Significance of Ashtami : అష్టమి తిథి శుక్రవారం అమ్మవారిని ఇలా పూజిస్తే.. ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి.. ఏ పరిహారాలు పాటించాలంటే?

Significance of Ashtami : ఈరోజు ఎంతో విశేషమైనది. అందులోనూ అష్టమి తిధితో పాటు శుక్రవారం కూడా కలిసివచ్చింది. శుక్రవారం అంటే.. లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన రోజుగా చెబుతారు. అందుకే, మహిళలు అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఆర్థిక సమస్యలు రాకుండా ఆర్థికంగా స్థిరపడాలంటే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పనిసరి. లక్ష్మీదేవిని పూజించడం వలన సుఖసంతోషాలతో పాటు ఐశ్వర్యం కలుగుతాయి. మరి లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడం కోసం ఎలాంటి పరిహారాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

శుక్రవారం రోజున ఇంటి ఇల్లాలు ముంగిట్లో ముగ్గులను తప్పనిసరిగా వేయాలి. ముగ్గు మధ్య భాగంలో పసుపు కుంకుమ ఉంచాలి. రంగురంగుల రంగవల్లి శుక్రవారం రోజు మన ఇంటి ప్రధాన ద్వారానికి ఉన్న గడపనుశుభ్రంగా కడగాలి. ముందుగా పసుపు పూయాలి. గడపకు ఆ తర్వాత కుంకుమతో పూజించాలి. ఆ తర్వాత గడపకు బొట్లు పెట్టాలి. గడపకు రెండు వైపులా పువ్వులను కూడా ఉంచితే చాలా శుభప్రదంగా చెబుతారు. ఈ విధంగా చేసి లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానించాలి. మనం ఎప్పుడైనా మనకు ఉన్నంతలో ఇంట్లోనే వస్తువులు చెందరవందరగా లేకుండా చక్కగా సర్దుకోవాలి.

పూజగది ఇలా ఉంటే.. లక్ష్మీదేవి స్థిరనివాసం :
ఇల్లంతా వస్తువులతో దుమ్ముతో నిండి ఉంటే.. ఆ ఇంట లక్ష్మీదేవి ఉండదు. అలాగే ఇంట్లో పగిలిపోయిన పాడైపోయిన వస్తువులు ఉంచుకోకూడదు. ఇవన్నీ దరిద్రానికి చిహ్నాలుగా చెబుతారు. ఇలాంటి వాటిని వెంటనే బయటపడేసి ఎప్పుడూ ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. పరిశుభ్రత దైవత్వం అని తెలుసుకోవాలి. ఇంట్లో పూజలు చేసేవారు ఎప్పటికప్పుడు ఇంటిని బూజు లేకుండా దులుపుకుంటూ ఉండాలి. అప్పుడే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది.

కొందరు పూజా మందిరాన్ని మాత్రం పట్టించుకోరు. రోజు ఏదో కొన్ని నిమిషాలే కదా అక్కడ ఉండేదని నిర్లక్ష్యంగా ఉంటారు. ఇల్లు ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో పూజ మందిరాన్ని కూడా అంతే శుభ్రంగా ఉంచుకోవాలి. మనం నివసించే ఇంటిని అంత జాగ్రత్తగా చూసుకుటాం. అలాగే దేవుడి ఇంటిని ఆ స్వామి పూజగదిని ఇంకా ఎంత శుభ్రంగా ఉంచుకోవాలి. అందుకే పూజా మందిరంలో అక్కర్లేని పుస్తకాలు ఇతర వస్తువులు పెట్టకుండా మీ సంప్రదాయాన్ని అనుసరించి దేవుని విగ్రహాలను లేదా దేవుని పట్టాలను అమర్చుకోవాలి.

ఇలా చేస్తే ఇంట్లో సకల దోషాలు తొలగిపోతాయి :
పూజా మందిరంలో పసుపు రాసి, కుంకుమ బొట్లు పెట్టిన పీటపై లక్ష్మీదేవి చిత్రపటం లేదా విగ్రహం ఉంచాలి. ఇప్పుడు అమ్మవారికి గంధం, కుంకుమ పెట్టి పూలతో అలంకరించాలి. దీపారాధన కోసం వెండి కుందులు కానీ ఇతని కుందులు కానీ మట్టి ప్రమిదలు కానీ తీసుకోవాలి. అందులో మీ కుటుంబ సంప్రదాయాన్ని అనుసరించి రెండు లేదా ఐదు ఒత్తులు వేసి ప్రమిద నిండుగా ఆవునెయ్యిని పోసి దీపారాధన చేయాలి. అలా వెలిగించిన దీపాన్ని కుంకుమ అక్షింతలతో అలంకరించాలి. శుక్రవారం ఇంట్లో ధూపం వేస్తే దృష్టి దోషాలు పోతాయి. ధూపం వేస్తే చాలా మంచిది. లేదంటే.. అగరత్తులు కూడా వెలిగించిన సరిపోతుంది. లక్ష్మీ అష్టోత్తరం చదవండి. సహస్రనామాలు చదివినా మంచి ఫలితం ఉంటుంది. మీ సమయానుసారం చదువుకోవాలి. చివరగా ప్రసాదంగా కొబ్బరికాయ, పళ్ళు అమ్మవారికి నివేదించాలి.

