తారు. నిజానికి శని దేవుడు న్యాయాధికారి ఎవర్ని కూడా నిజానికి శనిదేవుడు న్యాయాధికారి. ఎవరినీ అకారణంగా బాధించడు. మానవుల పాపకర్మలను అనుసరించి వ్యక్తుల్ని ప్రేరేపించి వారితో ఆయా కర్మల ఫలితాలను అనుభవించేలా చేస్తాడు. దానధర్మాలతో సత్యం అహింసలను ఆచరిస్తూ పవిత్రంగా జీవించే వారికి ఎటువంటి ఆపద రాకుండా కాపాడడం జరుగుతుంది.

శని జయంతి రోజున ఈ స్తోత్రాన్ని పఠిస్తే :
సకల శుభాలను ఐశ్వర్యాన్ని అదృష్టాన్ని కలగచేసేది శనిదేవుడే. లౌకిక భౌతిక సుఖాల పట్ల సంపదల పట్ల వైరాగ్యం కలిగించి భగవంతుని స్మరించమని గురువై బోధిస్తాడు. భయంతో కాకుండా భక్తితో ఆయన వేడుకుంటే సకల శుభాలు కలుగుతాయి. శని వివిధ వృత్తి ఉద్యోగాల్లో వ్యాపారాలు స్థిరత్వాన్ని వృద్ధుని కలుగజేస్తాడు. అందుకే శనీశ్వరుని జయంతి రోజున ఆయన స్తోత్రాన్ని పటించడంతోపాటు ఆయన దర్శనం చేసుకోవాలి. అలాగే నవగ్రహ ప్రతిక్షణం చేసుకోవడం, దానధర్మాలను చేసినట్లయితే ఏలినాటి శని అష్టమ శని, అర్థాష్టమ శని వంటి వారితో తీవ్రమైన బాధపడుతున్న వారికి దోషాలన్నీ కూడా తొలగిపోయి ఉపశమనం కలుగుతుంది.

శని జయంతి పూజా విధానం ఇలా :
నవగ్రహాలయాలకు వెళ్లి శనిదేవున్ని దర్శించుకొని ఆ తర్వాత స్వామివారికి ఎంతో ప్రీతిపాత్ర మైనటువంటి నల్లని లేదా నీలిరంగు వస్త్రాలను ధరించి ‘ఓం శనీశ్వరాయ నమః’ అనేటువంటి నామాన్ని 108 సార్లు లేదా 19*19 సార్లు ఈ విధంగా కూడా స్వామివారిని పూజించిన కూడా విశేషమైనటువంటి ఫలితాలు ఇస్తాడు అని మన పురాణాలు చెబుతున్నాయి. ముఖ్యంగా శనీశ్వరుని జయంతి రోజున ఎలాంటి పూజా విధానాలు పాటించాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఎంతో మంది శని గ్రహదోషాలతో బాధపడుతూ ఉంటారు. కొంతమందికి ఏలినాటి శని అనేటువంటి బాధతో పీడింపబడుతూ ఉంటారు. శని జయంతి రోజున భక్తులు చాలామంది ఉపవాసం ఉండటం చూస్తూ ఉంటాం. ఆ తర్వాత ప్రత్యేక పూజలతో పాటు శని భగవానునికి పూజ చేస్తూ ఉంటారు.

11వేల సార్లు ఈ మంత్రాన్ని పఠిస్తే :
యజ్ఞలు హోమాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఈ పూజల్ని సాధారణంగా శని ఆలయాల్లో లేదంటే నవగ్రహ దేవాలయాల్లో నిర్వహిస్తూ ఉంటారు. భక్తులు దీపాన్ని వెలిగించి శని దేవుని ముందు ఉంచి శని మంత్రాన్ని పట్టిస్తూ ఉంటారు. ఇలా చేయడం ద్వారా జీవితంలో విజయం ప్రాప్తిస్తుందని బలంగా విశ్వసిస్తూ ఉంటారు. కొందరైతే 11 వేల సార్లు మంత్రాన్ని పఠించి శని దేవాలయాన్ని దర్శించుకుంటూ ఉంటారు. అలాగే చాలామంది శనీశ్వరుని మంత్రమైనటువంటి ‘నీలాంజన సమాభాసం రవిపుత్ర యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం’ అనేటువంటి ఈ ఒక్క శ్లోకాన్ని పట్టించి తరిస్తూ ఉంటారు. సంస్కృతంలో అంటే కదలిక అనర్ధం..

