Black Crow Superstition : శనివారం ఉదయం మీకు ఈ దృశ్యాలు కనిపిస్తే మీపై శనిదేవుడి ఆశీస్సులు ఉన్నట్టే. ఎంతకీ శనివారం ఎటువంటి దృశ్యాలు కనిపిస్తే శనిదేవుని ఆశీస్సులు అనుగ్రహం ఉంటుంది? శనిగ్రహ ప్రభావం ఎలా తగ్గుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. తొమ్మిది గ్రహాల్లో శనిగ్రహం అంటేనే అత్యంత శక్తివంతమైన ప్రభావవంతమైంది. సాధారణంగా అన్ని రాశుల వారి మీద శనివిగ్రహ ప్రభావం ఎంతో కొంత ఉండే ఉంటుంది. ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ఇలా రూపాల్లో శని ప్రభావం ఆయా రాశుల వారి మీద ఉంటుంది.
వారి జీవితంలో ఏ పని చేసినా అది కలిసి రాదు. వాయిదా పడుతుంది. అదేవిధంగా వారికి మనశ్శాంతి ఉండదు. చికాకులు సమస్యలు ఉంటాయి. ఇబ్బందులు పెడతాయని చాలామంది భావిస్తారు. అయితే, శని అంటే సమస్యలే కాదు.. చాలామంది ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పుడే శని దోష ఉన్నప్పుడే వారు టాటా బిర్లాలు అంబానీలు అయ్యారు. వారికి అదృష్టం కలిసి వచ్చింది. అంతటి శక్తివంతమైనది. శని అయితే మనం చేసే మంచి చెడులను బట్టి ఫలితాలు ఇచ్చే దేవుడు శని దేవుడు. అందుకే న్యాయ దేవుడు కర్మదాత అని పిలుస్తారు.
శనిదేవున్ని ప్రసన్నం చేసుకోవాలంటే? :
శని దేవుడి అనుగ్రహం పొందడానికి శనివారం చాలా మంచి రోజు అని చెబుతుంటారు. అయితే, ఈ శనివారం రోజు మీకు ఈ దృశ్యాలు కనుక కనిపిస్తే.. మీపై శని కటాక్ష ఉన్నట్టే భావించాలి. శనిదేవుని ఆశీస్సులు మీపై ఉంటాయి. అయితే, శనివారం ఎటువంటి దృశ్యాలు కనిపించాలి అవేంటో తెలుసుకుందాం.. హిందూ మతంలో శనివారం వెంకటేశ్వర స్వామితో పాటు శనిదేవుడికి కూడా అంకితమైంది. అంటే వారంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవునికి ప్రాధాన్యత వహిస్తారు. మన హిందూ సంప్రదాయంలో అయితే శనివారం నాడు శనిదేవుని ఆరాధించడం శనికి అనువైన నైవేద్యంగా పెట్టడం చేస్తారు. అదేవిధంగా శనికి ఆవనూనె నైవేద్యంగా పెడుతుంటారు. దానం చేయడం ఇటువంటి కార్యాలు చేయడం శుభప్రదంగా భావిస్తారు. శనిదేవుని ప్రసన్నం చేసుకోవడానికి శనివారం మంచి రోజుగా చెబుతారు.
శనివారం శనికి ప్రీతికరమైన రోజు :
ఈరోజు వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తారు. ఆంజనేయ స్వామిని కూడా ఆరాధిస్తారు. అదేవిధంగా శనివారం శనిదేవునికి శనిగ్రహ పూజలు నిర్వహిస్తారు. ఆవనూనె లేదా నూనెతో శివునికి తైలాభిషేకాలు చేస్తారు. శని దేవునికి తైలాభిషేకాలు నిర్వహిస్తారు. దానధర్మాలు చేస్తారు. ఆవనూనెను ఒంటికి పట్టించుకుని ఆరోజు తలస్నానం చేస్తారు. అభ్యంగన స్నానాలు చేస్తారు. ఇలా చేసే శనిదేవునికి సంబంధించిన పూజలు చేసుకుని ఆరోజు దానాలు చేస్తే వారి మీద శనిదోష ప్రభావాలు ఉండవు అని చెబుతారు. శనిదేవుని ప్రవచనం చేసుకోవడానికి శనివారం అనుకూలమైన రోజు. శని అనుగ్రహం ఉంటే.. మీ జీవితం ఆనందంగా ఉంటుంది. మీకు డబ్బు పదవి మంచి ఆరోగ్యం లభిస్తుంది శని అనుగ్రహానికి ముందు కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. అయితే, శనివారం ఉదయం ఈ సంకేతాలు కనుక మీకు కనిపిస్తే.. శనిదేవుని కటాక్షం మీకు ఉన్నట్టే. ఇంతకీ ఆ సంకేతాలు ఏంటో తెలుసుకుందాం.
Black Crow Superstition : శని అనుగ్రహానికి సంకేతాలు ఇవే :
తెల్లవారు శనివారం తెల్లవారుజామున శ్రీవారు మూడుస్తూ కనిపిస్తే.. అది చాలా శుభప్రదం భావిస్తారు. శనివారం మనం లేచేసరికి తెల్లవారుజామున ఎవరైనా మన ఇంటి ముందు గానీ మన ఇంటి చుట్టుపక్కల కానీ ఎవరైనా కావచ్చు.. చీపురు పట్టుకొని ఊడిస్తూ కనిపిస్తే అది చాలా శుభప్రదమని మీకు తెలుసా? మీరు ఏదైనా గొప్ప విజయాన్ని సాధించబోతున్నారని అర్థంగా భావించాలి. వీలైతే మీకు తోచినంతగా స్వీపర్లకు దానం చేయండి. అటువంటి వారికి లేదా పనివాళ్ళు చాలామంది షాప్స్ ముందు ఇంటి ముందు వూడుస్తూ ఉంటారు.