ఐశ్వర్యం పొందాలంటే ఎన్ని శుక్రవారాలు చేయాలంటే? :
ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి చిన్న పాత్రలో పచ్చిపాలు, తేనె, పచ్చ కర్పూరం, యాలకుల వంటివి సమర్పిస్తే అమ్మవారు సంతృప్తిచెందుతారట. ఎందుకంటే అమ్మవారికి సుగంధ ద్రవ్యాలన్నా, సువాసన ఎంతో ఇష్టం. చివరిగా కర్పూర నిరాశనం సమర్పించి అమ్మవారికి నమస్కరించుకోవాలి. ఇలా నియమానుసారంగా 5 శుక్రవారాలు లేదా 9 శుక్రవారాలు పూజిస్తే.. దారిద్ర్యం తొలగిపోయి ఐశ్వర్యవంతులు కావడం తథ్యం.

Significance of Ashtami _ Astrology Remedies to Improve Financial Status in Telugu
Significance of Ashtami Astrology Remedies ( Photo Credit : Google )

ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని ఇలా పూజిస్తే.. మీ జీవితంలోని కష్టాలని తొలగిపోతాయి. మీ ఇల్లు సంతోషంగా ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహం పొంది ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారని చాలామంది విశ్వసిస్తారు. ఈ అష్టమతిధి రోజున శ్రీ మహావిష్ణుకు ప్రత్యేక భక్తి శ్రద్ధలతో పూజించడంతో పాటు జలాభిషేకం చేయడం ద్వారా అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు. ఇలా చేయడం ద్వారా ఇప్పటివరకూ ఆర్థికంగా పడిన అనేక ఆర్థిక సమస్యల నుంచి తొందరగా బయటపడతారు.

Significance of Ashtami : వివాహ ఆలస్యం.. దోషం తొలగిపోవాలంటే? :

అష్టమ తిథికి ఒక ప్రత్యేకత ఉంది. చాలామందికి వివాహం ఆలస్యం కావడం దోషాన్ని తొలగించుకోవాలంటే అనేక పరిహారాలు చేసుకోవచ్చు. ఆగస్టు నెలలో ముహూర్తాలు ఉన్నాయి. శ్రావణమాసంలోనైనా వివాహం అయితే ఏమైనా పరిహారాలు చేసే ముందు అష్టమి నాడు పాటించవలసిన ఒక ప్రత్యేకమైన విధిని తెలుసుకోవాలి. అప్పుడే, వివాహం ఆలస్యం కావడం అనే దోషం పోతుంది. అష్టమితికి ఆధిపత్యం గల దైవం ఈశ్వరుడు. ఆయన ఉమాపతి పార్వతీ పతి. అందుకే అష్టమి నాడు శివాభిషేకం చేయాలి. అప్పుడు వివాహం ఆలస్యం కావడం అనే దోషాన్ని తొలగిస్తుంది. అష్టమి నుంచి అష్టమి వరకు అనే ఒక దోషం చంద్రులకు ఆపాదించడంతో జ్యోతిష్య శాస్త్ర పరంగా అష్టమి నాడు వివాహాలు చెయ్యరాదు అని కూడా శాస్త్రంలో ఒక ప్రమాణం ఉంది. శాస్త్రానికి సంబంధించి అష్టమి తిథి త్రయోదశి స్థితికి తదియతిథి.

శివరాధన చేసి ఈ మంత్రాన్ని జపించాలి :
ఈ మూడు కూడా భద్రతితులు కనుక జయతి జనుక జయ అన్న పేరిట అష్టమిని తదియను చెబుతారు. అలాగే త్రయోదశిని వివాహాలకు క్షేమంగా చెబుతారు. అష్టమి నాడు శివరాధన చేయాలి. ఈ చంద్రుడికి క్షీణ చంద్రుడు అని పేరు కూడా ఉంది. క్షీణ చంద్రుడిగా ఉండేటటువంటి పౌర్ణమి అష్టమి నుంచి పౌర్ణమి అనంతరం అమావాస్య తర్వాత వచ్చేటట్లు ఉండేటటువంటి కాలంలో శుభకార్యములు ఆచరించరాదు. వివాహాలు చేయరాదు.

ఈ సమయంలో పుణ్యఫలం పెంచుకునే నిమిత్తమై శివారాధన చేయాలి. అష్టమి నాడు 8 మామిడిపండ్ల రసంతో శివాభిషేకం నిర్వహించి ప్రత్యేకంగా ’నమ: శంభవేచ నమః శివాయ శివతరాయచా:’ అనే ఆరు పాదాల మృత్యుంజయ మహా మంత్రంతో శివాభిషేకం నిర్వహిస్తే.. అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు. ఈ అభిషేక సేవలో మామిడి పండ్లతో చేసిన శివాభిషేక అర్చన ద్వారా పరమాత్ముడి సంపూర్ణ అనుగ్రహం పొందవచ్చు. వివాహం ఆలస్యం కావడం అన్న దోషం కూడా పూర్తిగా అంతర్ధానం అవుతుంది.

Read Also : Today Horoscope 31th May 2024 : మే 31 రాశి ఫలాలు.. ఈ రోజు పంచాగం.. 12 రాశుల వారికి ఆర్థికపరంగా ఎలాంటి ఫలితాలు కలుగుతాయంటే?