Shani Jayanti 2024 _ June 6th Pancha Graha Kutami And Shanaishchara Jayanti Day Telugu
Shani Jayanti 2024 _ June 6th ( Photo Credit : Google )

శని అనేది ఒక గ్రహం చర అంటే.. కదలిక అంటే.. సూర్యుని చుట్టూ శనిగ్రహం తిరిగి రావడానికి 30 ఏళ్ల సమయం తీసుకుంటుంది. అందుకే శని జయంతినిచార్య జయంతి అని కూడా అంటూ ఉంటారు. శని దేవుడిని ఎక్కువగా శనివారం రోజున పూజించడం జరుగుతూ ఉంటుంది. తమకి ఎలాంటి కీడు జరగకూడదని జీవితంలో అంతా మంచే జరగాలని భక్తులు కోరుకుంటున్నారు. ఆయన్ను పూజిస్తూ ఉంటారు.

చెడు చేసేవారిని శనిదేవుడు శిక్షిస్తాడు :
కొన్ని సందర్భాల్లో శని నెత్తి మీద ఉంటే.. ఏ కార్యం జరగదు అని మన పెద్దవాళ్ళు చెబుతూ ఉండటం కూడా వినే ఉంటాం. శని అనుగ్రహం ఉంటే.. ఏదైనా సరే సాధించగలుగుతాం. మన వ్యక్తిగత జీవితం వృత్తిపరంగా కొన్ని అవాంతరాలు ఎదురవుతున్నాయి. అంటే.. మన పట్ల శని దేవుడి కరుణ చూపడం లేదు అని అర్థం. అందుకే.. శని దేవుని ఎప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు. ఈ సందర్భంగా ఇతనికి కర్మ భగవానుడు అని మరో పేరు కూడా ఉందని చెబుతూ ఉంటారు. మంచి మార్గంలో నడిచే వారికి ఆయన అనుగ్రహం ఎప్పుడూ ఉంటుందని చెబుతారు. అదే వక్ర దారిలో పోయి.. చెడు చెయ్యాలి అనుకునే వారికి మాత్రం అదే రేంజిలో శిక్ష విధిస్తాడు అని చెబుతూ ఉంటారు.

ఇక శనీశ్వరుడు జన్మదినాన్ని శనిజయంతిగా జరుపుకుంటూ ఉంటాం. ఈసారి శనీశ్వరుడి జయంతి జూన్ 6వ తేదీ వచ్చింది. సాధారణంగా ప్రతి శనివారంతో పాటు శని త్రయోదశి నాడు శనీశ్వరుని భక్తిశ్రద్ధలతో పూజిస్తూ ఉండటం మనమంతా చూస్తూ ఉంటాం. సంవత్సరం అంతా శనిత్రయోదశి శనివారాల రోజున ఆయన పూజించలేని వాళ్ళు ఉదయాన్నే నువ్వుల నూనెతో మర్దన చేసుకుని తర్వాత తలస్నానం ఆచరించాలి. నవగ్రహాలయాలకు వెళ్లి స్వామివారిని దర్శించుకుని ఆ తర్వాత స్వామివారికి ఎంతో ప్రీతిపాత్ర మైనటువంటి నల్లని లేదా నీలిరంగు వస్త్రాలను ధరించి ఓం శనిశ్చరాయే నమ: అనే మంత్రాన్ని జపించాలి.

Read Also : Daily Horoscope Today 6th June 2024 : ఈరోజు శనిజయంతి.. ఈ 12 రాశుల వారు శనిదేవుని అనుగ్రహంతో పాటు ఏయే ఫలితాలు కలిసివస్తాయంటే?