వాళ్ళలో చాలామంది పేదవాళ్లే ఉంటారు. అటువంటి వారికి మీకు తోచినంత దానంగా చేయండి. అది మీకు చాలా మంచి శుభ ఫలితాలు తెచ్చిపెడుతుంది. ఇక ఒక బిచ్చగాడు లేదా పేదవాడు శనివారం ఉదయం మీ ఇంటికి వస్తే అతన్ని ఉత్త చేత్తో పంపకండి. ఇలా శనివారం సమయంలో మీ ఇంటికి వచ్చినప్పుడు ముఖ్యంగా శనిహోరా సమయంలో అంటే.. ఈ శని హోరా సమయం ఉదయం 6 గంటల నుంచి 7 గంటలకు సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల మధ్య సమయాన్ని సిరిహోరా సమయం అంటారు. ఈ సమయంలో ఎవరికైనా పేదవారికి దానధర్మాలు చేస్తే చాలా మంచిది.
నల్ల కుక్కకు రొట్టె తినిపిస్తే చాలా మంచిది :
అంతెందుకు.. ఎవరైనా కార్మికులకు లేదా బిచ్చగాడికి టీ కాఫీలు ఇప్పించినా అది చాలా మంచిది. ఇలా చేయడం వల్ల శనిదేవుడు సంతోషిస్తాడు. మీకు అపారమైన సంపదని ఇస్తాడు. మీపై ఉన్న శనిగ్రహ దోష నివారణ అవుతుంది. ఇక శనివారం నల్ల కుక్కను శని దేవుడు వాహనంగా భావిస్తారు. మీరు శనివారం ఉదయం నల్ల కుక్కని చూసినట్లయితే మీకు ఏదో ఒక మంచి జరుగుతుందని అర్థం. మీకు జీవితంలో ఆనందం వెల్లివిరుస్తుంది. అంతేకాదు.. నల్ల కుక్కకు రొట్టె పెట్టడం వల్ల శనిదేవుని ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ ఉంటాయి. సాధారణంగా కుక్కను విశ్వాసానికి మారుపేరుగా చెబుతారు. నల్ల కుక్క ఎక్కువ ప్రాధాన్యత సంతరించుకుంటుంది. నల్ల కుక్కని శని దేవుని వాహనంగా కూడా భావిస్తారు. కావున శనివారం నల్ల కుక్క కనిపిస్తే.. మీకు అదృష్టం వరించినట్టే.. మీకు ఏదో ఒక శుభవార్త ఆరోజు అందుతుందని అర్థం.
శనివారం నల్లటి ఏదైనా చూస్తే కలిగే ఫలితాలివే :
శనివారం రోజు నల్ల కుక్కకు రొట్టె పెట్టడం వల్ల శనిదేవుని ఆశీస్సులు మీపై ఉంటాయి. ఇక శనివారం నల్లగా చూడటం కూడా చాలా మంచిది. ఆ రోజున నల్లకాకి అరవడం కూడా శుభ సూచకంగా భావిస్తారు. శకుని శాస్త్రంలో వీటి గురించి అనే విషయాలను చెప్పారు. శనివారం నల్ల కాకి చూడటమే కాదు.. నల్ల కుక్కను కూడా చూడటం చాలా మంచిది. ఆరోజు నల్ల కాకి అరిచిన అది శుభంగా భావిస్తారు. ఆరోజు కాకులకు కచ్చితంగా బ్రెడ్ లేదా ఇతర ఆహారాన్ని తినిపించండి. దీనివల్ల మీకు మంచి జరుగుతుంది. దీనివల్ల శని దోషా నివారణ కూడా అవుతుంది. శని దేవుని ఆశీస్సులు మీపై ఉంటాయి.
శనివారం మీరు నల్లగా ఏదైనా చూసిన అది మీ ఇంటి ఆవరణలో అరుస్తున్న పక్షి లేదా జంతువుకు ఆహారాన్ని తినిపించండి. నిజానికి కాకులకు రోజు ఆహారాన్ని పెట్టడం అది అత్యంత శుభపరిణామం. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న దారిత్యం పోతుంది. అదేవిధంగా మీకు ఏవైనా అనారోగ్య సమస్యలు ఉన్నట్టయితే.. అవన్నీ కూడా తొలగిపోతాయని శకున శాస్త్రం చెప్తుంది. కావున నల్ల కుక్కలకు నల్ల కాకులకు ఆహారాన్ని ప్రత్యేకించి శనివార సమయంలో తినిపించినట్టయితే మీకు మంచి జరుగుతుంది. ఆరోజు మీరు శుభవార్త వింటారు. మీకున్న ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు అన్నీ కూడా మెల్లమెల్లగా తగ్గుముఖం పడతాయి. కాబట్టి శనివారాల్లో ఇవి తప్పక చేయండి.
Read Also : Shani Jayanti 2024 : జూన్ 6న పంచగ్రహ కూటమి, శనైశ్చర జయంతి రోజున ఇలా చేస్తే.. శనిదోషాలు పోయి రాజయోగం పడుతుంది